27, ఏప్రిల్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1659 ("అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే.
(కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో..)

37 కామెంట్‌లు:

  1. ఎన్నికలప్పుడీ ప్రజల కిచ్చుచు బాసలు చెప్పుచుంద్రు రా
    నున్నది రామరాజ్యమని రైతుల కష్టము తీరునంచు తా
    మన్నది మర్చిపోయెదరు మాయలు నేర్చిన నేతలార మీ
    కన్నమొరామచంద్ర యని అందరు చచ్చిన రామరాజ్యమే

    రిప్లయితొలగించండి
  2. మిన్నగు పంటపండినను మేఘము లాగ్రహమొందినం తనే
    చెన్నగు పైరుపచ్చలను చిందరవందర జేసిపోవగా
    యన్నము భిన్నమాయె ననియార్తిగ రైతులుఘోష బెట్టినన్
    " అన్నమొ రామచంద్ర యని " యందరుచచ్చిన రామరాజ్యమే

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి గారు రెండవపాదంలో యతి సరిపోయిందా ?
    **********************************
    రాజేస్వరిగారు పద్యం బాగుంది మూడవ పాదం లో బెట్టిమా .... కన్నము అంటే బాగుంటుందేమో.
    ***********************************

    రిప్లయితొలగించండి
  4. పిరాట్ల వారికి ధన్యవాదములు. కొన్ని సవరణలతో నా పూరణ:

    ఎన్నికలప్పుడీ ప్రజల కెన్నియొ బాసలు చేయు మీరు రా
    నున్నది రామరాజ్యమిక నుండవు కష్టములంచుపల్కి తా
    మన్నది మర్చిపోయెదరు మాయలు నేర్చిన నేతలార! మీ
    "కన్నమొరామచంద్ర!" యని అందరు చచ్చిన రామరాజ్యమే

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి గారు "లించుకన్న " అంటే బాగుంటుంది.ఇకమూడవ పాదం లో తాము +అన్నది =తామన్నది అక్కడ 'అ' కి మ కి యతి కుదరదు.చివరి పాదం వచ్చేసరికి మీకన్న మొరామచంద్ర !" అనేబదులు 'మిమ్మనమొరామచంద్ర' అనండి.మరియు 'అందరు' ను 'యందరు' యడాగమం చేస్తే సరిపోతుందేమో.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ (యతి సవరించిన) పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    చంద్రమౌళి సూర్యనారాయణ గారి పద్యం మూడవ పాదంలో అఖండయతి వేశారు. అది దోషం కాదు. సంధి జరిగినప్పుడు పూర్వపదాంత హల్లుకు కాని, ఉత్తర పదాది అచ్చుకు కాని యతి వేయవచ్చు ననడం అఖండయతి.

    రిప్లయితొలగించండి
  7. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కన్నుల పండుగై జనులు గాంచి సుఖించిరొకప్పుడీభువిన్
    చెన్నుగ జేయ రాజ్యమును శ్రీ రఘురాముడు;కూడుగుడ్డకున్
    భిన్నసమస్యలే యిపుడు భీకరమై ధరలంట నింగికి
    నన్నమొ రామచంద్ర యని యందరు చచ్చిన రామరాజ్యమే.

    రిప్లయితొలగించండి
  8. కొర్నెపాటి చంద్రశేఖరరావు గారి పూరణ....

    అన్నములేక దేశజను లందరు నావురుమంచునుండ,క్షీ
    రాన్నములన్ విదేశముల కంపెడు డంబములేలయన్న? య
    న్నన్న! యవేమి మాటలని యందరు బుగ్గలు నొక్కుకొందురే!
    "అన్నమొ రామచంద్ర"యని యందరు చచ్చిన రామరాజ్యమే?!!!

    రిప్లయితొలగించండి
  9. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొర్నెపాటి చంద్రశేఖర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారు ఒక సందేహము తమన్నది తాము+అన్నది దీనికి మా ఎలా సరిపోతుందో చెప్పండి .నా సమస్య అఖందయతి ప్రకారం పూరపదంత హల్లు ఇక్కడ 'ము' ఉత్తరాపదాంత అచ్చు 'అ' ఇటు ము కి కాని అ కి గాని మా యతి అక్షరం ఎలా అయ్యింది ? దయచేసి చెప్పగలరు.

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి


  11. పన్నుల మీద పన్నులిడి పన్నుల రాలగ రాలు వేసి యా
    పన్నులు రైతు బాంధవుల పంటల నష్టము బండు వేళలో
    దన్నుగ నిల్చి నాయకులు దైర్యము జెప్పక మిన్నకుండినన్
    "అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే ?

