30, ఏప్రిల్ 2015, గురువారం

పద్య రచన - 895

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. నిన్నటి పద్య రచన:
    లోపల యరిషడ్వర్గంబులు చెలరేగ
    గురువు నాశ్రయించుచు సరగున వెడలిన,
    మనల బుద్ధ్యాత్మలిరువురు మాటుకాయు,
    నిత్య కర్మలన్ సరిజూచి నెమ్మి నొసగు

    రిప్లయితొలగించండి
  2. యేబాధను నేబొందిన
    నాబావకు విన్నవించననునయమిచ్చున్
    నాబాధనెవరికి చెబుదు
    నాబావయె యేడిపించెనన్యాయముగా

    రిప్లయితొలగించండి
  3. సింగారించితి నీకని
    పొంగారెడు మనసు తోన పోవుద మెటకున్
    సంగోరు రాత్రి గడచెను
    బంగా రపుమామ జాడ బాధించ మదిన్

    రిప్లయితొలగించండి
  4. వెండి తెరవెలుగులకును వెర్రి యగుచు
    ఇంటఁ దెచ్చిన పైకము లింకి వోవ
    దిక్కు దోచక నచ్చోట ,దీన యగుచు
    కనులు, ముఖమును, కరముల గప్పి యుంచె

    తార కావలె ననియెడి తనదు యిచ్చ
    తీరుటకు దారు లెచ్చట తెలియ లేక
    తారల, మెరయు ధగధగలఁ తలచు కొనుచు
    తాఁ రగులుచు నొగులుచును తాపమొందె

    తగని కోరిక లకునీవు దగులు కొనిన
    ముందు వెనుకలు తెలియక ముందుజనిన
    ఆసల మరీచిక పడవ యందు నెక్కి
    సేయు, భ్రమల పయనములు చేటు దెచ్చు

    అభ్ర విభ్రమ తారల యందమంత
    దూర మునబరి కించిన, ద్యుమణి మించు
    నిక్కములు గాని యా రిక్క, నెరిఁ మెరఁగుల
    మాయలకు మోసపోకుమ మ్మాయిలార







    రిప్లయితొలగించండి
  5. మొదటియాటకు ' సినిమాకు ' మోదమలర
    పోదమంచును మగడేమొ ' ఫోను' జేసె
    ఎదురు చూచెను సతి ' టైము ' యేడవగను
    రాడు రాడాయె ఫలమేమి యేడవగను.

    రిప్లయితొలగించండి
  6. శీనూబావను చేకొన
    తానెంతో యాసపడుచు తనియుచు నుండన్
    మేనరకము వలదనుచును
    నానమ్మే పట్టుబట్టనలుగుచు నుండెన్

    రిప్లయితొలగించండి
  7. చిత్ర మందున బాలిక చింత తోడ
    నేడ్చు చుండెను గారణం బేది యగునొ ?
    తెలిసి కొననేగి బాధను దీర్చు మయ్య !
    కావ లసినది యీయుచు గారవముగ

    రిప్లయితొలగించండి
  8. మాజేటి సుమలత గారూ,
    (నిన్నటి చిత్రానికి) మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    సందేశాత్మకమైన మీ ఖండకృతి బాగున్నది. అభినందనలు.
    రెండవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘ధగధగల్ దలచుకొనుచు’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    యమకాలంకారంతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఏడ్పుమానుము చెల్లెలా గాడ్పు వోలె
    వచ్చె ప్రియుడు నీ తోడిదే బ్రతుకటంచు
    పేరు తెలియని యూరిలో విడిచి,నీదు
    నగలతో పారిపోయెను వగల జూపి
    నయము వేశ్యల యింట నిన్నమ్మ లేదు
    మాను ఆత్మహత్య తలపు మరలు మింక
    యున్న ధనము తో నెటులైన యూరు జేర
    కొత్త జీవిత మింక నీ కూర్మి యగును

    రిప్లయితొలగించండి
  10. మాపటేళ వచ్చి మనసైన చోటకూ
    తీసుకెళ్లెదనని బాస చేసి
    తీరి కూర్చొనుండ తీరిక లేదనె!
    కాక పోతి నేమొ రాక పోయె!

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్న మీ తేటగీతిక బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మంచిభావంతో పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    కాని ఎక్కువగా వ్యావహారికాన్ని ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణలు.....
    మాపటికిని వచ్చి మనసైన చోటకు
    తీసుకొనుచు నేగ బాస చేసి
    తీరి కూరుచుండ తీరిక లేదనె!
    కాక పోతి నేమొ రాక పోయె!

