26, నవంబర్ 2021, శుక్రవారం

సమస్య - 3913

 27-11-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్”
(లేదా...)
“రక్తం బంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లెఁ దాన్”

21 కామెంట్‌లు:

 1. వక్తలపలుకులతానా
  సక్తుండైశ్రోతసభనుసంగమమందెన్
  భుక్తియుమరచినవాడై
  రక్తంబనిమంచినీరుఁద్రావఁగజంకెన్

  రిప్లయితొలగించు
 2. భక్తులు కుంకుమ తోడను
  ముక్తిని గోరుచును గంగ బూజను సల్పన్
  వ్యక్తి యొ కడు దాహమ్మున
  రక్తంబని మంచి నీరు ద్రావ జo కెన్

  రిప్లయితొలగించు

 3. యుక్తము కాశ్యపమంచును
  వ్యక్తపరచు నారి యిచ్చి బానెడు జలమున్
  శక్తిని పొందకుడవమన
  రక్తంబని మంచినీరు ద్రావన్ జంకెన్.

  రిప్లయితొలగించు
 4. కందం
  శక్తికొలది నూతిని యా
  సక్తతఁ బొలమందుఁ ద్రవ్వ సజలమ్మైనన్
  యుక్తముగఁ, దల్లి, కొమరుని
  రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్!

  శార్దూలవిక్రీడితము
  శక్తిన్ మించి పొలాన ద్రవ్వఁగ నవిశ్రాంతమ్ముగా పుత్రుఁడా
  సక్తుండై నుయిఁ దీర్చ నీటి కొరతన్ సర్వేశు నాశీసనన్
  యుక్తంబౌచు జలమ్ము వొంగ తలియే యుద్విగ్నతన్ సంతుదౌ
  రక్తం బంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లెఁ దాన్

  రిప్లయితొలగించు
 5. భక్తుండంతటసూర్యబింబమునుఁదాభాసిల్లునెమ్మోమునున్
  సక్తుండైతిలకింపసంధ్యగనిభాస్వంతుండుముద్దాడగా
  రక్తంబట్టులవాహినీజలములున్రాగంబుచిందించెనే
  రక్తంబంచునునిర్మలోదకమునున్ద్రావంగభీతిల్లెఁదాన్

  రిప్లయితొలగించు
 6. ఒక సన్యాసి సమాధానంగా ప్రయత్నము:

  శా:

  ముక్తిన్ గల్గగ జేతునంచు జనులన్ మోహాంధకారంబులో
  రక్తిన్ జేర్చిరటంచు సామి గుణమున్ లంకించ బాహాటమై
  ముక్తాయింపుగ జెప్ప బూనె నతడై మోసాలు వర్జింపనై
  రక్తం బంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లె దాన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 7. శక్తిని,యుద్ధముపైనను
  రక్తిని,దునిమెను కళింగ లక్షల సేనన్
  యుక్తత నెరిగి యశోకుడు
  రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్

  రిప్లయితొలగించు
 8. రక్తచరితలుకథలకను
  రక్తుండైమతిచలించి రాత్రింబవలూ
  రక్తపుటాలోచనలన్
  రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్

  రిప్లయితొలగించు

 9. యుక్తంబయ్యది కాదురా మధువు పీయూషంబు కాదంటిరా
  శక్తిన్ చుబ్బనచూఱలాడు కదరా సారాయి కన్నన్ గనన్
  రక్తంబేగద మేలు గ్రోలు మనుచున్ బ్రాణేశ యందించె నా
  రక్తంబంచును నిర్మలోదకమునుం, ద్రావంగ భీతిల్లెఁ దాన్.

  రిప్లయితొలగించు
 10. భక్తిగ నభిషేకమును సు
  యుక్తునకుం జేసినట్టి యుదకమునీయన్
  సిక్తమ్మవ శోణిమతో
  రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్

  రిప్లయితొలగించు
 11. రక్తంబంటిన విచ్చుకత్తులను క్రూరాకారులై ముష్కరుల్
  యుక్తంబెంచకబూని ప్రాణహననోద్యోగమ్ము సాగింపగా
  శక్తింగోల్పడినట్టి వృధ్ధుడొకడున్ సంభ్రాంతచేతస్కుడై
  రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగభీతిల్లెదాన్.

