27, అక్టోబర్ 2021, బుధవారం

సమస్య - 3884

28-10-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నలకూబరు మంచమందు నల్లులు సేరెన్”
(లేదా...)
“కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే”

38 కామెంట్‌లు:

  1. సమస్య :

    కొల్లలు కొల్లలయ్యె నల
    కూబరు మంచమునందు నల్లులే

    ( ఎంత దిక్పాలక పుత్రుడైనా సోమరిగా నిద్రాళువై
    కాలం గడిపితే జరిగే పరిణామం ఇదే ! )

    " అల్ల కుబేరనందను ; డ
    హా ! మరి చక్కని వా " డటంచు మే
    నెల్లను పొంగజేయు నుతు
    లెన్నియొ పొందుచు రంభగూడుచున్
    మెల్లన నల్లనన్ నిదుర
    మేల్కొనకుండుట కారణమ్ముగా
    కొల్లలు కొల్లలయ్యె నల
    కూబరు మంచమునందు నల్లులే

    రిప్లయితొలగించండి
  2. వలగనిరాజునుబట్టగ
    అలుపెరుగకనరితిరుగగయామినియందున్
    కలలోకలవరమందగ
    నలకూబరుమంచమందునల్లులుసేరెన్

    రిప్లయితొలగించండి
  3. అలరావణాసురుండే
    బలవంతముసేయ రంభబావురుమనియెన్
    కలవర పాటున వాడని
    నలకూబరు మంచమందు నల్లులు సేరెన్

    రిప్లయితొలగించండి
  4. ఇలలో మనుజుల రక్తము
    నలవోక గ బీల్చు నట్టి యల్ప క్రిములకున్
    గలవే తరతమ భేదము
    నలకూబరు మంచ మందు నల్లులు సే రెన్

    రిప్లయితొలగించండి
  5. మల్లెలు సల్లుకున్న మరి మంచి
    సుగంధము రాసుకున్న తా
    నుల్లము సంతసిల్ల కొమ రూర్వసి
    తోడను బొందు గూడినన్
    బల్లిదుడైననేమి తన పాన్పున
    నుద్భవ మందె గాంచగా
    కొల్లలు కొల్లలయ్య నలకూబరు మం
    చమునందు నల్లులే

    రిప్లయితొలగించండి
  6. ఎల్లలుదాటగాప్రభువునేర్పునుజూపుచుభోగమందునన్
    చిల్లరచేతలన్తనదుచేవనుజెప్పగలక్ష్మిపుత్రుడై
    కల్లలుకాటువేయప్రజకాగలకార్యమునెంచిచూడగా
    కొల్లలుకొల్లలయ్యెనలకూబరుమంచమునందునల్లులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "ఎల్లలు దాటగాను ప్రభు వెంతయొ నేర్పున భోగమందుచున్" అందామా?

      తొలగించండి
    2. సవరణతో
      ఎల్లలుదాటగానుప్రభువెంతయునేర్పునభోగమందుచున్చిల్లరచేతలన్తనదుచేవను. జూపగలక్ష్మిపుత్రుడై
      కల్లలుకాటువేయప్రజకాగలకార్యమునెంచిఁజూడగా

      తొలగించండి

  7. పలువురి కొంపల యందున
    పలుదినములు గడిపెడు పరి వ్రాజకు డతడే
    చెలమరి యింటగడిపె కా
    నల, కూబరుమంచమందు నల్లులు సేరెన్.

    రిప్లయితొలగించండి
  8. చలిపులి సందడి సేయగ
    గిలిగింతలు పెట్ట రంభ, గీరుచు గడిపెన్
    కలవర మందుచు రాతిరి-
    నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్!

    రిప్లయితొలగించండి
  9. కందం
    జలజల గురిసెను వానలు
    జలతస్కరు వెలుగు లేక చకచక చేరెన్
    పలు కీటకములు, యా వా
    నల ,కూబరు మంచమందు నల్లులు సేరెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    కూబరు-మనోజ్ఞమైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కీటకములు+ఆ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  10. చెల్లెలు పిల్చెనంచు తన శ్రీమతి తోడ ప్రయాణమయ్యె నా
    పల్లెకు రాత్రి పాళమున బస్సది యందక ప్రాంగణమ్మునన్
    బల్లల పైననుండిరి ప్రభాతపు వేళను నాడు జేరగా
    కొల్లలు కొల్లలయ్యె నల, కూబరు మంచమునందు నల్లులే.

    రిప్లయితొలగించండి
  11. ఉత్పలమాల:
    ఎల్లలు లేని భోగముల నీ కలభాషిణి రంభ పొందులో
    “కొల్లలు కొల్లలయ్యె, నలకూబరు మంచమునందు నల్లులే”
    నల్లులు మంచమందు రతినాధుని సేనయె క్రొత్త జంటకున్ ।
    తెల్లగ తెల్లవారినను తీరవు క్రీడలు నిద్ర రాకనే ।।
    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  12. అలసటనెరుగక నిరతము
    పలురకముల పంచభక్ష్య పరమాన్నంబుల్
    కలగలిపి తినిపరుండెడు
    నలకూబరు మంచమందు నల్లులు సేరెన్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కలవవి పువ్వులు కొల్లలు
      నలకూబరు మంచమందు; నల్లులు సేరెన్
      వలసిన రక్తము ద్రాగగ
      మలకలు గల పేద నులక మంచములోనన్

      తొలగించండి
  14. ఇల్లును వాకిలింగనక నెన్నడు వీధులబట్టి తిర్గుచున్
    చిల్లర నేస్తగాండ్రెపుడు చిల్లులు వెట్టుచునుండ జేబులన్
    తల్లడమేమెరుంగక నితాంత సుఖంబుల తేలి సోలగన్
    కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే

    రిప్లయితొలగించండి
  15. కలతలు నల్లుల రీతినిఁ
    జెలఁగిన మదిమంచమందు చిక్కునె నిదురల్
    సలుపఁగ రావణ దౌష్ట్యము
    నలకూబరు మంచమందు నల్లులు సేరెన్!

