19, నవంబర్ 2021, శుక్రవారం

సమస్య - 3907

 20-11-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ”
(లేదా...)
“కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్”

51 కామెంట్‌లు:

  1. నారికేళపుపోకడనరుడుమసలు
    పగులగోట్టినతెలియునుభావమందు
    మాటమాటనువెటకారమావహించు
    కోతిమూఁకకునెలవయ్యెకోనసీమ

    రిప్లయితొలగించండి
  2. పండు చుండగ పలు పండ్లు మెండుగాను
    దీరు నాకలి యనుకొని చేరు చుండ
    కోతి మూక కు నెలవయ్యె : కోనసీమ
    ప్రకృతి యందాల సొబగుల ప్రాంత మయ్యె

    రిప్లయితొలగించండి
  3. తీపిమాటలమాటువేటునదబ్బఁదీయునుఠక్కునన్
    చాపక్రిందుననీటినుంచుచుచాలధైర్యముఁజెప్పులే
    కాంచలేకనుమీరలుండినకంచెచేనునుమేయుగా

    కోఁతిమూఁకలకాలవాలముకోనసీమయెచూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మా. ఇది మత్తకోకిల. ప్రాస మరచి నట్లున్నారు. సవరించండి

      తొలగించండి
    2. ప్రాస తప్పింది. మరో పూరణ వ్రాయండి

      తొలగించండి
    3. నాతిమాటలమాటలమాటువేటుననారీకముహెచ్చులే
      పూతపూయుచుపూతరేకులభూరిసంపదనందులే
      చేతివంటలశీర్షమందునచేయిబెట్టుదురంతలో
      కోఁతిమూకలకాలవాలముకోనసీమయెచూడగా

      తొలగించండి
  4. రాజెవరికి సుగ్రీవుడు, రత్న
    ములకు

    సంద్ర మేమయ్యెనో గదా, జగతి‌ లోన‌.

    మంచి టెంకాయ‌ లుదొరుకు‌ మండలమ్ము

    కోతి మూకకు, నెలవాయె, కోనసీమ

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. గండి హనుమంతు కోవెల కలకలముల
      కోఁతిమూఁకకు నెలవయ్యె; కోనసీమ
      కొబ్బరికి పేరు, జిహ్వకు కొర్ర మీను,
      రొయ్య, మాగాయ, బొబ్బట్ల రుచుల నెలవు.

      తొలగించండి
  6. తేటగీతి
    హాయిగొల్పు గోదారి విహారమందు
    నావ నాట పాటలదేల్చు నటనముండ
    భద్రగిరి వాసుఁ జూడఁబోవగఁ దలంచు
    కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ!

    మత్తకోకిల
    చూతమంచును రామభద్రుని సుందరంబగు క్షేత్రమున్
    ప్రీతిఁగూర్చు విహారముండగ వెళ్లనెంచుచు నావలో
    నాతతంపు వినోదమెంతయొ నందజేయఁగ బృందముల్
    కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్!

    రిప్లయితొలగించండి

  7. అక్కరకురాని విషయాల ననవరతము
    పలికి విసిగించు తాతను పరిహసించు
    మనుమలను గాంచి నవ్వుతు జినుడు వదరె
    కోతిమూకకు నెలవయ్యె కోనసీమ.

    రిప్లయితొలగించండి

  8. ఖ్యాతి గాంచిన నేలరా తెలగాణయంచును చెప్పెడిన్
    తాతగారిని గాంచినంతనె తామసమ్మున బాలురే
    భీతివీడుచు వెక్కిరింపగ వృద్ధుడిట్టుల పల్కెనే
    కోతిమూఁకల కాలవాలము కోనసీమయె చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  9. ప్రీతి నిచ్చెడు పండ్లు కాయలు
    బెక్కు చిక్కు భుజించగాన్
    భీతి లేక చరించు నచ్చట వృక్ష
    శాఖల హాయిగా
    రాతిరిం గడు శాంతితోడ సురక్షి
    తంబుగ నుండెడిన్
    కోతి మూకలకాలవాలము కోన సీమయె చూడగన్

    రిప్లయితొలగించండి
  10. మ. కో.

    గౌతమీ నది తీర ప్రాంతము కాశి బోలిన క్షేత్రమే ( ద్రాక్షారామము)
    పూతరేకులు తీపి కాజలు పూలతోటల స్వర్గమే
    పీత కూరయు రొయ్య వేపుడు పేరు గాంచిన విక్కడే
    కోతి మూకల కాలవాలము గోన సీమయె జూడగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. కొసరు నందాల సీమయే కోన సీమ
      విరివిగా నారికేళమే దొరకునచట
      కోఁతిమూఁకకు; నెలవయ్యె కోనసీమ
      సజ్జనతతికి నత్యంత సరసులకును

      తొలగించండి
  12. చిక్కగ వనమంతయు పెద్ద చెట్లు పెరుగ
    కోఁతిమూఁకకు నెలవయ్యె ; కోనసీమ
    పరుగులిడుచు గోదావరి పారుచుండ
    నాయతనమయ్యెను ప్రకృతి
    యమరికలకు

