అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మనోహరభావయుక్తమైన ఈ ద్విపద (మకుటం చూసి గేయమనుకున్నాను) అద్భుతంగా ఉంది. కాని ప్రాసనియమాన్ని పాటించారు కనుక ఇది ద్విపదయే. మంజరీ ద్విపద కాదు. మీకు నా ప్రత్యేకాభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, చక్కని భావంతో పద్యాన్ని అందించారు. అభినందనలు. ‘తీరికచే నత్త’ అనండి. ‘గెట్టుగాను’ అన్నది ‘గుట్టుగాను’ అన్నదానికి టైపాటు కావచ్చు. లేకుంటే యతిదోషం.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యంలో వెలిబుచ్చిన ఆధ్యాత్మక బావాలు బాగున్నవి. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పిండిని చేయగ వనితలు
రిప్లయితొలగించండిదండిగ శ్రమకోర్చి తొల్లి తాపము నొందన్
కండలు కరగక నిప్పుడు
మెండగు యంత్రములు వచ్చె మేలగు సతికిన్
" కండలు బెంచగ నిప్పుడు "
రిప్లయితొలగించండిఅంటే బాగుండేదేమొ
విసరమ్మ విసరవే వెయ్యేళ్ళు నీకు
రిప్లయితొలగించండివిసరమ్మ విసరవే వేవిళ్ళు నాకు
బతకవే నీయిల్లు బంగార మవగ
బాలింత నైనేను పాపణ్ణి కనగ
నీయింటి దేవుడూ నిటలాక్షు దలచి
నాయింటి దేవుడూ నరసింహు గొలిచి
మాయింట బూసినా మరుమల్లె ముడిచి
మీయింట గాసినా మేలుపూఁ దురిమి
విసరమ్మ....
మాయింట బుట్టేను మహరాజు యొకడు
మీయింట గలిగేను మీనాక్షి యొకతె
మనజన్మ ధన్యమై మనువాడి వారు
మనయిండ్ల తిరగాలి బంగారు తేరు
విసరమ్మ.......
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
ఈ తిరగలి పాట చాలా బాగున్నది. ఇది మీ స్వరచనయా? లేక సేకరించినదా?
ఇది పూర్తి గా నా స్వంతరచన
రిప్లయితొలగించండిY stands for Yanamandra and S for my fathers's name Singappa
మీ మెప్పుదలకు నా సనమస్కార కృతజ్ఞతలు
శ్రీ శంకరయ్య గారూ
రిప్లయితొలగించండిద్విపద మంజరి ప్రయత్నం చేశాను
కృత కృత్యుణ్ణి ఐతే సంతోషం
వనితలిరువు రచట వాసిగ మినుములు
రిప్లయితొలగించండివిసురు చుండ క్రింద పిండి పడగ
నెత్తి పంచదార నెక్కువ నెయి వోసి
కలిపి కట్జ లడ్డు కమ్మ గుండె/కమ్మనుండె
వనితలిరువు రచట వాసిగ మినుములు
రిప్లయితొలగించండివిసురు చుండ క్రింద పిండి పడగ
నెత్తి పంచదార నెక్కువ నెయి వోసి
కలిపి కట్జ లడ్డు కమ్మ గుండె/కమ్మనుండె
తిరగలి త్రిప్పుచు రయమున
రిప్లయితొలగించండిస్థిరమగు చిత్తమ్ముతోడ చేయుచు నుఱుమున్
నిరతము నాడుచు పాడుచు
సరదాగా పనులఁజేయు సకియలఁగనుడీ!
చిత్ర మందున భామలు చిత్త మలర
రిప్లయితొలగించండిత్రిప్పు చుండిరి పిండికై తిరుగ లియట
యెంత మెత్తగా వచ్చునో నంత బాగు
చేయ వచ్చును దానితో జేత నైన
పిండి వంటలు రామయ్య !ప్రియము గలుగ
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమనోహరభావయుక్తమైన ఈ ద్విపద (మకుటం చూసి గేయమనుకున్నాను) అద్భుతంగా ఉంది. కాని ప్రాసనియమాన్ని పాటించారు కనుక ఇది ద్విపదయే. మంజరీ ద్విపద కాదు. మీకు నా ప్రత్యేకాభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
తిరుగలి తిరుగంగ?తీరికచే యత్త
రిప్లయితొలగించండి------------పెత్తనాలు సలిపి పేరుబొందె|
పక్కింటివదినలు మక్కువ మాటలు
------------చెవులలో వేయంగ?చేరి పిదప
నోటవెలువడు వినూత్నరీతిగ|పిండి
-----------వచ్చు నట్లుగ మాట లొచ్చుగాదె|
సంసారబంధమ్ము సాగెడిపద్దతి
-----------గుండ్రమే ననిదెల్పు గెట్టుగాను|
అట్టి తిరుగలి నింటింటపట్టుదలను
ఐకమత్యముజేకూర్చి సాకు నట్లు
నాటి సంస్కృతి నెల కొల్ప?నేటి బ్రతుకు
కలసి మెలసియునున్నచో?కలత లాయె|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిచక్కని భావంతో పద్యాన్ని అందించారు. అభినందనలు.
‘తీరికచే నత్త’ అనండి. ‘గెట్టుగాను’ అన్నది ‘గుట్టుగాను’ అన్నదానికి టైపాటు కావచ్చు. లేకుంటే యతిదోషం.
నిన్నటి పద్య రచన :
రిప్లయితొలగించండినీరము నభిషేకించియు
మారేడులనిడఁగ హస్తి మాత్సర్యమునన్
దూరగ శ్రీ కాళమ్ములు
జౌరగ కుంభముఁ, ద్రయమ్ము శంకరుజేరెన్!
నేటి పద్యరచన :
తిరుగని రాయియె 'కర్మము'
తిరుగే రాయన్న'భక్తి' తిప్పెడు పిడియే
యెరిగిన'జ్ఞానము' , కర్మను
ధరపై ధ్వంసమ్ము జేయఁ దనరును పరమే!
మరలుండెడి కాలమ్మున
రిప్లయితొలగించండితిరుగలితో విసురుటేల తీయుము మిక్సీ!
బరువును తగ్గించు కొనగ
సరియగు వ్యాయామమిదియె సఖియా గనుమా!!!
మరచిరి ఘరట్టములిలన్
మరలందున మరలవోలె మసలుచు మనుజుల్
తిరుగలితో పిండి విసరి
మురియుచు మురుకులను జేయు ముదితలు గలరే!!!
గంగ-గౌరి వాదు కనులకుగట్టంగ
రిప్లయితొలగించండిపాటబాడుపనులుపరవశాన
కష్ట నష్ట మేది గనుపించ నంతగా
తిరుగలి వలె బ్రతుకు తిరుగు చుండు
గిరగిర లలనా మణులే
రిప్లయితొలగించండితిరుగలి లోధాన్యముంచి త్రిప్పుచు పిడితో
కరముల సత్తువ తోడ వి
సరుచుండిరి పిండి చాకచక్యము తోడన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యంలో వెలిబుచ్చిన ఆధ్యాత్మక బావాలు బాగున్నవి. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.