17, అక్టోబర్ 2024, గురువారం

సమస్య - 4915

18-10-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కుంతి తల్లి యగు శకుంతలకును”

(లేదా...)

“కుంతియె తల్లి యయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్”

26 కామెంట్‌లు:


  1. తల్లిదండ్రులచట తనయను విడనాడి
    కఠిన హృదయులగుచు కదలి పోగ
    గాంచి శిశువు నచట కాపాడి నట్టి శ
    కుంతి తల్లి యగు శకుంతలకును.

    (శకుంతి=పక్షి)

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    కౌగిట బిగియింప కౌశికుడు భ్రమసె
    వజ్రిపంపినట్టి వలపురాశి
    పరిమళంపుపుట్ట తరుణిగ మేనక
    కుంతి, తల్లి యగు శకుంతలకును

    ఉత్పలమాల
    పంతము పట్టి పంపనల వజ్రియె మేనక సోయగమ్మునం
    దంతటి కౌశికుండు తపమాపుచు కౌగిట జిక్కి కేళిలో
    సొంతము గాగ మేనకయె సూనను బొందఁగ సౌరభమ్మునన్
    గుంతియె, తల్లియయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్!

    (కుంతి = రేణుకయను గ్రంధద్రవ్యము)

    రిప్లయితొలగించండి
  3. మంత్రమహిమబుట్టె మా రాజు కర్ణుడు
    కుంతితల్లియగుశకుంతలకును
    మేనమాతయయ్యె మీరగాతపసియు
    బిడ్డవీడిచనిరి వింతగాదె

    రిప్లయితొలగించండి

  4. దుంతవయాళికానికి సుతుండగు ధర్మజు కన్నతల్లి యే
    యింతియొ తెల్పుమంచు మరి యెవ్వరి కిన్ భరతుండు పుట్టెనో
    పంతము వీడి చెప్పుమన భామయె యుత్తరమిచ్చె నిట్టులన్
    కుంతియె తల్లి యయ్యెను , శకుంతలకంచు వచింత్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  5. వింతగసూర్యుమంత్రమునబిడ్డడుకర్ణుడుజన్మనందగా
    కుంతియెతల్లియయ్యెను, శకుంతలకంచువచింత్రుపండితుల్
    వంతమిగిల్చెమేనకయువైనములేనిమహర్షిపొందుతో
    చింతనులేనిమాతలుగచేకొనజాలరుమాతృప్రేమనే

    రిప్లయితొలగించండి
  6. పంచపాండవులను పెంచిన పడఁతియె
    కుంతి తల్లి యగు, శకుంతలకును
    తల్లి మేనకయగు తండ్రి కౌశికుడగు,
    భరతు గన్నతల్లి భవ్య చరిత.

    రిప్లయితొలగించండి
  7. ఆ॥ కమలధరుఁ గొలచిన కతన భానుజునకు
    కుంతి తల్లి యగు, శకుంతలకును
    బ్రాణము నిలిపెఁ గద పక్షులు రెక్కలఁ
    గప్పి హింస్రకముల ముప్పుఁ బాపి

    ఉ॥ వింతగ ముద్దు కన్యగనె వేడఁగ సూర్యుని జ్ఞానశూన్యతన్
    గుంతియె తల్లి యయ్యెను. శకుంతలకంచు వచింత్రు పండితుల్
    చెంతకుఁ జేరి రెక్కలను జిహ్వరదమ్ములె కప్పి కాచెనే
    కొంతయుఁ గాంచనీయకను గ్రూరమృగమ్ములు రక్షసేయుచున్

    కమలధరుడు సూర్యుడు
    భానుజుడు కర్ణుడు
    హింసక్రము క్రూరమృగము
    జిహ్వరదము పక్షి
    నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  8. భారతమున గనగ పంచపాండవులకు
    కుంతి తల్లి యగు ; శకుంతలకును
    మేనక యగు మాత , మేఘవాహను కడ
    నామె సుందరమగు యప్సరసయె

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. సొంత బిడ్డఁ వీడ చింతింప కుండెగా
      వింత నడత నొరసి కుంతి యనగ
      మేనక నరయంగ తానొక యభినయ
      కుంతి తల్లి యగు శకుంతలకును

      కుంతల రాజపుత్రికను కుంతిగ పేర్కొను చుంద్రు సత్యమే
      సుంతయు జాలిలేక మరి సొంత కుమారుని వీడు భామనే
      కుంతియనంగ మేనకయె, కొందరు విజ్ఞులు పోల్చి చూడగా
      కుంతియె, తల్లి యయ్యెను శకుంతలకంచు వచింత్రు పండితుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. శాంతుఁడు ధర్మజున్ గనిన సద్గుణవల్లియు దాన కర్ణునిన్
    సంతుగ పొందినట్టి ఘన సచ్చరితెవ్వరు? విశ్వమిత్రుడే
    యింతికి జన్మనిచ్చె నతఁడేర్పడ గూడఁగ నప్సరాంగనన్?
    కుంతియె తల్లి యయ్యెను, శకుంతలకంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  11. సూర్య పుత్రు డైన సూత కర్ణునకును
    కుంతి తల్లి యగు :: శకుంతల కును
    భరతు డే సుతు o డు భారత మున కాత o
    డ య్యె మూల మందు రార్యులు గద

    రిప్లయితొలగించండి
  12. ఆ.వె:భరత వంశగాధ వన్నె బెంచెడు తల్లి
    కుంతి తల్లి యగు, శకుంతలకును
    వారసత్వకీర్తి వర్థిల్ల జేసెడు
    శాంత మూర్తి కాదె కుంతి యనగ!
    (కుంతీ దేవిని గౌరవ సూచకం గా కుంతి తల్లి అన్నాను.కుంతి ఆదర్శప్రాయురా లైన తల్లి.శకుంతల యొక్క వంశపు కోడలు కనుక శకుంతలకు కీర్తి తెచ్చింది.)
    ఉ:"ఎంతటి ఘోరమో!ఒక నరేశుడె పెండిలి యాడి బిడ్డనున్
    కాంతను కాదు పొమ్ననుట గాదె శకుంతల గాధలోన!భా
    స్వంతుని పుత్రునిన్ గనియు భానుదయన్, కడు బాధ లొందుటన్
    కుంతియె తల్లి యయ్యెను శకుంతల "కంచు వచింత్రు పండితుల్.
    (భర్త,కొడుకు తో శకుంతల ఒక బాధ పడగా కుంతి సూర్యుడి తో కర్ణుని తో అంతకంటే బాధ పడింది.బాధలలో కుంతి శకుంతలకి తల్లి వంటిది.)

    రిప్లయితొలగించండి