4, అక్టోబర్ 2024, శుక్రవారం

సమస్య - 4902

5-10-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్”

(లేదా...)

“పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె నద్వైతంబు బోధించుచున్”

(నేను నేపాల్ వెళ్ళి ఉంటే నేడు లుంబినీ దర్శనం)

13 కామెంట్‌లు:


  1. కందం
    నవరాత్రి పర్వమున నీ
    వవలక్షణుని ప్రవచనము నందింప మనన్
    వివరమ్మెఱుగని కూతల
    "నవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్"

    మత్తేభవిక్రీడితము
    శరదిందుజ్జ్వల రాత్రులన్ జననియా శర్వాణి పర్వమ్మునన్
    స్మరణీయంబగు గాథలన్ బ్రతి దినంబందున్ ప్రబోధింపగన్
    గొరగాడంచును పేరుఁగొన్న ఘనునిన్ గూడంగ నా బోధలన్
    "పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె నద్వైతంబు బోధించుచున్"

    రిప్లయితొలగించండి
  2. ఎవరే రీతి దలచినను
    "అవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్”
    వివరముగ నేనెరుగ నది
    సవరించుటకై తగనిది సత్యమొకటియే

    రిప్లయితొలగించండి
  3. కం॥ అవలంబించ నహింసయె
    యవనిన్ బోధించె బుద్ధుఁ, డద్వైతమ్మున్
    భువిలో శంకర పాదులు
    వివరించి తెలిపిరి జనులు విహితము నరయన్

    మ॥ ధరలో సత్యమ హింసయున్ జనులు సంధానించి వర్తిల్లఁగన్
    బరమోత్కృష్టమటంచు బుద్ధుడనె, నద్వైతమ్ము బోధించుచున్
    విరియన్ శంకర పద్మపాదులటు సద్విద్యా సుధావాహినుల్
    పరమున్ బొందెడి మార్గమున్ జనులు సంప్రాప్తించఁగన్ జూపెనే!

    రిప్లయితొలగించండి
  4. వరమౌభారత సంస్కృతిన్ విరిసె భవ్యంబైన నుద్బోధనల్
    ధరలో ధర్మములన్నిటన్ బ్రవరమౌధర్మంబు బౌద్ధంబదే
    పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె, నద్వైతంబు బోధించుచున్
    పరమాచార్యుడు శంకరుండు బఱచెన్ ప్రాబల్యమీ త్రోవకున్

    రిప్లయితొలగించండి
  5. అవలోకించిన వాదము
    సవివరముగ తెల్పినాడు శంకరుడిలలో
    భువనము మెచ్చు విధంబున
    నవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్

    గురువర్యుండన నాది శంకరునిగా కోట్లాది భావింపగన్
    బరిపూర్ణంబగు జ్ఞాన యోగ పటువై వాక్రుచ్చె నద్వైతమే
    స్థిరచిత్తుండగు వాడు కాన ఘనుడై సిద్ధాంతియై బ్రహ్మమే
    పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె నద్వైతంబు బోధించుచున్

    [బుద్ధుఁడు = విద్వాంసుడు]

    రిప్లయితొలగించండి

  6. అవివేకివి నిను గాంచగ
    కువలయమున నిన్ను మించు కూళుడు గలడే
    యెవడిట్టుల వచియించెనొ
    యవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్?


    స్థిరమౌ జ్ఞానము పంచగా జనులకున్ శ్రీశంకరాచార్యులే
    ధరలో నాల్గు చెఱంగులున్ దిరుగి తా ధర్మంబు బోధించుచున్
    స్మరణీయంబగు బోధనల్ విరివిగా ఛాత్రుండకే చెప్పుచున్
    పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె నద్వైతంబు బోధించుచున్.

