16, అక్టోబర్ 2024, బుధవారం

సమస్య - 4914

17-10-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై”

(లేదా...)

“లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్”

(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...) 

17 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      దయగల దైవము శ్రీహరి
      నియమము వీడక గొలువుడు నిష్ఠ తలిర్పన్
      స్వయముగ బ్రోచు దురితజన
      లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై


      చంపకమాల
      దయగల శ్రీహరిన్ గొలువ దక్కును శ్రేయము నిశ్చయంబుగన్
      భయమున నేనుగే శరణు భక్తిని వేడగ దిక్కునీవనన్
      రయమున వచ్చి కాచెనె నిరాయుధుఁడౌచు వికుంఠమన్ పురా
      లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్

      తొలగించండి

  2. దయగల ప్రభువాతండై
    స్వయముగ తా సప్తగిరుల పై వెలసెనె య
    వ్యయుడాతండే భవభయ
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై.


    దయగల వాడటంచు పరితాపము తీర్చు నెపమ్ము తోడ తా
    స్వయముగ నిల్చెనందురిల భక్తవశంకరు డైన యట్టి య
    వ్యయుడట వేంకటాచలమునందున నట్టి పవిత్ర మైన యా
    లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  3. భయమేలేదనినిలచును
    లయ కారుడు, సౌఖ్యమిచ్చులచ్చిమగండై
    రయమునకాచునుభువిలో
    దయతోనుండెగపరమును ధర్మమురూపై

    రిప్లయితొలగించండి
  4. భయమదిలేదురాయనునుభైరవమూర్తిగ వల్లకాటిలో
    లయమునకాదిదైవతము, లచ్చిమగండతడిచ్చుసౌఖ్యముల్
    జయమునుభోగముల్గనగచాలగకోరగచ్ద్విలాసుడై
    దయగలవారలిర్వురునుధర్మముదప్పనివారికెందునున్

    రిప్లయితొలగించండి
  5. నియమమ్ముగ గొలిచిన నా
    లయమందలి వేలుపిచ్చు రయముగ వరముల్
    భయహరుఁడు సురల, కసురుల
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై

    రిప్లయితొలగించండి
  6. చయమున భక్తజన మనో
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై ,
    దయ జూపుచు నెల్లపుడును
    జయము నొసగుచుండునుగద జనులందరికిన్

    రిప్లయితొలగించండి
  7. రయముగవరములనొసగును
    *“లయకారుఁడు, సౌఖ్యమిచ్చు లచ్చిమగండై”*
    భయములు బాపుచు శ్రీహరి
    స్వయముగతానిచ్చుచుండుసంపదలెపుడున్


    భయములుబాపుచున్ సతము పన్నగ భూషణు డిచ్చుమోదమున్
    *“లయమున కాదిదైవతము, లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్”*
    నియమముతోడకొల్చుచును నిష్టగ చేయుచునున్నపూజలన్
    స్వయముగతానొసంగుచునుసంతసమొందుచుభక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
  8. కం:భయ మేలనో? అనాథా
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై
    జయ మిడెడు క్షీర సాగర
    శయనుని వలె దీనజనుల సంరక్షకుడై
    (అనాథాలయకారుడు=అనాథాలయం కట్టించిన వ్యక్తి.)

    రిప్లయితొలగించండి
  9. నియమము లాచరించి హరినింగడు భక్తిపురస్సరమ్ముగా
    దయగొనుమంచు గొల్వఁగ నుదాత్తుఁడొసంగును వాంఛితమ్ములన్
    భయహరుఁడయ్యె వేల్పులకు భక్తజనాళికి రక్షకుండు నా
    లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  10. చం:నయ మొనరించు బాధ లని నల్వురు గొల్చెడు నీ యుమామహేశ్వరా
    లయమున మూలమూర్తిగ కలండు శివుండు శుభప్రదాతయై
    దయ గని, సంతునిచ్చు ప్రథ దాల్చిన యా మురళీమనోహరా
    లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్”
    (ఒకటి శివాలయము.మరొకటి విష్ణ్వాలయము.)

    రిప్లయితొలగించండి
  11. జయతిలకమ్ము ఫాలమున, చందన చర్చితమైన దేహమున్
    నయముగ చేత కంకణము, నాసికపై నవమౌక్తికమ్ము గో
    చయము ముదంబుకై మురళి, సర్వము దాల్చి గమించెనా విశా
    ల యమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్!!

    రిప్లయితొలగించండి
  12. నియమమున గొలుచు వారికి
    లయకారుడు సౌఖ్య మిచ్చు :లచ్చి మగండై
    భయమును బో ద్రోలి జనుల
    నయమున కాపాడు గాదె నమ్మిన వారిన్

    రిప్లయితొలగించండి
  13. దయ గలవాడు త్రిధాముడు
    రయమున భక్తులను గాచు ప్రాణదుడతడే
    భయహర్త భక్త హృదయా
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చిమగండై

    దయగల వాడు భక్తులకు దన్నుగ నిల్చిన వేలుపాతడే
    రయమున లోకరక్షణకు రాక్షసులన్ వధియించు నేర్పుతో
    జయమును కూర్చువాడు దనుజారి శుచిశ్రవుడంబుజాసనా
    లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  14. కం॥ భయము నిలిపి సజ్జనులను
    దయావిహీనతను నలఁచు దైత్యాధములన్
    నయముగ దుష్టులఁ దునిమెడి
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చి మగండై

    చం॥ భయమును నిల్పి సజ్జనుల బాధలు వెట్టుచు యజ్ఞ యాగముల్
    రయముగ భగ్న మొందుటకు రాక్షస మూకలు చేయు కృత్యముల్
    నయముగఁ బాప పంకిలము నాశమొనర్చుచుఁ జేటుఁ బాపెడిన్
    లయమున కాదిదైవతము లచ్చి మగం డతఁడిచ్చు సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  15. జయము నొనగూర్చు భక్త ని
    చయమునకు నిరంతరమ్ము సమ్మద లీలన్
    భయకర దుస్సహ రాక్షస
    లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చి మగండై


    భయ దురి తాపహార సిత పన్నగ తల్ప విలాస సుస్రవ
    ద్వియదమ లాపగా చరణ భీకర చక్ర ధరారవింద వ
    న్నయనుఁడు బ్రహ్మ రుద్ర సుర నాథ సురాళి సమేత తీక్ష్ణ కా
    ల యమున కాదిదైవతము లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్”

    రిప్లయితొలగించండి