5, అక్టోబర్ 2021, మంగళవారం

సమస్య - 3863

6-10-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పితరుల నిందించినపుడె విభవము దక్కున్”
(లేదా...)
“పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్”

66 కామెంట్‌లు:

  1. పతనముగానివిధంబున
    సతతముసౌమ్యతమనుగడసాగుటకోఱకై
    సుతులునునమవసదినమున
    పితరులనిందించినపుడెవిభవముదక్కున్

    రిప్లయితొలగించండి
  2. ఇతరుల మాటలు విడువుము
    సతతమునీక్షుద్రపూజ సల్పినజాలున్
    అతులిత శక్తులు వశపడు
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వితముగ తమ కృషి తోడను
    ప్రతీతి నొందుచు వఱలు ననాథల్
    మతి తప్పి పోనిడిన తమ
    పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు:
      వితముగ తమ కృషి తోడను
      ప్రతీతి నొందుచు ఘనముగ వఱలు ననాథల్
      మతిదప్పి పోనిడిన తమ
      పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.

      తొలగించండి
  4. సమస్య :
    పితరుల నింద సేసిననె
    బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్

    ( తల్లి ఒక కోనలో తండ్రి ఒక కోనలో
    పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమ లేని కానలో )

    జతనము సేయరే యెపుడు
    చక్కని సంతును సాకుచుంటకై ;
    సతతము పేకలాటకును
    చల్లగ సాగును కన్నతండ్రియే !
    హితమది లేక కాంతలకు
    హెచ్చును గూర్చగ నేగు తల్లినిన్
    బితరుల నింద సేసిననె
    బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ .

    ( జతనము - ప్రయత్నము )

    రిప్లయితొలగించండి
  5. సుతులునువృద్ధినొందుటకుచూడనిజీవనకాలమందునన్
    అతులమునైనదీవనలనన్నిటపెద్దలుకాయుచుందురే
    సతతముతద్దినంబుననుసన్నిధిగోరు’తిలోదకంబులన్
    పితరులనిందజేసిననెబిడ్డలకున్సిరిదక్కునిచ్చలున్

    రిప్లయితొలగించండి

  6. మతిజెడినట్టి పలుకులివి
    యతగులకే చెల్లుగదర, యల్పుడ వనుచున్
    కృతిమతులందురు నిన్నే
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్?

    రిప్లయితొలగించండి
  7. పతనమగుదు రెవరైనను
    పితరుల నిందించినపుడె ; విభవము దక్కున్
    సతతము స్మరించు కొనుచునె
    బ్రతుకు సలుపుచుండ వారి పథము విడువకన్

    రిప్లయితొలగించండి
  8. కందం
    హితములు మాకొనరింపఁగ
    మితముగ వారుండి మమ్ము మింటను నిల్పన్
    వెతలఁబడు పిచ్చివారని
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్!

    చంపకమాల
    మితముగ వారలుండి మముమింటను నిల్పుట తప్ప, ప్రీతిగా
    వెతలను మున్గుచున్ దమరి వేదన దాచుటె తప్ప, మాకనన్
    హితముల గూర్చి వారికని యేమియునెంచని పిచ్చివారిగన్
    బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్!

    రిప్లయితొలగించండి
  9. సుతులిల బ్రీతిగ మరువక
    నతులిత భక్తిగ నొసఁగఁగ నమవస తిథిలో
    కృతువుగ దర్పణ ముల నే
    పితరుల నిందించి నపుడె విభవము దక్కున్?

    రిప్లయితొలగించండి

  10. మతిజెడి మాటలాడిన సమాజము మెచ్చదు మొండికట్టెవం
    చుతలతురెల్ల మానుమిక శుష్కప్రియంబులు వంశనాశమౌ
    పితరుల నిందసేసిననె, బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
    పితరుల కార్యమన్న కడు ప్రీతిని జూపుచు నాచరించినన్.

