రాజేశ్వరి అక్కయ్యా, కేవలం దత్తపది, న్యస్తాక్షరి వంటివి మాత్రమే ముందుగా ఇద్దామనుకుంటున్నాను. సమస్యాపూరణలు అందరి పూరణల తరువాత ఇస్తాను. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం. సామర్ధ్యంబున కర్ణుడు సామాన్యముజేసికుంతిసంతతి విధిగా నీమము నవిడువ భీతిని భీముండు ప్రసిద్ధుఁ డయ్యెఁ బిఱికి తనమునన్! ************************************* కుంతికి ఇచ్చినమాట ప్రకారం యుద్ధములో కర్ణుడు పాండవులను చేతికిదోరికినా విదిచిపెట్టినపుడు భీముడు కుడా భయపడిన సన్నివేశం.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మా తండ్రి గారి నామమునకు ముందు ''శ్రీ '' ని ఉంచుట మర్యాద పూర్వకమే ఆయన మీ బ్లాగుకు సమస్య సంఖ్య1242 నుండి 1511 వరకు పూరణలు పంపిరి . ఆకాశవాణి విశాఖ , విజయవాడ ,కడప కేంద్రాల నిర్వహణ సమస్యా పూరణలకు ను ,సాహితీ కౌముది , సాహితీ స్రవంతి ,ప్రసన్న భారతి ,సాహిత్య పత్రికలకును ,సప్తగిరి దూరదర్శన్ కు పలు పూరణలు కూడా వారు పంపిరి ఉత్తమ పూరణకు 'సాహితీ స్రవంతి ' పత్రిక నుండి ,సప్తగిరి దూర దర్శన్ నుండి పలు బహుమతులు వచ్చినవి . మీ కోర్కె మేరకు 18 చిత్ర సమస్యలను కూడ మీ బ్లాగుకు పంపిరి .
నేటి సమస్యకు వారి పూరణ :- రాముని బంటుని బలిమికి భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ ; బిఱికితనమునన్ సామంతుడు విరటు తనయు నీమహి నుడుగంగ వచ్చు నిస్సందియ మై
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘విడి యుత్తరుడా...’ అనండి. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల సత్యనారాయణ మూర్తి గారూ, వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమస్యాపూరణల పట్ల మీ తండ్రిగారికి ఉన్న ఆసక్తి, ప్రావీణ్యం తెలిసి సంతోషిస్తున్నాను. ఈనాటి మీ తండ్రి (భాగవతుల కృష్ణారావు) గారి పూరణ చాలా బాగున్నది. అభినందనలు. ఉకారాంత శబ్దాల తరువాతి ‘ని’ రాదు. ‘ను’ వేయవలసి ఉంటుంది. ఆ పాదాన్ని ఇలా మార్చితే బాగుంటుందని నా సలహా ‘రామానుచరు ననుజుడుగ| భీముండు ప్రసిద్ధు డయ్యె’ ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. నిన్నటి సమస్యకు పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువుగారూ ! ముందుగా మీ పద్యం ఉంటే మాకెంత భాగ్యమొ కదా ?
రాముడు భీముని మిత్రుడు
రిప్లయితొలగించండిభీముండు ప్రసిద్ధుఁ డయ్యెఁ బిఱికి తనమునన్
సోముడు కలియగ మువ్వురు
ప్రేమగ తమకై తామె భీతిని వీడెన్
రామానాయుడు దీసిన
రిప్లయితొలగించండిరాముడు-భీముడు సినీమ రక్తిని గూర్పన్
రాముని పాత్రకు మారిన
భీముండు ప్రసిద్ధుఁ డయ్యెఁ బిఱికి తనమునన్!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండికేవలం దత్తపది, న్యస్తాక్షరి వంటివి మాత్రమే ముందుగా ఇద్దామనుకుంటున్నాను. సమస్యాపూరణలు అందరి పూరణల తరువాత ఇస్తాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నామము చేతను మనుజులు
రిప్లయితొలగించండిసామాన్యంబుగ నెవరును సరిపోలరిలన్
భీముడను పేరు గల యీ
భీముండు ప్రసిద్ధుడయ్యె బిఱికి తనమునన్
కం. సామర్ధ్యంబున కర్ణుడు
రిప్లయితొలగించండిసామాన్యముజేసికుంతిసంతతి విధిగా
నీమము నవిడువ భీతిని
భీముండు ప్రసిద్ధుఁ డయ్యెఁ బిఱికి తనమునన్!