    రిప్లయితొలగించండి
  12. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ సందేహం సమంజసమే. అయితే ‘పూర్వపదాంత హల్లు’ అని ఉన్నదే కాని దాని అచ్చుతో ఇక్కడ సంబంధం లేదు. ఒకటి రెండు పూర్వకవుల ప్రయోగాలను చూడండి....
    ౧) మతిఁ గింకిరి పడక యోల మాసపడక (భారతము) .... ఇక్కడ ‘ఓలము+ఆసపడక = ఓల‘మా’సపడక’ అని ఉండగా పాదాద్యక్షరం ‘మ’.
    ౨) వెలయు నవ్విశ్వనాథు దేవేశుఁ గాంచి (హరిశ్చంద్రోపాఖ్యానము)... ఇక్కడ ‘దేవ+ఈశు + దే‘వే’శు’ అని ఉండగా పాదాద్యక్షరం ‘వె’.
    అఖండయతిని గురించి మన బ్లాగులో గతంలో ఇచ్చిన ఈ పాఠం చూడండి.
    అఖండయతి
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఉండి+ఎన్నడు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘తామెన్నడు/ తానెన్నడు’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  14. గురువుగారు
    "యతిస్థానంలో సంధి జరిగినప్పుడు అక్కడి హల్లుకు యతికూర్చడమే అఖండయతి. (అచ్చుకు యతి చెల్లవలసిన చోట హల్లుకు యతి చెల్లడం అఖండయతి). ‘రమ్మనెను (రమ్ము + అనెను)’ అనే చోట పరపదాద్యక్షరమైన ‘అ’కారానికి కాక పూర్వపదాంతాక్షరమైన ‘మ’కారానికి యతికూర్చడం అఖండయతి అవుతుంది."

    ఇది మన బ్లాగ్ లో ఇచ్చిన వివరణ

    ఇక్కడ నావుద్దేసం సంధి తప్పనిసరి యతిస్థానం లో జరగాలని కాని మిత్రులు చంద్రమౌళిగారి పద్యం లో సంధి పాదారంభం లో వుంది యతిస్థానం లో లేదు.మరల అడుగుతున్నందుకు అన్యదా భావించవద్దు.కేవలం academic interest లో అడిగాను.

    రిప్లయితొలగించండి
  15. మిన్నక యుండగా వలదు నెన్నడు ,చచ్చుట నాపగా దగున్
    అన్నమొ రామచంద్ర యని యందరు చచ్చిన, రామరా జ్యమే
    యెన్నడు నుండున ట్లుగను పన్నుగ నందరు బాటు నొందుచున్
    నెన్నిక లందు నె న్నుకొన మిన్నగు వానిని నొప్పుగా ధరన్

    రిప్లయితొలగించండి
  16. మిన్నగు పాడిపంటలిడు మేలగు క్షేత్రము లాక్రమించుచున్
    తిన్నన లేని నాయకులు తేరగ పంచుచు రైతుభూములన్
    చెన్నగుపాలనమ్మనుచు చెప్పెడు మాటలు కల్లలేసుమా!
    అన్నమో రామచంద్ర యని యందరు చచ్చిన రామ రాజ్యమే!

    రిప్లయితొలగించండి

  17. అన్నమొ రామచంద్ర యని " యందరు చచ్చిన రామరాజ్యమే
    యన్న- గనంగ, చావు యిక నందరినిన్ వరియింప నోక్కమా
    రెన్నగ పెండ్లి తో సమము నీయిల యందున నన్నసామెతే
    యున్నది గాదె చింత యిక నుండదు నుండగబోదు జూడగన్

    రిప్లయితొలగించండి
  18. పిరాట్ల ప్రసాద్ గారూ,
    సంధి యతిస్థానంలోనే జరగాలన్న నియమం ఎక్కడా లేదు. పదాదిని కూడా జరగవచ్చు.
    క్రింది కొన్ని ఉదాహరణలు చూడండి. ఇవన్నీ పాదాది సంధులే. అఖండయతి భాగలకు చెందినవి.....
    చి|*చ్చఱ పిడుగుల్ వడిం దొఱఁగు *చాడ్పున నంబరవీధి నుగ్రమై. [భారత.విరాట. ౫.౧౪౩] (చిచ్చు+అఱ)
    క్ర|*చ్చఱ మునివర్గవాహనుఁడ*వై చనుదెమ్మను మంతఁ దీరెడున్. [భారత.ఉద్యో. ౧.౧౭౬] (క్రచ్చు+అఱ)
    విస్ఫుర|*ల్లీలన్ నివ్వరిముంటిచందమున నెం*తే పచ్చనై సూక్ష్మమై [కూ.తిమ్మకవి. భర్గశతకము] (విస్ఫురత్+లీల)
    ను|*పేంద్రుఁ డిచ్చు నర్థము మోపె*డేసి యనఁగ. [అనం.ఛంద. ౧.౧౨౦] (ఉప+ఇంద్రుడు)
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    సవరించిన పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మిన్నక యుండగాను వల దెన్నడు...’ అనండి.
    ******
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చావు లిక’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. నిన్న చరిత్రదెల్పుచును నేడిల కష్టపు నష్టసూత్రముల్
    తిన్నగవల్లె వేయుచును తీరికయందున మైకు మైకమున్
    విన్నది సత్యమార్గమని వీనుల విందుగజెప్పు” నాయకుల్
    అన్న?మొరా మ చంద్రయనియందురు “|చచ్చినరామ రాజ్యమే”.

    రిప్లయితొలగించండి
  20. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సుమాంజలులు...

