21, అక్టోబర్ 2021, గురువారం

సమస్య - 3878

22-10-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నన్నున్
నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్”
(లేదా...)
“నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా”

67 కామెంట్‌లు:

  1. సమస్య :
    నన్నిటులన్ నయమ్ము విడి
    నగ్నముగా గన నీకు న్యాయమా

    ( దిగంబరంగా కనబడమని తనను కోరిన వేమారెడ్డితో వారకాంత విశ్వద పలుకులు )

    ఎన్నగ రెడ్డి వంశమున
    నెంతయొ పున్నెము జేసికొన్న యా
    మిన్నగు రాజదంపతుల
    మేలిమి బిడ్డవు వేమనాఖ్యుడా !
    చెన్నగు కార్యమే యిటుల
    చేయుట ? వేశ్యనె కాని యయ్యయో !
    నన్నిటులన్ నయమ్ము విడి
    నగ్నముగా గన నీకు న్యాయమా ?

    రిప్లయితొలగించండి
  2. కన్నులచెదరనికాంతుల
    మిన్నునచంద్రుడువెలుగులమీరుచురాగా
    కన్నెయుకలుునడిగెను
    నన్నున్నగ్నమునఁగనుటన్యాయమెనీకున్

    రిప్లయితొలగించండి
  3. పన్నగ దుష్టచింతనల పాచిగ లాటను లాడగా సభన్
    మిన్నగు క్రోధ మందగను మేదిని జెల్లని క్రూర బుద్ధితో
    చెన్నగు కార్యమా?నిటుల చిన్నది చింతిల,నీడ్చిలాగగన్
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా?!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పాచికలాటను కౌరవుల్ సభన్... కార్యమా యిటుల.." అనండి.

      తొలగించండి
  4. ఎన్నడు లేని కోరికిది యెందుకు
    కోరుచు నుంటివో కదా!
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నము
    గా గన నీకు న్యాయమా !
    విన్నప మాలకించుమయ వేశ్యను
    నే నయి నంత నేమి సం
    పన్నము సేయ లేను ప్రియ! పంతము
    వీడుము కామకూటుడా!

    రిప్లయితొలగించండి
  5. అనసూయమాతత్రిమూర్తులతో
    అన్నిటమీరలేగదరయాగినిసేయగబాలురైతిరా
    కన్నుకుగానరెప్పుడునుఖండితరూపములేదుమీకుగా
    వన్నెలచిన్నెలన్నటనవంశమువ్రుద్ధినిఁబోందయాడుడీ
    నన్నిటులన్నయమ్మువిడినగ్నముగాగననీకున్యాయమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వంశపు వృద్ధిని బొంద నాడుడీ" అనండి.

      తొలగించండి
  6. చేబంతి తప్పి పడెనని...... యూహతో

    వెన్నయు మీగడల్ పెరుగు వేడుక తోడుత దోచివేస్తివే
    యెన్నగ లేము నీ మహిమ నెవ్వరు నైన జగంబునందునన్
    తిన్నగ బంతి వచ్చెనని తెంపరివై యదు నందనందనా!
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?

    రిప్లయితొలగించండి
  7. విన్నపము జేసె వేమన
    చెన్నుగ గనుపించు మంచు జేడి య నొకె తన్
    మిన్నగ బదు లొసగె ను దను
    "నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్? "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను'ను 'తను' అనరాదు. "బదు లొసగెను గద" అనండి.

      తొలగించండి
  8. భర్త మిత్రుడు గీచిన తన చిత్రము గురించి సతి పతితో...

    కందం
    తిన్నగ చిత్రమ్మున నా
    కున్నను లేనట్లు వల్వలొప్పఁగ గీయన్
    మన్నింతురె? నల్వురిలో
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్?

    ఉత్పలమాల
    తిన్నగ చిత్రకారుఁడని తెచ్చిన మీసఖుఁడున్ లిఖించ నా
    కున్నను లేవులేవనుచు నొప్పెడు వల్వల నాదు చిత్రమున్
    మన్నన జేతువే మగడ! మానుము నల్గురి మధ్య, పత్నినౌ
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?