*************************************
కుంతికి ఇచ్చినమాట ప్రకారం యుద్ధములో కర్ణుడు పాండవులను చేతికిదోరికినా విదిచిపెట్టినపుడు భీముడు కుడా భయపడిన సన్నివేశం.
రిప్లయితొలగించండిభూమిని భుజబలమందున
భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ - బిఱికితనమునన్
నీమము తప్పక పోరుచు
నేమార్చె సుయోధనుననినెల్లరి యెదుటన్
భీముని వేషముఁగట్టగ
రిప్లయితొలగించండిసోమము లేకుండ తిరుగు శుంఠడు నటుడై
గ్రామములోనానాటక
భీముండు ప్రసిద్ధుఁడయ్యె పిఱికితనమునన్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సేమమగు గదా విద్యన్
రిప్లయితొలగించండిభీముండు ప్రసిద్ధుఁడయ్యె , బిఱికితనమునన్
నీమము విడి నుత్తరు డా
భీమరమును వీడి తాను భీరుకుడయ్యెన్!!!
కె యస్ గురుపమూర్త్గి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిభామకు వలువలు నోలుచగ
తా మూలన కూరుచుండి తన అగ్రజుడిం
కేమన్నను జవ దాటని
భీముండు ప్రసిద్ధుఁ డయ్యెఁ బిఱికి తనమునన్!
శ్రీ కంది శంకరయ్యగారి కి నమస్సులు ,
రిప్లయితొలగించండిమా తండ్రి గారి నామమునకు ముందు ''శ్రీ '' ని ఉంచుట మర్యాద పూర్వకమే
ఆయన మీ బ్లాగుకు సమస్య సంఖ్య1242 నుండి 1511 వరకు పూరణలు
పంపిరి . ఆకాశవాణి విశాఖ , విజయవాడ ,కడప కేంద్రాల నిర్వహణ సమస్యా
పూరణలకు ను ,సాహితీ కౌముది , సాహితీ స్రవంతి ,ప్రసన్న భారతి ,సాహిత్య
పత్రికలకును ,సప్తగిరి దూరదర్శన్ కు పలు పూరణలు కూడా వారు పంపిరి
ఉత్తమ పూరణకు 'సాహితీ స్రవంతి ' పత్రిక నుండి ,సప్తగిరి దూర దర్శన్ నుండి
పలు బహుమతులు వచ్చినవి . మీ కోర్కె మేరకు 18 చిత్ర సమస్యలను కూడ
మీ బ్లాగుకు పంపిరి .
నేటి సమస్యకు వారి పూరణ :-
రాముని బంటుని బలిమికి
భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ ; బిఱికితనమునన్
సామంతుడు విరటు తనయు
నీమహి నుడుగంగ వచ్చు నిస్సందియ మై
రాముని తమ్ముడు భీముడు
రిప్లయితొలగించండిరాముడు మఱి శౌర్యశాలి రమ్యుడు కూడన్
భీముని గుణమును నరయగ
భీముండు ప్రసిధ్ధు డయ్యె బిఱి కి తనమునన్
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులు.
రిప్లయితొలగించండిబీముండు పిఱికి! తా నొక
పామునుఁ గని పరువిడి యిడి, పరుగుల పోటీన్
నేమమున గెలిచె! భీరువు
భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ బిఱికితనమునన్!!
