28-11-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రోమము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్”(లేదా...)“రోమము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్”
నామముశివునిదికాగానీమముదప్పకపలుకుమునేరుపుతోడన్కామమువీడుచునుసుకవిరోమముసత్క్రుపనుఁగనుచుఁబ్రోవఁగనోప్పున్
కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ తో... కందంమా మధ్య నుండఁ గృష్ణా!కామితములు మిగులఁ గూడెఁ గష్టములందున్సేమమనఁగనిడుముల నిడరో, మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్ఉత్పలమాలప్రేమను జూపి మాపయిన వేదనలెన్నియొ కృష్ణ! బాపితే!సేమము గూడఁగా జయము సిక్కితె రాజ్యము నేల దక్కెనే!మామది నిత్యమున్ దమరి మన్ననలందఁగ జింత బెట్ట రారో! మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
సామముసాధుభావములసజ్జనసంఘముమెచ్చునట్లుగారామునిసద్గుణంబులనురాగములందునకూర్చిపాడుచున్పామరుమానసంబుననుపండితభావమునూసులాడరారో! మముసత్క్రుపన్గనుచుఁబ్రోవనిచోయశమెల్లపాడగున్
నీమము గల్గియు భక్తుడు నామ జపంబును నొనర్చు నగ ధరు శౌరిన్ సేమము కు వేడె విడువకు రో 'మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్
రామా కృష్ణా శ్రీకరసేమము గూర్చెదవనినిను సేవింతుమయాప్రేమముతో మామొరవినరో మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
వామార్ధజానివనుచునుభ్రామరి సతతమ్ము నిన్ను ప్రార్థింతు సదాక్షేమమ్మొసగెడు జననిరో! మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్.
క్షేమము గూర్చువాడవని శ్రీహరి నిత్యము నీదు నామమున్ నామనమందు దల్చెద జనార్దన సౌరి రథాంగ పాణి హేతామరకంటి వీవె వడి ధాత్రిని ధర్మము నిల్పనెంచి రారో! మము సత్కృపన్ గనుచు బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్.
ఉత్పలమాల:కాముని జంప కొంత కొడిగట్టెను నీ యశ మట్లుగాకయీతామస మేమి బాలకుని దండ్రిగ దల్చక త్రెంచవే తలన్ ?పామరులన్ గిరీశ! నిను భావము నందు న నిల్పినాము రా “రో మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్”--కటకం వేంకటరామశర్మ.
చామ తనువు పైన పెరిగెరోమము ; సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్నామెకొక లేపనమిడిగోముగ వాటి దొలగించు కొరకై పూయన్
కె.వి.యస్. లక్ష్మి: నీమము దప్పక గొల్చెద కామిత ఫలదాయిని యిల కాత్యాయినివై సేమమొసగు జననివి గద రో! మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్.
నీమము తప్పక నెన్నఁడునామజపముఁజేసి నిన్ను నామదిఁగొల్తున్బాములపెట్టకుము జననిరో! మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
రోమానందుడు వెలసెనురామా! దయ్యము దరుమగ,రయముగ నిడు యాస్వామిని నమ్మిన వారికిరోమము,సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్.
రాముడవై ప్రజాళులకు రక్షణనిచ్చితె ప్రేమతోడ, మాక్షేమము గూర్తు వీవనుచు కేశవ! నిన్ను మనమ్ము నమ్మి నీనామము నే జపించెదము నందక హస్త! కరమ్మునెమ్మి రారో, మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
ధీమత నర్కతేజమదిదేహపు సంపద నందజేయగన్క్షేమము గుండెగూడునను కేసరి హన్మకు నంతరాత్మనైరాముని నామమంత్రమది రక్షణ వానికి రోమరోమమైరోమము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామా రామా యనుచునునామమునే గోటిసార్లు నాలుక పయినన్నీమము తోడను బలుకుదురో,మముసత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్
స్వామివి నీవని నమ్మితిక్షేమము గూర్చగ పిలిచెద కేశవ!కృష్ణా!కామితము దీర్చగనురారో,మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్ !!
