29-11-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్”(లేదా...)“దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే”
అరయగపథకములన్నిటమురియుచుతామేవడివడిమూటనుగట్టన్సరిగాపాలకుధనపందారములేకున్నబ్రతుకఁదరమేప్రజకున్
ఆర్యా! నమస్కారము. మొదటి మూడు పాదాదులు గురువుగా నుండుట మఱచిరి.
పైవ్యాఖ్యనుతీసివైచితిని
దారమె నాభికి గావలెదారమె యాధారమగును దంపతులవగాదారమె బట్టకు మూలముదారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
కందంసారమొసఁగ జీవుల కాహారమ్మిడఁ బీల్చి నబ్ధి నంబరమణి కందారమొలకఁ బండెడు కేదారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్?ఉత్పలమాలసారము నింపి జీవులకు శక్తినొసంగగ నిత్యవృత్తి కాహారము ముఖ్యమంచు నిడ నంబరరత్నము నబ్ధిఁ బీల్చి కందారము లేర్పడన్ మెరసి ధారగ జారగ పంట పండు కేదారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే?
ఆరయమానవాళికినియానమునందునముఖ్యమౌసంస్కారమునయ్యెగావడినికాంచసమస్తమునెట్టినింటనేవీరునువారులేరునికవేసటలేకనుపర్వులెత్తనాదారములేనిచోఁబ్రజముదమ్మలరన్బ్రతుకంగసాధ్యమే
ధారుణి పైన మానవుల దప్పిక తీర్చ జలమ్మవశ్యమౌవారిధినుండి నీరమును భాస్కరు డావిరి చేసి వేసవిన్బోరునఁ గ్రుమ్మరించు వెస భూమిని వర్షపు రూప మందు, కందారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే
వర్షము నిచ్చు నట్టి కం/ దారము
ఉ: బేరము లేని వర్తకము విత్తము గూడని రెక్క కష్టమున్తేరగ జేరు బంధువులు తిండి యటంచన బండి నెక్కనైసారము లేని మాటలును చప్పిడి పట్టణ జీవితమ్ము బృందారము లేనిచో బ్రజ ముదమ్ము లరన్ బ్రతుకంగ సాధ్యమేబృందారము=మనోహరము వై. చంద్రశేఖర్
ధారుణిలో జీవులకాహార మవసర మదికాదె యందుకొరకిలన్ దూరను గురిపించెడి కందారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్.
కూరగవిషయముహారముమీరుచుతెలివినినలుగడవింతలుదెలుపన్సౌరునమేధాసరమాదారములేకున్నబ్రదుకదరమేప్రజకున్
హారము వికృతంబగు మం దారము లేకున్న : బ్రదుక దర మే ప్రజకున్ నీరము లేకున్న యెడల సార విహినంబ గుచు విషాద ము హెచ్చు న్
ధారుణి యందు జీవులకు ధాన్యమె ముఖ్యము బ్రత్కునీడ్వ నాయారబమిచ్చు నేమనగ నంబరముల్ గద సృష్టియందునన్ భూరిగ పూరణమ్మొసగి భుక్తిని ప్రాణులకిచ్చునట్టి కందారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీరంబుండిన క్షేత్రముసారముఁ గోల్పోకసస్య శ్యామలమౌ! నాధారము వర్షములకు కందారము, లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
మారుత నీరముల పిదపశారీరక యవసరంబు సాపాటె గదా! ,యూరు వెలుపల కవియు కేదారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
చేరగ కళేబరంబులుకారణ మెంతయొ క్రిములును క్రమమున మన్నైపేరునె ధరణిని చెత్త చెదారము, లేకున్న, బ్రతుకఁ దరమే ప్రజకున్
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా: తీరుగ భుక్తి నొసగు కే దారము లందున ఫలములు దక్కగ జేయన్ భూరిగ వానల నిడు కం దారము లేకున్న బ్రదుక దరమే ప్రజకున్.
