అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, (మీ పేరులోని YS అంటే?) మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వీడుచు నరుగువేళ’ అనండి. ***** జిగురు సత్యనారాయణ గారూ, చింతా వారి ప్రశంసకు పాత్రమైన చక్కని పూరణ మీది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, నిజమేనండోయ్.. టైపాటు ఎంతటి అపార్థానికి దారి తీసింది! సవరించాను. ధన్యవాదాలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ కాళహస్తీశ్వర స్తుతి బాగుంది. అభినందనలు. ‘మత్సరము గాల్చి’ అన్నచోట గణదోషం. ‘మత్సరముం గాల్చి’ అనండి. అదే పాదంలో ‘వెలిగించు’లో అనుస్వారం టైప్ కాలేదు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, సమస్యను భృగుమహర్షి వృత్తాంతంతో ముడి పెట్టిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘రామా! ఇదీ ఒక రాజ్యమే’ అంటూ చక్కని విరుపుతో నిన్నటి సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** మాజేటి సుమలత గారూ, బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసుర మర్దన కార్యము లైన పిదప
రిప్లయితొలగించండిఅలిసి క్షీరాబ్ధి వీడుచు యరుగు వేళ
నలువ తోవాణి గదలగ నగజ వెడల
పరమివునితో, లక్ష్మియు పవ్వళించె
ఇంతకు ముందు చేసిన నా పూరణ
రిప్లయితొలగించండికొండ పైన కాత్యాయిని కోరియుండె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె
విష్ణుతో నడి సంద్రాన విభ్రమముగ
ఇల్లు వాకిలి లేనట్టి యింతులయ్యె!!
జిగురు వారూ ! మీ పూరణ బాగుంది
రిప్లయితొలగించండి-------------------------
కాళి యవతార మైనట్టి కలికి దార
పరమ శివునితో , లక్ష్మియుఁ బవ్వ ళించె
కమల నాధుని సతియైన కాంతి మతిగ
పేర్లు వేరైన దైవము వేరు గాదు
వెండి కొండపై వసియించు చండి తుష్టి
రిప్లయితొలగించండిపరమశివునితో, లక్ష్మియు పవ్వళించె
శేషతల్పమునందున చెన్నుగాను
విభునితోడ, వాణియు కూడె విశ్వయోని
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, (మీ పేరులోని YS అంటే?)
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వీడుచు నరుగువేళ’ అనండి.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
చింతా వారి ప్రశంసకు పాత్రమైన చక్కని పూరణ మీది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిసృష్టికే యంకితం బయ్యె సృష్టికర్త
విద్య నేర్పగ భగవతి వెడలె భువికి
కదలె వెనువెంట ప్రియముగ గంగకూడ
పరమ శివునితో; లక్ష్మియు పవ్వళించె
పార్వతికి తోడు పాన్పు పై నోర్వలేక
జీవ రాశుల గననేగ శ్రీధరుండు
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండినిజమేనండోయ్.. టైపాటు ఎంతటి అపార్థానికి దారి తీసింది! సవరించాను. ధన్యవాదాలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బంధ మెక్కువ నాకుగా బరగె నార్య !
రిప్లయితొలగించండిపరమ శివునితో , లక్ష్మియు బవ్వళించె
పాల సంద్రాన విష్ణువు పార్శ్వ మునన
వంద నంబులు సేతును వారి కెపుడు
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెండి కొండపై కొలువుండె నిండుగ సతి
రిప్లయితొలగించండిపరమశివునితో, లక్ష్మియు పవ్వళించె
పద్మ నాబునితో శేష పాన్పు పైన
భక్త జనులను గాచుచు బడలికగను!!!
