5, నవంబర్ 2021, శుక్రవారం

సమస్య - 3893

6-11-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్”
(లేదా...)
“వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్”

28 కామెంట్‌లు:

  1. తనియుదమానందమునను
    కనులకుపండువుమనకదికాంచగవిష్ణున్
    వినయముతోడుత, శ్రీగిరి
    వనమునసుఖమబ్బుశ్రీనివాసునిఁగోలువన్

    రిప్లయితొలగించండి
  2. మనమున స్వచ్చ త గల్గియు
    జనహిత మొనరింప బూని సాత్వికు డగుచున్
    వినయ విధేయత తో బా
    వనమున సుఖ మబ్బు శ్రీని వాసుని గొలువన్

    రిప్లయితొలగించండి
  3. చనివేగన్తిరువేంకటాద్రిగననాంచారమ్మనాథున్ఘనుం
    డనగావేంకనసౌరులేగదరమీటన్శోభహ్రుత్పద్మమున్
    తనువేసార్ధకమాయెగాతనియవేదాహంబుమోక్షార్ధికిన్
    వనమందున్సుఖసంపదల్దోరకులేఁబద్మాక్షుపూజించినన్

    రిప్లయితొలగించండి
  4. నాటి టీటీడీ ఈవో శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారి మనోగతం.....

    కందం
    మనసా! దైవాశీసుల
    నను గూర్చఁగఁ గార్యనిర్వహణ బాధ్యతలం
    దున 'నాహం కర్తా' భా
    వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్

    మత్తేభవిక్రీడితము
    అనయంబున్ తిరువేంకటాద్రి విభు నే నర్పింప సేవింపఁగన్
    మనసా! స్వామి దయాంతరంగము వరమ్మై కార్యనిర్వాహకుం
    డను పీఠంబున దీర్చినంత నను 'నా హంకర్త' యంచెంచు భా
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి
  5. మనమందుం జెడు బుద్ధి వీడి
    యు సదా మర్యాదతో బ్రేమతో
    జన సామాన్యులకెల్లవేళ మిగులన్
    సాయంబు నందించుచున్
    వినుతుల్ సేయుచు చిత్త శుద్ధి
    మెయి సంప్రీతి సద్భక్తి జీ
    వన మందున్ సుఖ సంపదల్ దొర
    కులే పద్మాక్షు బూజించినన్

    రిప్లయితొలగించండి
  6. జననస్థితి లయదూరుని
    ఘనముగ బూజింపఁ దగును గైవల్యముకై
    వనమున విరిసిన విరి సే
    వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్.

    జననంబున్ సఫలంబు జేయగ, బునర్జన్మంబు లేకుండగన్
    ఘనుడా శ్రీహరి, యంబుజోదరుడు, శ్రీకాంతుండు నావిష్ణునిన్,
    వనమందున్ విరబూసినట్టి విరులం బాదాలపై బేర్చ, సే
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్.

    రిప్లయితొలగించండి
  7. మనముననేకాగ్రతతో
    ననయము శ్రీహరినిగొల్వ నభయమునిచ్చున్
    తనువు లశాశ్వతమను భా
    వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్

    రిప్లయితొలగించండి
  8. ధనమార్జించుట కొరకై
    యనునిత్యము పోరుసలిపి యలసిన నరుడే
    యనరున పడుచుండు గద, భు
    వనమున సుఖమబ్బు శ్రీనివాసుని గొలువన్.

    రిప్లయితొలగించండి
  9. మ:

    కనలేరెవ్వరు నీదు రూపమెచటన్ కాణాచి ప్రత్యక్షమున్
    తన వారెవ్వరొ వేరు లెవ్వరుగుటో దర్షింప నీ భాగ్యమే
    మన లేకుందురు తోడు లేక, మహిమల్ మన్నింప, నీజీవి, భా
    వనమందున్ సుఖ సంపదల్ దొరుకునే పద్మాక్షు పూజింపగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. (ఒక పూజారి మరియొక పూజారితో....)


    మనవృత్తే ఘనమైనది
    మనదౌ పూజావిధంబు మహిమాన్వితమై
    ఎనలేనిగొప్పసంభా
    వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్

    రిప్లయితొలగించండి
  11. జనులకు దిరుమల యందలి
    అనిమిషు దరిసెనము ముందు నచటి కొలనునన్
    మునకలపుడు శీతల పా
    వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్

    పావనము = జలము

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. దినదినము గండమే! జీ
      వనమున; సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్,
      తన తిరుమలకు నడచి వె
      ళ్ళిన, కోర్కెల దీర్చి గాచు లీలగ మనలన్

      తొలగించండి
  13. అనయంబాహరి పాదయుగ్మములయందాసక్తి జూపించి చిం
    తనమున్ శ్రీహరి నామ కీర్తనమునన్ తాదాత్మ్యతన్ జేయ జీ
    వననౌకన్ కడజేర్చు సాధనము దైవంబన్నమేలైన భా
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్