    ఉత్పలమాల
    ఉల్లపు మంచమున్గలతలూనము సేయఁగ నల్లులట్లుగన్
    జెల్లునె నిద్రకున్? సతియె చిక్కగ రావణుఁడెంచి దౌష్ట్యమున్
    దల్లడపెట్ట వేదనను దారుణ శాపమునీయు దాక సూ!
    కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే!

    రిప్లయితొలగించండి
  16. (శోభన రాత్రి మామ యల్లునితో పలికిన పలుకులు)

    కల్లయు గాదదిన్  నిజము కానుక నేటికి శోభ నంబవన్
    చెల్లును 'ఆఫ్రికన్ ఎబొని' చెక్కల మంచమె యం చు కొంటినే
    మెల్లగ జెప్పుచుంటి నెప మెన్నక సర్దుకొనుండు నే లపై
    కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే

    (ఆఫ్రికన్ ఎబొని : మిక్కిలి ఖరీదైన నల్లని చెక్క;
    నలకూబరు : నల్లని మనోజ్ఞ మైన))

    రిప్లయితొలగించండి
  17. అలరుచు పండుకొనిరి కూ
    నల కూబరు మంచమందు ; నల్లులు సేరెన్
    తొలగిన మంచము నందున ,
    ఫలమేమియు లేదటంచు వాడక నుండన్

    కూబర = మనోజ్ఞము.

    రిప్లయితొలగించండి
  18. ఎల్లలు మీరగన్ వలపు యెంకిని జూడగ కోర్కెలూరగన్
    మల్లెలుజాజులన్ గొనుచు మైకపు టూహల నూగితేలుచున్
    అల్లరి జేయగా చెలగి హత్తుకు ముద్దిడి ,శయ్యజేరగన్
    కొల్లలు కొల్లలయ్యె నల, కూబరు మంచము నందు నల్లులే !!

    రిప్లయితొలగించండి
  19. వలచిన రంభయె చేరెను
    నలకూబరు మంచమందు; నల్లులు చేరెన్
    నులకల మంచము నందును
    తలకొని శయనించువాడు తల్లడమందన్

    ఒక విదేశీయుని పాట్లు

    ఉల్లము రంజిలన్ వినగ నూర్వశి రంభలె భారతాంగనల్
    పిల్లకు పైకమిచ్చి కడుపేదది యైనను పల్లెటూరునన్
    తుళ్ళుచు బెండ్లియాడ బహుతోషము నందుచు సుందరాంగినిన్
    కొల్లలు కొల్లలయ్యె నల కూబరు మంచమునందు నల్లులే

    రిప్లయితొలగించండి
  20. తల్లికి తిండి పెట్టడతిదౌష్ట్యము జూపుచు లోభియౌచు దా
    చిల్లర కాసులైననఱ జేయుచు చౌకగ చిక్కెనంచునా
    పొల్లగు వస్తువుల్ గొనుచు మూర్ఖముగా నడయాడు నయ్యయో
    కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచమునందు నల్లులే

    రిప్లయితొలగించండి
  21. ఇల నెఱుకుల కడ పందులు
    కలుఁగుల లోన నెలుకలు నగరుల శునకముల్
    కలవా రింటను బిల్లులు
    నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్


    ఉల్లము తల్లడిల్లఁగ సహోదరు తోడుత జోడు మద్దులై
    గొల్లల మందలో నిలువ ఘోరముగాఁ బలు వత్సరమ్ములే
    చల్లగఁ జేర రిత్తవడి చాగఁగ నత్తరిఁ బాను పక్కటా
    కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచము నందు నల్లులే

    రిప్లయితొలగించండి
  22. తొలిరేయి చూడంగ దోమలు పీడించె నని రంభ పలికెను మనసు విప్పి ,

    దుప్పటి వలదంచు దోమ తెర యొకటి కట్టించ రాకుండె గాలి యనుచు

    గోలను చేసెగా కుమరుండు, గదిలోని మంచమున్ బయటకు మార్చి సుఖము

    పొందమని పలుక కందెను కాయము నల్లుల తోనని తల్ల డిల్లె,

    సరిగ జూచి నలకూబరు మంచమందు నల్లులు చేరెనెటుల తెలుపగ వలయు


    చెలియ లార తప్పించుము నులక మంచ
    మీ దినమున, చెక్క మంచము ,మెత్త నైన
    పరుపు నిడుమని ధనపతి భార్య పలికె
    రంభ భాధ బాప దలచి రమ్య గతిని


    రిప్లయితొలగించండి