13, నవంబర్ 2021, శనివారం

సమస్య - 3901

14-11-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధారణ యుండదు శతావధానములందున్"
(లేదా...)
"ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్"

30 కామెంట్‌లు:


  1. పారులు నారులు వీరలు
    వారలనెడు భేదమెంచు వారలు కారీ
    సూరులవధాన మందున
    ధారణ యుండదు శతావధానములందున్.

    (ధారణ= హద్దు)

    రిప్లయితొలగించండి
  2. కందం
    ధారాశుద్ధిగ పద్యము
    భారతి మదిఁగొని వధాని వల్లింపంగన్
    దీరుచు నాషామాషిగ
    ధారణ యుండదు శతావధానములందున్

    ఉత్పలమాల
    ధారయు ధోరణుల్ ధిషణ ధైర్యములబ్బి వధాని శేఖరుం
    డీఱముగన్ వధానముల నింపుగఁ జేయు కవీంద్రతేజమై
    భారతి నృత్యమున్ సలుప వాక్కునఁ బండితులొప్పనట్లుగన్
    ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. తీరని గోర్కె యటంచును
    బేరొంద గ నెంచి యొకడు వేదిక నెక్కెన్
    పారక పాచిక నతనికి
    ధారణ యుండదు శతావ ధానము లందున్

    రిప్లయితొలగించండి


  5. నారుల వింతపోకడలు నాయకులెల్లరి పాపకృత్యముల్
    పారుల సీరవాహకుల వైద్యుల నొజ్జల తప్పులెంచుచున్
    వారలు వీరలంచనక బాహటమందున దూరుచుందురే
    ధారణ యుండబోదఁట వధానికిఁ జేయశతావధానమున్.

    ధారణ= హద్దు ఎల్ల

    రిప్లయితొలగించండి
  6. పూరణ రుచి తెలియకనే
    కారణమదిలేక నవ్వు కలకలమందున్
    ప్రేరణము లేని చోటుల
    ధారణ యుండదు శతావధానములందున్

    రిప్లయితొలగించండి
  7. సమస్య :

    ధారణ యుండదు శతావధానములందున్

    ( నూర్గురు పృచ్ఛకులకు నాల్గవరోజున నూరు
    పద్యాలను అప్పజెప్పేకవికి అపధారణ ఉండరాదు)

    కందము
    ............

    ఆరని ప్రతిభాబలమున
    నూరగు పద్యసుమములను నొప్పుగ గురియున్
    ధీరత నొప్పెడి కవి ; యప
    ధారణ యుండదు శతావధానములందున్ .

    ( అపధారణ - ధారణ లేకపోవటం )

    రిప్లయితొలగించండి
  8. ధారణయుండిన జాలును
    దారాళముగ సతత మవధానము జేయన్ ,
    వేరుగ ప్రత్యేక వలువ
    ధారణ యుండదు శతావధానములందున్

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఉత్పలమాల:
    కారణ జన్ములై యమిత కావ్యపురాణ విశేష గ్రంథముల్
    ధారణసేసి, సద్గురువు దాపున శిక్షణ నందియుండి, సం
    పూరణ ధీమతన్ గల సుబుద్ధికి,
    నన్నిట ఖండితమ్మునౌ
    "ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్-కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  11. పూరణజేసిన పిమ్మట
    ధారణచేయునవధానితనపద్యములన్
    ధీరత్వము లోపించిన
    ధారణ యుండదు శతావధానములందున్

    రిప్లయితొలగించండి
  12. *ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్.*

    ప్రయత్నం:

    క్రూరుల పాలనంబునను గుర్వుల నెల్లర జిన్నబుచ్చగన్,
    శారద సేవలో ఘన విశారదులౌ బహు పండితోత్తముల్
    బారగ దేశమున్ వదలి, భాగవతోత్తము లంత వీడ, ను
    ద్ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్.

