1, నవంబర్ 2021, సోమవారం

సమస్య - 3889

 2-11-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ”
(లేదా...)
“సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

  1. సమస్య :

    సాయము జేయువాడె కద
    శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    ( పాండవుల వద్దకు వస్తున్న శల్యుని మధ్యలో ఆపి సపర్యలు చేసి తన వైపు త్రిప్పుకున్న దుర్యోధనునికి కొరివితో తలగోకుకున్నట్లయింది )

    ధ్యేయము పంచపాండవుల
    దిక్కున నుండుట శల్యరాజుకున్ ;
    మాయగ సత్కృతిన్ సలిపి
    మంచిగ మారుపు జేసి రాజరా
    జాయన గర్ణు సారథిగ
    నాజిని దోడ్పడ గోర ; నట్లనెన్ ;
    సాయము జేయువాడె కద
    శత్రువు ; దప్పదు కీడు ; నమ్మినన్ .

    ( ధ్యేయము - లక్ష్యము ; ఆజి - యుద్ధము )

    రిప్లయితొలగించండి
  2. పిల్లకుందేలుసింహంబుపీచమణచ
    దారిఁజూపించికూపంబుదరినిఁజేర్చె
    తోంగిఁజూచినమ్రుగరాజుఁద్రోసెనపుడు
    సాయమందించువాడెపోశత్రువనగ

    రిప్లయితొలగించండి
  3. అడగక మునుపే కలుపుకు, యమితముగను
    వలపు జూపి జేరువయగు, వలదని యన
    సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
    తదుపరి తెలియు ఖలుడని తథ్యముగను

    ఉత్త ముడని పించుకొనును యుర్విని బొరి
    సాయ మొనరించువాఁడె పో; శత్రువనఁగ
    కష్టపు ఫలితముల దోచు కర్కశుడును,
    మనమెదిగినచో జూడలేని మనుజుడు గద!

    రిప్లయితొలగించండి
  4. మంచి తనమును గల్గిన మానవుండు
    సాయ మొనరించు వాడెపో :: శత్రువనగ
    కక్ష సాధింప గా జూచి గాసి గూర్ప
    నెంచు చుండును సతతమ్ము నీతి మాలి

    రిప్లయితొలగించండి
  5. పాయకకౌరవాదులకుభావనమిత్రుడుసౌబలుండెగా
    మాయనుమర్మమున్దెలిపిమార్గముఁదప్పగఁజసెనేగదా
    దాయలతోడియుద్ధమునధర్మమువీడిరిమేనయల్లురున్
    సాయముఁజేయువాడెగదశత్రువుఁదప్పదుకీడునమ్మినన్

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    సౌరి రథమున శల్యుఁడు సాదియౌచు
    గురిని తప్పంగఁ దెగడుచుఁ గ్రుంగదీసె!
    పాండవేయులు గెలువంగ వక్రరీతి
    సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ!!

    సుయోధనునితో శకుని :

    ఉత్పలమాల
    ఆయన నొక్కనిన్ విజయుఁడార్తిగఁ గోరెనటన్న మోదమే?
    శ్రేయము గూర్చునంచు హరిసేనకు నొప్పిన రాజరాజ! యా
    మాయలమారి వైరులకు మారణహోమపు వ్యూహకర్తయై
    సాయముఁ జేయువాఁడె కద! శత్రువు!! దప్పదు కీడు నమ్మినన్!!!

    రిప్లయితొలగించండి
  7. "రైలు" "టిక్కెట్టు"దెచ్చెద రయముగాను
    పెద్ద 'క్యూ'లోన నిలబడవద్దు మీరు
    డబ్బులిమ్మని మోసగాడైన నాడు
    సాయమొనరించు వాడెపో శత్రువనగ.

    రిప్లయితొలగించండి
  8. జిమ్మ రీతి నధోగతి చెంది యుండ ,
    సీమ నొక తారకాణము జేయబోవ
    ప్రగతి నడ్డుకొ నెడు ప్రతి పక్ష ములకు
    సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ

    జిమ్మ = అధికము

    రిప్లయితొలగించండి
  9. ఉత్పలమాల:
    రాయినిఁజూపి రత్నమని రాసుల కొద్ది ధనమ్ము కూడ గం
    జాయిని నమ్మరమ్మనుచు జాలమునన్బడవైచి మిత్రుడై
    న్యాయ విరుద్ధ కార్యముల నాశలు పెంచుచనుంగు ధూర్తుడై
    “సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్”
    -కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి

  10. స్వర్గ తుల్య మటంచును వారవనిత
    పొందు మద్యపానమ్ములే ముదమటంచు
    పనికి మాలిన వానికి వలయు ధనము
    సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ.

    రిప్లయితొలగించండి

  11. ప్రాయము తిర్గిరానిదని వాసి సుఖమ్ముల బొందమంచు సా
    రాయము గ్రోలుటన్ మరియు గ్రామణి బొందుటె సౌఖ్యమంచు రూ
    పాయలు లేకపోయెనని బాధయె వీడుమటంచు సొమ్ములన్
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    రిప్లయితొలగించండి

  12. జాయయె వీడెనంచు నవసాదము జెందెడు వానిజేరి సా
    రాయము మేలుగూర్చునని గ్రామణి పోందది బాధ తీర్చగన్
    హాయిగ గాంచవచ్చు నమరాలయ మంచును దుష్పథమ్ముకై
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    రిప్లయితొలగించండి
  13. మాయని మచ్చయయ్యె మద మచ్చరికంబున గెంటివేయగా,
    బాయని నేస్తమున్ విడువ బాపమటంచు దలంపడెవ్విధిన్
    సోయి నెఱింగి రాజు తుది శోకము బాలవ నెన్నికందునన్
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్.

