9, అక్టోబర్ 2021, శనివారం

సమస్య - 3867

10-10-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అతివకున్ మొలిచె మీసము లంచుఁ గనిరి”
(లేదా...)
“అతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్”

22 కామెంట్‌లు:

  1. గ్రంధుల సమస్య వలనను రమణి కమరెఁ
    వింత యగు రూపమని వెజ్జు వివర మిచ్చె
    నతివకు మొలిచె మీసము లంచు గనిరి
    యబ్బుర ము నంది జనులిల హా యనిరి గ

    రిప్లయితొలగించండి
  2. రాణిరుద్రమపురుషునిరాజసమున
    పౌరుకుశలంబుగానగపోరుసలిపె
    వీరనారిగభాసించెవిస్మయముగ
    అతివకుమోలిచెమీసములంచుఁగనిరి

    రిప్లయితొలగించండి
  3. అతివలు బేలలౌదురను నందరి యూహల ద్రోసిపుచ్చుచున్
    పతి హరివెంట యుద్ధమున బాల్గొని రాక్షసవీరు
    జంపగా
    స్తుతమతి సత్యభామయట తోడుగనిల్చుచు ఠీవినొల్కగా
    నతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబున గాంచి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వెలది వలె నాటకమ్మున వేష మాడు
    పురుషుడట మఱపున మీసమున కనబడ
    చూచునట్టి నాహూతులు చోద్యమొంది
    నతివకు మొలచె మీసములంచు గనిరి.

    రిప్లయితొలగించండి
  5. వీధి నాటక మాడెడు వేషగాడు
    తరుణి పాత్రను ధరియింప తరలివచ్చె
    మరచె వేగిరపాటున గొరుగుకొనుట
    అతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    కోరి సఖులభిమన్యుని గుంపుఁగూడి
    మొలకమీసము సోకుచు పురులఁ ద్రిప్ప
    "సుందరుండు మొగతనమ్ముఁ జూపనెంచ
    నతివకు, మొలిచె మీసము" లంచుఁ గనిరి

    చంపకమాల
    అతులిత వీరశేఖరుఁడు నయ్యభిమన్యుడు గుంపుఁజేరుచున్
    గుతుకము మీర మాటికిని గోటను మీటఁగ గోరమీసమున్
    నతమయినంతటన్ "మొగతనమ్మున జొప్పడఁ జూపనెంచగా
    నతివకు, మీసముల్ మొలిచె"నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  7. కె.వి.యస్. లక్ష్మి:

    అందమనగ మురియుచు అతివ కొనియె
    రంగు రంగుల క్రీములు రమ్యముగను
    పూసి జూడగ మెఱిసెడి మూతి గాంచి
    నతివకు మొలచె మీసములంచు గనిరి.

    రిప్లయితొలగించండి

  8. కుతిలము చెందినట్టి పతి కూర్చము పండె నటంచు రంగువే
    సి తరుణి జేరపిల్చెనని చెంతకు జేరి పరాయణమ్ము నే
    కతమున ముద్దులాడుతరి కాంతము ఖమ్మును శ్యామమంటగా
    నతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబున గాంచిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  9. అమాయక పతి ని కాపాడే పత్ని గా నా ప్రయత్నము:

    చం:

    కుతకుత లాడమానసము కొంటెగ పిల్లలు కోతి చేష్టలన్
    సతతము జుట్టు పీకుచును సంతస మొందుచు గంతులేయగన్
    పతియని గాచ నెంచి పని పట్టగ వారల బుద్ధి జెప్పనై
    యతివకు మీసముల్ మొలిచె నంచు ముదంబున గాచి రెల్లరున్

    రిప్లయితొలగించండి

  10. కూర్చమునకు రంగునువేసి కొమ్మజేరి
    ముద్దులాడగ నారంగు ముగ్దకంట
    నదియె గాంచినచెలులెల్ల రచ్చెరువున
    నతివకు మొలిచె మీసములంచు గనిరి.

