4, నవంబర్ 2021, గురువారం

సమస్య - 3892

5-11-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్”
(లేదా...)
“శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్”

32 కామెంట్‌లు:

  1. నానావిధములభోగము
    తానీజగతినిసుఖపడదర్పముతోడన్
    మానగకాయపుకష్టము
    శ్రీనాథాచెఱచినావుసీసపునడకన్

    రిప్లయితొలగించండి
  2. ఏనాడో కవి శ్రేష్టుల
    శ్రీనాథా! చెఱచినావు; సీసపు నడకన్
    పోనా డుచువారి యహము
    మానిత కావ్యములువ్రాసి; మహి ధన్యాత్మా!

    రిప్లయితొలగించండి

  3. ప్రౌణడు డిండిమభట్టును
    శ్రీనాథా! చెడిపినావు, సీసపు నడకన్
    జ్ఞానులు భేషను రీతిని
    భానువునేగూర్చినట్టి ప్రాజ్ఞుడవీవే.

    రిప్లయితొలగించండి
  4. వేనోళ్ళను గొని యాడ రె
    శ్రీనాథుని సీసములను చెలువము లనుచున్
    గానీ మత్తున నొకడనె
    ""శ్రీనాథా చెఱచి నావు సీసపు నడకన్ "

    రిప్లయితొలగించండి
  5. కూనారిల్లుచునున్నకావ్యజగతిన్కోలాటనాట్యంబుతో
    సానంబెట్టిననాగరీకపదముల్సాధింపపద్యంబులో
    మీనాక్షీపదనర్తనల్గనగనామీసంపుభీమేశుడే
    శ్రీనాథాచెడగోట్టినావుగదమాసీసంపుసౌందర్యమున్

    రిప్లయితొలగించండి
  6. కందం
    శ్రీనాథుని రూపంబున
    జ్ఞానిననుచు గర్వపడితె! నలుగురు వినఁగన్
    గానమునకెంచి యభినవ
    శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్!

    శార్దూలవిక్రీడితము
    శ్రీనాథున్ గవిసార్వభౌముననుచున్ చిందించి యాహార్యమున్
    జ్ఞానంబందున సాటిరారెవరనన్ సారించి నీ పోకడన్
    గానంబందున ముంచితేల్చుమన నాకారానికే తూగెడున్
    శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్!

    రిప్లయితొలగించండి

  7. తానే గొప్ప కవీశ్వరుండననుచున్ ధాత్రిన్ తనన్ మించెడిన్
    లేనేలేడెవడంచు చెప్పుకొను గర్విష్టుం డెయౌ డిండిమన్
    శ్రీనాథా! చెడగొట్టినావుగద, మాసీసంపు సౌందర్యమున్
    జ్ఞానుల్ మెచ్చెడు భంగి పెంచితివి ప్రాజ్ఞాపాటవమ్మొప్పగన్.

    రిప్లయితొలగించండి
  8. ఓ నాప్రియనాథ! మరో
    శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్
    ఈనీ పద్యాలు వదలి
    రానాతో సరసమాడ రమణీయంబౌ

    రిప్లయితొలగించండి

  9. నానీ రాయ వలదిటుల
    శ్రీనాధా మగణము సరి సేయవలె సుమీ
    శ్రీనాధ యనుము, యనుచును
    శ్రీనాధా, చెఱచినావు సీసపు నడకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనుము+అనుచును' అన్నపుడు యడాగమం రాదు. *...యనుమటంచును* అనండి.

      తొలగించండి
  10. మిత్రుడు శ్రీనాధుని తో....