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    మాపటికిని వచ్చి మనసైన చోటకు
    తీసుకొనుచు నేగ బాస చేసి
    తీరి కూరుచుండ తీరిక లేదనె!
    కాక పోతి నేమొ రాక పోయె!

    రిప్లయితొలగించండి
  13. చిన్న తనంబు నుండిమనసెంచిన ఏడుపు సాకకమ్మ.నీ
    వన్నెయుసన్నగిల్లు|మను వాడెడి వాడికి ముఖ్యమమ్మ|నీ
    కన్నె తనంబు నందు తనకందెడి కోర్కెలు పంచు వానితో
    పున్నమి రేయిలా గడుప పూర్తిగ వన్నెలవెన్నెలబంచ ముఖ్యమౌ?

    రిప్లయితొలగించండి
  14. బావ సెప్పిన యూసుకు ఫక్కుమనుచు
    సిగ్గు కెంజాయ మోమున సీమమీర
    కరమున ముఖశశాంకము గప్పి, కన్నె,
    చిలిపి యూహల దేలుచు చిత్రమయ్యె

    రిప్లయితొలగించండి
  15. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థనారాయణ మూర్తి గారూ,
    అందరికీ ఏడుస్తున్న అమ్మాయి కనిపిస్తే మీకు సిగ్గుతో ముఖం కప్పుకుని నవ్వుతున్న అమ్మాయి కనిపించిందా? బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారి అభినందనలకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  17. వేదన భద్రత నీయదు
    రోదించుట మానుమింక రుచిరాంగియటన్
    శోధించిన కనబడు గతి
    సాధింతువు దానితోడ సత్కార్యములే!!!

    రిప్లయితొలగించండి
  18. అందరి దృక్కోణం నుంచీ కాకుండా అమ్మాయిని నవ్విద్దామని
    ప్రయత్నం చేశా. మీరు అమ్మాయి ముఖాన్ని చేతులతో కప్పి
    భావాలను వేటినైనా ఊహించే అవకాశం కల్పించారు.

    రిప్లయితొలగించండి
  19. సిగ్గు తోనైతే అరచేతులతో కళ్లు మూస్తారు.
    కాబట్టి ఇది ఏడుపు భంగిమే!

    రిప్లయితొలగించండి
  20. వనిత విషాధ చాయ ననివార్య మటన్నచొ?కార్య హాని|నీ
    పనితన మెంతయున్న?పనిపాటలు సాగుటకల్ల|గుల్లయౌ|
    మనుగడ కష్టసాధ్యమగు ,మానినిఏడుపు లోకనిందతో
    ధనమున సాగ దండుగగు|ధైర్యమునింపెడి దాడదేసుమా

    రిప్లయితొలగించండి
  21. కలువకన్నులు మూయ గాంచగ శక్యమా?
    -------------మూయుచేతుల యందు మూతబడగ
    చెప్పెడినీతులు చెరుపగ పెదవులు
    -------------హస్త మందునలుగ?విస్తు గాద
    సంపెంగ ముక్కుకు సరిబడ గాలినే
    -------------అందించ కున్నచో?హాయియేది?
    బుగ్గల మొగ్గల సిగ్గులు విరచిన?
    విడచి విలువైననవ్వుకు-నిడివిబెంచు|

    రిప్లయితొలగించండి
  22. నేను చిత్రాన్ని ఉదయం ఏడిపించాను అందుకు, ఇది వర్ణన సంబంధించి అయినందునా, ఇంకోవిధంగా ప్రయత్నం చేశాను.నేను మీతో ఏకీభవిస్తున్నా

    రిప్లయితొలగించండి
  23. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
    మీ చివరి పద్యం ఛందం అర్థం కాలేదు. అసంపూర్ణ సీసపద్యంలా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  24. ఏడుపు లెందుకమ్మ?”తన నేలెడివాడికి కట్న కానుకల్
    తోడుగ వెళ్ళ కున్న?తనతోడుగ రాడట వారసత్వమే
    నీడ గ వెంట నంట?నవ నీతికిపుట్టుక సంతుకబ్బగా|
    వాడద నాడజాతి?ననివార్యము నందున నాశనంబనే”.

    రిప్లయితొలగించండి
  25. ఎడుపన్నది బాల్యనతోడుగాని
    తోడు నీడగ మగడున్న జాడవెతుకు
    సంతసంబునుసాకని చింత,వగపు
    విడచి విలువైన నవ్వుకు-నిడివిబెంచు
    --------------------------------
    శ్రికందిశంకరయ్యగారికి వందనాలతో పొరపాటున తేటగీతి పొందుపరచలేదుసీసపద్యన

    రిప్లయితొలగించండి