    రిప్లయితొలగించండి
  11. పలుకరించ వచ్చిన మంత్రివర్యుని నిల
    దీసి ప్రశ్నించుటందామె దెగువ నడప
    అతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి
    పురమునందు జనులు కడుముదము తోడ

    రిప్లయితొలగించండి
  12. సమస్య :

    అతివకు మీసముల్ మొలిచె
    నంచు ముదంబున గాంచి రెల్లరున్

    ( విశ్వనాథవారి నాటికలో నాగమ్మపాత్ర ధరించిన రామారావుగారు మీసం తీయకుండానే నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు . )

    ధృతమతి విశ్వనాథ రచి
    యించిన 'నాయకురాలు' నాటికన్
    స్మితముఖసుందరుండయిన
    శిష్యుడు రాముడు నాగమాంబయై
    స్తుతులను పొందినాడు తన
    సొంపగు మీసము తీయకుండగా ;
    " నతివకు మీసముల్ మొలిచె "
    నంచు ముదంబున గాంచి రెల్లరున్ .

    రిప్లయితొలగించండి
  13. అతి ధృతి యున్న పూరుషులు నైనను
    జేయని గొప్ప కార్యము
    న్నతిదృఢమైన చిత్తమున నంగ
    న యెక్కె హిమాలయంబునున్
    స్తుతియొనరించి కొందరును సోద్య
    ముతో గని యిట్టు లాడి రీ
    'యతివకు మీసముల్ మొలిచెనంచు',
    ముదంబున గాంచిరెల్లరున్

    రిప్లయితొలగించండి
  14. చంపకమాల:
    స్ఫుతినుకు నంతరిక్షమున జుక్కల దాపున నిల్పినారు, వా
    క్పతి రచనల్ చెడంగ దృఢ కాయము చిత్తము బెంచినారు,య
    గ్రత పలుశాఖ లందు మహరాణులు తగ్గ రు పూరుషాళితో
    న్న“తివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్”
    -కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  15. అబల గాదు ప్రబల సైన్యమందు చేర
    మీస మున్నట్టి నేతల మీరి గెలువ
    దుష్కర ప్రతిభ లెన్నియో దొరకొన జను
    లతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి

    రిప్లయితొలగించండి
  16. అతివలవేషమందు జనులందరి మన్ననలొందు నట్లుగా
    నతి సహజంబుగానటనమాతడు సల్పుచు నుండ నొక్కనా
    డతివగవేషమేయతనయాస్యమునందున మీసముండగా
    అతివకు మీసముల్ మొలిచెనంచుముదంబునఁ గాంచి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  17. కలియుగ మహిమలివి యని కాంతలంత
    యతివకు మొలిచె మీసములంచు గనిరి
    యాడపిల్లలు మగవారి ననుసరించ
    తారు మారుగ మారిరి దలచ మదిని

    రిప్లయితొలగించండి
  18. చారు నయన గంధ మలఁది చనుచు నుండఁ
    జంప కంబని భ్రమ సెంది చామ నాసి
    కఁ గని వ్రాలఁగ భ్రమర సంఘమ్ము వింత
    నతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి


    వెతలకు నోర్చి విత్తులను బ్రీతి సెలంగఁగ సంగ్రహించి యా
    తత బల వర్ధ కౌషధ వితానము నింపుగ వాడి కావఁగా
    నత మృదు కాండ సంయుతము నాటిన విత్తు లవెల్లఁ, జెప్పఁగా
    నతివకు మీ సముల్, మొలిచె నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్

    [మీ సముల్ = మీకు సమ మైన వారు]

    రిప్లయితొలగించండి
  19. అతివకు మీసముల్ మొలిచె నంచును ముదంబున గాంచిరెల్లరున్
    నతివల మోదమున్ గనగ నచ్చెరువందితి నొక్కసారిగా
    గతిపయ ధర్మమున్ వినుడు గాంతకు మీసముగల్గకారణం
    బతులిత జన్యులోపముగ భావన జేతును సుమ్ము నమ్ముమా

    రిప్లయితొలగించండి
  20. (NTR నాగమ్మ పాత్రను మీసముతోనే నటించిన సందర్భములో)
    ప్రతిభను జూపెగా మగువ పాత్ర ధరించి ప్రశంసలందెనా
    స్తుతమతి నందమూరి బిగి జూపెను మీసముతో నటించెనా
    మతకరి నాగమాంబ వలె మైమరపించె సభాంగణంబునం
    దతివకు మీసముల్ మొలిచెనంచు ముదంబునఁ గాంచి రెల్లరున్

    రిప్లయితొలగించండి