11, అక్టోబర్ 2021, సోమవారం

సమస్య - 3868

12-10-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులు గొప్పవారు గారు నిజము”
(లేదా...)
“కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా”

49 కామెంట్‌లు:

  1. ఎన్నబడగ లేరు ఎన్నికలందైన
    ముఖ్యమంత్రిపదవిబొందలేరు
    మంత్రి పదవి మనకు బహుగొప్ప యనుకున్న
    కవులు గొప్పవారు గారు నిజము

    రిప్లయితొలగించండి
  2. ఆస్తిక నాస్తిక సంవాదము

    నాస్తికుడు:
    దివిజుల మెప్పుగోరుచును దేవునిపేరిట వ్రాయ స్తోత్రముల్
    కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్ధమేసుమా

    ఆస్తికుడు:
    భవమున మున్గితేలుచును పాలకవర్గము మెప్పుగోరెడిన్
    గవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్ధమేసుమా

    రిప్లయితొలగించండి
  3. మూఢ నమ్మ కాలు మూర్ఖత్వ ఫణ తులన్
    మార్చ గలుగు నట్టి మనసు లేక
    చెత్త కవిత లల్లి చేటును గూర్చు కు
    కవులు గొప్ప వారు గారు నిజము

    రిప్లయితొలగించండి
  4. నవ్యజగతియందునవనవోజ్వలనల
    మాటలల్లికథలమాయఁజేయు
    భావజాలమందుభావంబుదెలియమి
    కవులుగోప్పవారుగారునిజము

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    కవనమన్న నాశ కలమేమొ కదలదు!
    పేరుపొందనెంచు కోరికలను
    పరుల భావజాలమరసిపట్టుచు వ్రాయు
    కవులు గొప్పవారు గారు నిజము

    చంపకమాల
    కవనముఁ జెప్పగా దలఁచి కాగితమున్ గలముంచి చేతిలో
    భవమున దోషమై తనకు భావము లూరవటంచు బెంగ, వై
    భవమును గాంచగన్ బరుల భావ పరంపరఁ దస్కరించెడున్
    కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా!

    రిప్లయితొలగించండి
  6. తనను గూర్చి నిజము తాత్వర్యమున జెప్ప
    విన్న జనులు నమ్మి వివరమడిగి
    కడిగి వేయుదురని ఖలుడు, నుడివెనిట్లు,
    కవులు గొప్పవారు గారు నిజము.

    రిప్లయితొలగించండి
  7. అవినయభావసంపదలహంగులులేవుగవాక్కునందునన్
    నవనవవేషధారణలనాగరికంబులుచేతగావుగా
    వివరములేకసత్యమునువెన్నుననంటుదురెల్లవేళలన్
    కవులనుగోప్పవారనుచుగౌరవమిచ్చుటవ్యర్ధమేగదా

    రిప్లయితొలగించండి

  8. భవితను దిద్దితీర్తుమని వర్జనమౌ కృతులెన్నొ వ్రాయుచున్
    నవయుగ ఘాంటికుండ్రకు సనాతన ధర్మమదేల యంచు తా
    నవధులు మీరి కావ్యముల నందగ జేసెడు కుచ్చితుండ్రు కా
    కవులను గొప్పవారనుచు గౌరవ మిచ్చుట వ్యర్థమే సుమా!

    రిప్లయితొలగించండి
  9. సవినయ మంత్రి వర్యులును సద్గణు
    లైన ప్రధాను లుండగన్
    భవితను జక్క దిద్దగల భాసుర
    మైన ప్రవక్తలుండ మా
    నవులను భాగ్యవంతులుగ
    మార్చెడు జ్యోతిష శాస్త్రులుండగా
    గవులను గొప్పవారనుచు గౌరవ
    మిచ్చుట వ్యర్థమే సుమా.

    రిప్లయితొలగించండి
  10. ప్రగతి పథము జూపి పయనింపమనిచెప్పు
    సత్కవుల రచనలు చదువ మేలు
    పనికిరాని చౌకబారు కథలు వ్రాయు
    కవులు గొప్పవారు గారు నిజము

    రిప్లయితొలగించండి
  11. వాసి లేని కృతులు రాశులుగా వ్రాసి
    సాటి లేని మేటి సత్కవినని
    కాసుల వెదజల్లి ఘనపురస్కృతినందు
    కవులు గొప్పవారు గారు నిజము.

