29, నవంబర్ 2021, సోమవారం

సమస్య - 3916

 30-11-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యోగభ్రష్టుండు గాంచు నొప్పుగ ముక్తిన్”
(లేదా...)
“యోగాభ్యాసములోన భ్రష్టుఁ డయినన్ యోగ్యుండగున్ ముక్తికిన్”

50 కామెంట్‌లు:

  1. భోగముల దేలి దానయె
    యోగభ్రష్టుండు, గాంచె నొప్పుగ ముక్తిన్
    రాగము లవీడి తపమున
    సాగుచు కౌశికుడు ఘనుడు సత్యము నెరిగెన్

    రిప్లయితొలగించండి
  2. యోగీశుండగు కృష్ణునిన్ గొలవగన్ యోగంబులే గల్గవా?
    యోగాభ్యాసము లేలనో?,మదిని నా యోగీశుడే నిల్వ,నా
    యోగంబొక్కటి చాలదా? బడయగా యోగీశు పాదమ్ములన్,
    యోగాభ్యాసము లోన భ్రష్టుడయినన్ ,యోగ్యుండగున్ ముక్తికిన్!!

    రిప్లయితొలగించండి
  3. యోగియువేమనబ్రతుకున
    తాఁగవెశూన్యముజగతినితప్పులవలనన్
    సేఁగినివిడచియుసాధన
    యోగభ్రష్టుండుగాంచెనోప్పుగముక్తిన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    రాగవియోగిగ వేమన
    సాగగ విశ్వద తలంచి సలిపినదౌ ప
    న్నాగమ్మునఁ జిక్కుచు దు
    ర్యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్

    శార్దూలవిక్రీడితము
    సాగన్ గామిగ వేమనార్యుడట వేశ్యావాడలన్ మోహియై
    రాగంబందు వియోగిగన్ మలచి నిర్వ్యామోహిగన్ మార్చు ప
    న్నాగంబందున విశ్వదాలలన విజ్ఞానంబు జూపించె దు
    ర్యోగాభ్యాసములోన భ్రష్టుఁ డయినన్ యోగ్యుండు ముక్తిం గనన్

    రిప్లయితొలగించండి
  5. భోగిగ బ్రతికెడి వేళల
    యోగపు చింతన తనువది నోటమి యనగన్.
    వీగగ బలమును,ధనమును
    యోగ భ్రష్టుండు గాంచు నొప్పుగ ముక్తిన్!!

    రిప్లయితొలగించండి
  6. భోగము లందును రక్తుడు
    యోగ భ్రష్టుo డు : గాంచు నొప్పుగ ముక్తిన్
    సాగించు జప తపముల ను
    భోగముల విడు వ దాను పుణ్యా త్ము o డై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం లో సాగించి అని యు మరియు మూడవ పాదం లో భోగములను అనియు సవరణ చేయడమైనది

      తొలగించండి

  7. భోగార్థియైన వాడొక
    భోగపు స్త్రీ కుచము గాంచి మొరకుడు దానిన్
    నాగాభరణుని గ కొలచి
    యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  8. యోగంబందునగీతలోహరియుఁదాయోచించివాగ్రుచ్చెగా
    సాగంజాలినసాధనంబుననునాసాగ్రంబునేకాగ్రతన్
    తూగన్జాలకమధ్యమార్గముననేద్రోయంగనీచంబుకున్
    యోగాభ్యాసములోనభ్రష్టుడైనన్యోగ్యుండుముక్తిన్గనున్

    రిప్లయితొలగించండి
  9. యోగుల కైనను మనుగడ
    రాగభరితమయిన దుఃఖ రహితము గాదే !
    భోగము లన్నింటను విని
    యోగభ్రష్టుండు గాంచు నొప్పుగ ముక్తిన్

    రిప్లయితొలగించండి
  10. సాగును మరుజన్మమునకు
    యోగభ్రష్టుండు; గాంచు నొప్పుగ ముక్తిన్
    యోగాభ్యాసముతో ని
    ర్భోగాసక్తుడు కనుగొన రూఢిగ సుమతీ

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:

    శ్రీగర్భుని విగ్రహమును
    ఆగడకాడొకడు వెరజి ఆలయమందున్
    భోగము శౌరిది దిని యా
    యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  12. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    యోగము నెఱుగని తిన్నడు
    బాగుని గూడని వెడగున పండిన భక్తిన్
    నాగాభరణుని తన్నియు
    యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్.

