18, నవంబర్ 2021, గురువారం

సమస్య - 3906

 19-11-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివునిఁ దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు”
(లేదా...)
“శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్”

49 కామెంట్‌లు:

  1. చంద్రశేఖరుసరసనచంద్రమౌళి
    బాలుడయ్యెనుపరమమౌభావమందు
    తీక్ష్ణద్రుష్టినివిశ్వంబుదిరుగునపుడు
    శివునిఁదోడ్కోనిచనెఁజంద్రజంద్రశేఖరుండు

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖరులు-కంచిపరమాచార్యులు

    రిప్లయితొలగించండి
  3. పూజులను చేయు చుండిరి పుడమి లోన

    రమ్మనుచు పిల్చి శ్రీహరి రమ్య గతిని

    శివుని తోడ్కొని చనె,చంద్ర‌ శేఖరుండు

    విష్ణువును కూడి పుడమికి వెడలె నపుడు

    రిప్లయితొలగించండి

  4. పుత్రుడగు చంద్రశేఖరున్ బుణ్య తీర్థ
    మైన వారణాశిని జూప మంచడగగ
    తండ్రి కోర్కెను దీర్చగా తనయు డపుడు
    శివునిఁ దోడ్కొని చనెఁ జంద్ర శేఖరుండు.

    రిప్లయితొలగించండి
  5. శివుడు కేశవుఁడునుచంద్ర శేఖరుండు
    బాల్యమిత్రులు వారలు ప్రాణ సఖులు
    ఖాయిలాపడ్డ కేశవుఁ గాంచనెంచి
    శివునిఁ దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు

    రిప్లయితొలగించండి
  6. పట్టు బట్టియు పార్వతి పతిగ బడయ
    గట్టి తపమును జేయంగ కనికరించె
    శివుడు : దోడ్కొని జనె చంద్ర శేఖరుండు
    సతిగ జేకొని నామెను సంత సమున

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. తేటగీతి
      మిత్రపక్షమ్ములన వారు మేలటంచు
      కలిసి యేలెడు వారిని నిలువరించి
      గద్దనెక్కెడు వ్యూహాన కలువనెంచి
      శివునిఁ దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు

      మత్తేభవిక్రీడితము
      శ్రవణమ్మౌ వ్యతిరేకతల్ ప్రజలలో సాగన్ బ్రభుత్వమ్ముపై
      నవియే మద్దతుఁ గూడఁగట్టునని వారాశించి కూటమ్ముగన్
      మువురున్ మేలన మిత్రపక్షములుగన్ పోరాడు వ్యూహమ్ముతో
      శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ప్రక్కనింటను దిగెనొక జక్కనైన
    చిన్న సంసారమందున శివుని తల్లి
    పొరుగు బాబు వెంట బడికి నరుగు మనగ
    శివునిఁ దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు.

    రిప్లయితొలగించండి

  9. భవనాశమ్మని యందురే జనులు విన్వాకమ్ములో మున్గి బా
    లవిధూత్తంసుని గాంచినంత చరితార్థంబంచు వాచింతురే
    శివుడా రమ్ముర కాశికేగెదమికన్ శీఘ్రమ్ముగా నంచు నా
    శివునిందోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరున్ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  10. భువికైలాసమునయ్యెగానగరిశంభుండాస్థలిన్జేరగా
    కవితల్ధారగజాలువారెనటనాకామాక్షిభర్తన్గనన్
    రవిజూడంగనుకోటిదీపములనారాశిక్యదామోదరున్
    శివునిన్దోడ్కొనిచంద్రశేఖరుడువచ్చెన్శంకరున్జూడగన్
    చంద్రశేఖరుడు-ముఖ్యమంత్రి

    రిప్లయితొలగించండి
  11. పుణ్యదినము కార్తీకపు పున్నమి యని
    దైవ దర్శనము సలుప దలచి , సఖుడు
    శివునిఁ దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు
    భవుని యాయతనమునకు బరుగులిడుచు

    రిప్లయితొలగించండి
  12. (కేవలము పూరణ నిమిత్తమే...కంది శంకరయ్య గారికి క్షమాపణ లతో)
    మత్తేభము:
    కవులీ కార్తిక మాసమందు శివునిన్ కన్నీటితో వేడిరే
    భవుడా బ్రోవుము కంది శంకరుడసంబద్ధంబునౌ పాదముల్
    పవలున్ మిన్నకయుండి రేయి విడుచున్ భావ్యంబనన్? కంచిలో
    “శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  13. మ:

    కవితా వేశము పొంగిపొర్ల నొసగెన్ కవ్వింపుగా పూరణన్
    కవితల్ గొప్పగ వ్రాయు వారెవరలో కై యెత్తి లెక్కించగా
    శివ నామంబునె యుచ్చరింప త్రయమైశేషంబుపేక్షింప,నా
    శివునిం దోడ్కొని చంద్రశేఖరుడు వచ్చెన్ శంకరుం జూడగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా.

    పల్లెనుండి వేంచేసిన భాతృసుతుడు
    సోదరుడగు నాపుత్రుని సొబగగు విధి
    పట్టణమును జూపుమనగ బాళి చెంది
    శివుని దోడ్కొని చనె జంద్రశేఖరుండు.

