27, ఏప్రిల్ 2015, సోమవారం

పద్య రచన - 892

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. హస్తి యభిషేక మొనరించి ప్రస్తు తించె
  వెలుచ పూజించి తరియించె వేల పూలు
  లూత వేదము దెలియక నేత నేసె
  కాచి రక్షించు ననగశ్రీ కాళ హస్తి

  రిప్లయితొలగించండి
 2. ఏనుగు నేలిన వానికి
  మానుగ నా సాలెపురుగు మాల్మిని తన లో-
  కానికి బిల్చిన వానికి
  తానై ఫణి గాచినట్టి త్రాతకు జేజే.

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. కం: భక్తిని జూపుచు కాళము
  శక్తిన్ జూపుచు కరియును సలిపెన్ సేవల్
  యుక్తిగ లూతయు జేయగ
  ముక్తిని మువ్వురు బడసిరి పూజల చేతన్.

  ఆ.వె :భక్తి తోడ గొల్చె పాము యడవియందు
  శక్తి తోడ హస్తి సల్పె పూజ
  నేర్పు జూపి లూత నేసె వస్త్ర్రంబును
  ముక్తి నంది రెల్ల పూజ సేయ.

  రిప్లయితొలగించండి


 5. చుర చుర దీపము గాల్చగ
  బిర బిర తా హరుని పైన పేర్చిన గూటిన్
  కొర కొర జూచుచు మ్రింగగ
  హరహర యని దూకి లూత హరునే జేరెన్.

  అన్నాగము పూజలలో
  నన్నాగము పోటి బడుచు నాగము సేయన్
  పన్నాగమందు జావగ
  పన్నగ ధరుడేమొ మెచ్చి పంచెను ముక్తిన్.
  రిప్లయితొలగించండి
 6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘పాము+అడవియందు’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘పాము వనమునందు’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛస్త్రి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. చిత్ర మందున శంభుని జిత్ర ముగను
  సర్ప మొక్కటి నాగము సాలె పురుగు
  బూజ జేయుట గుఱు తుగా పొలుపు గాను
  పూలు మణులును గలవియై పొడగ నెగద

  రిప్లయితొలగించండి
 8. సాలెపురుగు గూడులనల్లి చక్కగాను
  పురరిపుని కొల్వ, సర్పము పూజ సలిపె
  మణులతోడను, తొలగించి మణులనన్ని
  నిత్య పూజల కరిచల్పె నీటితోడ
  లింగము నభిషేకించుచు లీల గాను
  కలహకారణమ్మున నవి యిలనువీడ
  మొదలివేల్పుతా కలిగించె మోక్ష పథము

  రిప్లయితొలగించండి
 9. శశ్రీశైలంబట గాకపోయినను శ్రీ –శ్రీశంభు సేవార్చనా
  ఆశీస్సందగ నాశదోషముల మాయల్ సర్ప మాసించకే
  కాశీఖండపు కల్పనాకథగ నాకర్షించు హస్తీశ్వరున్
  శ్రీశాంతాత్మల భక్తి తత్పరతయే?శ్రీ కాళహస్తీశ్వరా

  రిప్లయితొలగించండి
 10. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ******
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శుండియు శ్రీకాళమ్ములు
  నిండుగ సద్భక్తి తోడ నిను సేవించన్
  మెండగు ముక్తినొసంగిన
  చండీశుడ వందనములు చల్లగ గనుమా !!!

  రిప్లయితొలగించండి
 12. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. జీవ మేది యైన భావన భక్తిచే
  హస్తి,పాము,పురుగు-హరునిగొలిచి
  కీర్తి బడయు టెంత-స్పూర్తికి మార్గమో
  కాళ హస్తిమహిమ గనగ దెలిసె|

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 15. సాలె పురు గల్లె చిక్కని చక్కనైన
  పట్టు దారాల కోవెల పాము దెచ్చె
  మణులు రతనాలు,ఏనుగు మజ్జనముకు
  జలము నర్పించగ శివుడు సద్గతి నిడె
  శ్రీకాళహస్తి పురమని
  నా కాలము నుండి బరగి నాశ్రయ మెుసగెన్
  శ్దీ కంఠుడు,చరితము విన
  శ్దీ కైవల్యము లభించు సిరిసంపదలున్

  రిప్లయితొలగించండి
 16. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. నీరము నభిషేకించియు
  మారేడులనిడఁగ హస్తి మాత్సర్యమునన్
  దూరగ శ్రీ కాళమ్ములు
  జౌరగ కుంభముఁ, ద్రయమ్ము శంకరుజేరెన్!

  రిప్లయితొలగించండి
 18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాని లూత ఏనుగు కుంభస్థలంలో దూరలేదే! పాము మాత్రమే దూరింది.

  రిప్లయితొలగించండి