6, నవంబర్ 2021, శనివారం

సమస్య - 3894

7-11-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాపివని తిట్టె సీతను పవనసుతుఁడు”
(లేదా...)
“పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై”

26 కామెంట్‌లు:

  1. హనుమకిచ్చెనుసీతమ్మహారమోకటి
    నీరసంబునునిదియంచునెంచివీడె
    రామనామమురుచిఁజూచిరామబంటు
    పాపివనితిట్టెసీతనుపవనసుతుఁడు

    రిప్లయితొలగించండి

  2. స్త్రీపరుడైన రావణుడు శీలవతిన్ జెరపట్టినందుకే
    యా పొలిదిండి గాంచగనె యాగ్రహ మందున నూగిపోవుచున్
    బాపివటంచు తిట్టెగద పావని, సీతను నిర్దయాత్ముడై
    పాపెను రామభద్రునకు పంక్తిముఖుండను బాధతోడనే.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    మంచి మాటలు జెప్పిన మౌన ముద్ర
    నున్న రావణ బ్రహ్మను న్యూన బఱచి
    ధైర్య మిచ్చి ప్రాణముల వదల వలదనె
    పాపివని తిట్టె ,సీతను పవనసుతుడు.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    (క్రమాలంకార పూరణ)

    రిప్లయితొలగించండి
  4. మారు వేషము ధరియించి మాయ జేసి
    యపహరించి తి లంకేశ యవని సుతను
    పాపి వని తిట్టె :పవన సుతుడు
    గాంచె సీత ను లంకలో కన్నులార

    రిప్లయితొలగించండి

  5. పరసతిని చెరబట్టిన పంక్తిముఖుని
    పాపివని తిట్టె, సీతను పవన సుతుడు
    శోక మూర్తిగ వనమందు చూచినంత
    కలత చెందె గాన పలికె కఠినముగను.

    రిప్లయితొలగించండి
  6. రావణాసురు మందిర ప్రాంగణమున
    హనుమవెదకుచు నిదురించు నతివఁగాంచి
    జనకసుతయని యెంచితామనమునందు
    పాపివని తిట్టె సీతను పవనసుతుఁడు

    రిప్లయితొలగించండి
  7. తాపముఁజెందుచున్హనుమతాల్మినివీడుచురావణాసురున్
    దాపునసుందరిన్గనినధర్మమురోసెనుసంశయాత్ముడై
    ఆఁపెనుసీతగాభ్రమసిహాయనిక్రుంగుచుదీనుడయ్యెగా
    పాపివటంచుఁదిట్టెగదపావనిసీతనునిర్దయాత్ముడై

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. రమణి సీతను వేధించ రక్క సొకతె
      పాపివని తిట్టె; సీతను పవనసుతుఁడు
      పిలువ, రాను రానని తెగబలికె కలికి,
      వత్తుననె, రావణుడు జావ నెత్తురొలికి.

      తొలగించండి
  9. రమణి జానకిని వెదుక లంక కేగి
    దశముఖుడు జేసిన పనికి తనివి దీర
    పాపివని తిట్టె ; సీతను పవనసుతుఁడు
    కౌతుకము బర్చె రాముడు కలియు ననుచు

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. రావణుడు అశోక వనములో రాత్రిపూట దీపాల వెలుగు లో సీతను కలుసు కొంటాడు. చెట్ల కొమ్మల మధ్యలో నుండి హనుమ గ్రహించి తన ఆలోచనను తెలిపే ఈ ప్రయత్నము:
      ఉ:

      దీపపు కాంతులందు కడు త్రెవ్వన, జానకి చెంత మోహమున్
      పాపపు నోట రావణుడు బాలము తీర్చుమటన్ననుగ్రతన్
      పాపి వటంచు దిట్టెనట పావని;;
      సీతను నిర్ధయాత్ముడై
      కోపము చేయుటిట్లు గన కోసల రాముడు శాస్తి చేయడే

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  11. వాయు పుత్రుడు రావణ బ్రహ్మనుగని
    పాపివని తిట్టె; సీతను పవనసుతుఁడు
    గాంచి రామ సందేశ మందించి మరలె
    దాశరథి దిక్కు లంకను తగుల బెట్టి

    రిప్లయితొలగించండి

  12. కోపవివేకశూన్యుడు ప్రకోపితమన్మథమోహబద్ధలం
    కాపరిపాలనాధిగతగర్వకృతాంధ్యుడు మూఢబుద్ధియై
    వేపథుదేహసంగతను విశ్రుతసాధ్విని రావణుం డహో!
    పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    పంక్తికంఠుని సతిఁగాంచి పావని యని
    భ్రమసి పిదపఁ దా లెంపలు వైచు కొనుచుఁ
    'దప్పు క్షమియింపఁ గోరెను', దనను తాను
    పాపివని తిట్టె, 'సీతను పవనసుతుఁడు'