    రిప్లయితొలగించండి
  15. గంగిరెద్దుల నాడించి కనులవిందు
    సల్పి చంపి గజాసురున్ చక్రధారి
    శివునిఁ దోడ్కొని చనెఁ; జంద్రశేఖరుండు
    తిరిగిరాగ సంతసమొందె గిరిజ మిగుల

    రిప్లయితొలగించండి
  16. అవలోకించగకార్తికమ్ముననునాహార్యంబు
    నృత్యంబునన్
    శివరూపమ్ములువెల్లువెత్తెనటుసుశ్రీకార సంరంభమై
    నవలోకమ్మున దీపకాంతిననుభిన్నత్వంబు నేకంబునై
    శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  17. సవనం బట్లుగ కార్తికంబునను నీశానార్చనల్ సల్పగా
    నవనీనాథుడు భక్తిమై హితుల నాహ్వానించగా నచ్చటన్
    ధవళాంగుండగు గృత్తివాసుని సుభక్తాగ్రేసరుల్ గూడగా
    శివునిన్ దోడ్కొని చంద్రశేఖరుడు వచ్చెన్ శంకరున్ జూడగన్

    రిప్లయితొలగించండి
  18. తేటగీతి
    ఆత్మలింగ ము పొందగ రావణుండు
    శివుని దోడ్కొని చనె ,చంద్రశేఖరుండు
    సంతసించి నివాసము జనెను, శివుడు
    భక్తజన రక్షకుడు పరి పాలకుండు.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  19. ఘోర తపమున మెప్పించి గిరిజ పొందె
    శివుని,దోడ్కొని చనె చంద్రశేఖరుండు
    సంతసంబున కళ్యాణ చవిక దరికి
    యేకమగుటకు నచ్చట యొకరి కొకరు

    రిప్లయితొలగించండి
  20. భక్త వరదుండు సౌరభ వాహనుండు
    ప్రీతిఁ దనతోడఁ జేసి నిర్వీర్యు యముని
    ఘన మునిసుతు మార్కండేయుని, నెడఁద నిడ
    శివునిఁ, దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు


    శివ చత్వారము నూనఁ బద్మ భవుఁడే చేతన్ శివుండౌ తగన్
    భువి విష్ణుండు సుఖమ్ము లీయఁగను సద్భూతాలి కత్యంతమున్
    నవ నామం బగు శంకరుం డనఁగఁ దన్నారాయ ణైకాహ్వకున్
    శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్

    రిప్లయితొలగించండి
  21. ద్యానమందున పశుపతి దయతలంచి
    గగనమందునకన్పించెకాంతిమీర
    శుభముగూర్చెడివివిదరూపంబులందు
    శంకరి చూడగోరె నపుడు శంభుడు హర
    గంగధరుడు,రుద్రుడు,నీలకంఠ, ప్రణవ
    శివుని, దోడ్కొని చనె చంద్రశేఖరుండు
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  22. భవు పూజార్చన జేయనెంచియు మహా ప్రఖ్యాత కాశీపురిన్
    శివునిన్ దోడ్కొని చంద్ర శేఖరుడు వచ్చె
    న్ శంకరుంజూడగన్
    శివ సేవోన్నత తత్పరుండు, వరదున్
    శ్రీ విశ్వనాథున్ శంభువున్
    ధవళాంగుం గని యాత్మలో మురిసి
    యున్ దాదాత్మ్యమున్ జెందెడిన్

    రిప్లయితొలగించండి
  23. శివనామంబును బల్కుచున్,మదిని
    నే సేవించి ప్రార్ధించగన్
    కవితల్,కీర్తన జేయగా వినగ,నా కామేశు,నే బిల్వగన్
    భవనాశమ్మగు భవ్యమౌ పథము నే భర్గుండు
    మెచ్చీయ,నా
    శివునిం దోడ్కొని చంద్రశేఖరుడు వచ్చెన్ ,శంకరున్ జూడగా....

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. భవబంధమ్ములుద్రెంచువాడు నయి యావారాశియుప్పొంగగా
      శివునిందోడ్కొని చంద్రశేఖరుడు వచ్చెన్ శంకరుంజూడగన్
      నవనిన్ శంకరు బోలు దైవమును నయ్యా చూడశక్యంబునే
      శీవనామంబునుశ్రద్ధతో బలుకనాశీర్వాదముల్ గల్గుసూ

      తొలగించండి
  25. శివనామంబును బల్కుచున్,మదిని
    నే సేవించి ప్రార్ధించగన్
    కవితల్,కీర్తన జేయగా వినగ,నా కామేశు,నే బిల్వగన్
    భవనాశమ్మగు భవ్యమౌ పథము నే భర్గుండు
    దానీయ,నా
    శివునిం దోడ్కొని చంద్రశేఖరుడు వచ్చెన్ ,శంకరున్ జూడగా....
    సవరించా..మెచ్చీయ అనేపదంని

    రిప్లయితొలగించండి
  26. స్తవనీయమ్మగు యజ్ఞముల్ జరుపగా సద్భక్తిఁ పట్నమ్ములో
    కవనమ్ముల్ కవి పుంగవుల్ జదువగా కామారిపై నిచ్చతో
    భవునిన్ మ్రొక్కగ, పండితాళులను సంభావించుచున్ మంత్రియౌ
    శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్

    రిప్లయితొలగించండి
  27. హిమగిరులయందువిహరించ హిమజ వడిగ
    శివుని తోడ్కొని చనె,చంద్రశేఖరుండు
    తాండవమ్మాడె మదినెంచి దారతోడ
    నమరవరులుగనుచునుండ నంబరాన.

    రిప్లయితొలగించండి