రాముని బంటగు హనుమను
రిప్లయితొలగించండిభీముడు నవమానబరచు భీరముబలుకన్
ఏమాత్రము గదలించక
భీముడు ప్రసిద్దుడయ్యె బిరికితనమునన్
రిప్లయితొలగించండిఆమగధాధిపు జీల్చగ
భీముండు ప్రసిద్ధుఁ డయ్యెఁ. బిఱికి తనమునన్
భూమింజయుడగు విరటుని
ప్రేమాస్పద సుతుడు బడసె విశ్రుతి ధరణిన్
నిన్నటి సమస్యకు పూరణ
రిప్లయితొలగించండిఈసందేహము వీడుము
మీసమ్ములు లేని వనిత మేదిని గలదే
మీసము పురుషుల కందము
రోసమునకు చిహ్నమనుచు లోకులు పలుకన్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విడి యుత్తరుడా...’ అనండి.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల సత్యనారాయణ మూర్తి గారూ,
వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమస్యాపూరణల పట్ల మీ తండ్రిగారికి ఉన్న ఆసక్తి, ప్రావీణ్యం తెలిసి సంతోషిస్తున్నాను.
ఈనాటి మీ తండ్రి (భాగవతుల కృష్ణారావు) గారి పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఉకారాంత శబ్దాల తరువాతి ‘ని’ రాదు. ‘ను’ వేయవలసి ఉంటుంది. ఆ పాదాన్ని ఇలా మార్చితే బాగుంటుందని నా సలహా ‘రామానుచరు ననుజుడుగ| భీముండు ప్రసిద్ధు డయ్యె’
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. నిన్నటి సమస్యకు పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
రామగు ద్రౌపది కావగ
రిప్లయితొలగించండిభీముండు ప్రసిద్ధుడయ్యె-పిరికితనమునన్
లేమల మధ్యన విరటుని
కోమల తనయుడు పలువిధి కోతలు కోసెన్
సేమము నజ్ఞాతమునను
కోమలి,పార్ధుడు,కవలును,కూరిమియన్నన్,
నేమము తప్పని కోరిక
భీముండు ప్రసిద్ధుడయ్యె పిరికితనమునన్
ఇక నిన్నటి సమస్యకు నా పూరణ;
రోసమదెక్కువ వనితల
కీసుంగలవారె యెటనునేడ్వరె వసుధన్
వాసిగ నిలయంబై పొడ
మీ,సంబులు లేని వనిత మేదిని గలదే!
(పొడము+ఈసు+అంబులు=పొడమీసంబులు)
మాసము లెవ్వరు లేరిల
వేసము దాల్చుట,సొగసున,వేవిధిననుచున్
నీసున గొప్పలు పలికెడి
మీసంబులు లేని వనిత మేదిని గలదే!
రాసగు రూపము తీసుకు
వాసిని గనమే సొగసున పడతులమనుచున్,
బోసగు మోమున మెలియిడు
మీసంబులు లేని వనిత మేదిని గలదే!
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రోసమ్మున నను గెలుచునే
రిప్లయితొలగించండిమీసమ్ములు లేని వనిత, మేదిని గలదే
నాసమమగుశక్తి యనుచుఁ
జూసెన్ దుర్గుడు యా దుర్గఁ చోద్యంబమరన్
ఆశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం.
అశ్వత్థ నారాయణ మూర్తి గారి పూరణ....
రిప్లయితొలగించండిఏమిక గతియని పరుగిడె
సేమము గాదంచు దుస్స సేనుడు, బలని
స్సీముండగుచు దునుమఁ రాన్
భీముండు, ప్రసిద్ధుడయ్యెఁ పిరికి తనమునన్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రాన్ భీముండు’...?
దునుముటకు రాగా అని అలా రాశానండీ
రిప్లయితొలగించండిజూసెన్ దుర్గుడటఁ దుర్గఁ చోద్యంబమరన్
అని సవరించ వచ్చు గదండీ
రిప్లయితొలగించండిగోముగ బెనజిరు భుట్టో
భామిని చావున దుబాయి పారిన ఘనుడా
గ్రామపు సింహము వోలెన్
భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ బిఱికితనమునన్
భామిని కోర్కెను తీర్చగ
రిప్లయితొలగించండిక్షేమమ్ముగ తోక నెత్తి గెలుచుట నందున్
రాముని బంటుకు నోడగ
భీముండు ప్రసిద్ధుఁడయ్యెఁ బిఱికితనమునన్