1-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అంశం - శ్రీరాముని వనవాసము
చందం - ఉత్పలమాల
(1వ పాదం 1వ అక్షరం 'పం'; 2వ పాదం 2వ అక్షరం 'చ'; 3వ పాదం 10వ అక్షరం 'వ'; 4వ పాదం 17వ అక్షరం 'టి')
(లేదా...)
'పం, చ, వ, టి' అనే అక్షరాలను వరుసగా నాలుగు పాదాల ఆద్యక్షరాలుగా ప్రయోగిస్తూ తేటగీతి పద్యం వ్రాయండి.
31, మే 2023, బుధవారం
న్యస్తాక్షరి - 80
30, మే 2023, మంగళవారం
సమస్య - 4435
31-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేప గూడొనర్చి వసించుఁ జెట్టుపైన”
(లేదా...)
“చేప నెఱుంగవా వినుము చెట్టున గూడొనరించి యుండదా”
29, మే 2023, సోమవారం
సమస్య - 4434
30-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్”
(లేదా...)
“ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్”
28, మే 2023, ఆదివారం
సమస్య - 4433
29-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా”
(లేదా...)
“చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)
27, మే 2023, శనివారం
సమస్య - 4432
28-5-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోహిణి మేఘతతిఁ దెచ్చెఁ ద్రోయుచు నెండన్”
(లేదా...)
“రోహిణి దెచ్చె మేఘతతి ద్రోయుచు నెండల మండువేసవిన్”
(కొరుప్రోలు గౌరినాయుడు గారికి ధన్యవాదాలతో...)
26, మే 2023, శుక్రవారం
సమస్య - 4431
27-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్”
(లేదా...)
“రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరాయంచు శ్లాఘింపఁగన్”
25, మే 2023, గురువారం
సమస్య - 4430
26-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రఘురాముఁడు పాంచజన్య రవమును వినిచెన్”
(లేదా...)
“రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా”
24, మే 2023, బుధవారం
సమస్య - 4429
25-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా”
(లేదా...)
“శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా”
(ఛందోగోపనం)
23, మే 2023, మంగళవారం
దత్తపతి - 196
24-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'నది - మది - గది - పది' పదాలను ప్రయోగిస్తూ
గురుశిష్యుల అనుబంధం గురించి
స్వేచ్ఛఛందంలో పద్యం వ్రాయండి.
22, మే 2023, సోమవారం
సమస్య - 4428
23-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్”
(లేదా...)
“కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)