    (బుద్ధుడు= జ్ఞాని.....శంకరభగవత్ఫాదులు)

    రిప్లయితొలగించండి
  7. ప్రవి మల బౌ ద్ధ మతము దా
    నవని న్ బోధిం చె బుద్ధు:: డ ద్వై త మ్ము న్
    సు వి ధ మ్మని బో ధి o చ గ
    భువి జను లకు శంక రుండు బూ జ్యు o డ య్యె న్

    రిప్లయితొలగించండి
  8. వివరంబుగ హింసాచ్యుతి
    నవనిన్ బోధించె బుద్ధుఁ, డద్వైతమ్మున్
    భువిలో శంకరపాదులు
    ప్రవరమ్ముగ పాదుకొలిపి ప్రఖ్యాతిగొనెన్

    రిప్లయితొలగించండి
  9. వివరింపబుద్ధుడనగను
    సవికాశసయోగిరత్న‌ శంకర‌ భగవాన్‌
    కవిగారందుకుపలికిరి
    యవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్?


    హవములులేకనహింసయె‌
    యవనిన్‌ బోధించె‌ బుద్ధుఁ, డద్వైతమ్మున్‌
    అవలంబింపగ‌జేయుచు
    పవిలా‌ శంకరులునిలిపె‌ బలహైందవమున్‌

    రిప్లయితొలగించండి
  10. సు విశాల బోధి దివ్య త
    రువు చెంతను బోధ మంది రుచిరము నే కై
    క విశుద్ధ భూత దయనే
    యవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్

    [అద్వైతము = ఏకైకము( రెండవది లేనిది]


    పరమాత్మాత్మలు గాంచ నొక్క టని యద్వైతంబు నిష్కర్షగాఁ
    బరఁగం జేసెను మానవావలికి సంప్రాప్తింప మోక్షంబు దా
    నర లోకమ్మున నాది శంకరుఁడు ధ్వాంతఘ్నస్వ తేజుండునై
    పరమోత్కృష్ట మటంచు బుద్ధుఁ డనె నద్వైతంబు బోధించుచున్

    [బుద్ధుఁడు = విద్వాంసుఁడు]

    రిప్లయితొలగించండి
  11. కం:వివరముగ నేను లేదని
    యవనిన్ బోధించె బుద్ధుఁ, డద్వైతమ్మున్
    బ్రవచించు శాంకరమ్మున
    ధ్రువముగ జీవుండు బ్రహ్మరూపమె శిష్యా!
    (బుద్ధుడు ఆత్మ అంటూ ఒక అస్తిత్వం లేదన్నాడు.శంకరుడు కూడా బ్రహ్మం మాత్రమే సత్యం,జీవుడు బ్రహ్మమే అన్నాడు.శంకరుడు బ్రహ్మం అనే శాశ్వత సత్యాన్ని అంగీకరించినా బుద్ధుడు దాన్ని చెప్పకున్నా జీవాత్మని పరిపూర్ణసత్యం గా అంగీకరించక పోవటం లో ఇద్దరూ సమానులే.అనేది నా సమన్వయం.)

    రిప్లయితొలగించండి
  12. మ:పరహింసన్ విడనాడి, తృష్ణ విడువన్ బ్రాప్తించు నిర్వాణమే
    పరమోత్కృష్టమటంచు బుద్ధుఁడనె, నద్వైతంబు బోధించుచున్”
    నరజన్మమ్మున శ్రేష్ఠ మెన్నడును జ్ఞానమ్మే యదే నీకు శం
    కరమౌ నంచనె శంకరుండు పరమజ్ఞానుల్ కదా యిర్వురున్.
    (బుద్ధుడి ప్రేమ, శంకరుని జ్ఞానం రెండూ గొప్పవే.)

    రిప్లయితొలగించండి
  13. నవతను చాట నహింసను
    నవనిన్ బోధించె బుద్ధు డద్ద్వైతమ్మున్
    భవబంధములనువీడుచు
    జవముగబోధించె ప్రజకు శంకర గురుడే

    రిప్లయితొలగించండి