    రిప్లయితొలగించండి
  12. సమస్య :

    కవులను గొప్పవారనుచు
    గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా

    ( " సర్వశుక్లా సరస్వతీ " అన్న ప్రస్తుతికి పాత్రురాలు ,లలితకళాప్రదాయిని అయిన సరస్వతీదేవిని సేవింపని దురహంకారకవులు మాన్యులు కారు )

    ధవళపు దేవియై జనుల
    ధన్యుల జేయగ సంచరించుచున్ ;
    చవులను చిందు కావ్యముల
    జక్కగ వ్రాసెడి శక్తి నిచ్చుచున్ ;
    ఛవుల నొసంగు వత్సలపు
    శారద గొల్వని దుర్విదగ్ధులౌ
    కవులను , గొప్పవారనుచు
    గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా !

    ( చవి - రుచి ; ఛవి - కాంతి )

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. చం:

      కవులన నెవ్వరౌ యిలను గాంచగ మారుపు లెల్ల వేళలన్
      కవితలు జెప్పి లోకమును గావగ కౌను బిగింప దల్చ నీ
      యవనిని మెచ్చి వారలను నాదర జేసేద రట్లు గానిచో
      కవులను గొప్ప వారనుచు గౌరవ మిచ్చుట వ్యర్థమే సుమా

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  14. పాలనెటుల నున్న పరిపాలకులవెంట
    తిరిగి పొగడు కైత తెగడవలయు
    సత్కవితల వ్రాయ సతతము గోరని
    కవులు గొప్పవారు గారు నిజము!!

    రిప్లయితొలగించండి
  15. పద్య లక్షణముల పాటించు చున్నను
    కవితలల్లు ముఖ్య కారణమగు
    ప్రభువు మెప్పుపొంది , పబ్బమును గడుపు
    కవులు గొప్పవారు గారు నిజము

    రిప్లయితొలగించండి
  16. యువతకు మార్గదర్శనము యుక్తపు పోకడ జూపి స్వచ్ఛమౌ
    భవితను తీర్చిదిద్దగల భవ్యకవిత్వము వ్రాయు సత్కవుల్
    కవులననొప్పు, కొల్లలుగ కల్లలు వ్రాసెడి నీతిలేని కా
    కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా

    రిప్లయితొలగించండి
  17. ప్రవిమల చిత్తులై వఱలు పండిత వర్యుల సన్నుతించుచున్
    కవితలు చెప్ప బ్రహ్మసతి కాంచును మోదము నెంచి చూడగా
    ద్రవిణము కోరి నీచులనుఁ దల్చుచు పద్యములన్ వచించు కా
    కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా

    రిప్లయితొలగించండి
  18. అవిరళమైన కాంక్షగొని యర్థముపైనను నీచ నేతలన్
    వ్యవధులు లేని స్తోత్రముల పావనభావనఁ గొల్పి మెచ్చుచున్
    యువతకు మేలు లేనిదగు నుత్త కవిత్వము చెప్పుచున్న నా
    కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా

    రిప్లయితొలగించండి
  19. పదము పట్టు గలుగు పండితుల కంటెను
    కవులు గొప్పవారు గాదు నిజము
    సకల శాస్త్రములను సంతరించు కోనుట
    కారణంబు సుమ్ము కవివరేణ్య!

    రిప్లయితొలగించండి
  20. పామరులను గాంచి పండిత వ్రజ మెల్ల
    సంత సిల్లఁ దివిరి సుంత వారి
    కీ ధరా తలమున నిడకున్న జ్ఞానము
    కవులు గొప్పవారు గారు నిజము


    రవి శశి మానినీ నృప ధరాధర జంతు విహంగ హృత్సరో
    జ వన నదీ నగాభ్ర సుర సంచయ వర్ణన కావ్య కర్తలన్
    వివృత వచో విశేషముల విత్త విహీనము రిక్త వాక్కులం
    గవులను గొప్పవా రనుచు గౌరవ మిచ్చుట వ్యర్థమే సుమా

    రిప్లయితొలగించండి
  21. నవయు నశాశ్వతంబు మెయి నాటకమైహికమౌసుఖంబులున్
    ధ్రువము పరాత్పరుండఖిలలోకవిభుండని నిక్కమెంచకన్
    భువి నరపాలురన్ బొగడి భూరి ధనాదులకాశ జెందెడిన్
    కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్థమే సుమా

    రిప్లయితొలగించండి
  22. కలముబట్టగానె కవివరులవ్వరు
    హలముదున్నగానె పొలముగాదు
    "మలినమైనమనసు మార్పు జేయనివారు
    కవులు గొప్పవారు గాదునిజము"!

    రిప్లయితొలగించండి
  23. కవులను గొప్పవారనుచు గౌరవమిచ్చుట వ్యర్ధమే సుమా
    కవులను గించపఱచుచు గర్కశ మైన విధంబు బల్కుచో
    నెవరును హర్షమొందరిల నెవ్వరునిచ్చను గొరబోరుగా
    కవులనువారలెప్పుడును గౌరవనీయులెనెంచ యిద్ధరన్

    రిప్లయితొలగించండి