22, మే 2023, సోమవారం

సమస్య - 4428

23-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్”
(లేదా...)
“కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

12 కామెంట్‌లు:

 1. తరుమగగ్రీష్మముతాపము
  పురజనులంతటనిలువకపూషునిదిట్టన్
  కురిసెనునిప్పులవానలు
  కరములులేనట్టివాడుకత్తులుదూసెన్

  రిప్లయితొలగించండి
 2. విరి శరముల వేలుపు తన
  పరుసము జూపించి యువిదపై కసిదీరన్
  విరహము రేపగనే పరి
  కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్

  రిప్లయితొలగించండి

 3. పరశువు పట్టగ నొక్కడు
  పరిఘమునే దాల్చె నొకడు పగతుర దునుమన్
  దరమము గలిగిన తగు పు
  ష్కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్.


  పరశువు దాల్చె నొక్కడు విపక్షుల గూల్చగ రుద్రమూర్తియై
  పరిఘము పట్టి వచ్చె బలవంతుడు హాళిని భీకరాకృతిన్
  దరమము చేతబట్టె నొకదావరి, చేతను చాపమున్న పు
  ష్కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్.

  రిప్లయితొలగించండి
 4. కందం
  సరి తమ్మి మొగ్గరమునం
  దరివీర భయంకరుండు నభిమన్యుండున్
  బరులన్ గూల్చు తెగువ వ
  క్కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్

  చంపకమాల
  దురమునఁ దమ్మి మొగ్గరము ధూర్తులు కౌరవులూని నంతటన్
  వెరపులు లేని సాహసిగ భీకరుడౌ యభిమన్యుఁడాగునే?
  బరులను గూల్చు ధైర్యమున బాటిగ దూకుచు శౌర్యమందు వ
  క్కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్!

  రిప్లయితొలగించండి
 5. విరివిగ దుష్క ర్మ ల తో
  ధరణి ని దుష్టాత్ము లౌచు దాన వు లగు చున్
  వర లెడు వారల పై కని
  కరములు లే నట్టి వాడు గత్తులు దూ సెన్

  రిప్లయితొలగించండి
 6. పరమానందము నొందుచు
  సరియగు ప్రత్యర్థిలేని సమరమునందున్
  దొరకిన శత్రువుపై కే
  కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరివిగ యుద్దసైనికులు వేసట నొందని కార్యదీక్షయున్
   మరిమరి పోరుకై రగులు మత్సరమున్ గల సుప్రసిద్ధుడున్
   సరియగు సైన్యశక్తి తగు సత్తువ లేని విరోధి పైన కే
   కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్

   తొలగించండి
 7. మరులను గొల్పు మన్మథుడు మానినిపై దయమాలి యివ్విధిన్
  విరుల శరంబులన్ విడిచి వేసట గూర్చఁగఁ బాడియౌనొకో!
  విరహపు వేడి గాడ్పులకు భీతిలజేయుచు నక్కటా దయా
  కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్

  రిప్లయితొలగించండి
 8. కం॥ అరయఁగ రణమందు ఘనులు
  విరియఁగ శౌర్యము దునుమఁగ వెరవరు రిపులన్
  మరణముకు జడువక కృపా
  కరములు లేనట్టి వాఁడు గత్తులు దూసెన్

  చం॥ అరియఁగ యుద్ధమందు ఘనులాలముఁ జేసెడి వేళ వైరులన్
  విరియఁగ శౌర్య సంపద వివేకముతో దయఁ జూప కుండగన్
  మరణము లెక్క పెట్టకను మట్టుకు తెత్తు రటంచు నాకృపా
  కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్

  రిప్లయితొలగించండి
 9. వరమునపుట్టినపడతిని
  దురుసుగనందరియెదుటనుదుశ్శాసనుడున్
  మరవగనీతిని నేపరి
  కరములులేనట్టివాడుగత్తులుదూసెన్

  రిప్లయితొలగించండి

 10. పిన్నక నాగేశ్వరరావు.

  పర సతి ద్రౌపదిని సభను
  దురంతముగ వలువలూడ్చి దుశ్శాసనుడున్
  పరుషముగా కరుణయు కని
  కరములు లేనట్టి వాడు కత్తులు దూసెన్.

  రిప్లయితొలగించండి
 11. అరయగ జీవియానమున నందరిచే
  నవమానమొందుచున్
  దిరుగుచు కూడ గుడ్డకయి దేశము
  నంతట బాధకోర్చుచున్
  వెరవక యీ సమాజమున బెక్కు
  శ్రమమంబులతో సుఖం
  కరములు లేనివాడు చురకత్తులు దూసె
  రణాంగమందునన్.

  రిప్లయితొలగించండి