    రిప్లయితొలగించండి
  11. గతుకుచు పరాయి సొమ్మును
    పితరుడు యేసయ్యయనుచు వెఱ్ఱిగనమ్మన్
    గతమును మరచుచు స్వజనపు
    పితరుల నిందించి నపుడె విభవము దక్కున్

    మతమన క్రైస్తవమ్మెయని మార్పిడిసేయుచు బీదబిక్కినున్
    ఇతరుల నమ్మకమ్ములను హీనమటంచును ద్వేషభావనల్
    సతతము వ్యాప్తిసేయుచును శాస్త్రవిధాన విరుద్ధమౌనటుల్
    పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  12. పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
    ప్రతిహత మౌనుగాక! యిటు వల్కుట బాడియె? పండితోత్తమా!
    మత మది యేదియైన దమ మానసమందున మర్వ వచ్చునే?
    హితమును గోరు పూర్వజుల నేట దలంచుట నుత్తమంబగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతి యవకాశముం గొనుచు పాటవ మేర్పడ మాటలాడుచున్
      చితికిన బీదలన్ గొనుచు చిల్లర డబ్బులు హుజ్రబాదునన్
      బ్రతుకగ భారమైన మన పౌరుల వంచన జేయనెంచ చూ
      పితరుల నిందసేసిననెబిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. చం:

    గతుకులు బడ్డ జీవనము గంపెడు నాశలు వింత పోకడల్
    బ్రతుకుట చేతగాక బిగి పంతము బట్టుచు వాదు లాడగన్
    కుతకుత లాడు మానసము కోపము నెచ్చగ నెట్లు పూన్చనౌ
    పితరుల నింద వేసిననె, బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  14. పతితల పొందుకై గణిక వాటికలన్ దిరుగాడు వారలా
    యతిగలు ద్యూతకృత్తులు సురాపులు దుర్మతులైన వారలై
    ప్రతిదినమున్ గళత్రమును రాయడిపెట్టుచు నాస్తులమ్మెడిన్
    బితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బ్రతుకున నెంతయో శ్రమను పన్ని సమంచితమైన నేర్పుతో
    ద్యుతి నెనయించు కార్యములు దొంతగు రీతి నొనర్చి వృద్ధినిన్
    యతులితమౌచు సాగెడి ననాథలు వారి నిటుంచి కుల్కునౌ
    పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  16. చంపకమాల:
    మతిసరి లేని సంతు, మరి మందులు మూర్ఖులు పుత్రులౌదు రే
    “పితరుల నింద సేసిననె/ బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్”
    వెతలను బొందరెన్నడును వేల్పులు దీవెన లిత్తురెంతయో
    సతతము భక్తిగల్గి మనసా వచసా తలిదండ్రిఁ గొల్చినన్
    -కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  17. నీతులనన్నియు నేర్పుచు
    హితమునె నిత్యము తలపుము హింసను వదులని
    సుతులకు హితమును జెప్పిన
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. "హింసను వదులన్" అనండి.

      తొలగించండి
  18. పితరులె తొల్తవేల్పులని పేర్కొనె వేదపురాణశాస్త్రముల్
    హితవరు లట్లు వారి సము లేర్పడ నుందురె? లోకమందునన్
    గతులను దప్పి యుండినను కాదన వచ్చునె వారి సేవలన్
    సుతుడు కుపుత్రుడైన నిల చూతుము, లేదు కుమాత, యేల నో
    పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. సుతులను పట్టించుకొనక
    సతతము సంపదలకొఱకు సతమతమగుచున్
    మతితప్పి చరించెడునా
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్

    రిప్లయితొలగించండి
  20. కందం
    సతతము మాతా పితరుల
    ప్రతిపత్తిగ జూడ కలుగు పరమపదంబున్
    నుతిగ యనదగదు పలుకున్
    పితరుల నిందించి నపుడె విభవము దక్కున్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  21. సతిని నిరాదరించుచును సంపద నిత్యము ఖర్చుపెట్టుచున్
    సతతము సాని కొంపలను సాగుచు దుర్భర కామవాంచతో
    సుతులను కష్టపెట్టి కడు శుంఠలుగాచరియించు నట్టి యా
    పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  22. మితమగు మాటలు బలుకుచు
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్
    హితులై యివ్వరు యాస్తుల్
    పతకములని భార్యయన్న ప్రాజ్ఞుడు వినునా!

