29, అక్టోబర్ 2021, శుక్రవారం

సమస్య - 3886

30-10-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్”
(లేదా...)
“అంబరమందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్”

38 కామెంట్‌లు:


  1. కుంబిలుని జన్మదినమని
    యంబుజలోచన కొనెనొక యాచ్ఛాదనమున్
    సుందర చిత్రము లుగనా
    అంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్

    రిప్లయితొలగించండి
  2. సంబరమున మడుగునగల
    యంబును తొండమున పీల్చి హమ్మని యూదన్
    డంబపు కరి,యానీటన్
    యంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్

    రిప్లయితొలగించండి
  3. సంబరమాయెగజగతికి
    అంబుదశ్రేణియుకదలగనానందముతో
    శంభుఁడుజార్చగగంగను
    అంబరమునఁజేపలీదెనందమ్మోలుకన్

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    అంబరమందు జేపలు న
    యంబుగ నీదె మనోహరమ్ముగన్

    ( రాయలవారి సభలో ఇంద్రజాల ప్రదర్శన )

    శంబరు డింద్రజాలికుడు
    సన్మతి విద్యను కృష్ణరాయడే
    సంబరమందుచున్ సతుల
    జక్కగ నుంచుక చూచుచుండ ; నా
    డంబరమొప్ప వింత ఘన
    టంకృతి జేయుచు సల్ప ; నీలమౌ
    అంబరమందు జేపలు న
    యంబుగ నీదె మనోహరమ్ముగన్ .

    రిప్లయితొలగించండి
  5. కందం
    అంబువు రాలక తమ ప్రా
    ణంబు నిలువదని సరసున నలిగెడు గతిలో
    నంబుద గర్జన వినపడ
    నంబరమునఁ, జేఁప లీఁదె నందమ్మొలుకన్

    ఉత్పలమాల
    అంబువు రాలకే కొలను నందున జీవనమెట్లు సాగు? ప్రా
    ణంబులు నిల్చునెట్ల? నుచు నల్గుచు చింతను గ్రుంగుచుండ న
    య్యంబుద గర్జనల్ బ్రతుకునాశకు నూపిరులూద వేగమే
    యంబరమందుఁ, జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్!

    రిప్లయితొలగించండి
  6. సంబరపడిమీననయన
    చుంబనరుచినేకనుగొన సుందరిమదిలో
    సంబరమే యంబరమై
    అంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్

    రిప్లయితొలగించండి
  7. సంబరముగ దీపావళి
    చుంబిత గగనాల వెల్గు జువ్వల వెలుగుల్-
    వెంబడి కనపడెనవిగొ
    అంబరమున జేపలీదె నందమ్మొలుకన్

    రిప్లయితొలగించండి

  8. అంబురుహాక్షి జన్మదినమంచు నెఱంగిన ప్రేమికుండు తా
    సంబరమందితెచ్చె నొక చక్కటి తెల్లని కోక దానిపై
    యంబువు నందునన్ బిసరుహమ్ములు యంచలు గల్గినట్టియా
    యంబరమందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  9. సంబరమందమత్స్యములసన్ననివస్త్రముపైనిగీయగా
    అంబకమందుపాపలవియందముతోడుతచిందులేయనా
    రంభయుదాల్చెదానిఁగనిరాగముఁదీయుచునాడెముద్దుగా
    అంబరమందుచేపలునయంబుననీదెమనోహరమ్ముగన్
    అంబకము-కన్ను

    రిప్లయితొలగించండి
  10. సంబరముగ గు వ్వలెగిరె
    నంబరమునఁ ; జేఁప లీఁదె నందమ్మొలుకన్
    నంబుధి నందున హాయిగ
    పంబిన యుత్సా హమొంది భయపడ కుండన్

    రిప్లయితొలగించండి
  11. అంబుల  రణమును బహు యా
    డంబరముగ తెరని నిలుప నంతటది వినో
    దంబై తోచెనొకో  నీ
    లాంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బహు+ఆడంబరము' అన్నపుడు యడాగమం రాదు. 'అంతట+అది' అన్నపుడు సంధి లేదు. *కడు నాడంబరముగ.. నంత నది..* అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలండి🙏. సవరించితిని.

      అంబుల  రణమును కడు నా
      డంబరముగ తెరని నిలుప నంతనది వినో
      దంబై తోచెనొకో  నీ
      లాంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్

      తొలగించండి
  12. అంబరమందు పతంగులు
    సంబరముగ నెగురవేయు సందడిచూడన్
    అంబకములకవి తోచిన
    వంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్

    రిప్లయితొలగించండి
  13. సంబర ముడిగిన వగుచుదా
    మంబరమును జూచు చుండె నలసిన దరిలో
    నంబుద ములు గర్జింపగ
    నంబరమున :జేప లీ దె నంద మ్మొలు కన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. *సంబర ముడిగినవై తా మంబరమును...* అనండి.

      తొలగించండి
  14. అంబరవీథిరమ్యసలిలాశ్రయసాంద్రఖనీలిమంబు చొ
    క్కంబగు నీరు, తల్లహరికమ్రపరంపరవీచిడోలలం
    దంబుధిజుండు నావయగు, నట్లుగ తారలు కొర్రమీనులై
    యంబరమందు చేపలు నయమ్మున నీదె మనోహరమ్మునన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. అంబుజ నాభు మహిమ మక
    రంబులఁ దారా గ్రహముల రంజిలుచును మో
    దంబునఁ గర్కటములతో
    నంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్


    చుంబన కేళి సల్పుచును జోద్యమ బంగరు రంగు లీనుచున్
    సంబర మంబరమ్మును భృశమ్ముగఁ దాఁకుచు నుండఁ దోఁగి పు
    ణ్యాంబువు లందు దోవతిని నాడుచు నుండఁగఁ బాండురంపు నా
    యంబర మందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  16. అంబుదముల సొగసు గనుమ
    నంబరమున,జేపలీదె నందమ్మొలుకన్
    నంబువు లెక్కువ గల్గుట
    యంబువులే ప్రాణముకద యాచేపలకున్

    రిప్లయితొలగించండి
  17. కం.
    కంబము చివరన గగన ప
    థంబునెగిరె 'కొయ్‌నొబోరి' తళతళమని యా
    డంబరముగ; పోలికగన
    నంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్!

    జాపనీయులు కొయ్ (koi) చేపలను బలముకు మరియు పట్టుదలకు చిహ్నములుగా భావిస్తారు. పిల్లలకు ఆ లక్షణములు అబ్బవలెననే సదుద్ధేశముతో బాలల దినోత్సవము రోజున కొయ్ చేపల రూపములో ఉండే గాలిపటాలను స్తంబముల చివర ఎగురవేస్తారు. వాటిని 'koinobori' అంటారు.

    రిప్లయితొలగించండి
  18. అంబుద శ్రేణులన్ వరుస నారయ చక్కగనుండె చూడుమా
    యంబరమందు,జేపలు నయంబుగ నీదెమనోహరంబుగన్
    నంబువు లెక్కువౌ కతన యబ్బగ వేడుక మానసంబునన్
    సంబర మొప్పగా మిగుల సంతుల తోడను నక్కొలన్ దమిన్

    రిప్లయితొలగించండి
  19. అంబుధరంబులలముకొన
    నంబరమునఁ, జేఁప లీఁదె నందమ్మొలుకన్
    సంబరమున నంబుధిలో
    నంబరమణి తాపమణగ నానందమునన్

    రిప్లయితొలగించండి