  రిప్లయితొలగించు
 12. శ్రీ కంది శంకరయ్యగారు ఇచ్చిన సమస్యకు నా పూరణము

  సమస్య:

  రక్తంబని మంచినీరుఁద్రావగ జంకెన్ .

  కందము

  యుక్తిగఁగట్టిన మయసభ
  యుక్తంబని చూచుటకు సుయోధనుఁడేగెన్
  వక్తవ్య మేమి యున్నది
  రక్తంబని మంచి నీరుఁద్రావగ జంకెన్ .

  సమస్య:

  రక్తంబంచును నిర్మలోదకమునుంద్రావంగ భీతిల్లెఁదాన్

  శార్దూలము

  యుక్తంబీ సభ చూడ రమ్మనగనే యుత్సాహముప్పొంగ,ను
  ద్యుక్తుండై చనె కౌరవాగ్రజుడు నోహో!వింతలేమందు,త
  త్సిక్తంబయ్యునసిక్తమై కనులకున్ దృశ్యంబులన్యంబవన్
  రక్తంబంచును నిర్మలోదకమునుంద్రావంగ భీతిల్లెదాన్

  ———దువ్వూరి రామమూర్తి.

  రిప్లయితొలగించు
 13. రిప్లయిలు
  1. రక్తాంబరమును గని యా
   సక్త నియమగరిమినొకడు చాందసుడగుటన్
   వ్యక్తంబదియును రవికుప
   రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్

   (ఉపరక్తము: గ్రహణము)

   తొలగించు
 14. యుక్తంబంచు యుధిష్ఠిరుండు దలపెన్ యుద్ధంబు వారింపగన్
  వ్యక్తంబయ్యె దుదిన్, మహోగ్ర బవరం బావశ్యమై పోరెఁ దాన్,
  రక్తిం జూపెడి బంధులెల్ల సమయం, రాజ్యంబు సేకూరినన్,
  రక్తం బంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లెఁ దాన్.

  యజ్ఞభగవాన్ గంగాపురం

  రిప్లయితొలగించు
 15. యుక్తము కాదని సంశయ
  యుక్తుం డయి డెంద మందు నూహించి నదీ
  ముక్త పురీషణ యాదో
  రక్తంబని మంచి నీరుఁ ద్రావఁగ జంకెన్

  [యాదో రక్తము = జలచరముల కిష్టము]


  యుక్తాయుక్త విచక్షణుండు తర ణోద్యుక్తుండు ధీయుక్తుఁ డా
  సక్తింగాంచి జలమ్ము డెందమున హర్షం బందె శశ్వత్తృషా
  రక్తుం డయ్యు నదీ జలమ్ముఁ బ్రసరిల్లన్ బాల సూర్యప్రభల్
  రక్తం బంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లెఁ దాన్

  రిప్లయితొలగించు
 16. రక్తిని బూజను జేయుచు
  భక్తుడు దానీటకలుప వరపుంబొడినిన్
  రక్తము వోలెను గనబడ
  రక్తంబని మంచినీరు ద్రావగ జంకెన్

  రిప్లయితొలగించు
 17. పక్తలొకదరి కలిసి యు
  ద్రిక్తతతో భాషణలిడి తృష్ణాళువులై
  రక్తిమ సీసాన గలది
  రక్తంబని మంచినీరుఁ ద్రావఁగ జంకెన్

  రిప్లయితొలగించు
 18. రక్తిన్ బూజను జేయు కోరికనునా వీరయ్య యుత్సాహియై
  సిక్తంబౌనటు జేసి కుంకుమపొడిన్ జేయార గల్పంగగా
  రక్తంబంచును నిర్మలోదకమున్ ద్రావంగ భీతిల్లెదాన్
  భక్తుండెవ్వడు నిష్ఠతోడను హరిన్ ప్రార్ధించు దాముక్తు డౌ

  రిప్లయితొలగించు
 19. భక్తుండా రఘరామ మూర్తికి మహా
  భాస్వంతు డా జానకిన్
  శక్తీశాలి దశాననాసురుని రాజ్యంబందు
  నంగాంచి తా
  రక్తాక్షోగ్ర మనస్కుడౌటనట సర్వంబె
  క్కె లౌహిత్యమే
  రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లె దాన్

  రిప్లయితొలగించు