    యజ్ఞభగవాన్ గంగాపురం.

    రిప్లయితొలగించండి
  14. మిత్రునకు మిత్రుడగు తన మిత్రునిగను
    శత్రువుకుమిత్రుడేతన శత్రువగును
    మిత్రుడైనను తనయొక్క శత్రువునకు
    సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ

    రిప్లయితొలగించండి
  15. ద్వేష భావన లేమియు తెలియనీడు
    స్నేహితునివలె నభినయించి వెనుక మన
    వైరులకు తదుపరి వైరి వర్గమునకు
    సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ

    రిప్లయితొలగించండి
  16. చేయిని జాచి యర్ధిలుచు,జెప్పిన పిన్నును మోసగించులే,
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్,
    హేయము వాని చేష్టలిల, యేమన,డబ్బుల నేటియమ్ములో
    మాయను జేసి దోచు, మరి మార్చును కార్డును నేర్పుతోడుతన్

    రిప్లయితొలగించండి
  17. ఉ:

    ఆయువు పోయువాడు పరమాత్మనె యివ్విధి నింద జేతువే
    శ్రేయము గూర్చయజ్ఞుడికి శిక్షనువేయు గ్రహింప నీతినై
    న్యాయము గాదు బల్కుటగు నాలుక తోచిన రీతి నిట్లనన్
    సాయముజేయువాడెకద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. న్యాయ విహీను డీ శకుని యంతర
    మీ వెరుగంగలేవు మీ
    పై యెన లేని ప్రేమ హిత భావము
    తా నటియించు గాని య
    న్యాయమె చేయు వీడు వినుమా!
    'విదురుండు వచించె', రాజ మీ
    సాయము జేయువాడె కద శత్రువు
    నమ్మియు మోసపోకుమా!

    రిప్లయితొలగించండి
  19. కాయముపెంచుగామనకుఖాయముగానిల స్వీటులే సుమీ
    మాయముచేయుగామననుమాటుగదాగుచుతీయదన్నమే
    దాయనిరోగమైయటులదాచుచువైరముతీయగానిలన్
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    రిప్లయితొలగించండి
  20. తేటగీతి
    రాజకీయ వైరములలో సాజ క్రమము
    పదవి బొంది ప్రముఖుడై విపక్ష మాశ్ర
    యించి ,తనకు మొదటి నుండి యెంత గానొ
    సాయ మొనరించు వాడె పో శత్రు వనగ!

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  21. మంచి మిత్రుడు గబరిగణించ దగును
    సాయమొనరించువాడెపో,శత్రువనగ
    కీడు నొనరించు నెప్పుడు వీడువాడ
    నుదలచక నేరికైనను ,నొవ్వజేయు

    రిప్లయితొలగించండి
  22. హాయను మిత్రుడున్ నిరతి హర్షము తోడను నెల్లవేళలన్
    సాయము జేయువాడెకద,శత్రువు దప్పదు కీడునమ్మినన్
    బాయక నెల్లవేళలను భద్రముతోడను నుండమేలగున్
    సాయముజేయుచో మనకు శంకరుడిచ్చును భోగభాగ్యముల్

    రిప్లయితొలగించండి
  23. ఎంచి విత్తమ్ము ధర్మమ్ముఁ ద్రుంచి త్రుంచి
    నించి ద్వేషమ్ము మాటలు దంచి దంచి
    మించి పగవారి కనిశమ్ము పొంచి పొంచి
    సాయ మొనరించు వాఁడె పో శత్రు వనఁగ


    మాయలు పన్ని మిక్కుటము మంతన మింపుగఁ జేసి భండన
    న్యాయ మొకింత యేని మది నక్కట యెన్నక మించి సంధి నేఁ
    జేయ నెదం దలంతు నని చెప్పుచు యుద్ధము, కూర్చి వింటినిన్
    సాయముఁ, జేయు వాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    [సాయము = బాణము]

    రిప్లయితొలగించండి
  24. కాయము పెంచి మానసముఁ గాంక్ష ఘటిల్లగ దుష్టుడై యల
    ప్రాయమునందు కన్నియకు భాగ్యములందున నాశ చూపి యా
    త్మీయునిగా నటించుచును దేవత యంచును మోసగింపగా
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    రిప్లయితొలగించండి
  25. ధ్యేయమ దొక్కటై నమదితీరుగ లేకను నాకతాయిగా
    మాయగ మాటలన్ పలికి మంచిగ వేషము వేయువారలౌ
    ప్రాయము నందు పోకిరిగ భామల వెంటను తిర్గువారికే
    సాయము జేయువాడెకద శత్రువు దప్పదు కీడు నమ్మినన్!!

    గార బమ్ముగా బెంచగా కడుపు తీపి
    బుద్ధి మతులను జెప్పకన్ బోధ పరచి
    సోమరిగ పెంచి వదలగా ,సొత్తులిచ్చి
    సాయ మొనరించు వాడెపో శత్రువనగ!!

    రిప్లయితొలగించండి
  26. న్యాయముదప్పకెన్నడు సనాతనధర్మమునాచరింపగా
    సాయముఁ జేయువాఁడు నిజ సన్నిహితుండతడెన్నడేనియున్
    మాయలమారియౌచు నపమార్గమునందున సంచరించుటన్
    సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్

    రిప్లయితొలగించండి