అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యంలో ‘సుబాహువు’ ‘సుభాసు’ వయ్యాడు. టైపు దోషం కావచ్చు. ‘పెంచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దక్షత బెంచన్’ అనండి. నాల్గవపాదంలో గణదోషం. ‘ఆరాముడు లక్ష్మణుడును యాగమునందున్’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కొన్ని లోపాలు. (విశ్వామిత్రుడు ఒక్క రాముణ్ణే పంపమన్నాడు. అన్నను వీడి ఉండలేని లక్ష్మణుడు వెంట వచ్చాడు). మీ పద్యానికి నా సవరణలు.... రాముఁ బంపు మటంచు సన్ముని రాజు చెంతకు వచ్చినన్ కోమలంబగు మేని వాడని కొంచె మాతడు జంకగన్ ఆ మహీశుని గాధిజుండట యాగ్రహించగఁ బంపెనే వ్యోమ సీమను రాక్షసాదుల నొక్కసారిగఁ గూల్చినన్ స్వామి కార్యముఁ దీరి నంతనె శస్త్ర సంపద లందిరే! ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఇకా’ అన్నదానిని ‘యికన్’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, అద్భుతమైన ఖండకృతిని ప్రసాదించారు. అభినందనలు, ధన్యవాదాలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవి మిత్రులకు నమస్సుమాంజలి మనం మంచి పద్యం వ్రాసినప్పుడు చదివినపుడు చాలా సంతోషం వేస్తుంది ఆత్మను అంతర్గతం చేసి కనులు అంతర్లోకనం చేసి యోగ స్థితి నధివసించి వాగర్థాలకు వందనమాచరించి పద్యాన్ని ప్రసవిస్తే పొందే ఆనందం ఆస్వర్గానికి అవతల చేరినంత అమ్మ బిడ్డను కన్నంత
మారీచ సుబాహు లనగను
రిప్లయితొలగించండినేరీతిగ నైన క్రతువు నిధనము జేయ
న్నారామ లక్ష్మణు లపుడే
గారవ మునపరి మార్చె గాధిజు పనుపున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
చివరి రెండు పాదాల గణదోషాలను సవరించాలి.
మఘము చెఱచు చుండ మారీచ సోదరుల్
రిప్లయితొలగించండిమౌని కోర్కెను తమ మదిని తలచి
రక్షసలిపిరి రఘు రాముడున్ సౌమిత్రి
తండ్రి యానతిగొని తరలివచ్చి
చిత్ర మందున జూడుము చిత్స్వరూప !
రిప్లయితొలగించండిరామ లక్ష్మణు లచ్చట రయము గాను
యజ్ఞ సంరక్ష ణ మునందు ప్రాజ్ఞు లగుచు
సిద్ధ ముగనుండి గద మఱి యుద్ధ మునకు
మారీచ సుబాహులచట
రిప్లయితొలగించండిదారుణముగ క్రతువునాప దలచగ నపుడున్
శ్రీరాముడు సౌమిత్రియు
వీరముతో వారిగూల్చి వేలిమి గాచెన్!!!
గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
రిప్లయితొలగించండిరామలక్ష్మణులును రయముతోడ
మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
రామచంద్రుడెపుడు మనకు రక్ష.
గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
రిప్లయితొలగించండిరామలక్ష్మణులును రయముతోడ
మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
రామచంద్రుడెపుడు మనకు రక్ష.
గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
రిప్లయితొలగించండిరామలక్ష్మణులును రయముతోడ
మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
రామచంద్రు డెపుడు మనకు రక్ష
గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
రిప్లయితొలగించండిరామలక్ష్మణులును రయముతోడ
మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
రామచంద్రు డెపుడు మనకు రక్ష
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నీచపు కోర్కె లందు మహనీయుల యజ్ఞము మాన్ప నెంచు.మా
రిప్లయితొలగించండిరీచ,సుభాసు లిద్దరి పరీక్షను బగ్నము జేయ నెంచియే
కాచియురామ,లక్ష్మణులు కల్పిత రాక్షసు లెంచు మార్గమున్
తోచిన రీతి జంపిరట|తొందర లేకను యజ్ఞ శాలలో|
2మారీచు సుభాసులిద్దరి
దారినిమాన్పించి|యజ్ఞ దక్షత బెంచే
కోరికబెంచిరి గురువుకు
ఆరామ,లక్ష్మనులట యాగము నందున్|
రామ లక్ష్మణ రక్షఁ గోరుచు రాజు చెంతకు వచ్చినన్
రిప్లయితొలగించండికోమలంబగు మేని వారని కొంచెమాతడు జంకగన్
రామ! రామ! ని గాధిజుండట రంకె లేయగఁ బంపెనే
వ్యోమ సీమను రాక్షసాధుల నొక్కసారిగఁ గూల్చినన్
స్వామి కార్యముఁ దీరి నంతనె శస్త్ర సంపద లందిరే!
