28, మే 2023, ఆదివారం

సమస్య - 4433

29-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా”
(లేదా...)
“చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

13 కామెంట్‌లు:

 1. మురియుచుముద్దులగుమ్మలు
  పొరుగులపద్ధతిదలచియుపోగనిసిగ్గున్
  కొరివినిదయ్యములైరే
  చిరుగులగుడ్డలసొబగులుచెప్పగవశమా

  రిప్లయితొలగించండి
 2. పొరు గింటి పుల్ల గూర యె
  కరము రుచి క ర మని యెంచు కరణి ని వని త ల్
  మరి మరి కోరుచు దాల్చె డు
  చిరుగుల గుడ్డల సోబగులు చెప్పగ వశమా!

  రిప్లయితొలగించండి

 3. తరమది మారెనటంచును
  పరువములను బయటపెట్టు వలువలె ముదమున్
  ధరియించుచుండిరే యా
  చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా.


  పరువుకు చిహ్నమంచు వరవర్ణిని నిండుగ గట్టె నోయి యం
  బరముల నాడు, నేడిల శుభాంగుల పోకడ లోన మార్పులే
  విరివిగ జేరి వీడిరట వ్రీడనమున్ బరువాల జూపెడిన్
  చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్.

  రిప్లయితొలగించండి
 4. పరువుగలవనితలైనను
  చిరుగుల గుడ్డలు తొడుగుచు చిందులు వేయన్
  మరిమరి గాంచిన వారను
  చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిరిపెము వాడుగుడ్డలను దివ్యము భవ్యమటంచు మెచ్చిరే
   మురిపెముగా ధరించి తమ ముచ్చట తీరెనటంచు పల్కిరే
   పరువపు వంపుసొంపులను బైటకు చూపెడి సంవిధానమున్
   చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్

   తొలగించండి
 5. చిరిగిన గుడ్డలఁ గట్టుట
  కరువుకు సంకేతమాయె గతకాలములో
  ధరియింతురు నేడు యువత
  చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా

  చిరుగుల గుడ్డలన్ యువత చిత్రముగా ధరియింతు రేలొకో!
  పరువఁపు సోయగమ్ములను బాహ్యపు దుస్తులు దాచలేని యా
  మురిపెఁపు వస్త్రధారణము మోదముగూర్చునె చూచువారికిన్?
  చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్

  రిప్లయితొలగించండి
 6. చం.

  కరముల రీతి, స్వైరమున, కాంతల ధారణ పూరుషాళికిన్
  సరగున సామ్యమున్ బదవి జాటుచు వస్త్రములందు జూపెడిన్
  నరులకు నుక్కపోత నిడు నాట్యము దేహపు సౌష్ఠవమ్ముతో
  *చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్.*

  రిప్లయితొలగించండి
 7. కం॥ అరయఁగఁ జిరుగుల బట్టలు
  కరుమమటంచుఁ దొడుఁగఁగను గతమున పేదల్
  సిరితనముఁ జాటె నిపుడవి
  చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా!

  చం॥ అరయఁగ నాఁడు సిగ్గుపడి రయ్య ధరించఁగఁ జింకి గుడ్డలన్
  గరమమటంచు బాధపడి కప్పుకొనంగను వాడ దీనతన్
  జిరుగుల గుడ్డ నేఁడిటుల శ్రేయమనంగను భాగ్యవంతులే
  చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్

  రిప్లయితొలగించండి
 8. మరచిరి సంస్కృతిన్ మహిని మానినులెల్లరు చీర కట్టుటన్
  మరచిరి సంప్రదాయములుమానక పోయిరి నేడు వింతగా
  తిరుగుచువీధులందుగనదీనులయట్లుసతమ్ము దాల్చుచున్
  చిరిగిన గుడ్డలన్ సొబగు చెప్పన శక్యమె నేటి కొమ్మకున్


  కొరమాలిన కోకనొసగి
  పరి పరివిధముల గపొగడపాడియె నాథా
  తర మౌనే విధికైనను
  చిరుగుల గుడ్డల సొబగును చెప్పగ వశమా

  రిప్లయితొలగించండి

 9. పిన్నక నాగేశ్వరరావు.

  ఎఱుగక మన ఘన సంస్కృతి
  అరకొర వలువలు ధరించి యందమటంచున్
  విరివిగ రంధ్రమ్ములు గల
  చిరుగుల గుడ్డల సొబగును జెప్పగ వశమా?

  రిప్లయితొలగించండి
 10. పరుగులు తీయుచుండెగద పశ్చిమ
  దేశపు వింత సంస్కృతుల్
  తరుణులు భారతవనిని తద్దయు
  రంధ్రములున్న దుస్తుల్
  విరివిగ వాడుచుండ్రి యవి వేకముతో
  నది ప్యాశనంటు హా
  చిరుగుల గుడ్డలన్ సొబగు జెప్ప న
  శక్యము నేటి కొమ్మకున్

  రిప్లయితొలగించండి