    పానము జేయుచు కైతల
    మానుమను హితవు పలుకుల మరుగున పెట్టన్
    నానాటికి పొల్లులెదిగె
    శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్

    రిప్లయితొలగించండి
  11. నానా రుచిరపు సీసము
    శ్రీనాథుడు వ్రాయఁజెల్లు చిత్రగతులలో
    హీనముగానో యభినవ
    శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నాథుడు సామాన్య విద్యార్థి

    శా:

    నానారీతులు నచ్చజెప్పితినిగానాకింక లేదోపికే
    మానా లెన్నియొ దెల్పుచున్ పటుగతిన్ మర్యాద చ్ఛందంబునున్
    శాణీ బెట్టుమటన్నపల్కు వినకై సాగింప నీ కావ్యముల్
    శ్రీ నాథా చెడ గొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. నానారీతుల సీసపద్యములతోనందంబు గల్గించునో
    శ్రీనాథా! కవిసార్వభౌమ! ప్రణతుల్ హృద్యంబు నీ పద్యముల్
    నానా కశ్మలమున్ కవిత్వమని యానందించు నీనాటియో
    శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్

    రిప్లయితొలగించండి
  14. తేనెల్ జిందెడి సీస పద్యములహా తీయందనంబొల్కగా
    వేనోళ్ళన్ గొనియాడనెల్లరు రసావిష్కారమున్ జేసెనా
    శ్రీనాథుండలనాడు, నీకతని పేరే గాని సౌరేదయా
    శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్

    రిప్లయితొలగించండి
  15. నీ నే ర్పేమయ్యె నహో
    కానిమ్మికఁ జేయ నేమి కల దిచ్చట నీ
    వీ నాఁ డీ మల్లు నెదుట
    శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్

    [సీసము = మల్ల యుద్ధములో నొక పట్టు]


    దీ నాలాపము లేల పల్కెదవు నిం దిట్టంగ నీ సత్కవుల్
    చానల్ మెత్తురె నీదు పద్యముల లజ్జాహీన! ధీవర్యులుం
    గానంగం గవి సార్వభౌముని వ రాఖ్యన్ వెల్గి నీ వివ్విధిన్
    శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్

    రిప్లయితొలగించండి
  16. నేనే ప్రసిద్ధ కవినని
    నీనోటనె జెప్పబలుక నేరము గాదే
    శ్రీనాధా!యోయభినవ
    శ్రీనాధా!చెఱచినావు సీసపు నడకన్

    రిప్లయితొలగించండి
  17. తానే గొప్పకవీండ్రు డంచును మహా దర్పంబు తోమెల్గుచున్
    శ్రీనాధుండను బేర నొప్పుచునుదా సీసంబు మార్చంగ నో
    శ్రీనాధా! చెడగొట్టినావు గద మాసీసంపు సౌందర్యమున్
    హా నాయంబిదెనీకు చెప్పుమ వినన్ నాశ్చర్యమున్ గొల్పెసూ

    రిప్లయితొలగించండి
  18. కం:శ్రీనాథున్ డను కవివరు
    దౌ నామము దాల్చి యుంటి వయ్యా! పద్య
    మ్మేనా యిది! ఆధునిక
    “శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్”*

    రిప్లయితొలగించండి
  19. శా:శ్రీనాథుం డల సీసపద్యమునకున్ చేకూర్చె సౌందర్యమం
    చేనాడో యొక కీర్తి రాగ ,నదియే యీనాటికిన్ జెల్లగా
    నీ నాడీ కవి విశ్వనాథ యనెగా యీరీతి ధైర్యమ్ముగా
    *శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్*
    (సీసపద్యానికి శ్రీనాథుడు సౌందర్యం తెచ్చా డనేది అనేకుల అభిప్రాయం.కానీ సీస సౌందర్యాన్ని శ్రీనాథుడే పాడు చేశా డనేది విశ్వనాథ సత్యనారాయణ గారి అభిప్రాయం.ఇది నేను పూరణ కోసం చేసిన కల్పన కాదు.విశ్వనాథ వారు కొన్ని సందర్భాలలో లిఖితంగానే ఈ అభిప్రాయం వెలిబుచ్చారు.ఇది సాహితీలోకం లో సుప్రసిద్ధమే.)

    రిప్లయితొలగించండి
  20. తానే మిక్కిలి సంస్కృతాంధ్రమునం
    దత్యంత విద్వాంసుడన్
    దానే మిక్కిలి జ్ఞానవంతునని దా
    దర్పించు సుజ్ఞానినిన్
    శ్రీనాథా! చెడగొట్టినావు కద, మా సీసం
    పు సౌందర్యముల్
    నానా రీతుల బెంచినావు కవి నీ
    నామంబు దీపింపగన్

    రిప్లయితొలగించండి