ఏమీ దౌర్భాగ్యం బీ భూమీశ్వరుల వెదకంగఁ బుణ్యాత్ము లహో యీ మహినిం గలరో లేరో మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్సేమము లెల్ల నారసి విశేషముగాఁ జదివించి పెంచి మీ ధామము లందు మీ జనుల దాయల నందఱి నిల్పి నిత్యముం బ్రేమ సెలంగ బంధువులు పెద్దలు మీరొ దయార్ద్రు లైన వారో మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశ మెల్లఁ బాడగున్
నీ మహిమన్నుతించుచును నిత్యమువేడెడు మమ్ము రాఘవా!సామజ రక్షకా! సుగుణ సాగర మమ్ముల సాకి సర్వదానామము నిల్పుకొమ్ము రఘు నాయక!బ్రోవగ నేల మీరు రారో !మము సత్కృపంగనుచు బ్రోవనిచోయశమెల్ల బాడగున్
రైతు ఆవేదనగా నా ప్రయత్నముఉ: క్షామము పెచ్చు మీర వ్యవసాయము జేయుట దుర్భరంబగున్లేమిని గల్గ జేసి పెడ రెక్కలు గట్టును జీవితమ్మునున్భూమిని పంట కాల్వలను ముందుగ సిద్ధము గూర్చ డబ్బు లౌరో , మమ సత్కృపన్ గనుచు బ్రోవనిచోయశ మెల్ల బాడగున్వై. చంద్రశేఖర్
స్వామివి నీవటంచు,మది సాధన జేయగనీదు నామమున్మామవ మాధవ యనగ మానసమందును నీదురూపమేనీమము దప్పకన్ పిలిచి నిన్నిటు గొల్వగ జాలిజూపగన్తామస మేలరా గదర ధన్యత నొందెడి మంత్రమీయ రారో,మము సత్కృపం గనుచు బ్రోవనిచో యశమెల్ల బాడగున్!!
రాముని పేరునన్ వెలసి రంజిలు మోమున మామనంబులన్ నామనిలో వలెన్ నునిచి హాయిని నింపగ జేయుకావునన్ నీమము తోడ నేభజన నీకుగ జేయగ బూనుచుంటి గారో,మము సత్కృపన్ గనుచు బ్రోవనిచో యశమెల్ల పాడగున్
నీమముతప్పకెన్నడును నీపదసన్నిధి మోకరిల్లి నీనామజపంబొనర్చుచును నామదిగొల్చెదనెల్ల వేళలన్బాములపెట్టబోకుమిక బాయక నీశ్వరనన్నుఁ గావ రారో! మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
హాలికుల-ఆవేదనహా!ముంచెత్తిన వానలలో మునిగిన పంట లన్ని రొంపిగ మారెన్ స్వాములు భూములు కనరారో,మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్ .ఈ మహి నన్నదాత యని యెంతయొ కీర్తిని గాంచి దేశ సంక్షేమము గోరు చుందుమయ క్షేత్రములన్నియు మున్గె వానలందేమియు దిక్కు తోచదు శ్రమే మిగిలెన్ ప్రభువుల్ కనంగ రారో,మము సత్కృపంగనుచు బ్రోవనిచో యశమెల్ల పాడగున్ .
తామసబుద్ధినిబాపుచుతామరసాక్షునికరుణను తప్పక మాపైనేమరకుండగచేయుమురో,మము సత్కృపనుగనుచు బ్రోవగ నొప్పున్
నామముశివునిదికాగా
రిప్లయితొలగించండినీమముదప్పకపలుకుమునేరుపుతోడన్
కామమువీడుచునుసుకవి
రోమముసత్క్రుపనుఁగనుచుఁబ్రోవఁగనోప్పున్
కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ తో...
రిప్లయితొలగించండికందం
మా మధ్య నుండఁ గృష్ణా!
