1-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్”
(లేదా...)
“సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
1-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్”
(లేదా...)
“సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
31-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారి యనెను సుభద్రతో సవ్యసాచి”
(లేదా...)
“సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్”
(విరించి గారికి ధన్యవాదాలతో...)
30-10-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మనకుండిన మంచిదగు సమస్యలు సతమున్”
(లేదా...)
“మనకు సమస్యలుండిననె మంచిదగున్ గద సర్వవేళలన్”
29-10-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆడువారిని తన్నుటే న్యాయ మగును”
(లేదా...)
“ఆడువారినిఁ దిట్టి దన్నుటె న్యాయమౌ గద యెంచినన్”
28-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్”
(లేదా...)
“గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా”
27-10-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ”
(లేదా...)
“హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ”
(వి.వి. సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలతో...)
26-10-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె”
(లేదా...)
“అర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా”
25-10-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు”
(లేదా...)
“వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
24-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వానరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో”
(లేదా...)
“వానరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో”
(ఈ సమస్యను పంపినదెవరో గుర్తు లేదు. వారికి ధన్యవాదాలు)
23-10-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుండె నరుల కొసఁగుఁ బూర్ణసుఖము”
(లేదా...)
“పుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్”
22-10-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్”
(లేదా...)
“రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో”
21-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరభార్యాసంగమమును వద్దనఁ దగునా”
(లేదా...)
“పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే”
20-10-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్”
(లేదా...)
“ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా”
19-10-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్”
(లేదా...)
“పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా”
18-10-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంతి తల్లి యగు శకుంతలకును”
(లేదా...)
“కుంతియె తల్లి యయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్”
17-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై”
(లేదా...)
“లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్”
(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)
16-10-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్”
(లేదా...)
“భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్”
(అయ్యగారి కోదండరావు గారికి ధన్యవాదాలతో)
15-10-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్”
(లేదా...)
“బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే”
14-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”
(లేదా...)
“సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”
13-10-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్”
(లేదా...)
“సురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్”
12-10-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు”
(లేదా...)
“సరి యననొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్”
(ఆశావాది ప్రకాశరావు గారు పూరించిన సమస్య)
11-10-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము”
(లేదా...)
“జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ”
(ఆశావాది ప్రకాశరావు గారు పూరించిన సమస్య)
10-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు”
(లేదా...)
“తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో”
(నేను నేపాల్ వెళ్ళి ఉంటే ఈరోజు కాట్మండు పశుపతి దర్శనం)
9-10-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్”
(లేదా...)
“కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్”
8-10-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు”
(లేదా...)
“ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసిరేలనో”
(నేను నేపాల్ వెళ్ళి ఉంటే ఈరోజు ముక్తినాథుని దర్శనం)
7-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా”
(లేదా...)
“మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో”
6-10-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాదము మోదమిడె భీషణమ్ముగ మ్రోగన్”
(లేదా...)
“ప్రీతినిఁ గూర్చె నాదమది భీషణమై నినదింప నెల్లెడన్”
5-10-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్”
(లేదా...)
“పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె నద్వైతంబు బోధించుచున్”
(నేను నేపాల్ వెళ్ళి ఉంటే నేడు లుంబినీ దర్శనం)
4-10-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒప్పు శంకరపూజ లయోధ్యలోన”
(లేదా...)
“అయోధ్యలోని మందిరమ్మునందు శంభుఁ గొల్వుమా”
(నేను నేపాల్ యాత్రకు వెళ్ళి ఉంటే నేడు అయోధ్యలో బాలరామ దర్శనం)
3-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్”
(లేదా...)
“నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా”
2-10-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్”
(లేదా...)
“పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా”
(పితృ అమావాస్య సందర్భంగా...)