కారణభూతుడు జగతికుదారుండైకరుణజూప ధర వర్ధిల్లున్కోరినవిచ్చెడి విభునకుదారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
దారముల పేర్చగ,నసాధారణ కల్పనల వర్ణ తంతువు లల్లన్తారము కడుపును నింపునుదారము లేకున్న బ్రతుక దరమే ప్రజకున్!!*3వ పాదంలో తారమునాలుగు కాసుల నాణెము అనే అర్ధంలో రాసాను.నేతపనులవారి పరంగా)
కందంబాఱుగ దండను గ్రుచ్చగదారపు బంతెంతవసరతనమో ,మహి సంసారము దాటగ చెలి మందారము లేకున్న బ్రతుక దరమే ప్రజకున్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
ఆరక మండిన హృదయ విదారక దుఃఖానలమ్ము దావాగ్ని వలెన్ దారుణ బాధా తరు కుద్దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్దారము లేక పుష్పముల దండ కనంబడ నట్టి రీతి కేదారము లేక యన్నమును ధారుణిఁ గానని భంగి దీన మందారము లేక సౌఖ్యమును ధాత్రినిఁ గాంచని యట్టి భంగిఁ గందారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే[కందారము = వడి గల మేఘము]
దారము వలననె వస్త్రముదారముతో బూలదండ దైవంబునకున్ దారము తోడనె వత్తులుదారము లేకున్న బ్రతుక దరమే ప్రజకున్
దారము పూలదండలకు,దైవమునొప్పుగ బూజజేతకున్ దారము వస్త్రనేతకును దద్దయు ముఖ్యపు వస్తువై కడున్ ధారుణి యందునన్ మిగుల దప్పని వస్తువు కారణంబునన్ దారము లేనిచో ప్రజముదమ్శలరన్ బ్రదుకంగ సాధ్యమే
నీరము ప్రాణకోటికిని నిక్కము నిల్పును జీవనంబు, కేదారము సాగు సేయగను దప్పక గావలె నెల్ల వేళ నాధారము నైనయట్టిజల ధారలు గుర్యగ యజ్ఞరూప కందారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే.కేదారము-వరికందారము-మేఘము
భారత దేశమందునను భాగ్యవిహీనులు బాధ జెందుచున్సారము లేని జీవితము సత్యముగడ్పుచు నుండి రెందరోవారల మేలుగోరి మన భారత శాశన పండ జాలనేదారములేనిచో బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే
కూరుప వచ్చునె?మాలలుదారము లేకున్న’ బ్రతుకఁదరమే ప్రజకున్ నీరము,గ్రాసము, వాసంబూరన్ లభియింపకున్న నొకపూటైనన్ .ధారుణిలో ప్రదేశములు తద్జయు నుండె,నివాసముండగన్ నీరము గ్రాసవాసములనే గద కోరుదురెల్లవారు నాహారమొసంగి జీవులకు హాయిని గొల్పెడు నట్టి సస్య కేదారము లేనిచోఁబజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే.
హారము కట్టగ లేమాదారము లేకున్న;బ్రతుక దరమే ప్రజకున్తీరుగ సతతము చేయుచుదారుణమౌ కృత్యములను ధారుణి యందున్.
అరయగపథకములన్నిట
రిప్లయితొలగించండిమురియుచుతామేవడివడిమూటనుగట్టన్
సరిగాపాలకుధనపం
దారములేకున్నబ్రతుకఁదరమేప్రజకున్
ఆర్యా! నమస్కారము. మొదటి మూడు పాదాదులు గురువుగా నుండుట మఱచిరి.
తొలగించండిపైవ్యాఖ్యనుతీసివైచితిని
తొలగించండిదారమె నాభికి గావలె
రిప్లయితొలగించండిదారమె యాధారమగును దంపతులవగా
దారమె బట్టకు మూలము
దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
కందం
రిప్లయితొలగించండిసారమొసఁగ జీవుల కా
హారమ్మిడఁ బీల్చి నబ్ధి నంబరమణి కం
దారమొలకఁ బండెడు కే
దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్?
ఉత్పలమాల
సారము నింపి జీవులకు శక్తినొసంగగ నిత్యవృత్తి కా
హారము ముఖ్యమంచు నిడ నంబరరత్నము నబ్ధిఁ బీల్చి కం
దారము లేర్పడన్ మెరసి ధారగ జారగ పంట పండు కే
దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే?
ఆరయమానవాళికినియానమునందునముఖ్యమౌసం
రిప్లయితొలగించండిస్కారమునయ్యెగావడినికాంచసమస్తమునెట్టినింటనే
వీరునువారులేరునికవేసటలేకనుపర్వులెత్తనా
దారములేనిచోఁబ్రజముదమ్మలరన్బ్రతుకంగసాధ్యమే
ధారుణి పైన మానవుల దప్పిక తీర్చ జలమ్మవశ్యమౌ
రిప్లయితొలగించండివారిధినుండి నీరమును భాస్కరు డావిరి చేసి వేసవిన్
బోరునఁ గ్రుమ్మరించు వెస భూమిని వర్షపు రూప మందు, కం
దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే
వర్షము నిచ్చు నట్టి కం/ దారము
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిబేరము లేని వర్తకము విత్తము గూడని రెక్క కష్టమున్
తేరగ జేరు బంధువులు తిండి యటంచన బండి నెక్కనై
సారము లేని మాటలును చప్పిడి పట్టణ జీవితమ్ము బృం
దారము లేనిచో బ్రజ ముదమ్ము లరన్ బ్రతుకంగ సాధ్యమే
బృందారము=మనోహరము
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండిధారుణిలో జీవులకా
హార మవసర మదికాదె యందుకొరకిలన్
దూరను గురిపించెడి కం
దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్.
