14, నవంబర్ 2021, ఆదివారం

సమస్య - 3902

15-11-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము”
(లేదా...)
“పరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్”
(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

  1. రాత్రిమెలకువగలిగినరాఁడుదోంగ
    నిద్రమత్తునువదలునునిక్కువంబు
    జాగరణమునశివరాత్రిజాతరందు
    పరుపునన్నల్లికుట్టినపరమసుఖము

    రిప్లయితొలగించండి

  2. ఎత్తి పొడుపు మాటలతోడ నెపుడు సతిని
    కించపరచుచు దూరెడు గృహిణి గలుగు
    పురుషుడు తలచెనట దార పొందు కన్న
    పరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము.

    రిప్లయితొలగించండి
  3. ఎవరి కైనను నిద్దుర దెట్లు వచ్చుఁ
    పరుపునన్ నల్లి కుట్టిన : పరమ సుఖము
    కలత లెరుగని కమ్మని కలల తోడ
    నిదుర వోవుట మేలండ్రు నిపుణ మతులు

    రిప్లయితొలగించండి

  4. పరుషపు మాటలాడి తన భర్తను నిత్యము తూలనాడుచున్
    నరకము చూపు భార్యగల నాథుడు మానసమందు తల్చెనే
    సరసమెఱుంగనట్టి సతి సన్నిహితమ్మున కన్న నిట్లు నీ
    పరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లికుట్టగన్.

    రిప్లయితొలగించండి
  5. నిదుర రాదయ్యె కంటికి నిముసమైన
    పరుపునన్ నల్లి కుట్టిన;పరమ సుఖము
    కటిక నేలను పవళించు కష్టటజీవి,
    పేద, పొందును నిదురించు నాదమరచి

    రిప్లయితొలగించండి
  6. ఉత్పలమాల:
    మరదలి పేరులో "నళిని" మారెను "నల్లి"గ ముద్దు ముద్దు గా
    సరసముతోడ నాతనిని చానయు మన్నన సేయు ప్రేమతో
    విరహమునోపలేనిపతి వేగిర మే గదిలోకి రమ్మనన్
    “పరుపున వాలినంత సుఖభావన గల్గెను "నల్లి" కుట్టగన్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి

  7. తరుణిని పెండ్లియాడుకొని దారు విహార నిమిత్త మేగగన్
    బరవశ చిత్తులై మిగుల పంచశరమ్ముల ధాటి కేళినన్
    పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్
    త్వరితమె నిద్ర మేల్కొని యవారిత రీతిని సంగమించరే!

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    గింజఁ దీసిన మృదువైన ముంజ ప్రత్తి
    నేకి యరడుగు చదునుగ నెత్తు వేసి
    పూల బొమ్మ ల గుడ్డలో పొదివి దానిఁ
    పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  9. చం:

    తిరుగని చోటు లేదు పలు తిప్పలు సైచి ప్రచండ తాపమున్
    దొరుకదె కూలి జేతునన దూరితి నేలిక కార్య స్థానముల్
    పరువును దీయురీతి పెను భారమటంచు తిరస్కరింపనై
    పరుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లికుట్టగన్

    ఏలిక కార్య స్థానములు: అనేక ఆఫీసులు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. నిదురపట్టదెవరికైన నిశనెరవుగ
    పరుపునన్ నల్లి కుట్టిన ; పరమసుఖము
    గూరుచుండు పడక మార్చి కునుకు దీయ
    శయ్య శుచిగనుండ గలుగు శయన సుఖము

    రిప్లయితొలగించండి
  11. జరుపగ తరమా రేతిరి జాగరణమె
    పరుపునన్ నల్లి కుట్టిన; పరమసుఖము
    క్రొత్త కుర్లాను పరుపును గొనిన,దాని
    లోన దొర్లిన నిదురకు లోటు లేదు

    రిప్లయితొలగించండి
  12. కొత్తగా పెండ్లయినజంట కొసరి వలపు
    కౌగిలింతల బిగువన్నఖక్షతమ్ము
    లోని సుఖమునాస్వాదించ బూనుకొనగ
    పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము

    రిప్లయితొలగించండి
  13. పెరటిగులాబిచెట్లకును
    పెక్కగువర్ణపుపూలుపూయగన్
    పరిసరప్రాంతమంత పరి
    పక్వసువాసనవిస్తరించగా
    సరగుణపూలుతెంపగను
    చట్కునగ్రుచ్చెనుముండ్లు గట్లనే
    పరుపున వాలినంత సుఖ
    భావన గల్గెను నల్లి కుట్టగన్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  14. గురుతరబాధ్యతన్ మునిగి కోర్కెలు కొల్లలు మిన్నుముట్టగన్
    విరతియె లేని కష్టమున విత్తసమార్జన జేసి డస్సి తా
    పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్
    సరవిని శాతశూలశరజాలము మై వడి గ్రుచ్చ గాసిలెన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. తేటగీతి
    పిల్లలు నిదురలో నుండు వేళ కనుక
    నర్ధరాత్రిఁ గూడెదమంచు నతివపలుక
    గురకఁ బెట్టు మగని మేలుకొలుపనెంచి
    పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము!

