30, నవంబర్ 2021, మంగళవారం

సమస్య - 3917

 1-12-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్”
(లేదా...)
“మీనముఁ గుంభమందుఁ గని మేషము నవ్వెను మిక్కుటంబుగన్”

23 కామెంట్‌లు:

  1. కానగవచ్చినమబ్బున
    వానలభయమునసుడివడిపాఱుచుచేపల్
    కూనలనుంచెనుకుండను
    మీనముఁగుంభమునఁగాంచిమేషమునవ్వెన్

    రిప్లయితొలగించండి
  2. వానల లోనన్ దొరికిన
    మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్
    దానును రేపటి కూరని
    స్థానువుయై జూడసాగె, తత్వము నెరిగెన్.

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:

    తానిట నుండగ మిత్రుడు
    కానక నుండెనని వెదకి కాలువ దరినిన్
    ధ్వానము జేసెడి తన సచి
    మీనము కుంభమున గాంచి మేషము నవ్వెన్.

    రిప్లయితొలగించండి

  4. మానవునికంచమున బి
    ర్యానిగ మారెడు చులుంప వంచు శకులియే
    జ్యానిని కోడిగ మాడిన
    మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  5. కానగసంద్రమందుతమకాంతులుజిమ్ముచునాట్యమాడుచున్
    కూనలచిన్నిచేపలనుకోరుచుపెద్దలుమ్రింగఁజూతురే
    చేనునుకంచెమేయకథఁజేరెనుకంచికినద్భుతంబనన్
    మీనముఁగుంభమందుఁగనిమేషమునవ్వెనుమిక్కుటంబుగన్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. మేషరాశికి మీనరాశితో వశ్యపొంతన.
      కానీ మేషరాశి వానిని కాదని శ్రీమంతుడని కుంభరాశి వానికి వధువును కట్టపెట్టడం. మేషరాశి వానికి అందని ద్రాక్ష పుల్లన....

      కందం
      హీనము వశ్యపుపొంతన
      మైనను శ్రీమంతుఁడంచు నాలిగ జేయన్
      దానందక పుల్లనిదని
      మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్

      ఉత్పలమాల
      తూనిక వైచ రాశులను తూగిన వాడొక లేని వాడనన్
      వానిని మాని కూర్చ ధనవంతుని వశ్య విహీను భర్తఁగన్
      దానట నందలేనిదను ద్రాక్షను పుల్లనిదంచు ఖిన్నతన్
      మీనముఁ గుంభమందుఁ గని మేషము నవ్వెను మిక్కుటంబుగన్

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    తానిట కిప్పుడొత్తునని దప్పక రమ్మని జెప్పినంతటన్
    కోనెరు జేరినట్టి తనకున్ కనిపింపని కారణమ్ముచే
    దీనతగూడు వృష్ణి కట దృష్టికి వచ్చెనుబో సఖుండునౌ
    మీనము కుంభమందు గని మేషము నవ్వెను మిక్కుటంబుగన్.

    రిప్లయితొలగించండి


  8. హీనపు జన్మనీదని మహీతల మందున నెప్పుడైన నా
    మానవజాతి నంజుగను మారెడు దానవు నీవటంచు నా
    జ్యానిని స్వేచ్ఛగా తిరుగెడండజ మొక్కటి గేలిసేసె, నా
    మీనముఁ గుంభమందుఁ గని మేషము నవ్వెను మిక్కుటమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  9. తాను వనమంతయు దిరిగి
    పానీయముకై వెతకగ బాన గనబడన్
    దాని దరికేగి జూడగ
    మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్

    రిప్లయితొలగించండి
  10. వానలు జోరుగ గురియగ
    మానుగ నిండిన చెఱువుల మత్స్యములాడన్
    దీనత నింటను బెంచిన
    మీనము కుంభమున గాంచి మేషము నవ్వెన్