    రిప్లయితొలగించండి
  9. "సాలార్ జంగ్ మ్యూజియము" లోని పాలరాతి శిల్పము పలుకరించితే......ఇలా
    ఉత్పలమాల:
    ఎన్నగ శక్యమే "నరబు" యింతి, ఘనీభవ క్షీర మూర్తి బ
    ల్వన్నెలు వేనవేలు తలపై జలతారు దుపట్ట జార గా
    కన్నియ మ్యూజియమ్మున ఫకాలున నవ్వుచు పల్కెనిట్టులే
    “నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా”
    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  10. ఒక కొండ మానవునితో

    మిన్నగ వర్షధారలను మీదట నీయగ నౌషధంబులన్
    పన్నుగ పచ్చగానిలచి ప్రాణమునిల్పెడు వృక్షసంతతిన్
    తిన్నగనుండనీక పలుతీరుల ద్రుంచుచు నార్జనంబుకై
    నన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకు న్యాయమా?

    రిప్లయితొలగించండి
  11. "కన్నులు కట్టిన వైనన్
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్
    చెన్నుగ తాకుచు" , యనియెన్
    మిన్నగ గాంధారి తడిమి, బెంచిన కొడుకే!

    రిప్లయితొలగించండి
  12. ఉ:

    నిన్నటి రాత్రినుండి యెల నిద్దుర లేక విరామమెంచకన్
    దన్నగు స్వాపతేయమును దండిగ నోడగ చీట్లపేకనున్
    పన్నుగ తీర్తువా కడమ వస్త్రము విప్పు మటన్న వేడనౌ
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. నిన్నారాధన జేసితి
    మన్నించితి వీవు బావ;మమతల పెండ్లై
    యున్నాము సిగ్గికేలా
    నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్.

    రిప్లయితొలగించండి

  14. అన్నులమిన్నలనెల్లెడ
    మన్నన సేయంగనొప్పు మాఘుడ వగుచున్
    బన్నపరచ గులకాంతను
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్.

    రిప్లయితొలగించండి

  15. (అనసూయను వివస్త్రవై భిక్షమొసంగమని అడిగిన త్రిమూర్తులలో ఒకరితోనాడిన మాటలుగ)

    మన్ననలందుకో గలుగు మాన్యులటుంచును నమ్మితిన్ భువిన్
    వెన్నెలకోలు నందుకొను పెద్దలు మీరు వివస్త్రనౌచు న
    న్నన్నము పెట్టమంచునిటు లానతి నిచ్చుట పాడియౌనటే
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా

    రిప్లయితొలగించండి
  16. వన్నెల చిన్నెల కన్నియ
    కన్నుల ఎదుటన్ నిలువగ కలలవిహారం
    దన్నుగ నూహల మదిలో
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్

    రిప్లయితొలగించండి
  17. సన్నని వలువల నొలువగ
    నున్నని దేహము నరయ కనుల నీరొలుకన్
    మిన్నగ నుల్లి పలికెనొకొ
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్

    రిప్లయితొలగించండి
  18. పన్నితివిగదా నీవొక
    పన్నిదమును నాపయి గల వలపు
    దలచుచున్
    కన్నార కలలను గనుచు
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్

    రిప్లయితొలగించండి
  19. చిన్నయ బొమ్మ గుమ్మలకు, చేలము మార్చును బట్టలంగడిన్
    చెన్నుగ ధూళి దుమ్ములును చేరగ శుద్ధిని చేయ బోవ యా
    కన్నియ బొమ్మ క్రొత్త రొబొ కావున యిట్లనె ఛీ! పదా! పదా!
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా!

    రిప్లయితొలగించండి
  20. ఎన్నడు వంటిపై నగలనెన్నియొ దాలిచి యుండుదాన నా
    వన్నియు నూడ్చిజూదమున నర్పణజేయుచు నేడు నిర్దయన్
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా
    విన్నఁదనంపు పోకడలు వీడుము నీవికనైన పెన్మిటీ!

    రిప్లయితొలగించండి
  21. కృష్ణుడు గోపిక వస్త్రాలు అపహరించిన సందర్భం.

    కందం
    కన్నడు కృష్ణుడు చాటుగ
    కన్నియ వలువలు హరించి గడుసుగ బయలున్
    మిన్నగ రమ్మన, తా యనె
    నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  22. ఎన్నినగలు నాగళమున
    మిన్నగనుండెడివినాఁడు మిలమిల మెరియ
    న్నన్నియు నొనర్చి స్వాహా
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్

    రిప్లయితొలగించండి
  23. అడవిలో నలుని విలాపము

    ఎన్నడు ధర్మమార్గమును నేమరువాడనుగాను నైననున్
    తిన్నగ జిక్కుకుంటిగద తీక్షణ కాలప్రభావమున్
    దురా
    పన్నుడ నాదువల్వలను పట్టుకుపోవుచు పక్షిసత్తమా
    నన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకు న్యాయమా?