    చంపకమాల
    మరునకుఁ జిక్కి వేడుకొన మానిని మన్నన నర్ధరాత్రికిన్
    బరువము విందుజేతునని పాపల నిద్దురఁ బుచ్చుమాయనన్!
    జిఱుతల జోలలన్ గురకఁ జిక్కిన భర్తకు మేలుకొల్పనన్
    బరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్!

    చిఱుతలు= చిన్నలు, పాపలు

    రిప్లయితొలగించండి
  16. గండు దోమల యారడి మెండుకాగ
    నిదుర పట్టదు నడిరేయి నిముసమైన
    మశకములుపెట్టు బాధతో మనుటకన్న
    పరుపునన్ నల్లి కుట్టిన పరమసుఖము

    రిప్లయితొలగించండి
  17. పరుగులు తీసితీసి పని పాటులు
    జేయుచు పొట్టకోసమై
    నిరతము రోజు మొత్తమును నిశ్చయ
    మొప్ప భుజించి రాత్రియున్
    పరుపున వాలినంత సుఖ భావన
    కల్గెను , నల్లి కుట్పినన్
    సరుగున లేచి నల్లులను జంపగ
    జాగరణంబు జేసితిన్

    రిప్లయితొలగించండి
  18. నిరతము గిల్లుచుండు సతి నిందలు వేయుచు, పుట్టినింకిన్
    సరగున చేరె, నేకతము సాగుచు నుంటి ప్రశాంతి తోడుతన్
    పరుగిడు చుండె కాలము నివాసమునందున, మత్తునిద్రలో
    పరుపున వాలినంత సుఖభావన గల్గెను నల్లి కుట్టగన్

    రిప్లయితొలగించండి
  19. నిదుర రాదేరికినినిక నిజము గాను
    పరుపునన్ నల్లి కుట్టిన,పరమ సుఖము
    పండు కొనగనె నిద్దుర వచ్చు నెడల
    మేటి భోగము లుండిన సాటిరావు

    రిప్లయితొలగించండి
  20. చీమ కుట్టంగఁ జర్మమ్ము జివ్వు మనును
    దోమ కుట్టంగ రోగము తోడ బాధ
    కంత ముండదు పరికింప నంత కన్నఁ
    బఱుపునన్ నల్లి కుట్టినఁ బరమ సుఖము


    తఱ చగు కార్య భారమును దద్ద వహించి భుజద్వయమ్మునం
    వెఱవక చక్కఁ జేయఁగను బ్రీతిని నేరక కుట్టి నట్టులే
    యఱిముఱి నిద్ర వోవఁగను సాంతము వెచ్చటి నెత్తు రింపుగాఁ,
    బఱుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లి, కుట్టఁగన్

    [నల్లికి +ఉట్టఁగన్ = నల్లి కుట్టఁగన్; ఉట్టు =కాఱు ]

    రిప్లయితొలగించండి
  21. చురచురలాడునెండ కడుశోషిలజేయగ దాళలేకనే
    పరుపున వాలినంత సుఖభావన గల్గెను,నల్లి కుట్టగన్
    నరకము జూచితిన్ మిగుల ,నక్కాన నల్లుల జంప యత్నమున్
    త్వరితమె జేయగానగును దాలిమి కష్టముగాన లక్ష్మణా!

    రిప్లయితొలగించండి
  22. పరుపున వాలినంత సుఖభావన గల్గెను, నల్లి కుట్టగన్
    చురచురలాడి పుట్టినది చుయ్యని చీదఱ దేహమందునన్
    నరకము చూపు మంచమున నల్లులు కొల్లలు నల్ల ద్రావుచున్
    దురితపు పోకడల్ బెనఁగి దోమలు తూటులుపుచ్చు కాయమున్
    (నల్ల=నెత్తురు)

    రిప్లయితొలగించండి
  23. నల్లి కుట్టిన సాకుతో నతివ బిలిచి
    కుట్టి నట్టిచోటును జూపి కోరి జూప
    పరవశమ్మది పెరుగగా పైట దొలగ
    పరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము!!

    రిప్లయితొలగించండి
  24. నల్లి కుట్టిన సాకుతో నతివ బిలిచి
    కుట్టినట్టి తావును జూపి గోకు మనగ
    పరవశమ్మది పెరుగగా పైట జార్చ
    పరుపునన్ నల్లి కుట్టిన పరమ సుఖము !!

    రిప్లయితొలగించండి
  25. మక్కువకూర్చెడి ప్రాంతము
    చిక్కడపల్లి,సుజనులకుజింతంకూర్చెన్
    మిక్కుటమగువర్షముతో
    నక్కడికార్యక్రమమదియాగినయంతన్.

    రిప్లయితొలగించండి
  26. తిరిగెననేక తీర్థములు దేవళముల్ గని జేరెనింటికిన్
    పరుపున వాలినంత సుఖభావన గల్గెను; నల్లి కుట్టగన్
    చురుకున మంట బుట్టెనిక సూదిని గుచ్చిన బాధ తాళకన్
    సరగున పారెనాతడటు శయ్యను వీడి పరుండె నేలపై

    రిప్లయితొలగించండి