30, మే 2023, మంగళవారం

సమస్య - 4435

31-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేప గూడొనర్చి వసించుఁ జెట్టుపైన”
(లేదా...)
“చేప నెఱుంగవా వినుము చెట్టున గూడొనరించి యుండదా”

14 కామెంట్‌లు:

  1. మండుటెండలసంద్రముమాయమయ్యె
    నీటిజీవులుపరుగిడెనీడకొఱకు
    చిన్ని ప్రాణమునిలువంగ చెఱువువీడి
    చేపగూడొనర్చివసియించుచెట్టుపైన

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    వింటె? రోహిత పక్షిని వివరమెరుగ
    గుంపులుగ జలాశయములఁ గోరి చేరు
    నొంటి కాలిమీద నిలచి యొడిసి పట్టు
    చేప, గూడొనర్చి వసించుఁ జెట్టుపైన

    ఉత్పలమాల
    రూపము గాంచుమా! యదియె రోహితపక్షి నివాస, ప్రాశనల్,
    ప్రాపుకటంచు గుంపులుగ రంజిలు దేవుని సృష్టిఁ జిక్కుచున్
    మోపుచు నొక్కకాలినట ముక్కును సాచుచు పట్టు భుక్తికై
    చేప, నెఱుంగవా వినుము చెట్టున గూడొనరించి యుండదా!

    రిప్లయితొలగించండి
  3. చెరువు గట్టునఁ గలదొక చింతచెట్టు
    చెరువు నందున వసియించు చేపలెన్నొ
    బకము మనమున యోచించి పట్టుకొనఁగ
    చేప, గూడొనర్చి వసించుఁ జెట్టుపైన

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    బాపురె! యందచందములు వాడిమి స్పందనమిచ్చెడిన్ వనిన్
    దీపము రాత్రులన్, బగలు దివ్యమె, లొంగెను కామదేవుచే
    తాపము చేత గర్భమును దాల్చిన వానరకాంత, పాలు, చే
    *చేప నెఱుంగవా? వినుము చెట్టున గూడొనరించి యుండదా?*
    ...........
    చేచేఁపు : క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1962
    దే.స.క్రి.
    ఎక్కువగా చేపు.

    రిప్లయితొలగించండి
  5. నీరులేకజీవించదునిమిషమైన
    చేప, గూడొనర్చి వసించుఁ జెట్టుపైన”*
    పక్షితనపిల్లలనుగూడివాసిగాను
    సృష్టి లొసహజమైనట్టికృత్యములివి

    రిప్లయితొలగించండి

  6. నేను గాంచితి నాండ్రైడు ఫోనులోన
    బహుబలమది తా మేసెనే పచ్చిగడ్డి
    విహగ వీధిని విహరించె భేరమొకటి
    చేప గూడొనర్చి వసించుఁ జెట్టుపైన.


    ఏ పని జేయజాలనను హీనునితోడ వచించె వృద్ధుడే
    కోపము తోడ చెంతజని కుర్రతనంబది వీడకుంటి వం
    చే పనెఱుంగవా? వినుము చెట్టున గూడొనరించి యుండదా
    యోపిక తోడ పక్షి, శ్రమ యొక్కటె యుక్తము మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  7. చెరువు గట్టున నెలకొన్న చెట్ల పైన
    కొలువు తీరెను పక్షులు బిలబిలమని
    చిట్టి లకుముకిపిట్ట తాఁ బట్టునుగద
    చేప, గూడొనర్చి వసించుఁ జెట్టుపైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపము కాదు జీవనము పక్షికి ముక్కున చిక్కి యున్నదౌ
      చేప నెఱుంగవా? వినుము చెట్టున గూడొనరించి యుండదా
      రూపము చూడ సుందరము రూఢిగ పిత్సువు గోచరించుగా
      చూపరులెల్ల ఱిచ్చపడి చూడగ ముక్కున చేపతో సదా

      తొలగించండి
  8. నీటి యందున వసి యించు నిశ్చ యముగ
    చే ప :: గూడొ న ర్చి వసించు చెట్టు పైన
    పక్షి తన పసి పిల్ల ల బాగు కోరి
    సహ జ మది లోక మందున సర్వ వేళ

    రిప్లయితొలగించండి
  9. రూపము పాండిమమ్ము యవలోకన చేయుచునుండు నోర్మితో
    తాపసివోలె కన్నులను తద్దయు మూయుచు నొంటికాలిపై
    కోపముబూనదెన్నడును కొంగని యందురు దాని లక్ష్యమౌ
    చేప నెఱుంగవా వినుము చెట్టున గూడొనరించి యుండదా

    రిప్లయితొలగించండి
  10. తే॥ ఆపుకొన లేని నవ్వు నన్నావహించె
    చేప గూడొనర్చి వసించుఁ జెట్టు పైన
    ననఁగఁ జేప జలచరము హాస్యమేల
    పక్షి గూడనంగను జెట్టు పైన నుండు

    ఉ॥ ఆపక నెల్లవేళలను హాస్యమటంచు వినంగ సర్వులున్
    బాపము పిచ్చివాఁడొకఁడు వాగుచు నుండెను దోచినదే
    చేపల హావ భావములఁ జెప్పుచు వాఁడు వచించె నిట్టులన్
    జేప నెఱుంగవా వినుము చెట్టున గూడొనరించి యుండదా!

    రిప్లయితొలగించండి

  11. వారి యందున మాత్రమే వాసముండు
    చేప; గూడొనర్చి వసించుఁ జెట్టు పైన
    పక్షి; జంతు జాలమున కావాస మడవి;
    పుట్టలో నివసించు పాములును చీమ;
    లిటుల ప్రకృతిడె ప్రాణులకెల్ల వసతి.

    పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రిప్లయితొలగించండి

  12. తే:
    పాప యెంత కష్టపడెను, పడెను జారి
    చేప; గూడొనర్చి వసించు జెట్టు పైన
    పిట్ట యొకటి పట్టుకొనగ పట్టు వీడి
    పోయె, పాప యేడ్చుకొనుచు పోయె నయ్యొ!

    రిప్లయితొలగించండి
  13. ఈపుడమే కదా నరులకెల్ల ని
    వాసము నిచ్చె ప్రేమతో
    ఈపుడమే కదా బ్రతుక నిచ్చె
    సరస్సు జరించ వారిలో
    చేప నెరుంగవా, వినుము చెట్టున
    గూడొనరించియుండదా
    ఈపుడమిన్ విహాంగ, మిల యెప్పుడు
    జీవుల దాపునుండెడిన్.

    రిప్లయితొలగించండి