15, అక్టోబర్ 2024, మంగళవారం

సమస్య - 4913

16-10-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్”

(లేదా...)

“భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్”

(అయ్యగారి కోదండరావు గారికి ధన్యవాదాలతో)

16 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      సక్తతఁ జూపి వరూధిని
      రక్తిని గూర్ఛంగ నిలువ ప్రవరాఖ్య! నిరా
      సక్తతె? భువి విలువలపై
      భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్!

      ఉత్పలమాల
      సక్తతఁ జూపి యప్సరస సందిటఁ జిక్కుదునంచు కేళిలో
      రక్తినిఁ గూర్తునంచు ప్రవరాఖ్య! వరూధిని చేరఁగన్ నిరా
      సక్తత ధర్మసూత్రముల సాగుదె తాకక? కట్టుబాట్లపై
      భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్!

      తొలగించండి
  2. సక్తజూపకవిషయము
    ముక్తినిగోరుచుపదపడిమోక్షేచ్ఛమదిన్
    రక్తముపాతమునందున
    భక్తినివిడుమయ్య నరుడస్వర్గముదక్కున్

    రిప్లయితొలగించండి
  3. సక్తతజూపకన్విషయసంపదయందునవీతరాగివై
    ముక్తమునైనయట్టిమనమోడకసాధనయందునిల్పుచున్
    భుక్తిని నాసజేయుమదిభూరియశస్సునలక్ష్మిగోరునా
    భక్తినివీడుమానరుడ! స్వర్గముమోక్షమునందగోరినన్

    రిప్లయితొలగించండి

  4. ముక్తి యదేల ప్రవర యను
    రక్తిని చూపించ మంచు రమణి పిలువ నా
    సక్తిని చూపు మనవసర
    భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్.


    రక్తిని వీడకుండ నను రాగము జూపుచు లోటు చేయకన్
    భుక్తి నొసంగు ధర్మమది, బుద్భుద మైన సుఖమ్ము గోరుచున్
    శక్తికి మించి కష్టపడి సంపద గూర్చుటయేల బైసిపై
    భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్.

    రిప్లయితొలగించండి
  5. యుక్తిగ మీ వెతనుండి వి
    ముక్తి కలుగజేసెదమని పొచ్చెము సలుపన్
    శక్తిగల నాయకులపై
    భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్

    రిప్లయితొలగించండి
  6. కం॥ త్యక్తముఁ జేసి యహమునిల
    శక్తిగ భగవంతుని యటు సర్వము నీవే
    ముక్తిఁ గనుమని యిహముపై
    భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్

    ఉ॥ త్యక్తముఁ జేసి కర్తనను హావము భావముఁ దత్పరుండవై
    శక్తినిఁ గాంచి దైవమును సర్వము నీకృప యంచు శ్రద్ధతో
    ముక్తినిఁ గోరి కొల్చుచును బుద్ధిగ నైహిక సౌఖ్యసిద్ధిపై
    భక్తిని వీడుమా నరుఁడ స్వర్గము మోక్షము లందఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  7. రక్తిని వీడనిచో నీ
    శక్తి నిరర్థక మగునను సత్యమెరుగవా
    ముక్తికొరకు, జోడింపగ
    భక్తిని, విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్

    రక్తిని వీడకున్న ననురాగపు బంధము లడ్డగింపగా
    శక్తి నిరర్థకం బగును సంసృతి బంధము లంతమొందగా
    ముక్తికి మార్గమేర్పడక పోదు హుటాహుటిఁ, బెంపుజేయగా
    భక్తిని, వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్

    రిప్లయితొలగించండి