17, అక్టోబర్ 2021, ఆదివారం

సమస్య - 3874

18-10-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల”
(లేదా...)
“పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే”

21 కామెంట్‌లు:

  1. పండుగలసంబరములభాగ్యమంది
    ప్రేమమీరఁగతనవారిబేలలగుచు
    వీడిపోవంగవలసినవేళయందు
    పర్వదినముననేడ్పింత్రుబంధుహితుల

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. పండుగ పూట బంధువులతో లవకుశ సినిమాకు తీసుకు వెళ్ళిన పతితో సతి:

      తేటగీతి
      హాస్యరసమున్న చిత్రమ్ము హాయినొసఁగు
      రమ్ము రమ్మన్న నొప్పక 'లవకుశ' కని
      సీత దుఃఖమ్ము జూపించఁ జేర్చి, యేల
      పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల?

      ఉత్పలమాల
      పర్వున నే వినోదమును బంచెడు చిత్రము నెంచమేలగున్
      సర్వులు సూడఁగన్ వెడలి సంతసమందెదమన్న నొప్పకే
      చర్వితమైన నీ లవకుశన్ గన సీతమ శోకమందునన్
      బర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే?

      తొలగించండి
  3. పనికి శలవులు లభియించ పండుగనుచు
    పరుగు పరుగున వత్తురు బంధు జనులు
    వంట వార్పుల శ్రమనింటి వారి కొసగి
    పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల

    రిప్లయితొలగించండి
  4. ఉర్వినిశాశ్వతంబనగనోక్కటిలేదనుమాటవీడుచున్
    సర్వముమాయయేయనెడిసత్యమునమ్మకనల్పభావమున్
    చర్వితచ్వణమ్మగనుసన్నిధిలేదనునూహఁజేయుచున్
    పర్వదినమ్మటంచుఁబరివారముబంధులనేడిపింతురే

    రిప్లయితొలగించండి
  5. దూర దేశము నుండియు జేర వచ్చి
    బాల్య మందలి స్మృతు లతో పరవశించి
    విడిచి పోలేని సమయాన వేద నమున
    పర్వ దినమున నేడ్పింత్రు బంధు హితుల

    రిప్లయితొలగించండి
  6. గర్వము మీరగన్ పిలువ గౌరవ మెంతయు యూరికేగగన్
    పర్వులు బెట్టగా కనగ పండుగ విందని మోదమందుచున్
    సర్వులు హేళనమ్ముగను సైపగలేని మాటవీచగా
    పర్వదినమ్మటంచు బరివారము,బంధుల నేడి పింతురే!!

    రిప్లయితొలగించండి
  7. పండుగనుచు చనగ పల్లెటూరు
    వండిన రుచులన్ని మెండు రసన
    మరలి వచ్చువేళ మదిని కలత
    పర్వదినమున నేడ్పింత్రు బంధు హితులు!!

    రిప్లయితొలగించండి

  8. పూర్వపు సాంప్రదాయమది పుణ్యదినమ్ముప వాసముండినన్
    శర్వుడనుగ్రహించునని శాస్త్రము లెల్లవచించెనంచు నే
    గర్వము వీడి యాకలనగన్ శివరాత్రి యిదేకదా మహా
    పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే

    రిప్లయితొలగించండి
  9. ఎంతచెప్పిన వినకుండ చెంతజేరి
    వలదు మోమోటపడవద్దు వలదటంచు
    పిండివంటల తినిపించి దండిగాను
    పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల

    రిప్లయితొలగించండి
  10. ఉర్విని పర్వమందుకడునోరిమితో పలు భక్ష్య భోజ్యముల్
    సర్వము నారగింపుడని సంతసమొప్పగ కోరి యర్మిలిన్
    చర్వితచర్వణమ్మటుల చాలని చెప్పిన నూరకుండకన్
    పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే

    రిప్లయితొలగించండి
  11. ఉర్విన దల్లిదండ్రులటు లొద్దిక తోడుత బెద్దసేయగా
    పూర్వపు యూసులన్ దలచి ముద్దుగ బెంచిన యాడకూతునే
    మర్వగ లేక బెండువడి మాతయె పెండ్లిన నప్పగింతలో
    పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే.

    రిప్లయితొలగించండి
  12. వేడుకగ నల్గురిని జీరి విందునిచ్చు
    పర్వదినమున ; నేడ్పింత్రు బంధు హితుల
    పెద్దకర్మ నాడున వార్నిబిలుచు భుక్తి
    గుడిప , నాదినము మృతుని గుర్తు జేయ

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    ఉర్విని బుట్టు వారలకు నున్నవి రెండు కులంబులే సుమా
    గర్వము నున్న వారమని కష్టము లెంచగ లేని వారలై
    పర్వ దినమ్మటంచు పరివారము బంధుల నేడిపింతురే
    సర్వము గాంచెడీశు డిల చక్కన బెట్టడె గల్మి లేమిడుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. సర్వ సపక్షులున్ గలచి సద్మము నందున చేరి ముందుగా
    పూర్వపు గొప్పనెంచుచు యపూర్వపు వంశ మటంచు పెండ్లిలో
    గర్వము జూపగా కరము కమ్మని వంటలఁ జేయఁ జెప్పుచున్
    పర్వదినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే

    రిప్లయితొలగించండి
  15. తేటగీతి
    రాజసూయ యాగమునకు రాజరాజు
    పండుగయని దలచి రాగ భంగ పడెను
    మయ సభన తాను దలచెను మౌనముగనె
    పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. సర్వమశాశ్వతంబెరిఁగి సంతతమార్తుల సేవ జేయుటే
    శర్వుని సేవగా దలచు సన్మతులే దినమైననందురే
    పర్వదినమ్మటంచుఁ; బరివారము బంధుల నేడిపింతురే
    గర్వితులౌచు లోభులిల కాసుల లాలస కళ్ళు గప్పగా

    రిప్లయితొలగించండి
  17. వచ్చెద మని వక్కాణించి తెచ్చెద మని
    మెండుగ బహుమానమ్ముల దండముల నొ
    సంగి వాక్రుచ్చి కాంచక ప్రాంగణములు
    పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల


    శర్వుఁడు కాచుఁ గావుతఁ బ్రజా నిచయమ్ముఁ గృపారసేక్షలన్
    సర్వ జగత్తు సాధన వశం బగుఁ దత్సముపార్జ నార్థమే
    యుర్విని వీరి వారి వని యొక్కొక పేరునఁ బర్వ పంక్తియే
    పర్వ దినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే

    రిప్లయితొలగించండి

  18. ఆకలి యని యన్నమడుగగ నన్న మిడక
    మోక్ష గాములె యుపవాస దీక్షతోడ
    మృడుని సేవించు శివరాత్రి మేటి యైన
    పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల

    రిప్లయితొలగించండి