కె,యస్,గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిభళిరె చిత్రమౌ నాచిత్ర పటము నందు
కనెడు మన దిష్టి కోణమ్ముననుసరించి
లక్ష్మితోపవళించు నారాయణుండు
గౌరితో నుండు హరుడును గానుపించు
యేటవాలుగా మనము వీక్షింప నరరె
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగౌరి కొలువు దీరెను మరి గౌరవముగ
రిప్లయితొలగించండిపరమశివునితో, లక్ష్మియుఁ బవ్వళించె
నరహరితొ పాల సంద్రమునను హరిహరు
లిరువురును చేరిరో మామలిళ్ళ సతము
విశ్వమందున్నట్టి వివిధజీవులకు నే
రిప్లయితొలగించండికష్టముల్ రానీ క గాతువీవు
రెండు కన్నులుమూసి నిండు ధ్యానమ్ముతో
సకలకార్యములకు సాక్షి వీవు
యొకసతి నెత్తి పై నొకసతి దేహాన
నునిచి యా మదనుని నుసిని జేసి
అమలినశ్రింగార మమరగ సతులను
జనుల సేమ మరయ పనుపు సేతు
వలసితివి, సురలకు పని యప్పగించ
వలయు, విశ్రాంతి నీ కవసర మనె హరిి
పరమ శివునితో,లక్ష్మియు, పవ్వళించె
ను కరములు హరి పదసీమను తలవాల్చి
పువ్వుల నవ్వులు పుట్టించి శివుడేమొ|
రిప్లయితొలగించండి---------వన్నెలు వేయుటే నొప్పుకొనగ
వన్నె చిన్నెల పూలు వయ్యారి జడజేర?
---------ప్రియుని కంటి వెంట ప్రీతినంట
ప్రేమవంతుగజేర్చి ప్రియురాలి మోజులో
----------కష్టించి పనిజేసి కలిమి బెంచ|
లక్ష్మి లక్ష్యాలచే లాభాలు బండంగ?
-----------పెద్దలొప్పిన పెళ్లి –విలువ లుంచ|
అందరాశీస్సు లందిన సుంద రాంగి
మెచ్చి శివునితొ బంధమే నచ్చెగాన
శివునియాజ్ఞగ పెళ్ళాడి సిగ్గు-జెరుప?
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె.
బ్యాంకు యుద్యోగి లక్ష్మిని పరమశివుడు
రిప్లయితొలగించండిపెండ్లియాడెను తొలి రేయిప్రియుడు యైన
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె
పూలుపరచిన సెజ్జపైముదము మీర
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రబృందమునకు వందనములు...
రిప్లయితొలగించండిమొదటి పూరణము:
(హరిహరాద్వైతముంగూర్చి యిద్దఱు పండితులు తర్కించు సందర్భము)
శివుఁ డనఁగ "శుభముల నొసంగి వరము లిడి
కాచువాఁ"డన, హరిహరుల్ గారె సములు?
"పరమశివునితో లక్ష్మియుఁ బవ్వళించె"
ననిన, "హరితోడఁ బవళించె" ననుట కాదె?
రెండవ పూరణము:
బ్రహ్మతోఁ గూడియును సరస్వతియుఁ బోయె!
వఱలు కైలాసగిరిఁ జేరెఁ బార్వతియునుఁ
బరమశివునితో! లక్ష్మియుఁ బవ్వళించెఁ
బాలమున్నీటను హృదయేశ్వరునితోడ!
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
(అన్నట్టు... ఈమధ్య నల్లులు ఎక్కడా కనిపించడం లేదు!)
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పల్లా నరేంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ సుదీర్ఘపూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒకసతి’ అన్నప్పుడు యడాగమం రాదు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
పరమశివం అనే యువకునితో లక్ష్మి అనే అమ్మాయి పెళ్ళి చక్కగా జరిపించారు. బాగుంది పూరణ. అభినందనలు.
‘ప్రియును కంటివెంట’ అన్నప్పుడు గణదోషం. ‘ప్రియుని కన్నులవెంట’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రియుడు+ఐన’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ప్రియతముడగు’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
భక్తి తత్పరతతో భక్తి మత్సరులై
రిప్లయితొలగించండికనలు భోగకరుల కరుణ జూపి
ఆలూత నేతను యాహుతి గావించి
శ్రీధామ మరయగ జేసినావు
బోయకు నీవేమి బోధించి నాడవో
భక్తి బంధముల నిన్ బట్టి నాడు
మత్సరము గాల్చి మాకును యెరుకను
గలిగించి వెలిగిచు కరుణ తోడ
ఆ.వె
శత్రు షట్క తతిని శాసించి సాధించి
ఆఖరి పురుషార్థ మందు కొనగ
నీచరణ రజమును నెత్తి నిడితి
ఆదుకొనవె కాళహస్తి నాథ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలదిలో మూడవ చరణం గణం తప్పింది
రిప్లయితొలగించండినెత్తిన బెట్టితి అని ఉండాలి.