    ఉద్ధారణ-రక్షణ

    రిప్లయితొలగించండి
  13. ధీరులు చూపింతురసా
    ధారణ సాహిత్య పటిమ ధారణశక్తిన్
    పూరణ కొరకై పుస్తక
    ధారణ యుండదు శతావధానములందున్

    రిప్లయితొలగించండి
  14. పూరణజేసి పద్యములు బోడిమిగా కవులెల్ల భేషనన్
    ధారణజేసియన్ని యవధానమునందున చెప్పితానసా
    ధారణ ప్రజ్ఞ జూపును వధాని, జయాప జయంబులన్నని
    ర్ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్

    రిప్లయితొలగించండి
  15. ధారుణమౌకరోన భువి దాపురమైన కతమ్మునెందరో
    సారవిహీనమౌ విధము సల్పుచు నెన్నొ వధానముల్ కడున్
    నీరసమైన పూరణల నిత్యము చేయగ వాట్సుయాపులో
    ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్

    రిప్లయితొలగించండి
  16. సారతరార్థసంకలితశబ్దవిరాజితధారలున్న త
    త్పూరకయుక్తిసంఘటనధోరణిశోభిలు చుండినన్ కడన్
    ధారణ తోడనే జయము దక్కు, హృదిన్ మననమ్ము లేక యా
    ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  17. భూరి కవిత్వ సంపదయు పుష్కల
    వాక్చతురత్వమున్న దా
    మీరిన సంస్కృతాంధ్రమున మిక్కిలి
    జ్ఞానము గల్గియుండినన్
    వారిజ నేత్రి యైన సుర వాణి కటా
    క్షము లేకయుండినన్
    ధారణ యుండబోదట వధానికి జేయ
    శతావధానమున్

    రిప్లయితొలగించండి
  18. భారము తీవ్రమైన,తలపార్శ్వములందున, యింటిలోపలన్
    తీరని కష్టముల్ కలిగి తిన్నగ రమ్మని ఫోను వచ్చినన్,
    జీరల గొంతు బొంగు‌రయి శ్లేష్మము కమ్మిన రోజులందునన్
    ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్

    రిప్లయితొలగించండి
  19. కందం
    వారుణి వాహిని గైకొని
    చేరెను పండితుడు సభకు చింతన బడకన్
    వారుణి ప్రభావితుండై
    ధారణ యుండదు శతావధానములందున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  20. వారుణి ద్రాగెడు వారికి
    ధారణ యుండదు, శతావధానము లందున్
    ధారణ యది లేని యెడల
    పూరణలన్ జేయలేరు మువ్వల చెన్నా!

    రిప్లయితొలగించండి
  21. ధారణ యుండబోదట వధానికి జేయశతావధానమున్
    ధారణ లేకయుండ నవధానము జేయగ రాదుగా నెటన్
    ధారణ యుండునెప్పుడును దాజదువన్బలుకావ్యశాస్త్రముల్
    పూరణ లన్నియున్ దనరి పోడిమి యొప్పును శారదాకృపన్


    రిప్లయితొలగించండి
  22. భారతి పదముల నమ్ముచు
    తరగని పదభందమిచ్చి దాపుననిలిచే
    వరమడుగుము లేనియెడల
    ధారణయుండదుశతావధానములందున్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  23. ఉ:

    కారణ జన్ముడయ్యు మిహి ఖ్యాతి గడించిన జ్ఞప్తి, ప్రజ్ఞతో
    ధారగ వెల్వరించు మది తట్టిన దెల్లను మెల్లమెల్లగా
    పూరణ జేయు పద్యములు పొత్తము నందు లిఖించి నట్లుగన్
    ధారణ యుండ బోదట వధానికి జేయ శతావధానమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. సారముసులభముసేయగ
    వారింపనుసభలయందువాదనలన్నిన్
    మారినకాలముచిన్నది
    ధారణయుండదుశతావధానములందున్

    రిప్లయితొలగించండి
  25. సారతర పృచ్ఛక గణము
    చారుతరమ్ము సెలరేఁగ సల్లాపము లే
    పారఁగ జ యాపజయ ని
    ర్ధారణ యుండదు శతావధానము లందున్


    కారట పండితోత్తములు గాంచఁగ నెల్లరు సద్వధానులీ
    ధారుణి నవ్వధానులును దల్పఁగఁ గారట పండితుల్ బృహ
    ద్ధారణయే చెలంగు నవధానికి నిత్యము మాన వాల్పవ
    ద్ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్

    రిప్లయితొలగించండి
  26. కందము:
    పూరణకై క్లిష్టతగల
    సారస్వత రసగుళికలు సంధించంగా
    హోరున మైకులు గొణగగ
    "ధారణ యుండదు శతావధానములందున్"
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  27. సారమెరింగి విద్యలను చక్కగ సాధన జేయకున్నచో
    ధారణ యుండఁ బోదఁట వధానికిఁ; జేయ శతావధానమున్
    శారద సత్కృపన్ బడసి శాస్త్రములన్నియు నేర్చి మేలుగా
    పారగుడైన వాడె తగు పండితులెల్లరి మెప్పునొందగా

    రిప్లయితొలగించండి