23, మే 2023, మంగళవారం

దత్తపతి - 196

24-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'నది - మది - గది - పది' పదాలను ప్రయోగిస్తూ
గురుశిష్యుల అనుబంధం గురించి
స్వేచ్ఛఛందంలో పద్యం వ్రాయండి.

15 కామెంట్‌లు:


 1. కననది యపురూపమది భు
  విని దైవసముండతండు పేరిమి తోడన్
  ఘనుడు గురువు గదిరించుచు
  మన భవితను పదిల పరచు మహనీయుండే.

  రిప్లయితొలగించండి
 2. (ఆ.వె)
  మదియనేటిగదిని‌ మంచిశ్రద్ధనునింపి‌
  పదివిధాలమొదడు‌ పదును‌ చేయు‌
  కొరతలేకనేర్చు‌ గురువుతెలిపినది
  వినయ‌ మున్నచోట‌ విద్యపెరుగు

  (కం)
  మదిగది‌ చదువుల‌నిధిగా‌
  పదిలముగాగురు‌వు‌ చెప్పు‌ పాఠముచదువన్‌
  నదిలా‌ శ్రద్ధాసక్తులు‌
  విధిగా ప్రవహింపచేయు‌ విద్యార్థిశుభమ్‌.

  రిప్లయితొలగించండి
 3. గురు డన దివ్యుడ టంచును
  నిరతము శిష్యుండు మదిని. నిల్పియు గొలు వన్
  పరగ దిర మగు నడతలను
  గరముగ నే ర్పి యు పదిలపు ఘ న తను గూర్చున్

  రిప్లయితొలగించండి
 4. నదియునుసంద్రమున్గలియనాకములోకమునౌనుగాయనన్
  మదిగనుమాయపోనణచిమార్గముజూపుగురుండునెప్పుడున్
  గదిసినభావమర్థమునుగాంచగశిష్యుడునేర్పుజూపగా
  పదిలమునౌనుగావిలువబ్రహ్మముజీవుడుజేరునట్లుగా

  రిప్లయితొలగించండి
 5. గురువననది యజ్ఞానఁపు టిరులు దొలఁగ
  జేయు దీపమదికలుగజేయు విత్తి
  శిష్యుఁడనఁగ దివము రాత్రి సేవలందు
  పదిలముగనుంచు గురువుల స్వాస్థ్య మతఁడు

  రిప్లయితొలగించండి
 6. విద్య యనునది నేర్వ వివేకమొసగు
  వటువు మదిలోని శంకలు పటుతరముగ
  నిగదితము సేయు వాడగు నేటిగురువు
  వసుధఁ గురుశిష్య బంధమ్ము పదిలమేను

  రిప్లయితొలగించండి
 7. తే. గీ.

  నదిని స్నానము జేయుట నలువ విధము
  మదిని సూర్యుని దలచగ మంత్రజిహ్వ
  గదిత సూక్తోపదేశముల్ కంఠమందు
  పదికల గురుశిష్యుల యాత్ర భక్తి రసము.

  రిప్లయితొలగించండి
 8. తే॥ మది గదిని నిను నిలిపితిఁ బదిలముగను
  నదివలె ప్రవహించు కవితల్ నలుగురు విని
  ధారలఁ దనియఁ గరపవొ దయఁ గని యని
  వేడె గురువును శిష్యుఁడు విద్య లొసఁగ

  రిప్లయితొలగించండి
 9. మరొక పూరణ

  కం॥ మది నిలిపి విద్య గురువులు
  గదితలు కవితలుగ మెఱయఁ గరుపఁగ శిష్యుల్
  నది ధార పగిది నుడువఁగఁ
  బదిలము గురు శిష్యుల కనుబంధము కనఁగా

  గదిత మాట పల్కు (నిఘంటువు సహాయము)

  రిప్లయితొలగించండి
 10. కందం
  మదినెఱిఁగి శిష్యునకుఁ దగి
  నది బోధింపంగ గురుఁడు నదనముగన్ దా
  గదిలియు మర్మములఁ జదివి
  పదిలమ్ముగ విశ్వనాథ వలె మెరయదగున్

  రిప్లయితొలగించండి

 11. పిన్నక నాగేశ్వరరావు.

  జ్ఞాన దివ్వెను వెలిగించ ఛాత్రుల మదిఁ
  పాటుపడెడు గురువులకు వందనములు
  తెలుప తరగతి గదియె వేదికగ నిలువ
  పదిలమగు గురు శిష్య సంబంధమెపుడు.

  రిప్లయితొలగించండి
 12. పాఠశాలయన్న పదిలమ గుగుడియె
  మదికి హత్తు నట్లు మాను గాను
  చెప్పు చుండ గురువు చిరకాలము నదియు
  కొలువు దీరి భయుండు గుండె గదిని


  రిప్లయితొలగించండి
 13. కపట మ *న్నది* లేకుండ కలసి కొనుచు
  నె *మ్మది* గ మాట లాడుచు నిండు మదిని
  కూడి చదువును *గది* రించ కుండ నేర్పి
  గురువు *పది* లపరచు శిశ్యు నరుసమునను

  రిప్లయితొలగించండి