కామితములు మిగులఁ గూడెఁ గష్టములందున్
సేమమనఁగనిడుముల నిడ
రో, మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
ఉత్పలమాల
ప్రేమను జూపి మాపయిన వేదనలెన్నియొ కృష్ణ! బాపితే!
సేమము గూడఁగా జయము సిక్కితె రాజ్యము నేల దక్కెనే!
మామది నిత్యమున్ దమరి మన్ననలందఁగ జింత బెట్ట రా
రో! మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
సామముసాధుభావములసజ్జనసంఘముమెచ్చునట్లుగా
రిప్లయితొలగించండిరామునిసద్గుణంబులనురాగములందునకూర్చిపాడుచున్
పామరుమానసంబుననుపండితభావమునూసులాడరా
రో! మముసత్క్రుపన్గనుచుఁబ్రోవనిచోయశమెల్లపాడగున్
నీమము గల్గియు భక్తుడు
రిప్లయితొలగించండినామ జపంబును నొనర్చు నగ ధరు శౌరిన్
సేమము కు వేడె విడువకు
రో 'మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్
రామా కృష్ణా శ్రీకర
రిప్లయితొలగించండిసేమము గూర్చెదవనినిను సేవింతుమయా
ప్రేమముతో మామొరవిన
రో మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
రిప్లయితొలగించండివామార్ధజానివనుచును
భ్రామరి సతతమ్ము నిన్ను ప్రార్థింతు సదా
క్షేమమ్మొసగెడు జనని
రో! మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్.
రిప్లయితొలగించండిక్షేమము గూర్చువాడవని శ్రీహరి నిత్యము నీదు నామమున్
నామనమందు దల్చెద జనార్దన సౌరి రథాంగ పాణి హే
తామరకంటి వీవె వడి ధాత్రిని ధర్మము నిల్పనెంచి రా
రో! మము సత్కృపన్ గనుచు బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్.
ఉత్పలమాల:
రిప్లయితొలగించండికాముని జంప కొంత కొడిగట్టెను నీ యశ మట్లుగాకయీ
తామస మేమి బాలకుని దండ్రిగ దల్చక త్రెంచవే తలన్ ?
పామరులన్ గిరీశ! నిను భావము నందు న నిల్పినాము రా
“రో మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్”
--కటకం వేంకటరామశర్మ.
చామ తనువు పైన పెరిగె
రిప్లయితొలగించండిరోమము ; సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
నామెకొక లేపనమిడి
గోముగ వాటి దొలగించు కొరకై పూయన్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండినీమము దప్పక గొల్చెద
కామిత ఫలదాయిని యిల కాత్యాయినివై
సేమమొసగు జననివి గద
రో! మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్.
నీమము తప్పక నెన్నఁడు
రిప్లయితొలగించండినామజపముఁజేసి నిన్ను నామదిఁగొల్తున్
బాములపెట్టకుము జనని
రో! మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
రోమానందుడు వెలసెను
రిప్లయితొలగించండిరామా! దయ్యము దరుమగ,రయముగ నిడు యా
స్వామిని నమ్మిన వారికి
రోమము,సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్.
రాముడవై ప్రజాళులకు రక్షణనిచ్చితె ప్రేమతోడ, మా
రిప్లయితొలగించండిక్షేమము గూర్తు వీవనుచు కేశవ! నిన్ను మనమ్ము నమ్మి నీ
నామము నే జపించెదము నందక హస్త! కరమ్మునెమ్మి రా
రో, మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
ధీమత నర్కతేజమదిదేహపు సంపద నందజేయగన్
రిప్లయితొలగించండిక్షేమము గుండెగూడునను కేసరి హన్మకు నంతరాత్మనై
రాముని నామమంత్రమది రక్షణ వానికి రోమరోమమై
రోమము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామా రామా యనుచును
రిప్లయితొలగించండినామమునే గోటిసార్లు నాలుక పయినన్
నీమము తోడను బలుకుదు
రో,మముసత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్
స్వామివి నీవని నమ్మితి
రిప్లయితొలగించండిక్షేమము గూర్చగ పిలిచెద కేశవ!కృష్ణా!