క్షమించ ప్రార్థన
లక్ష్మి..ఓ త్రాగుబోతు భార్య:-
రిప్లయితొలగించండిమందు త్రాగిన తనభర్త మంచ మందు
వ్రాలి పోవగ తనకేమి పాలుపోక
చిత్తమందలి బాధను చెప్పుకొనెను
పరమశివునితో - లక్ష్మియుఁ బవ్వళించె
శివుని గుడిలోన నిదురించ?చిత్ర మైన
రిప్లయితొలగించండికలయె|ప్రేమించి పెళ్ళాడు విలువ వరుడు
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె
మనసు మాంగల్య మైనట్టి మరపు నందు
సృష్టిఁ జేయుచు మరచిన ద్రష్టఁ గాంచి
రిప్లయితొలగించండియాలయమ్ములు పూజలు నాగు ననియె!
నాట్య మాడుచుఁ జూడని నర్తనమున
ధరణి లింగమై పొమ్మని పరుషమాడె
ఫరమశివునితో! ,లక్ష్మియుఁ బవ్వలించె
హరి హృదయముపై గానక, మురియు చుండ
పొగరుగన్ దన్నె శ్రీహరిన్ భృగుమహర్షి!
పాద సేవల నలరించి యాదరించ
యజ్ఞ ఫలమందు యోగ్యుడు హరియెననియె!
అంబు జాసనుతో వాణి ,నద్రి సుతయు
రిప్లయితొలగించండిపరమ శివునితో ,లక్ష్మియు బవ్వళించె
కమల నాభుని వక్షాన సుమము కరణి
సృష్టికేప్రేమ తత్వమ్ము స్పష్టమయ్యె !!!
నిన్నటి సమస్యాపూరణం :
రిప్లయితొలగించండిఅన్నము,సార, నోట్లడిగి యాశగ నోట్లను వేయుచుండఁ! దా
మెన్నికలందుగెల్చిమన యేలికలై సిరి దోచగ నెంచకుందురే?
ఖిన్నులమై దగా పడఁగ గేలిగ నవ్వెడు రాక్షసాళితో
'అన్నమొ రామచంద్ర'యని యందరు చచ్చిన? రామ! రాజ్యమే?
గొల్లత యవతారంబెత్తి గొలువ హరిని
రిప్లయితొలగించండిభువికి దిగివచ్చె బ్రహ్మతో బుట్ట కడకు
పరమ శివునితో లక్ష్మియుఁ, బవ్వళించె
పన్నగ శయను డచ్చట బాల ద్రాగి
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ కాళహస్తీశ్వర స్తుతి బాగుంది. అభినందనలు.
‘మత్సరము గాల్చి’ అన్నచోట గణదోషం. ‘మత్సరముం గాల్చి’ అనండి. అదే పాదంలో ‘వెలిగించు’లో అనుస్వారం టైప్ కాలేదు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
సమస్యను భృగుమహర్షి వృత్తాంతంతో ముడి పెట్టిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘రామా! ఇదీ ఒక రాజ్యమే’ అంటూ చక్కని విరుపుతో నిన్నటి సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరించిన నిన్నటి పద్యం:
అన్నము,సార, నోట్లడిగి యాశగ నోట్లను వేయుచుండఁ! దా
మెన్నికలందుగెల్చిమన యేలికలై సిరి దోచకుందురే?
ఖిన్నులమై దగా పడఁగ గేలిగ నవ్వెడు రాక్షసాళితో
'అన్నమొ రామచంద్ర'యని యందరు చచ్చిన? రామ! రాజ్యమే?