    రిప్లయితొలగించండి
  14. ఉత్పలమాల:
    మును ప్రహ్లాదుడు నంబరీష విదురుల్ మోదంబుతో విష్ణునిన్
    మనమున్నిల్పి భజించి పొందిరిఁగదా మాధుర్య వాత్సల్యమున్
    ఘనమౌ భక్త వశుండుమాధవుడు దిక్కాతండె భావింప !
    జీ
    “వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్”
    --కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  15. అనయ మ్మేవొ సమస్య లుప్పతిల నట్లత్యంతసంక్లిష్టజీ
    వనమందె ట్లగు క్షేత్రదర్శనము లో పత్నీ! సదా దైవచిం
    తనయుక్భక్తినిరంతరాయనిగమాంతప్రోక్తమౌనార్తహృ
    ద్వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  16. అనితర భక్తిని,బృందా
    వనమున సుఖమబ్బు శ్రీనివాసుని గొలువన్
    గనికరము జూపు నిరతము
    నెనయంగా దనదుభక్తులెల్లర బ్రీతిన్

    రిప్లయితొలగించండి
  17. కన రెన్నం డాపదలను
    గన రెవ్వరు దుఃఖములను ఘనముగ జీవిం
    చిన నిర్జన నర దుర్గమ
    వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్


    అనిశమ్ముం బరమాత్ము నిల్పి మదిలో నర్చించినన్ భక్తితో
    ననుమానింపఁగ నేల యేరికిని నాహా భావి జన్మంబు నే
    ని నివారింప నగుం బ్రమోదమునఁ బ్రాణిశ్రేణి కెల్లన్ జగ
    ద్వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్

    [వనము = సమూహము; జగద్వనము = ముల్లోకములు]

    రిప్లయితొలగించండి
  18. మనమున దల్చగ హరినే
    ఘనమగు రూపము కనగను కనులకు ధనమౌ
    జననము బాపెడి,బృందా
    వనమున సుఖమబ్బు శ్రీ,నివాసుని గొలువన్!!

    రిప్లయితొలగించండి
  19. ఘనమౌ నామము దల్చగా చెలగి నే కావ్యంబులన్ వ్రాయగా
    వినగా జేరగ వచ్చు శ్రీహరియె,యావేదాత్ముడే నిల్చు,జీ
    వనమౌ మానస మందునన్ నిలుప,నావైకుంఠ దేవేరితో
    ఘనమౌ దీనవశంకరుం డతడె,నాకామ్యంబులన్ దీర్చు,నా
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షు బూజించినన్!!

    రిప్లయితొలగించండి
  20. కందము:
    తనచింతన యనవరతము
    మనమున వరదుని స్మరణము మరిమరి తలవన్
    పనసతొనల తీపిగ జీ
    “వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి

  21. జనులాశించెడు భోగభాగ్యములనన్ సర్పంబదే కాంచగన్
    ధనమార్జింపగ నెంచుమానవులె బాధాతప్తులీ ధాత్రిలో
    ఘనమౌ మోక్ష పథంబు గోరు జనులీ కల్పంబులో నిత్యజీ
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్

    రిప్లయితొలగించండి
  22. వినుమా శేఖర! నాదుమాటలను నావేశంబులేకుండ,జీ
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షు పూజీంచినన్
    వినయంబొప్పగ రామకీర్తనము నేవేళంబు నైనన్ రతిన్
    మనముప్పొంగగ బాడుమా గళము దామారంగ గగ్గుత్తిగా

    రిప్లయితొలగించండి
  23. ఘనమౌ నామము దల్చగా చెలగి నే కావ్యంబులే వ్రాయగా
    వినగా జేరవచ్చు శ్రీహరియె యావేదాత్ముడే నిల్చు,జీ
    వనమౌ మానస మందునన్ నిలుప,నావైకుంఠ దేవేరితో
    ఘనమౌ నామము దల్చగా చెలగి నే కావ్యంబులే వ్రాయగా
    వినగా జేరవచ్చు శ్రీహరియె యావేదాత్ముడే నిల్చు,జీ
    వనమౌ మానస మందునన్ నిలుప,నావైకుంఠ దేవేరితో
    ఘనమౌ భక్త వశంకరుండనగ నా కామ్యంబులే దీర్చు,శ్రీ
    వనమందున్ సుఖ సంపదల్ దొరుకులే,పద్మాక్షు బూజించినన్ !!
    కొంచెం మార్చాను












    రిప్లయితొలగించండి
  24. అనునిత్యంబనురక్తితో విహిత ధర్మాచారసంపన్నులై
    ధనభోగాదుల లాలసన్ విడిచి సత్యాన్వేషణాసక్తులై
    మనమందన్యవిచారముల్ మరచి బ్రహ్మానందమాశించు జీ
    వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్

    రిప్లయితొలగించండి