కె.యస్.గురుమూర్తి ఆచారిగారి పూరణ
రిప్లయితొలగించండిమారీచుండు సుబాహుడున్ యజమునన్ మాంసాదులన్ వేయగా
శ్రీరాముండు సలక్ష్మణుండగుచు వారిన్ గూల్చిగాధేయు నౌ
రా రంజించెను గాచె ధర్మమును బాల్యప్రాయమందే యికా ధీరోదాత్తునికిన్ యశస్వికి మహాతేజస్వికిన్ మ్రెుక్కెదన్
రిప్లయితొలగించండితాటకేయులు, గాధినందనుని యాగ
భంగ నెుునరింప బూనిన వారి గూల్చి
సవన రక్షణ రామలక్ష్మణులు చిఱుత
ప్రాయ మందున జేసిరి భ్రాజితముగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమునివరుడు దీక్ష బూనెను
రిప్లయితొలగించండిఘనమౌ యజ్ఞమును సేయ గని ధూమము వ-
హ్నిని రుధిరము వోయుటకై
చనుదెంచిరి రక్కసు లట చయ్యన నంతన్.
మునిజనముల భయపెట్టిరి
ధ్వనులను వికృతముగ జేసి దానవు లుభయుల్
కని వారి రామలక్ష్మణు
లనుకొని నా రీదినమ్ము హతులని వారిన్.
శ్రీరాముడు మారీచుని
ఘోరముగా గాలికోల గొట్టెను వాడున్
నూరగు యోజనముల ము-
న్నీరున బడి బ్రతికిపోయె నెమ్మది నుండెన్.
నిప్పుకోల నేసె నీరజ నేత్రుడు
కని సుబాహు నంత గ్రమ్ముకొనియె
నగ్ని కీల లతని హతుడాయె క్షణములో
పుష్పవృష్టి కురిసె పుడమిపైన.
విశ్వశ్శ్రేయము కొరకై
విశ్వామిత్రుండు చేయ విస్తృత మఖమున్
విశ్వంభరుడే కాచెను
విశ్వమ్మును రక్ష సేయు వేలుపు కతనన్.
గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిసవరించిన పద్యము
-------------------------
మారీచ సుబాహు లిరువురు
నేరీతిగ నైన క్రతువు నిధనము జేయ
న్నారాముడు సౌమిత్రి యపుడు
గారవమున హతమార్చె గాధిజు పనుపున్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యంలో ‘సుబాహువు’ ‘సుభాసు’ వయ్యాడు. టైపు దోషం కావచ్చు. ‘పెంచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దక్షత బెంచన్’ అనండి. నాల్గవపాదంలో గణదోషం. ‘ఆరాముడు లక్ష్మణుడును యాగమునందున్’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొన్ని లోపాలు. (విశ్వామిత్రుడు ఒక్క రాముణ్ణే పంపమన్నాడు. అన్నను వీడి ఉండలేని లక్ష్మణుడు వెంట వచ్చాడు). మీ పద్యానికి నా సవరణలు....
రాముఁ బంపు మటంచు సన్ముని రాజు చెంతకు వచ్చినన్
కోమలంబగు మేని వాడని కొంచె మాతడు జంకగన్
ఆ మహీశుని గాధిజుండట యాగ్రహించగఁ బంపెనే
వ్యోమ సీమను రాక్షసాదుల నొక్కసారిగఁ గూల్చినన్
స్వామి కార్యముఁ దీరి నంతనె శస్త్ర సంపద లందిరే!
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఇకా’ అన్నదానిని ‘యికన్’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
అద్భుతమైన ఖండకృతిని ప్రసాదించారు. అభినందనలు, ధన్యవాదాలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తపసి యాగము సేయగ దైత్యులొచ్చి
రిప్లయితొలగించండిరుధిర మందుబో యుచునవ రోధపరుచ
రామ లక్ష్మణులిర్వురు రౌద్రులగుచు
వారి దునిమి యాగమవగ వాసి గనిరి
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఒచ్చి’ అనడం గ్రామ్యం. ‘దైత్యు లపుడు’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. తమరి సవరణతో పద్యానికి వన్నె వచ్చింది.సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిరాముఁ బంపు మటంచు సన్ముని రాజు చెంతకు వచ్చినన్
కోమలంబగు మేని వాడని కొంచె మాతడు జంకగన్
ఆ మహీశుని గాధిజుండట యాగ్రహించగఁ బంపెనే
వ్యోమ సీమను రాక్షసాదుల నొక్కసారిగఁ గూల్చినన్
స్వామి కార్యముఁ దీరి నంతనె శస్త్ర సంపద లందిరే!
Guruvugaaroo dhanyavaadamulu.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారూ
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నాయండీ
కవి మిత్రులకు నమస్సుమాంజలి
రిప్లయితొలగించండిమనం మంచి పద్యం వ్రాసినప్పుడు చదివినపుడు చాలా సంతోషం వేస్తుంది
ఆత్మను అంతర్గతం చేసి
కనులు అంతర్లోకనం చేసి
యోగ స్థితి నధివసించి
వాగర్థాలకు వందనమాచరించి
పద్యాన్ని ప్రసవిస్తే పొందే ఆనందం
ఆస్వర్గానికి అవతల చేరినంత
అమ్మ బిడ్డను కన్నంత
లోపల యరిషడ్వర్గములు చెలరేగ
రిప్లయితొలగించండిగురువు నాశ్రయించుచు సరగున వెడలిన,
మనల బుద్ధ్యాత్మలిరువురు మాటుకాయు,
నిత్య కర్మలన్ సరిజూచి నెమ్మి నొసగు