    తిన్నగ వానయుం గుఱియదే, యిలఁ బంటలుఁ బండవే హరీ!
    సన్నుతిఁ జేసినన్ గనవు, చక్కని పంటల నీయ వేలరా?
    యన్నము కోసమై ప్రజలు వ్యాకుల మందుట నీకు న్యాయమే?
    "యన్నమొ రామచంద్ర"యని యందఱుఁ జచ్చిన రామరాజ్యమే?

    రిప్లయితొలగించండి
  21. ఆశ్వత్థ నారాయణ మూర్తి గారి పూరణ.....

    కన్నుల ముందరే పొలము గాసినదంతయు నీటి పాలవన్
    కన్నుల నీరు నింపి మన కర్షక లోకము శోకమగ్నమై
    కన్నుల ముందు కష్టములు కాష్టములై గని యార్తివర్తులై
    'అన్నమొ రామచంద్ర' యని యందరు జచ్చిన రామరాజ్యమే.

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు నాకు మెయిల్‍లో పంపిన పూరణల క్రింద ‘ఇంద్రాణి’ అని ఉంటున్నది....? ఈ పూరణ వ్రాసింది మీరా? ఇంద్రాణి గారా? లేక అది మీ కలంపేరా?

    రిప్లయితొలగించండి
  23. అది నా భార్య పేరు ,కలం పేరు కూడాను.
    వ్రాసింది నేనే. అది mail లో మాత్రమే
    మీ సందేహానికి కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  25. కె,యస్,గురుమూర్తి ఆచారి గారి పూరణ
    నిన్నెదలంచుచున్ ప్రజలు నీరసులైరి,సహింపకుండెయే
    మన్నమొ రామచంద్రయని,యందరుచచ్చినరామరాజ్యమే
    మున్నది,రమ్మయోధ్యకు,గుణోన్నత,రాఘవ,రాజ్యమేలనా
    కెన్నడు లేదటంచు యనియెన్ భరతుండు,వినమ్రశీలుడై

    రిప్లయితొలగించండి
  26. నిన్నను రామరాజ్యమన నీతిని దప్పని నేత లెన్నగా
    నన్నము గూడు గుడ్డలకు నార్తిని జెందిన వారు లేరు నే
    డున్న వినాయకుల్ చెపుదు రొక్క పరార్థము నిట్లు సోదరా!
    "అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే.

    రిప్లయితొలగించండి
  27. చెన్నుగ వచ్చు నాయకులు చేతులు కట్టుకు నోట్లకోసమై
    మిన్నును దెచ్చి యిత్తుమను మేలగు నాశలు చాల జూపుచున్
    తిన్నగ గద్దెనెక్కగనె తీయని మాటలు నీటిమూటలై
    యన్నమొ రామచంద్ర! యని యందరు చచ్చిన రామరాజ్యమే!!!

    రిప్లయితొలగించండి
  28. కన్నము వేయకే గెలికి గౌరవ మందుననున్నదెంతయో
    చిన్నగ లూటి జేయగల చిత్ర,విచిత్రపు మాయజాలమున్
    నెన్నిక లైనవారలిల నేర్పరి తత్వమె నున్న చోటునే
    అన్నమొ రామచంద్రయని యందురు|చచ్చినరామరాజ్యమే|

    రిప్లయితొలగించండి
  29. చెన్నుగ సేద్యమున్ నెరపి (సలిపి) చేర్చిరి రైతులు ధాన్య రాశులన్,
    వన్నెలు చిల్కు వార లటు పల్కిరి బేరము "సిండికేటు" గన్,
    పన్నులు కట్ట కుండగను వన్నెలు చిల్కెడి బేహరుల్ ధరన్
    "అన్నమొ రామచంద్ర " యని యందరు చచ్చిన రామరాజ్యమే
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. చెన్నుగ సేద్యమున్ నెరపి (సలిపి) చేర్చిరి రైతులు ధాన్య రాశులన్,
    వన్నెలు చిల్కు వార లటు పల్కిరి బేరము "సిండికేటు" గన్,
    పన్నులు కట్ట కుండగను వన్నెలు చిల్కెడి బేహరుల్ ధరన్
    "అన్నమొ రామచంద్ర " యని యందరు చచ్చిన రామరాజ్యమే
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  32. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. అన్నము,సార, నోట్లడిగి యాశగ నోట్లను వేయుచుండఁ! దా
    మెన్నికలందుగెల్చిమన యేలికలై సిరి దోచకుందురే?
    ఖిన్నులమై దగా పడఁగ గేలిగ నవ్వెడు రాక్షసాళితో
    'అన్నమొ రామచంద్ర'యని యందరు చచ్చిన? రామ! రాజ్యమే?

    రిప్లయితొలగించండి
  35. పన్నుగ బైకు త్రోలుచును బంజర హిల్సున వీధులందునన్
    చెన్నుగ దొంగిలించి వడి క్షేమపు రీతిని హేమహారముల్
    మిన్నగ పారిపోవుటను మెండుగ వచ్చిన రాక్షసాధముల్
    "అన్నమొ రామచంద్ర!" యని యందరు చచ్చిన రామరాజ్యమే

    రిప్లయితొలగించండి