26, మే 2023, శుక్రవారం

సమస్య - 4431

27-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్”
(లేదా...)
“రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరాయంచు శ్లాఘింపఁగన్”

13 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. కందం
   హోమ జనితుండు త్వష్టకుఁ
   దా మన్ననఁ జూపు కతన దండెత్తి పగన్
   భీమ బలుండనఁగన్ సు
   త్రాముని వృత్రుండు మ్రింగెరా ప్రజ వెరగందన్

   శార్దూలవిక్రీడితము
   తామర్దించెను విశ్వరూపుననుచున్ దండింపగా నింద్రునిన్
   హోమంబందున నంది త్వష్ట సుతునయ్యుద్రిక్తతన్ బూన్చినన్
   భీముండైరణభూమి జొచ్చి పగతో విధ్వంసమేపార సు
   త్రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా! యంచు శ్లాఘింపఁగన్!

   తొలగించండి
 2. వేమఱునటనలజూపుచు
  కామందులుగాగనున్నఘనులునుప్రజకున్
  నీమములెంచకయుండిరి
  రామున్వృతుండుమ్రింగెప్రజవెఱగందన్

  రిప్లయితొలగించండి
 3. నీమము వీడియు మసలుచు
  కామము తో సంచ రించు ఘా తుకు నొకనిన్
  పామరు డగు వానిన్ బో
  రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్

  రిప్లయితొలగించండి
 4. శ్రీమంతున్ గూల్చు సుతుని
  హోమంబున బొందె త్వష్ట , యుగ్రుండగుచున్
  భీమరమందునపుడు సూ
  త్రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్.


  తా మర్దించెను విశ్వరూపుననుచున్ తాపంబుచే త్వష్టయే
  ధీమంతుండగు పుత్రునిన్ బడిసి యా దేవాధిపున్ ద్రుంచగన్
  హోమంబొక్కటి జేయ పుట్టి సుతుడే యుద్ధంబులో నట్టి సూ
  త్రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరాయంచు శ్లాఘింపఁగన్.

  రిప్లయితొలగించండి
 5. దీమసముగ త్వష్టసుతుఁడు
  హోమము నందుద్భవించె నుద్భటముగ దా
  సోమపతినిఁ జంపఁగ, సు
  త్రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్

  దీమసముగజనకుని సుత
  యేమహితాత్మునకుపత్ని ?యెవ్వండవనిన్
  సోమపతినిఁ దా మ్రింగెను?
  రాముని, వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్

  రిప్లయితొలగించండి
 6. హోమంబందున నుద్భవించె నసురుం డుద్భాసియై యింద్రునిన్
  ధీమంతంబుగజంప వృత్రునిగ నుద్దీప్తంపు శౌర్యోద్ధతిన్
  భీముండై యనినుద్యమించి కడునాభీలంబుగా నిల్చి సు
  త్రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరాయంచు శ్లాఘింపఁగన్

  రిప్లయితొలగించండి
 7. కం॥ హోమమున త్వష్టకు కలిగి
  యేమిటి తండ్రీ పని యన నింద్రుని దునుమన్
  నామనముఁ గోరెనన సు
  త్రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరఁగందన్

  శా॥ సామాన్యమ్ముగ నేఁడు చూడఁగను దుష్టత్వమ్ము శూరత్వమై
  రామాయన్చును దుష్ట మానవులు క్రూరత్వమ్ముఁ జూపంగనా
  రాముండేమియుఁ జేయడాయెనె కనన్ రాముండు లేడాయెనో
  రామున్ వృత్రుఁడు మ్రింగె శూర జను లౌరాయంచు శ్లాఘించగన్

  (శార్దూలము నేటి దేశకాల పరిస్థితుల ననుసరించి)

  రిప్లయితొలగించండి
 8. డా బల్లూరి ఉమాదేవి

  ఆమునిగొంపోయెవనికి
  రాముని,పరశువునుదాల్చిరాజుల చంపెన్
  రాముడెభువిలో మరియే
  రాముని వృత్రుండు మ్రింగె ప్రజవెరగందన్

  రిప్లయితొలగించండి
 9. గురువర్యులకు వివాహ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. అసనారె

  రిప్లయితొలగించండి
 10. నీమము తప్పిన వాడగు
  శ్రీమంతునిపైన దాడి చేసె భటుల్ సం
  గ్రామముజరిగినపుడు సు
  త్రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్

  రిప్లయితొలగించండి
 11. ఆమునిగొంపోయెవనికి
  రాముని,పరశువునుదాల్చిరాజుల చంపెన్
  రాముడెభువిలో మరియే
  రాముని వృత్రుండు మ్రింగె ప్రజవెరగందన్.

  రిప్లయితొలగించండి
 12. రామాయణకథనొక్కడు
  యేమాత్రము‌తెలివిలేక‌ నేదో‌ చెప్పెన్
  నామెదడు చెడెను‌ వినగా‌
  రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్”

  రిప్లయితొలగించండి