    అక్వేరియంలో చేపను చూసి నవ్వినదని

    ఈనర జాతికైనవగు నీహల దీర్చగ సాధ్యమేభువిన్?
    పూని భుజింతురే విడక పోషణపేరిట జంతుజాలమున్
    మానుగ బెంచుచుందురయొ మాపటివేళకు మెక్క నంచు దా
    మీనము గుంభమందుగని మేషము నవ్వెను మిక్కుటంబుగన్

    రిప్లయితొలగించండి
  11. మీనము మేషము లెక్కని
    మానక తధ్యము తినుటయు మర్మంబెరుగన్
    ఆనక  తననని తెలియని
    మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్

    రిప్లయితొలగించండి
  12. మానిత పురోహితు గనియు
    స్థానముల తెలుపు మటంచు దశలను గోరన్
    వానిని గణించి పలికెను
    "మీనము గుంభమున గాంచి మేషము నవ్వెన్ "

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    మానిని గోరి యిర్వురగు మాన్యులు జేరగ బెండ్లి యాడనై
    యేనుగు బోటి వాడు తనకెంతయొ బ్రాణ మటంచు చేకొనన్
    కూనగ గాన వచ్చెనట కోరిన యింతి స్వభావ మెంచగన్
    మీనము గుంభమందు గని మేషము నవ్వెను మిక్కుటమ్ముగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. మీనము మేషపు బంధము
    గానంగతరమె ప్రజలకు కాంతా!చెపుమా
    కానిది యౌనన సబబే
    మీనము గుంభమున గాంచి మేషము నవ్వెన్ ?

    రిప్లయితొలగించండి
  15. వాన కురియ మిగుల ఘటము
    లో నీరు పడంగ నిండఁ బ్రోచుట కనఁగాఁ
    దా నేల నుండి యెగురఁగ
    మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్


    వానికి వ్రాయ జాతకముఁ బన్నుగ మంచి గ్రహమ్ము లుండఁగా
    మే నలరంగ మూడిటను మేలు నొసంగెడు నట్టి రీతిగా
    నా నరుఁ డంత హర్షము ఘనమ్ముగఁ బొంగఁగ డెంద మందుఁ దా
    మీనముఁ గుంభమందుఁ గని మేషము నవ్వెను మిక్కుటంబుగన్

    [అందు(ఆ చక్ర మందు) మీనమును గుంభము మేషము గని తా నవ్వెను మిక్కుటమ్ముగన్]

    రిప్లయితొలగించండి
  16. మీనము గుంభమందుగని మేషము నవ్వెనుమిక్కుటంబుగన్
    మీనము మేకకున్ నరయ మేదిని బంధము లేదుగా రవీ!
    మీనము గుంభమందు గని మేషము నవ్వుట సాధ్యమే యికన్
    గానగరాని బంధమును గాంచుట న్యాయమె చింతజేయగన్

    రిప్లయితొలగించండి
  17. కందం
    జ్ఞాని గణకుని గని యడిగె
    పాణిగ్రహణపు ముహూర్త వారము కొరకున్
    తాను గణుతించి నుడివెను
    మీనము గుంభమున గాంచి మేషము నవ్వెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  18. జానగు రాశుల పేరుల
    నే నిజ సంతతికిడ జననీ జనకులహో!
    ఆ నాటి యాటలందున
    మీనముఁగుంభమునఁదాంచి మేషము నవ్వెన్ .

    రిప్లయితొలగించండి
  19. తానొకకొలనుకడనిలిచి
    మీనత్రయభాషణమును మేషమువినియెన్
    ఈనాడుమందమతియౌ
    మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్

    రిప్లయితొలగించండి
  20. వానలరాకనుకోరుచు
    కానలలోగళమునెత్తి కాకపికమ్ముల్
    గానము చేయగ వినియెడి
    మీనము గుంభమునగాంచి మేషము నవ్వెన్.

    రిప్లయితొలగించండి