    రిప్లయితొలగించండి
  24. అన్నా! యేపని నీయది
    నన్నున్ నగ్నముగ గనుట న్యాయమె నీకున్
    విన్నపము నాలకించుమ
    యెన్నడు నికజేయకిటుల యెవ్వరి యొద్దన్

    రిప్లయితొలగించండి
  25. నన్నయ నిచ్చె మేనుకు ఘనమ్ముగ కాంచన వర్ణ చైలమున్,

    వన్నియ పారజల్లు నలి వల్వము తిక్కన చుట్టబెట్ట, సూ

    రన్న యలంకరించెను సురా ర్హపు శాటము స్తీర్విపైన, గో

    పన్న నొసంగె నూలు వలిపమ్మును మూరితి కప్ప మంచు, లిం

    గన్నవి చిత్రమౌ పొడలు స్కంధము పై హవణింపుచేయ, వే

    మన్న తొడింగె స్వర్ణమయ మానిక కంచుకమున్ ముదంబుగా,

    కన్నియ నంచు నందముగ కట్టిరి చీరలు మోహమొప్ప, నా

    చెన్ను విఘాత మాయెనని క్షేపము తోనిడ కుండె చీరలన్

    మొన్నటి నాయకుల్, మెయిని మూయక జారెను, నేలపైన యీ

    కన్నము లున్నవస్త్రములు కప్పగ జాలము కాయమంచు నా

    దన్నుగ నుండలేక పరి తాపము నొందుచు నుండ ప్రేమతో

    చిన్నది కన్ను గీటెనని చెంతన చేర దలంచి మోహనా

    (నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గననీకు న్యాయమా)

    ద్రాపుడ వీవుగా యనుచు తల్లి దిగాలుప డెన్ చలించుచున్

    రిప్లయితొలగించండి
  26. అన్నారీ రత్న మెలమిఁ
    జిన్ని కొమరునిగ మహిమను జేసిన వానిన్
    వెన్నునిఁ గని ముద్దుగ ననె
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్


    మృగరాజుతో నొక సింహి పలుకులు:

    సన్న వరావలగ్న సువిశాల భుజాంతర సింహరాజమా
    సన్నుత విక్ర మోద్ధత లసన్నయనద్వయ భీక రాకృతీ
    త్వన్నిల యాగ తైక మృగ తండ నితాంత సమక్ష మందహో
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా

    రిప్లయితొలగించండి
  27. పన్నగ దుష్టచింతనల పాచిగ లాడగా కౌరవుల్ సభన్
    మిన్నగు క్రోధ మందగను మేదిని జెల్లని క్రూర బుద్ధితో
    చెన్నగు కార్యమా?యిటుల చిన్నది చింతిల,నీడ్చిలాగగన్
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగా గన నీకు న్యాయమా?!!

    రిప్లయితొలగించండి
  28. అన్నియు దెల్సియున్ రమణ! హర్షము నొందని రీతినిట్లుగా
    నన్నిటులన్ నయమ్మువిడి నగ్నముగాగన నీకున్యాయమే
    విన్నది గన్నదిన్ నెఱుగ వెఱౢివ ?పిచ్చియ యిట్లుజేయగా
    గ్రన్నన మార్చుకో మనసు కాంతలబట్లన జక్కగుండుమా

    రిప్లయితొలగించండి
  29. కన్నులు గప్పిటులౌరా
    కన్నెల వలువలను దాచగా తగదయ్యా
    కన్నా చీరనొసంగుము
    నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్

    రిప్లయితొలగించండి
  30. పున్నమి రాతిరిన్ మధుర మోహన గానము రేప మోహమున్
    కన్నయ జేర వేగ జలకంబొనరింపగ జేరినంతలో
    వెన్నెలఱేడ హెచ్చిలగ వేడి గవాక్షమునుండి చాటుగా
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా

    రిప్లయితొలగించండి
  31. ఉన్నతమైన చోటని మహోన్నత భావము తోడ చేరగా
    కన్నియ నైన నన్ను మయికమ్మును క్రమ్మగజేసి, యివ్విధిన్
    పన్నిన వ్యూహమందు పడవైచి మనస్సు భ్రమింప జేయుచున్
    నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా?

    రిప్లయితొలగించండి