    ఉత్పలమాల
    ఏపని కేగుచుంటినను యింగితమేమియు లేని రాముఁడున్
    రూపసి వైననిన్ను మృగలోచననున్ వనవాసిఁ జేసెనే!
    నీపద పీఠి సౌఖ్యముల నింపెడు రావణు దూరముంచెడున్
    బాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పూరణ:

      ఉత్పలమాల
      ఏపని కేగుచుంటినను యింగితమేమియు లేని రాముఁడున్
      రూపసి వైననిన్ను మృగలోచననున్ వనవాసిఁ జేసెనే!
      నీపద పీఠి సౌఖ్యముల నింపెడు రావణు నన్నుకాదనన్
      బాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై!

      (పావని = పవిత్రురాలు)

      తొలగించండి
  14. పాపపు దృష్టితో పరుల భార్యనుచూచిన పంక్తికంధరున్
    కోపముదందడింప కపికుంజరు డాత్మగతంబుగా మహా
    పాపి వటంచుఁ దిట్టెఁ గద, పావనిసీతను దుష్టబుద్ధితో
    నీపగిదిన్ చెఱంగొనిన నిక్కటులంగొని దెచ్చినట్టులే

    రిప్లయితొలగించండి
  15. చూపెద స్వర్గమున్ భువిని సుందరి! యెగ్గు మటంచుఁ బ్రేలగా
    భూపతి రావణాసురుడు భూసుత తోడ, తిరస్కరింపగా
    నాపతి భక్తితత్పర, సుమాస్త్రుని కీలల లోన నెట్టితే
    పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై

    రిప్లయితొలగించండి
  16. పాపము మోసపుచ్చి పర పత్నిని
    జేకొని వచ్చితీవు చీ
    యీపని చేయ నీకు మది యేవిధి
    యొప్పెనటంచు బత్నియే
    పాపివటంచు దిట్టెగద, పావని సీతను
    నిర్దయాత్ముడై
    కోపముతోడ రావణుడు కోమల
    గాత్రిని తెచ్చె లంకకున్

    రిప్లయితొలగించండి
  17. తనను గాంక్షించు రావణు గినిసి మిగుల
    పాపివనితిట్టె,సీతను పవనసుతుడు
    కోరెనిమ్మని యేదేని గుర్తు కొఱకు
    ననగ నంగుళీయకమును నతని కిచ్చె

    రిప్లయితొలగించండి
  18. వెదకి లంకలోఁ దనరారు వీధు లిండ్లు
    కాననమ్ములు కోనలు గాన రాక
    కలఁత సెంది తనను దాను గాంచ కున్న,
    పాపి వని తిట్టె, సీతను పవన సుతుఁడు


    పాపము జానకీ సతికిఁ బట్టెను దుర్గతి యివ్విధమ్ముగం
    గోపము నూని మిక్కుటము ఘోర దశాస్యుఁడు, పల్కు మారుతీ,
    నీ పురి లోన రామ సతినిం గన వచ్చితి నన్న రోసి ని
    న్పాపి వటంచుఁ దిట్టెఁ గద, పావని సీతను నిర్దయాత్ముఁడై

    [పావని = పవిత్రురాలు]

    రిప్లయితొలగించండి
  19. ఆపగరాని దుఃఖమున నారటి నొందుచు రావణున్ గసిన్
    పాపివటంచు దిట్టెగద పావని,సీతను నిర్దయాత్ముడై
    రేపులు మాపులున్ననక ఱేయియు ప్రొద్దుల మానకుండగా
    దాపును జేరుచున్మరుని దాహము దీర్చుమ యంచు గోరెడిన్

    రిప్లయితొలగించండి

  20. అవనిజను గాంచి లంకలోనాంజనేయు
    డాగ్రహముజెంది యా రావ ణాసురున్ని
    పాపివని తిట్టె, సీతను పవన సుతుడు
    గాంచియాయశోక వన రూక్షమ్ము క్రింద

    రిప్లయితొలగించండి
  21. శాపవశంబునందసుర జన్మమునొందిన రావణుండు వాం
    ఛాపరుడై హరించి యటు జానకినా వనమందునుంచగా
    పాపి వటంచుఁ దిట్టెఁ గద; పావని సీతను నిర్దయాత్ముఁడై
    తాపసి సీమకంపె గుణధాముడహా రఘురామునేమనున్

    రిప్లయితొలగించండి