కూరగవిషయముహారము
రిప్లయితొలగించండిమీరుచుతెలివినినలుగడవింతలుదెలుపన్
సౌరునమేధాసరమా
దారములేకున్నబ్రదుకదరమేప్రజకున్
హారము వికృతంబగు మం
రిప్లయితొలగించండిదారము లేకున్న : బ్రదుక దర మే ప్రజకున్
నీరము లేకున్న యెడల
సార విహినంబ గుచు విషాద ము హెచ్చు న్
రిప్లయితొలగించండిధారుణి యందు జీవులకు ధాన్యమె ముఖ్యము బ్రత్కునీడ్వ నా
యారబమిచ్చు నేమనగ నంబరముల్ గద సృష్టియందునన్
భూరిగ పూరణమ్మొసగి భుక్తిని ప్రాణులకిచ్చునట్టి కం
దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీరంబుండిన క్షేత్రము
రిప్లయితొలగించండిసారముఁ గోల్పోకసస్య శ్యామలమౌ! నా
ధారము వర్షములకు కం
దారము, లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
మారుత నీరముల పిదప
రిప్లయితొలగించండిశారీరక యవసరంబు సాపాటె గదా! ,
యూరు వెలుపల కవియు కే
దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
చేరగ కళేబరంబులు
రిప్లయితొలగించండికారణ మెంతయొ క్రిములును క్రమమున మన్నై
పేరునె ధరణిని చెత్త చె
దారము, లేకున్న, బ్రతుకఁ దరమే ప్రజకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండితీరుగ భుక్తి నొసగు కే
దారము లందున ఫలములు దక్కగ జేయన్
భూరిగ వానల నిడు కం
దారము లేకున్న బ్రదుక దరమే ప్రజకున్.
కారణభూతుడు జగతికు
రిప్లయితొలగించండిదారుండైకరుణజూప ధర వర్ధిల్లున్
కోరినవిచ్చెడి విభునకు
దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
దారముల పేర్చగ,నసా
రిప్లయితొలగించండిధారణ కల్పనల వర్ణ తంతువు లల్లన్
తారము కడుపును నింపును
దారము లేకున్న బ్రతుక దరమే ప్రజకున్!!
*3వ పాదంలో తారమునాలుగు కాసుల నాణెము అనే అర్ధంలో రాసాను.నేతపనులవారి పరంగా)
కందం
రిప్లయితొలగించండిబాఱుగ దండను గ్రుచ్చగ
దారపు బంతెంతవసరతనమో ,మహి సం
సారము దాటగ చెలి మం
దారము లేకున్న బ్రతుక దరమే ప్రజకున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
ఆరక మండిన హృదయ వి
రిప్లయితొలగించండిదారక దుఃఖానలమ్ము దావాగ్ని వలెన్
దారుణ బాధా తరు కు
ద్దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్
దారము లేక పుష్పముల దండ కనంబడ నట్టి రీతి కే
దారము లేక యన్నమును ధారుణిఁ గానని భంగి దీన మం
దారము లేక సౌఖ్యమును ధాత్రినిఁ గాంచని యట్టి భంగిఁ గం
దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే
[కందారము = వడి గల మేఘము]
దారము వలననె వస్త్రము
రిప్లయితొలగించండిదారముతో బూలదండ దైవంబునకున్
దారము తోడనె వత్తులు
దారము లేకున్న బ్రతుక దరమే ప్రజకున్
దారము పూలదండలకు,దైవమునొప్పుగ బూజజేతకున్
రిప్లయితొలగించండిదారము వస్త్రనేతకును దద్దయు ముఖ్యపు వస్తువై కడున్
ధారుణి యందునన్ మిగుల దప్పని వస్తువు కారణంబునన్
దారము లేనిచో ప్రజముదమ్శలరన్ బ్రదుకంగ సాధ్యమే
నీరము ప్రాణకోటికిని నిక్కము నిల్పును జీవనంబు, కే
రిప్లయితొలగించండిదారము సాగు సేయగను దప్పక గావలె నెల్ల వేళ నా
ధారము నైనయట్టిజల ధారలు గుర్యగ యజ్ఞరూప కం
దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే.
కేదారము-వరి
కందారము-మేఘము
భారత దేశమందునను భాగ్య
రిప్లయితొలగించండివిహీనులు బాధ జెందుచున్
సారము లేని జీవితము సత్యము
గడ్పుచు నుండి రెందరో
వారల మేలుగోరి మన భారత శాశన
పండ జాలనే
దారములేనిచో బ్రజ ముదమ్మల
రన్ బ్రతుకంగ సాధ్యమే
కూరుప వచ్చునె?మాలలు
రిప్లయితొలగించండిదారము లేకున్న’ బ్రతుకఁదరమే ప్రజకున్
నీరము,గ్రాసము, వాసం
బూరన్ లభియింపకున్న నొకపూటైనన్ .
ధారుణిలో ప్రదేశములు తద్జయు నుండె,నివాసముండగన్
నీరము గ్రాసవాసములనే గద కోరుదురెల్లవారు నా
హారమొసంగి జీవులకు హాయిని గొల్పెడు నట్టి సస్య కే
దారము లేనిచోఁబజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే.
హారము కట్టగ లేమా
రిప్లయితొలగించండిదారము లేకున్న;బ్రతుక దరమే ప్రజకున్
తీరుగ సతతము చేయుచు
దారుణమౌ కృత్యములను ధారుణి యందున్.