కామితము దీర్చగనురా
రో,మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్ !!
ఏమీ దౌర్భాగ్యం బీ
రిప్లయితొలగించండిభూమీశ్వరుల వెదకంగఁ బుణ్యాత్ము లహో
యీ మహినిం గలరో లే
రో మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్
సేమము లెల్ల నారసి విశేషముగాఁ జదివించి పెంచి మీ
ధామము లందు మీ జనుల దాయల నందఱి నిల్పి నిత్యముం
బ్రేమ సెలంగ బంధువులు పెద్దలు మీరొ దయార్ద్రు లైన వా
రో మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశ మెల్లఁ బాడగున్
నీ మహిమన్నుతించుచును నిత్యము
రిప్లయితొలగించండివేడెడు మమ్ము రాఘవా!
సామజ రక్షకా! సుగుణ సాగర మమ్ము
ల సాకి సర్వదా
నామము నిల్పుకొమ్ము రఘు నాయక!
బ్రోవగ నేల మీరు రా
రో !మము సత్కృపంగనుచు బ్రోవనిచో
యశమెల్ల బాడగున్
రైతు ఆవేదనగా నా ప్రయత్నము
రిప్లయితొలగించండిఉ:
క్షామము పెచ్చు మీర వ్యవసాయము జేయుట దుర్భరంబగున్
లేమిని గల్గ జేసి పెడ రెక్కలు గట్టును జీవితమ్మునున్
భూమిని పంట కాల్వలను ముందుగ సిద్ధము గూర్చ డబ్బు లౌ
రో , మమ సత్కృపన్ గనుచు బ్రోవనిచోయశ మెల్ల బాడగున్
వై. చంద్రశేఖర్
స్వామివి నీవటంచు,మది సాధన జేయగనీదు నామమున్
రిప్లయితొలగించండిమామవ మాధవ యనగ మానసమందును నీదురూపమే
నీమము దప్పకన్ పిలిచి నిన్నిటు గొల్వగ జాలిజూపగన్
తామస మేలరా గదర ధన్యత నొందెడి మంత్రమీయ రా
రో,మము సత్కృపం గనుచు బ్రోవనిచో యశమెల్ల బాడగున్!!
రాముని పేరునన్ వెలసి రంజిలు మోమున మామనంబులన్
రిప్లయితొలగించండినామనిలో వలెన్ నునిచి హాయిని నింపగ జేయుకావునన్
నీమము తోడ నేభజన నీకుగ జేయగ బూనుచుంటి గా
రో,మము సత్కృపన్ గనుచు బ్రోవనిచో యశమెల్ల పాడగున్
నీమముతప్పకెన్నడును నీపదసన్నిధి మోకరిల్లి నీ
రిప్లయితొలగించండినామజపంబొనర్చుచును నామదిగొల్చెదనెల్ల వేళలన్
బాములపెట్టబోకుమిక బాయక నీశ్వరనన్నుఁ గావ రా
రో! మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్
హాలికుల-ఆవేదన
రిప్లయితొలగించండిహా!ముంచెత్తిన వానల
లో మునిగిన పంట లన్ని రొంపిగ మారెన్
స్వాములు భూములు కనరా
రో,మము సత్కృపను గనుచు బ్రోవగ నొప్పున్ .
ఈ మహి నన్నదాత యని యెంతయొ కీర్తిని గాంచి దేశ సం
క్షేమము గోరు చుందుమయ క్షేత్రములన్నియు మున్గె వానలం
దేమియు దిక్కు తోచదు శ్రమే మిగిలెన్ ప్రభువుల్ కనంగ రా
రో,మము సత్కృపంగనుచు బ్రోవనిచో యశమెల్ల పాడగున్ .
తామసబుద్ధినిబాపుచు
రిప్లయితొలగించండితామరసాక్షునికరుణను తప్పక మాపై
నేమరకుండగచేయుము
రో,మము సత్కృపనుగనుచు బ్రోవగ నొప్పున్