    రిప్లయితొలగించండి
  13. భోగముల యందసక్తము
    త్యాగంబైహిక విషయపు తర్షణలయెడన్
    రాగము ద్వేషమనెడు దు
    ర్యోగభ్రష్టుండు గాంచు నొప్పుగ ముక్తిన్

    రిప్లయితొలగించండి
  14. *మొదటిపాదం "భోగములందునసక్తత" గా చదువగోర్తాను

    రిప్లయితొలగించండి
  15. అంతకాలే చ మామేవ
    స్మర న్ముక్త్వా కలేబరమ్।
    .........,

    అనే గీతావచనము

    రాగద్వేషవిలోలమత్తమతియై ప్రధ్వంసితాధ్యాత్ముడై
    వాగీశానుడు నయ్యు జారవనితాబాహుద్వయీబద్ధుడై
    నాగేంద్రాభరణున్ దలంచ కడకు న్మాన్యుం డునై నిత్యస
    ద్యోగాభ్యాసములోన భ్రష్టుఁ డయినన్ యోగ్యుండగున్ ముక్తికిన్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  16. భోగిగ బ్రతికెడి వేళల
    యోగము నెంచదు తనువది యోటమి యనగన్
    వీగగ ధనమును,బలములు
    యోగ భ్రష్టుండు గాంచు నొప్పుగ ముక్తిన్ !!
    సవరించాను గురువుగారూ..ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  17. బాగుగ స్మరింప విష్ణుని
    నే గతి నైన నలినాక్షు నెడఁదఁ దరించున్
    వేగ మజామిళ నాముఁడు
    యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్


    పోగై యుండును జేసి నంత వఱకుం బో ధాత్రి నిశ్చింత వి
    త్తాగారమ్మున దాచి నట్టి నిజ భాగ్యాభమ్ము భోగావలి
    త్యాగస్వాంతఁడు భక్తి యోగ మహిమం దథ్యంబ సత్కర్మ యు
    గ్యోగాభ్యాసములోన భ్రష్టుఁ డయినన్ యోగ్యుండు ముక్తిం గనన్

    రిప్లయితొలగించండి
  18. భోగించలేడు దేనిని
    యోగభ్రష్టుండు,గాంచు నొప్పుగ ముక్తిన్
    రాగవిరహితుడగుచును
    యోగమునన్మనసు నిలిపి యోగ్యుడు నగుచోన్

    రిప్లయితొలగించండి

  19. భోగార్థుండయి యాటచేడియల సంభోగమ్ము నే గోరువా
    డాగౌరీశుని గొల్వకున్న నతడన్నార్థుండ్రకున్ నిత్యమున్
    భోగంబిచ్చెడు దాతయంచు జనులే పూజించి మన్నించినన్ .
    యోగాభ్యాసములోన భ్రష్టుఁడయినన్ యోగ్యుండగున్ ముక్తికిన్.

    రిప్లయితొలగించండి
  20. యోగాభ్యాసములోన భ్రష్టుడయినన్ యోగ్యుండగున్ ముక్తికీన్
    యోగంబుండిన వచ్చు మోక్షము నెఱిన్ యోగ్యంబు లేకుండినన్
    యోగాభ్యాసము జేయుచోగలుగుగా యోగీంద్రు వోలెన్ దపో
    యోగంబందును గల్గు శక్తియును నాయోగంబు చిత్రంబుగా

    రిప్లయితొలగించండి
  21. రాగాలాపనఁజేయుచు
    భోగంబులు విడిచి రామమూర్తింగొలిచెన్
    త్యాగయ, భవమాయా సం
    యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ భక్తిన్

    త్యాగంబున్ కరుణార్ద్ర చిత్తము దయాదాక్షిణ్య భావంబులున్
    ప్రోగై,నిర్మల చిత్తమందెపుడు నంభోజాక్షు పాదాబ్జ సం
    యోగానంద నిమీలితాక్షుడగుచునో,యూహింపగా నాతడే
    యోగాభ్యాసములోన భ్రష్టుడయినన్ యోగ్యుండగున్ ముక్తికిన్ .

    రిప్లయితొలగించండి
  22. శంకరయ్య గారు !నమస్తే
    మొదటి పద్యము 4వపాదము భక్తికి బదులు ముక్తి అనియత
    2వ పద్యము 3వపాదములో “నిమీలితాక్షుడగునో”అని ‘చు’అదనముగా పడింది.

    రిప్లయితొలగించండి
  23. త్యాగమ్ముల్ పొనరించు పత్నిని సదా యత్యంత హించించుచున్
    రాగమ్మున్ వెలయాలు పైనునిచి దుర్మార్గమ్ములన్ జేయుచున్
    సాగన్ పృథ్విని పూర్వజన్మమునిదౌ శాపమ్మెవెంటాడ దు
    ర్యోగాభ్యాసములోన భ్రష్టుఁ డయినన్ యోగ్యుండు ముక్తింగనన్

    రిప్లయితొలగించండి
  24. యోగములేమెరుగక నే
    రాగముతో సేవచేసి రయమున వనికిన్
    సాగుచు నెంగిలి యొసగిన
    యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్

    రిప్లయితొలగించండి