25, మే 2023, గురువారం

సమస్య - 4430

 26-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రఘురాముఁడు పాంచజన్య రవమును వినిచెన్”
(లేదా...)
“రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా”

13 కామెంట్‌లు:

  1. అఘమణచవిడిచెబాణము
    రఘు రాముడు, పాంచజన్యరవమునువినిచెన్
    మేఘశ్యాముడుమురహరి
    తాఘనులైరిగయిరువురుధైర్యముతోడన్

    రిప్లయితొలగించండి

  2. ప్రఘనుడు రావణు శోభకు
    విఘాత మొనరించె నెవడు? విగ్రహము గృష్ణుం
    డఘు హంత చేసె నేమిటొ?
    రఘురాముఁడు , పాంచజన్య రవముని వినిచెన్.

    రిప్లయితొలగించండి

  3. భీమరమందు శాత్రువుల పీకమడంచెడు వీరు డాతడే
    భామల చెంత జేరినను వంశము మోవిని దాల్చి నూదుచున్
    ప్రేమను పంచు వాడతడు విశ్వమనోహర మూర్తి యా రమా
    రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా.

    రిప్లయితొలగించండి
  4. కందం
    అఘనాశకుడౌ పాత్రను
    మఘవాత్మజు రథము ద్రోలు మధురాధిపుగన్
    జఘనమున దోపి మురళిన్
    రఘురాముఁడు పాంచజన్య రవముని వినిచెన్

    (రఘురాముడు = ఈలపాట రఘురామయ్య)

    ఉత్పలమాల
    ధీమతు లెల్లరున్ బొగడఁ దీరును కృష్ణుని పాత్రయందునన్
    ప్రామును 'నీలపాట రఘురాముడు' నీలము దేహమంతయున్
    భీమరమందు సారథిగ వీరరసమ్మును నింప క్రీడికిన్
    రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా!

    రిప్లయితొలగించండి
  5. ఆమహ నీయ కార్ముకము నందరు జూచుచు
    నుండనెత్తియున్
    కోమల గాత్రి జానకిని కూరిమితోడను
    బెండ్లియాడె నా
    రాముడు , పాంచజన్యమును శ్రావ్యముగా
    వినిపించె వింటివా?
    శ్యామల గాత్రు కృష్ణుడును జయ్యన
    యుద్ధపు టాదియందునన్

    రిప్లయితొలగించండి
  6. అఘముల నణ చగ వెలసెను
    రఘు రాముడు :: పాంచ జన్య రవమును వినిచెన్
    మఘవుని సుతు కున్. సా ర థి
    యా ఘనుడగు కృష్ణుడనిని యాప్తు ని వోలె న్

    రిప్లయితొలగించండి
  7. రఘురాముడు శ్రీవిష్ణువు
    నఘనాశకుడైన వాడు నతడే కాదా
    విఘటిత రూపము నందున
    రఘురాముఁడు పాంచజన్య రవమును వినిచెన్

    రాముడు కృష్ణుడంచు జనరక్షణ కూర్చును విష్ణుదేవుడే
    కాముని జన్మకారకుడు కారణ జన్ముడు వెన్నుడే కదా
    నామము మారినన్ ధరుడు నల్లటి వేలుపు ప్రక్కజన్మలో
    రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా

    రిప్లయితొలగించండి
  8. విఘటనముఁజేసె నసురుల
    రఘురాముఁడు, పాంచజన్య రవముని వినిచెన్
    అఘనాశకుఁడగు కృష్ణుఁడు
    మఘవాత్మకు రథమునెక్కి మహితాత్మునిగా

    రిప్లయితొలగించండి
  9. క్షేమముగూర్చ మౌనులకు ఛిద్రమొనర్చెను రాక్షసాళి నా
    రాముఁడు, పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా
    యా మహనీయుడైనహరి యర్జున సారధియై దురంబునన్
    రాముఁడు కృష్ణుడిర్వురును రక్షణజేసిరి ధర్మమిద్ధరన్

    రిప్లయితొలగించండి
  10. కం॥ అఘములఁ బాపును గొలచిన
    రఘురాముఁడు, పాంచజన్య రవమును వినిచెన్
    విఘటితముఁ జేయ కృష్ణుఁడ
    నఘుఁడెలమిని కౌరవులకు నాదము తోడన్

    ఉ॥ ధామము వీడి వచ్చెనట ధర్మము ధాత్రిని పెంపు సేయఁగన్
    రాముఁడు కృష్ణుఁడై భువిని రాజిల విష్ణువు సాధు రక్షకై
    రాముని యుత్తరాంశ బల రాముని తమ్ముఁడు నైన రుక్మిణీ
    రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    కామము క్రోధ లోభ మద కార్యపు తత్పరులైన కౌరవుల్
    నేమము దప్పి యుద్ధమున నిక్కుచు నీల్గుచు సిద్ధమయ్యెడిన్
    క్షేమము గోరు పాండవుల సేవలు కృష్ణుని ప్రీతి, యంతరా
    *రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా?*
    ........................

    _అంతరారాముఁడు : ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953_
    _సం.విణ._
    _1. పరమాత్మయందు క్రీడించువాఁడు; బ్రహ్మానంద మనుభవించువాఁడు;_
    _2. భక్తులను దరిఁజేర్చువాఁడు._

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. .............‌‌.................................
    కం:
    ఐహిక తాపము పెరిగెను,
    ఆహుతియై యడవి ఋతువులవి గతిదప్పెన్,
    నీహారమెల్ల గరిగెను
    రోహిణి మేఘతతిఁ దెచ్చెఁ ద్రోయుచు నెండన్.

    రిప్లయితొలగించండి