1-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అంశం - శ్రీరాముని వనవాసము
చందం - ఉత్పలమాల
(1వ పాదం 1వ అక్షరం 'పం'; 2వ పాదం 2వ అక్షరం 'చ'; 3వ పాదం 10వ అక్షరం 'వ'; 4వ పాదం 17వ అక్షరం 'టి')
(లేదా...)
'పం, చ, వ, టి' అనే అక్షరాలను వరుసగా నాలుగు పాదాల ఆద్యక్షరాలుగా ప్రయోగిస్తూ తేటగీతి పద్యం వ్రాయండి.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిపంచిన క్ష్వేళమున్ సుధగ భావనజేసెడు ధర్మ మూర్తి తా
వంచనమెంచకుండ వనవాసమువోయెను దండ్రిమాటకై
పంచెను మౌనివర్యులకు వంతలు వాపుచు రక్షణంబు మే
లెంచెను శిష్టరక్షణము నిద్ధర రాముడు మేటి దైవమై
తేటగీతి
పంతమున కైక వనమేగఁ బల్కెననఁగ
చకితుఁడున్ గాకయె వరప్రసాదమనుచు
వదలి వైచెను రాజ్యమ్ము పత్నితోడ.
టిప్పణము వలె నా రాము డెందమునకు?
పంచెరామునికైకమ్మపన్నివలను
రిప్లయితొలగించండిచనియెయాతమడుభక్తినిచాలగలిగి
వనికివెలుగులుతాముగావచ్చెనుగవ
టినివరగుణుడువసియించెఠీవితోడ
యాతడు
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండిపంచను వీడమన్న తలి వాంఛకు లోబడి భార్య తోడుతన్
సంచము భోగహీనుడయి సాగెను రాముడు చేర్చ లక్ష్మణున్
వంచెను శీర్షమున్ గుహుడు, వర్తని గంగను దాటగా రహిన్
పంచవటిన్ వనిన్ నిలుప వాసము, రక్షక సూటికాడటన్.
రిప్లయితొలగించండిపంక్తిరథుని మాట నిలుప భాగ్యములను
చమ్మదనము విడిచి రామచంద్రుడపుడు
వదలి పెట్టెను రాజ్యమున్ పడతుక కప
టి వరవైన మంథరకిది యవజయమ్ము.
పంచియ నారవస్త్రమును వాసిగ దాల్చుచు భోగ భాగ్యముల్
కాంచన భూషణాదులను కాదని రాజ్యము వీడె కైకయే
వంచన జేయనేమి తలవంచక సాగెను రాక్షసాళినే
ద్రుంచుచు పీడితాళికిల దుఃఖము బాపిన మేటి రాముడే.
పంక జాక్షి సీతను గొని వనికి నేగి
రిప్లయితొలగించండిచక్క నైనట్టి రీతిగా సౌఖ్య మునకు
వలసి నట్టిది యచ్చట వాస ముకు ప
టిష్ట మయ్యు నివాసకుటీ ర మయ్యె
పంచవటిలోన నిర్మించె పర్ణ శాల
రిప్లయితొలగించండిచకచకమనుచు విడనాడి చారపథము
వనమునందు దాశరథి జీవనము మునుప
టి పరిసరముల సౌఖ్యము నపలపించి
పంచమి రోజుమంచిదని భావన చేసిన రామచంద్రుడే
తొలగించండిపంచవటిన్ సృజించెనట పచ్చని వెచ్చని పర్ణశాలనే
వంచన సేయగా నరసి వచ్చిన పిమ్మట దొంగిలించెగా
చంచలుడైనరావణుడు జానకి గీతను దాటినంతటన్
పంచెను ప్రేమ రాఘవుఁడు పావనిసీతకు నంచితమ్ముగా
రిప్లయితొలగించండిపంచవటీ కుటీరమున భ్రాత తరించె సపర్యలందునన్
వంచనజేయ రక్కసుఁడు వచ్చెను దాపుకు మాయ లేడిగా
కాంచన శంబరమ్ముఁగని కాంతునిఁదెమ్మనె బోఁటి యర్మిలిన్
*పావని సీతకుదంచితమ్ముగా
తొలగించండిపంప తనతండ్రి యే వన వాసమునకు
రిప్లయితొలగించండిచనియె సతియు లక్ష్మణుడు రాన్ సంతసమున
వనమునండున కట్టగా వాసమును క
టికి ప్రదేశము నందున సుకము గొనియె
ఉ॥ పంతము కైక పట్టఁగను బ్రాణసఖీ యనుజుండు తోడుగా
రిప్లయితొలగించండిపంచవటీ కుటీరమున వాసముఁ జేయఁగ రాముఁడేగఁగన్
బంచలు నార చీరలును వస్త్రములై చన ధర్మ బద్ధుఁడై
మించిన దుఃఖ సాగరము మేనిని గ్రమ్మెను మేటి తండ్రికిన్
తే॥ పంచవటికి శ్రీరాముఁడు పడతి సీత
చక్కని యనుజుని గలసి చనఁగఁ దండ్రి
వచన పాలకుఁడై వన వాసిగను కు
టిలిలు సంతసించిరట మేటిగన చటను
పంచెను రాఘవుండు గడు బాధ్యత
రిప్లయితొలగించండితోడను బర్ణశాలను
న్నంచిత భావమొప్ప గనుమంచును
జెప్పెను దానవాధముల్
వంచన జేయగా సతము వచ్చుచు
నుందురు సుమ్మి లక్ష్మణా!
కంచెవలెన్ సదా నిలచి కాపల
గాయుము నేటి రోజునన్.
పంచవటి యందు శ్రీరాముడంచితముగ
రిప్లయితొలగించండిచక్కనమ్మ సీతమ్మతో సరసమాడ
వనము విరసెను పూవుల వాన కురిసె
టిప్పనిగ సీత మోదము చెప్పినటుల
*విరిసెను
తొలగించండిపం* చగ తండ్రి రాము వనవాసము నుండగ, కైక కోర్కె చె
రిప్లయితొలగించండిల్లిం *చ* గ, వాని యానతి ఫలించగ, తమ్ముడు భార్య తోడ తాన్
పంచవటిన్ వసించెను వి *వ* ర్జితుడై విభవమ్ములన్నియున్
వంచకులైన రాక్షసుల వంచగ నెంచుచు ధా *టి* గా వనిన్