2, నవంబర్ 2021, మంగళవారం

సమస్య - 3890

3-11-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె”
(లేదా...)
“మౌఖికమౌ పరీక్ష యెడ మౌనముఁ బూనుటె మేలు గెల్వఁగన్”
(కవితా ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

59 కామెంట్‌లు:

  1. లంకయందునరావణులాతిమాట
    తల్లిసీతమ్మపలుకకతాల్మినుండె
    మూగనోమునగరికనుముందరుంచె
    మౌఖికపరీక్షగెలిపించుమౌమమోకటె

    రిప్లయితొలగించండి
  2. సమస్య :

    మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె

    ( కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వంచనతో మహ్మదీయులు బంధించినపుడు ఆయన పోలికలు గల చాకలి పేరిగానితో యుగంధర జనార్దన మంత్రులు సభ నడిపిన వైనం )

    పేరిగానిని రాజుగా బేర్మి నిలిపి
    పలుకు లేకుండ తలనూపు పనిని జెప్పి
    సభను నడిపిరి మంత్రులు సక్రమముగ ;
    మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె .

    ( వేదం వేంకటరాయశాస్త్రి గారి "ప్రతాపరుద్రీయ"నాటకం ఆధారంగా )

    రిప్లయితొలగించండి
  3. వ్రాసిన పరీక్ష యందున ర్యాo కు బొంది
    తెలివి తేటలు జూపించు ధీయుతులను
    మౌఖిక పరీక్ష గెలిపించు : మౌన మొకటె
    కలహము లనుండి జనులను గాచు నండ్రు

    రిప్లయితొలగించండి
  4. మేఖలగాగదర్భనటమేనకకూతురుదాల్చియండగా
    శోకముఁదీర్పవచ్చెనటశంభుడుమాటలమూటవిప్పుచున్
    శాఖినిగాగదీక్షనటశాంభవిమౌనిగనోడలేదులే
    మౌఖికమౌపరీక్షయెడమౌనముఁబూనుటెమేలుగెల్వగన్

    రిప్లయితొలగించండి
  5. వాదు లాడెడి వేళల వైర మేల?
    పలుకు ములుకులు గ్రుచ్చగా పగయె పెరుగు
    వేయి మాటలేల ననుచు వెలగి నిలువ
    మౌఖిక పరీక్ష గెలిపించు మౌన మొకటె !!

    రిప్లయితొలగించండి

  6. కాపిశాయనమును గ్రోలి ఖలు డొకండు
    మత్తుతలకెక్కి తూలుచు మనుకునంటు
    తోడ వచియించె నీరీతి వాడడుగగ
    మౌఖిక పరీక్ష గెలిపించు మౌన మొకటె.

    రిప్లయితొలగించండి
  7. రేఖల గాంచగన్ దెలియ రిక్కల వైనము జాతకమ్మునన్
    శాఖలు వేరనన్ విడిచి సాధ్యము గాదని పెండ్లి కూతురిన్
    ఆఖరు మాట లేదనగ నందరు వీడగ వియ్యమందగన్
    మౌఖికమౌ పరీక్ష యెడ మౌనము బూనుట మేలు గెల్వగన్!!

    రిప్లయితొలగించండి

  8. రేఖయె యాగ్రహమ్మున పరేతరునిట్టుల తిట్టుచుండె వా
    డాఖరు యత్నమంచు సలహా నిను గోరగ వచ్చె గాదుటే
    నీ ఖలు బుద్ధి జూపితివి నీచుడ! చెప్పితి వేల యిట్టులన్
    మౌఖిక మౌపరీక్షయెడ మౌనము బూనుటె మేలు గెల్వగన్?