    రిప్లయితొలగించండి
  13. మత్తకోకిల:
    మాత సీతను రామభద్రుని మౌనమున్విడిఁ గొల్చుచో
    వాతసూనుడు రామభక్తుడు వచ్చి చేరును భక్తి తో
    స్వాతిముత్తెపు కోనసీమ నివాసులుత్తమ భక్తులై
    “కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి:
    సగము చీల్చిన దూలము సందులోన
    తోక నిరికించి బేడెము తొలగ లాగు
    కోతి చందము ,తెంపరి కుర్రకారు
    “కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ”
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  15. పాడిపంటలనెలవైన పసిడిసీమ
    వేదనాదాల ఘోష విన్పించు నిచట
    మాటలందున చెణుకులు మీటుచుండు
    కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ

    రిప్లయితొలగించండి
  16. జాతిరత్నము లెందరోయట జన్మమున్ గొని మించిరే
    ఖ్యాతి నొందిన దేవళమ్ములు కాంచనౌగద నచ్చటన్
    రోతమాటల నాడుచుండిన రువ్వుటందున వ్యంగ్యముల్
    కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్

    రిప్లయితొలగించండి
  17. కోతి మూకకు నెలవయ్యె కోనసీమ
    యక్ష రాలని జమ్ములె యార్య యదియ
    కోతి మూకల తోబాటు కొరివి దోచు
    కొండ ముచ్చులు గూడను దండి యయ్యె

    రిప్లయితొలగించండి
  18. భక్తి మీఱఁగ నిత్యమ్ము పడతు లెల్ల
    గుడులఁ గొబ్బరి కాయలు కొట్టు చుండ
    తియ్య నైన ముక్కలఁ గాంచి దినఁగ రాఁగఁ
    గోఁతిమూఁకకు నెలవయ్యెఁ గోనసీమ


    ప్రీతి తోడుత నేర్చి విద్యలు వీడి సీమను బౌరులే
    యాతనల్ వడి పొట్ట కూటికి నన్య దేశము లేఁగఁగాఁ
    జూత మంచును జేరి యన్యులు చుట్టు ముట్టఁగ నక్కటా
    కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్

    రిప్లయితొలగించండి
  19. ఈనాటి పద్య పూరణలు.....
    1-ప్రీతి మీరగ బిల్చి బెట్టెడు ప్రేమ నింపిన విందులే
    నేతిగారెలు తిన్న మూతిన నేతివాసన దెల్పదా
    వాత బెట్టెడు మాటలేలనొ వాటసాటపు నేర్పులై
    కాతి మూకల కాలవాలము కోన సీమయె జూడగా!!2-
    రాతిరేళల బంధువొచ్చిన రమ్మనంచును ప్రేమగా
    లేతలేతని ఖుత్తి కూరల నింపులైనటి వడ్డనల్
    ఖ్యాతి లెన్నియె దెచ్చి యిచ్చిన కారమొప్పెడి పచ్చడుల్
    కోతి మూకల కాలవాలము కోనసీమయె జూడగన్ !!

    రిప్లయితొలగించండి
  20. ప్లేమ మీర,బంధుజనుల పిల్చి,బలుకు
    నాప్త మిత్రుల మరునంగ నారడేల?
    కోతి మూకకు నెలవయ్యెవకోన సీమ...
    యనుచు?,నార్తిని జూడరే నాదరించి!!

    రిప్లయితొలగించండి
  21. నాతి వింటివె మేటి సత్యము నాదుమాటల సారమున్
    కోతిమూకల కాల వాలము గోనసీమయె చూడగన్
    వాత సూనుని,రామ భక్తుని భక్తి తోడను గొల్వగా
    బ్రీతి నొందుచు నిచ్చుసంపద వేనవేలుగ సూ

    రిప్లయితొలగించండి
  22. నాతిమాటలమాటువేటుననాగరీకముహెచ్చులే
    పూతపూయుచుపూతరేకులభూరిసంపదలందులే
    చేతివంటలశీర్షమందునచేయిపెట్టురంతలో
    కోతిమూఁకలకాలవాలముకోనసీమయెచూడగా

    రిప్లయితొలగించండి
  23. ఆతతమ్ముగ నారికేళములచ్చటన్ లభియించు నీ
    భూతలమ్మున కోనసీమను పుణ్యతీర్థము లెన్నియో
    చేతనమ్మతి మార్దవం గన చిత్రమా వెటకారమే
    కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్

    రిప్లయితొలగించండి
  24. వనములన్నినరికిమానవమనుగడకు
    పూర్తిగవినాషణంబైనపుడమియైయ్యె
    వనచరాదులబతుకులు బంగమైయ్యె
    మర్కటంబులు జనవాసమందుకలియ
    కోతిమమూకకునెలవయ్యెకోనసీమ
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  25. సీతమాతయువాసముండుచుసేదతీరిన ప్రాంతమే
    కోతిమూకలకాలవాలము,గోనసీమయెచూడగన్
    చేతికందుచుపంటలెల్లయుసేదతీర్చగ శీఘ్రమే
    రైతులెల్లరుసంతసమ్మునరాణకెక్కరి నిచ్చటన్

    రిప్లయితొలగించండి