21, నవంబర్ 2021, ఆదివారం

దత్తపది - 180

 22-11-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
"లడ్డు - బూరె - అరిసె - కాజా"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. సరసమున కిను(కా,జా)లను వేసెను
    రతిపతి నాపై,విరసము నేల

    చూపుచు నుంటివి చోద్యముగా కామ తాపం(బూరె)ను మదిన్, తనువు లోన


    (యరిసె)ము కలుగును పరుగున వచ్చి ము
    ద్దాడిన,మాలినీ హ్లాద మిడుచు


    దరి చేర నిచట సైంధవ(లడ్డు) లేదుగా
    నన్బెదిరించ
    ప్రాణ ములు‌ పోవు

    నెవ్వరైన చెప్పగ జాల రెదురు నాకు,

    రమ్ము త్వరితము గానీవు , రతి సుఖమ్ము

    నిడిన చేతును రాణిని‌ దడుపు‌ మాను
    మనుచు కీచకుడు పలికె వనిత తోడ

    అరిసెము = హర్షము,
    సైంధవలడ్డు = అడ్డము
    జాల= వల

    రిప్లయితొలగించండి
  2. కాంచిసేననచటకాజాలదుర్మతి
    ననుచుపలుకుపార్ధునరిసెబావ
    మాటలడ్డుఁజెరపమానసంబూరెగా
    చింతలన్నిఁదీరఁజేసెపోరు

    రిప్లయితొలగించండి
  3. సేన లడ్డు పడిన దాను జేరు కొనియె
    పద్మ మొగ్గరం బూరెక్క వాడె ననగ
    నరిసె నభిమన్యు దెబ్బకు న డలి సేన
    చిక్కె తుదకా జాలపు చివ్వయందు

    రిప్లయితొలగించండి
  4. స్వర్గంలో ఊర్వశి అర్జునినితో...

    కందం
    నరుడా! కేలడ్డుటె? నే
    మురిపెమునన్ దీర్చ శయ్యఁ బూరెక్కలు ని
    న్నరిసె పరువంపు కేళికి
    మరి నీకా జాలిలేదె? మనలేను దొరా!

    రిప్లయితొలగించండి
  5. యుధ్ధ 'బూరె'టువైపునో సద్దు చేసె
    'అరిసె'లవు లభించె కిరీటి శరము విడుము
    శరము విడుచుట'కాజా'గు చాలునోయి
    అస్త్రముల్ విడిచిన సేన'లడ్డు'తొలగు

    రిప్లయితొలగించండి
  6. కొట్టులాట ‘కా జా’గాను కోరుకొనగ
    పాండవుల దళం’బూ, రె’చ్చి పయన మయిరి
    శతృవు ‘లడ్డు’ కొనగ వార్ని సడల భీమ
    సేనుడటకేగి కౌరవ సేన ‘నరిసె’

    అరియు = నశింపజేయు

    రిప్లయితొలగించండి
  7. దత్తపది :
    లడ్డు - బూరె - అరిసె - కాజా పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ భారతపరంగా

    ( ఇంద్రుడిచ్చిన శక్తిని ఘటోత్కచుని పైన
    ప్రయోగించమని కర్ణుని కోరుతున్న దుర్యోధనుడు)

    తేటగీతి
    .............

    కర్ణ ! కాలడ్డు పెట్టుట కాదు మేలు ;
    నిన్ను జూచి ధైర్యంబూరె నిపుడు నాకు;
    అరిసెగల ఘటోత్కచుడంతమందునట్లు
    శక్తి విసరక -కాజాల జయుడ నేను .

    రిప్లయితొలగించండి
  8. *అరిసె* భీమ పుత్రు డనిలో నార్భటముగ
    కౌరవ బలము *లడ్డు* నె గదను బట్ట
    నేను, సంతసం *భూరె* నా మేనులోన
    నేల నాయ *కా! జా* లి యీ కూళులపయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరి సె* లగ నెంచ నేనని నార్భటముగ
      కౌరవ బలము *లడ్డు* నె? గదను బట్ట
      నేను, సంతసం *భూరె* నా మేనులోన
      నేల నాయ *కా! జా* లి యీ కూళులపయి

      తొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. *లడ్డు-బూరె-అరిసె-కాజా*
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

    శ్రీ కృష్ణ రాయబారం.
    ప్రయత్నం:

    పరు లెవ్వరోసుయోధన!
    యరిసెముతో బాండు సూను లడ్డను కొనకన్
    దరిఁజేరి పురంబూరే
    గరుగుము, కాజాలరెవ్వ రడ్డిక బావా!

    అరిసెము- ప్రేమ, హర్షము

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. నరుడు, సూతకా! జారెను నీరథమిల
      క్రుంగు బాటు నీ కేలడ్డు కొనగ తరమ,
      పొదిని నీకై శరంబూరె పదునుగ యని
      విసరె నరి సెగ జూపుచు వీరునణచె.

      తొలగించండి
  12. అంగారపర్ణుం డను గంధర్వుఁ డర్జునునిచే నోడి యుద్దమున దగ్ధ రథుఁ డయినందున గంధర్వ మహిమ ననేక చిత్ర రథములు సృష్టించికొని చిత్రరథుఁ డనఁ బేరు మార్చికొని యర్జునునితో స్నేహము సేయు సందర్భము:

    అరి సెడ బలమ్ము కా, జా
    లి రగుల, మిత్రుఁడు నరునకు లీలన్ వనిలోఁ
    గరమున బూ రెగయ మిగులఁ
    ద్వరితము వా లడ్డు తీసి వఱలి నుతించెన్

    [అరి శత్రువు; బూరు ఎగయ= బూ రెగయ; బూరు=వెండ్రుకలు, రోమాంచము; వాలు+అడ్డు]

    రిప్లయితొలగించండి
  13. శ్రీ కృష్ణుడు పాండవులతో:

    కం:

    కాజాలదు సంధి యెపుడు
    పోజాలరు మీరలడ్డు ముట్టడి నాపన్
    రాజేయదె నరి సెగలను
    కోజులు మీరన మిగులుగ కోపంబూరెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. లడ్డుగాడు మాబుచ్చోడు గడ్గుగాయి
    గుర్రమెక్కు బాబూ రెక్కలెర్రగున్న,
    లేచిపోవు వైకుంఠ హరి సెచి వాల
    యమ్ము, వెతుకా! జానకమ్మకనబడె
    మోక్షసాదనకుయడుగు ముందుబడియె
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  15. {ఉత్తరకుమార ప్రతిజ్ఞలు}

    *అరిసె*మొందగనాతండ్రి, యరులతోడ
    పోరుసలిపెడు సంబరం*బూరె*మదిని
    యాహవంబుననే వీరు*లడ్డు*పడిన
    పెంపెసంగెద *కాజా*ల భీరువుగను
    (అరిసెము=సంతోషము)

    రిప్లయితొలగించండి