    రిప్లయితొలగించండి
  9. ఒక అమ్మాయి ఆవేదనగా నా ప్రయత్నము:
    ఉ:

    ఈ ఖరు డెంతకైన తెగియించును బెండ్లికి బెట్టు చేయగన్
    మేఖల మైన నేమి దన మేనుకు నొప్ప ధనత్రయోదశిన్
    తాఖతు మీర గొంటినని దండిగ వెంటబడంగ దల్చనౌ
    మౌఖిక మౌపరీక్ష యెడ మౌనము బూనుటె మేలు గెల్వగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. మాట తీరును జ్ఞానము మంచి నడత
    మౌఖికపరీక్ష గెలిపించు; మౌనమొకటె
    జాతి పితకూతమై స్వరాజ్య సమరమున,
    నిరసనదెలుపు మార్గమై నిలిచిపోయె.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    తెలివితేటల మొదటగా నిలచి మూగ
    నెగ్గ వ్రాత పరీక్షల, నేర్పుఁ దెలియ
    సలుపు ప్రశ్నల సైగతో చక్కఁబెట్ట
    మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె!

    ఉత్పలమాల
    శేఖరుడౌచు విద్యల విశేషమనంగ సమున్నతంబుగన్
    శాఖలనన్ బరీక్షల ప్రశాంతమనంబున నెగ్గ వ్రాతలన్
    లేఖకుఁ బ్రశ్నవేయుటలు ప్రీతి జవాబులు సైగలైనచో
    మౌఖికమౌ పరీక్ష యెడ మౌనముఁ బూనుటె మేలు గెల్వఁగన్!

    రిప్లయితొలగించండి
  13. తెలియని విషయమడిగిన దెల్లబోవ
    కుండ నేదోయెక జవాబు గూర్చి పలుక
    మౌఖికపరీక్ష గెలిపించు; మౌనమొకటె
    ముఖ్యమగు లిఖిత పరీక్ష బూర్తి జేయ

    రిప్లయితొలగించండి
  14. తనకు బదులు తెలియని భేతాళ ప్రశ్న
    తన పరీక్షకునకు రుచించని జవాబు
    తాను యిరుకున బడెడుసందర్భమైన
    మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను+ఇరుకున' అన్నపుడు యడాగమం రాదు. "తానె యిరుకున..." అనండి.

      తొలగించండి
    2. సూచించిన సవరణతో...

      తనకు బదులు తెలియని భేతాళ ప్రశ్న
      తన పరీక్షకునకు రుచించని జవాబు
      తానె యిరుకున బడెడుసందర్భమైన
      మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె

      తొలగించండి
  15. తే.గీ:నీకు నత్తి యున్న దనెడు నిజము నెరిగి
    సిగ్గు నటియించి బదు లేది చెప్పకుంట
    మేలు పెండ్లు చూపుల యందు,మిడిసి పడకు
    *“మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె”*

    రిప్లయితొలగించండి
  16. మనసులోమాట తెలుపక మానలేను
    తెలుప పరిణామమేమౌనొ తెలియదాయె
    కనులబాసల కబురులు బనుప నెమ్మి
    మౌఖికపరీక్ష గెలిపించు మౌనమొకటె

    రిప్లయితొలగించండి
  17. మాయదారికరోనయె మాటువేయ
    విశ్వవిధ్యాలయంబున వెల్గుతగ్గి
    విద్యగర్పగసమయము వీగిపోయె
    పశ్నపత్రాలుముద్రించి పంపలేక
    వ్రాతరాయనకలుగొట్టె వారికంత
    మౌఖికపరీక్షగెలిపించు మౌనమొకటె
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  18. ఉ:లేఖను పంపితిన్,ధనము లెస్సగ నిచ్చితి నీదు చేతిలో
    రేఖలు మారి నౌకరి వరించును ,నీవిక ప్రశ్న లందు వి
    ద్యాఖిల వేత్త నం చనకు
    మల్లుడ !నేర్వని ప్రశ్న వచ్చినన్
    మౌఖిక మౌ పరీక్ష యెడ మౌనము దాల్చుటె మేలు గెల్వగన్
    (నీ ఉద్యోగం కోసం రికమండేషను,లంచం ఇచ్చాను.ఇక ఇంటర్వ్యూలో నీకు తెలియని ప్రశ్న వస్తే తెలిసినట్టు తప్పు సమాధానం ఇవ్వక మౌనంగా ఉండు.)

