17, నవంబర్ 2021, బుధవారం

సమస్య - 3905

 18-11-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర్షమిడును నేతకున్ జనాక్రందనలే”
(లేదా...)
“హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్”

36 కామెంట్‌లు:

  1. వర్షము లు గురియ రైతుకు
    హర్ష మిడు ను : నేతకున్ జనాక్రo దనలే
    ఘర్షణ మనమున రేగియు
    శీర్షము నొప్పించు గాదె సేమంబుడు గన్

    రిప్లయితొలగించండి
  2. వర్షంబులుముంచెత్తగ
    శీర్షంబునువంచెచేనుచిత్తడియందున్
    ఘర్షణపడగారైతులు
    హర్షమిడునునేతలకుజనాక్రందనలే

    రిప్లయితొలగించండి

  3. వర్షా! కారును తోలుచు
    కర్షకులను చంపినట్టి ఖలులుండిన యీ
    వర్షము నందున నిజమే
    హర్షమిడున్ నేతకున్ జనాక్రందనలే.

    రిప్లయితొలగించండి
  4. ప్రస్తుత సమాజంలో నేతల గుణము గా ప్రయత్నము:

    శా:

    వర్షింపంగదె రూప్యముల్ ప్రతిఫలంబాశింప నిస్సిగ్గుగా
    శీర్షంబెత్తిన ముప్పు దప్పదనుచున్ శిక్షింప వెన్నాడు. సం
    దర్శింపంగ జనాలనున్ దురుసుగా తాడించి పీడించనై
    హర్షంబుం గలిగించుసర్వజన దీనాలాపముల్ నేతకున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  5. వర్షాభావముకాంచినన్జనులివాపోదురెల్లప్పుడా
    కర్షింపన్తమజీవితంబులికలేకన్కాంతులెప్పట్టునన్
    ఘర్షణన్జనఱేఁడులేడుగదరాఘర్మంబుచిందించినన్
    హర్షంబున్గలిగించుసర్వజనదీనాలాపముల్నేతకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. కాంచినన్జనులే1వపాదం
      కర్షంబంందగఱేడులేడుగదరా3వపాదం

      తొలగించండి

  6. వర్షా! స్వార్థము నిండినట్టి ప్రభువుల్ పాపాత్ములే హెచ్చుగా
    వర్షంబందున నేడు పాలకులుగా ప్రఖ్యాతులై వారలే
    శీర్షంబెత్తుకు తిర్గువారలు ప్రజాక్షేమంబు నే కోరరే
    హర్షంబున్ గలిగించు సర్వజనదీనాలాపముల్ నేతకున్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    వర్షింతు వరములన నా
    కర్షణఁ బ్రతిపక్షనేత గద్దెనుఁ గన ని
    ష్కర్షగ మునుపు నలిగిరన
    హర్షమిడును నేతకున్ జనాక్రందనలే

    శార్దూలవిక్రీడితము
    వర్షింతున్ గెలిపింప నన్ను వరముల్ వద్దన్నమీకంచు నా
    కర్షింపంగ విపక్షనేత మదితాకన్పాదయాత్రాదులన్
    స్పర్షించన్ బ్రజ నమ్మి మద్దతుగ కష్టాలన్ నివేదించినన్
    హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్!

    రిప్లయితొలగించండి
  8. శార్దూలము:
    స్పర్షామాత్రముచేత మన్ను గరిమన్ బంగార మౌ రైతుచే
    వర్షంబాతని యాప్త మిత్రు డగుచో పండించు సస్యంబులన్
    వర్షంబుల్ ఋణమాఫి చేతుమనుచున్ వాగ్దానముల్ నమ్ముచో
    “హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  9. కర్షకులొసగినభూమిని
    హర్షముతో వృధ్ధిపరచు నాలోచనకున్
    శీర్షాసనమేర్పరచెన్
    హర్షమిడును నేతకున్ జనాక్రందనలే

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. కందము:
    హర్షమె మార్జాలమునకు
    శీర్షము క్షీరమునముంచి శీలము విడువన్
    కర్షక కార్మికులేడ్వగ
    “హర్షమిడును నేతకున్ జనాక్రందనలే”!
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  12. తర్షణమే! జయమును విన,
    హర్షమిడును నేతకున్; జనాక్రందనలే
    శీర్షికలౌ పత్రికలను
    వర్షము వలనన్ క్రికెట్టు వరుసగ నోడన్

    రిప్లయితొలగించండి
  13. వర్షమున పంట మునుగఁగ
    కర్షకసోదరులగుండె కలవలమొందెన్
    మర్షము కోల్పోవనెటుల
    హర్షమిడును నేతకున్ జనాక్రందనలే

    రిప్లయితొలగించండి
  14. అమరావతి రాజధాని సందర్భం.

    కందం
    హర్షోల్లాస మనముతో
    కర్షకులిచ్చిరి పొలములు ,కడకది మారెన్
    ఘర్షణలమరావతిగా
    హర్షమిడును నేతకున్ జనాక్రందనలే.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  15. కర్షక జనులకు వర్షము
    హర్షమిడును,నేతకున్ జనాక్రందనలే
    ఘర్షణ గలుగం జేయుచు
    హర్షా!చీకాకు పఱచు హృదినిన్ సుమ్మీ

    రిప్లయితొలగించండి
  16. వర్షంబుల్ గురియంగ రైతులకీకన్ పండంగ పంటల్ దగన్
    హర్షంబున్ గలిగించు ,సర్వజనదీనాలాపముల్ నేతకున్
    వర్షా!గుండెను వేగవంతముగ రఫ్ఫాడించి బాధించుచున్
    హర్షంబించుక లేక యుంచుచు గదా యెవ్వేళయందైననున్

    రిప్లయితొలగించండి
  17. తర్షము మిక్కుట ముండఁగ
    కర్షకులకు సేద్య మందుఁ గలఁత చెలంగన్
    శీర్షవ్యధతో ఖండిత
    హర్ష మిడును నేతకున్ జనాక్రందనలే


    మర్షం బూని యెడంద సాయమును సంరంభంబునం గూర్చి ని
    ష్కర్షం బాపి కలంత లన్నిటినిఁ దాఁ జాతుర్య మేపారఁగం
    గర్షాంతఃకరణుండు నంత జన సత్కాంతుండు పడ్డం జెవిన్
    హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్

    రిప్లయితొలగించండి
  18. వర్షించగ వాగ్వరములను
    హర్షమిడును,నేతకున్ జనాక్రందనల్
    ఘర్షణను బెంచి నిలుపగ
    శీర్షాసన ముప్పు లౌను చిత్తుగ నోడన్

    రిప్లయితొలగించండి
  19. వర్షోత్పాతము సంభవింపగ జనావాసంబులన్ మున్కతో
    తర్షంబున్ తలపించె నల్గడల నత్యంతవ్యథా పూరమై
    మర్షంబున్కలిగించు మార్గముల నామంత్రింపకే రీతిగా
    హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్?

    రిప్లయితొలగించండి
  20. పర్షపు మాటలు యెక్కడ
    హర్షమిడును? నేతకున్ జనాక్రందనలే
    పర్షీలించ వడివడిన్
    కుర్షీ నిల్చిపదవుండు కూర్మిని కల్గీ
    ...తోకల...

    రిప్లయితొలగించండి