    రిప్లయితొలగించండి
  23. నీతులనన్నియు నేర్పుచు
    హితమునె నిత్యము తలపుము హింసను వదులని
    హితబోధలు చేయనెడల
    పితరుల నిందించినపుడె విభవము దక్కున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర తప్పక గురువుండాలి.

      తొలగించండి
  24. నుతియించిన నొసఁగును గొ
    న్ని తరులు ఫలపుష్పముల ననేకముల నిలన్
    నుతియించుటఁ గొన్నిటి నా
    పి తరుల నిందించి నపుడె విభవము దక్కున్


    ధృతి మతి నూని దొంగలకు దిట్ట తనమ్మున బుద్ధి సెప్పుచున్
    సతతము మానవత్వమును జక్కఁగ నేర్పుచు మార్ప నెంచుచుం
    ముతుకల నింక నుత్తములఁ బుణ్య జనాలినిఁ గాక రేపు మా
    పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్

    [రేపు మాపు + ఇతరుల = రేపు మా పితరుల]

    రిప్లయితొలగించండి
  25. బ్రతికిన మూడునాళులిట భక్తిని గొల్చుచు దల్లిదండ్రులన్
    హితమగు వారిమాటలను నెన్నడుదాటక ధర్మమార్గమున్
    సతతము సంచరించగను చక్కని సంతును బొందవచ్చు నే
    పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. షారుక్ ఖాన్ వంటి ఎందరో పితరులు
      తాగి యాక్సిడెంట్లు చేసేవారు, అతి వేగంగా వెళ్ళి చచ్చేవారు, చంపేవారు, మాదక ద్రవ్యాలకు బానిసలు.....😥😥

      అతి చనవిచ్చి పిల్లలను నాంక్షల బెట్టక కాంక్షలన్నిటిన్
      మితమను మాటనెంచకనె మిన్నగ దీర్చగ దల్లిదండ్రులే
      మతిచెడి నల్లమందుగొని మత్తునజోగుచు జిందులేయగా
      గతియవ జైలుగోడలవె కావగ కోర్టులవెంట దిర్గెడిన్
      పితరుల నిందసేసిననె బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్ !

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  26. పతనము మొదలిడె గదరా
    పితరుల నిందించి నపుడె,విభవము దక్కున్
    సతతము భక్తియు రక్తియు
    యుతముగ నేవాడు జేయు నోనతనికిసూ

    రిప్లయితొలగించండి
  27. పతనమగు యశము మాతా
    పితరుల నిందించినపుడె, విభవము దక్కున్
    హితముగ వారల పూజిం
    ప తరించున్ జీవితంబు పరితోషముగన్.

    రిప్లయితొలగించండి
  28. పతనము సంభవించి పెనుబాధలనొందును నిశ్చయంబుగా
    పితరులనింద సేసిననె,బిడ్డలకున్ సిరిదక్కు నిచ్చలున్
    సతతము దుర్గమాతనిల సాదర భక్తిని బూజజేయునో
    నతనికి,బంధువర్గమున నందఱి పిల్లలు పెద్దవారికిన్

    రిప్లయితొలగించండి
  29. సతతము త్రాగి మైకమున సంతును
    భార్యను దిట్టి కొట్టుచున్
    సుతులకు యోగ్య మార్గమును
    జూపక నేర్పక బుద్ధి విద్యలన్
    మతి చెడి వేశ్యలోలురయి మంచి
    తనంబును వీడి నట్టి యా
    పితురుల నిందజేసిననె బిడ్డలకున్
    సిరి దక్కు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  30. పతనమొనర్చు బంధముల పాతకమబ్బు నిరాదరించుచున్
    పితరుల నింద సేసిననె; బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్
    పితరుల సేవ సద్విధిగ ప్రీతినొనర్చెడి వారికిన్ సదా
    హితమొనగూడు సద్గతియునీశ్వర దివ్య కటాక్షలబ్ధియున్

    రిప్లయితొలగించండి