    రిప్లయితొలగించండి
  19. ఏకతమునైన నింటను నింతితోడ
    వాగ్వివాదము సలిపెడు భావనమున
    యత్నమొనరించు భర్తకు ననుభవమ్మె
    మౌఖిక పరీక్ష గెలిపించు మౌనమొకటె

    దాఖల లేదుగా తనదు తప్పును నొప్పు స్వభావ మెన్నడున్
    మేఖల నూపుచున్ గదలి మేలగు వాక్పటిమన్ స్వవోఢదౌ
    వైఖరి మార్చగల్గు సతి వైభవమెంచుచు చిద్విలాసమౌ
    మౌఖికమౌ పరీక్షయెడ మౌనము బూనుట మేలు గెల్వగన్

    రిప్లయితొలగించండి
  20. చెల్లెలిని ప్రేమించిన అన్యకులపు మిత్రునికి అన్న సలహా

    రేఖను పెండ్లియాడగను ప్రేమను వ్యక్తము చేసినావు నీ
    లేఖలలోన చూడగను లేదు కులమ్మను గూర్చి, పైడిదౌ
    మేఖల నిచ్చి పొందితివి మిక్కిలి మక్కువ, వర్ణ మేదనన్
    మౌఖికమౌ పరీక్ష యెడ మౌనముఁ బూనుటె మేలు గెల్వఁగన్

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. వ్రాత యందున దక్కువ వచ్చు నెడల
    మౌఖిక పరీక్ష గెలిపించు,మౌనమొకటె
    మూలముగదార్య!జీవుల మోక్షమునకు
    మౌనము వలననేగద ముని మనుగడ

    రిప్లయితొలగించండి
  23. ఎన్ని చెప్పిన నీవు నీ కన్ని చెప్పు
    బుస్సు మన నీవు దా నప్డు కస్సు మనును
    దార చెంతను రాకా సుధాక రాభ
    మౌఖిక! పరీక్ష గెలిపించు మౌన మొకటె

    [మౌఖిక = ముఖమునకు సంబంధించినది ,రూపము కలవాఁడు]


    శాఖల భంగి విస్తరిల శాస్త్రము లెల్లను నేఁడు విస్తృతో
    లూఖల మందు దంచు విధి రుబ్బఁగ నిత్యము నిబ్బరమ్ముగన్
    లేఖన రేఖ లందునె పరీక్షలు వెట్టెద రన్నచో వినా
    మౌఖికమౌ పరీక్ష యెడ మౌనముఁ బూనుటె మేలు గెల్వఁగన్

    రిప్లయితొలగించండి
  24. రేఖను దాటిపోయితివి రీతిని వీడి
    యు నీవు చెల్లి నీ
    లేఖను జద్వినాను, మది లేకిస మంత
    భయంబు దెల్పు మే
    శాఖకు జెందినాడొ కద సత్యము దా
    చకు మంచు నీవనన్
    మౌఖికమౌ పరీక్ష యెడ మౌనమె పూ
    నుట మేలు గల్గెడిన్

    రిప్లయితొలగించండి
  25. మౌఖికమౌ జవాబులనుమోదము గల్గగ నీయగావలెన్
    మౌఖికమౌ పరీక్షయెడ,మౌనము బూనుటె మేలు గెల్వగన్
    శాఖల గూర్చియున్నడుగ సంయము తోడన మెల్గుచున్ నికన్
    శేఖర! కాలమున్గడుపు శిష్టుల మాటలు గారవించుచున్

    రిప్లయితొలగించండి
  26. తేటగీతి
    పెక్కు సంస్కరణలను ప్రవేశ పెట్టి
    దేశ ఆర్ధిక మార్పులు దెచ్చి నిల్చి
    మల్చిరి మనమోహను పీ వి మౌన మునులు
    మౌఖిక పరీక్ష గెలిపించు మౌన మొకటె.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేశ+ఆర్థిక' అని విసంధిగా వ్రాయరాదు కదా...

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారు.
      దేశ సంపద అని అంటాను.

      తొలగించండి
  27. ఆఖరి ప్రశ్నకైనను నియంత్రణ జూపుచు బల్క మేలగున్
    మౌఖికమౌ పరీక్ష యెడ; మౌనముఁ బూనుటె మేలు గెల్వఁగన్
    లేఖక వృత్తిలో సతము ప్రీతిని జూపెడి వారలెన్నడున్
    సౌఖికమౌను నిగ్రహమె శాంతిని గూర్చు జనాళికిన్ సదా

    రిప్లయితొలగించండి