9, అక్టోబర్ 2024, బుధవారం

సమస్య - 4907

10-10-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు”

(లేదా...)

“తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో”

(నేను నేపాల్ వెళ్ళి ఉంటే ఈరోజు కాట్మండు పశుపతి దర్శనం)

25 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నాటి శైవ ద్వేషులైన వైష్ణవుల ప్రచారం:

      తేటగీతి
      హృదయమందు లక్ష్మినిదాల్చి యింపుగాను
      సృష్టి స్థితికారుఁడౌ శౌరి సేమమొసగు
      కాటి వాసి నసమనేత్రు గరళగళుని
      పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు!

      చంపకమాల
      సిరులకు మాలమౌ రమయె చేరియు మానసమందు నిల్వగన్
      హరి స్థితికారుఁడై మెరసి యర్చనఁ జేసిన శ్రేయమందెడున్
      నిరతము కాటిలో దిరుగు నీలగళున్ లయకారుఁ డంచనన్
      దిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో!


      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. తే॥ వరదుఁడు శివుఁడు సులభుఁడు భక్తులకిల
    నొసఁగుఁ దరియించ జనులకు నొనరు గాను
    బశుపతినిఁ గొల్వ సకలసంపదలు, దొలఁగు
    ధనము జూదము నాడఁగఁ దప్పకుండ

    చం॥ వరదుఁడు శంకయేలనొకొ భక్తుల కాప్తుఁడు నంబరీషుఁడే
    కరములఁ జోడ్చి మ్రొక్కుచును గాంచఁగ భక్తిని నమ్రులై మహిన్
    దిరమగు సంపదల్ పశుపతిన్ దరసించిన, లుప్తమౌనయో
    మరుగుచు మద్యపానమును మక్కువ నొందుచు నాడ జూదమున్

    రిప్లయితొలగించండి
  3. వెడ యనగనేల నిజముగ విభవమబ్బు
    పశుపతినిఁ గొల్వ ; సకలసంపదలు దొలఁగు
    దుష్టులను జేరి వారితో దొరయుచుండి
    కాలమును వృధా చేయుచు గడుపుచుండ

    రిప్లయితొలగించండి
  4. శాశ్వతానందమునుగూర్చు సాధనమ్ము
    మోదమలరఁగ జూపించు ముక్తి పథము
    పశుపతినిఁ గొల్వ, సకలసంపదలు దొలఁగు
    నైహికములకొరకునీశు నర్చఁ జేయ

    రిప్లయితొలగించండి
  5. కరివరదున్ పరాత్పరుని కామితముల్ నెరవేర వేడఁగన్
    కరుణను జూచి భక్తుల కఖర్వముగానిడు శాంతి సౌఖ్యముల్,
    తిరమగు సంపదల్, పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో
    వరముగ పాపసంచయము జ్వాలను తూలము దగ్ధమౌ విధిన్

    రిప్లయితొలగించండి
  6. కలత చెందకు మంటినో చెలియ వినుమ
    వాస్తవమ్మ వచింతును, ప్రాప్త మగును
    పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు
    కాలకంఠికాలిడినంత కలిమియెల్ల.


    సిరులను గోరువారికిల క్షేమమొసంగుచు భక్తకోటికిన్
    భరమని యెంచబోవక నుపార్జమొసంగగ చేరునింక నా
    తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో
    కరిసము లన్న మాట యది కల్లయటంచు వచింపబోకుమా.

    రిప్లయితొలగించండి
  7. భక్త సులభుడు వరదుడు పరమశివుడు
    వరము లాశింప శీఘ్రమే తొరలివచ్చు
    పశుపతినిఁ గొల్వ సకలసంపదలు, దొలఁగు
    నెల్ల పాపముల్ శుభములు వెల్లువగును

    నిరుపమ భక్త రక్షకుడు నిర్గుణ హంసుడు నీలకంఠుడే
    వరముల నీయ భక్తులకు వైళమె తార్కొను వేలుపాతడే
    తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో
    దురితము లన్నియున్ దొలగు దుర్భర దుస్థితి దైన్యమంతమౌ

    రిప్లయితొలగించండి
  8. తరగని కామమున్ పెను మదమ్మును క్రోధము లోభమోహముల్
    పెరిగిన మత్సరమ్ము మురిపించి హసించి నశింపజేయవే!
    తురమగ లేని వైరులవి! దుష్టుని జీవితమందునవ్వియే
    తిరమగు సంపదల్! పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో!!

    రిప్లయితొలగించండి
  9. భవుని నామము స్మరియించి భక్తి గొలువ కోర్కె లన్నియు ఫలియించు కువ ల య మున
    ననుచు పెద్దలు వచియింప నవని నెందు
    పశుపతిని గొల్వ సకల సంపదలు దొలగు?

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:గొర్రెలను గాచు వానిని గొలిచినంత
    గోవులను గాచు వానిని గొలిచినంత
    సంపదలు కల్గ నే రీతి శైవభక్తి
    బశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు”?
    (ఏసు క్రీస్తు గొర్రెల కాపరి.కృష్ణుడు గోపాలుడు.శివుడు పశుపతి.వాళ్లని కొలిస్తే సంపదలు వచ్చి పశుపతిని కొలిస్తే పోతాయా?)

    రిప్లయితొలగించండి
  11. మరువకమూడు ప్రొద్దులునుమానసమందు న దీక్ష బూనుచున్
    స్థిరమగుబుద్ధితోగొలువతీరుగనబ్బునుభక్తితోసదా
    *“తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో”*
    నెరుగకచేయుదోషములునిమ్ముగనీశుదయార్ధ్రదృష్టితో


    రిప్లయితొలగించండి
  12. కోరు వారల కందును కూర్మితోడ
    *“పశుపతినిఁ గొల్వ సకలసంపదలు ,దొలఁగు”*
    చెంతనున్న సంపద లెల్ల శీఘ్రగతిని
    నీల గళుని సతతమిల నిందచేయ

    రిప్లయితొలగించండి
  13. చం:స్థిరమగు భాగ్య మజ్ఞతను జీల్చెడు జ్ఞానమె కాదె దానినిన్
    హరుడె యొసంగు భౌతికము లై కనుపించెడి వేవి కావు నీ
    తిరమగు సంపదల్, పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో
    స్థిరమును వీడి యస్థిరము జేకొను మాయ నిమేష మందునన్.

    రిప్లయితొలగించండి
  14. చదువు లబ్బవు పొలములు క్షయము లౌను
    సంతు సిక్కదు శకటము లంతము లగుఁ
    దఱుగుఁ బశువులు మదిలోనఁ దలఁప వేని
    పశుపతినిఁ గొల్వ సకల సంపదలు దొలఁగు


    అరుగక చెంత సంతతము నంజలి నచ్చట నుంట యొక్కటే,
    పెరుగును భక్తి తత్పరత పెల్లుగ సంతస మందు డెందమే
    దురితము లెల్ల ముక్క లగు దుఃఖము లాఱును వెల్గుఁ గొల్లలై
    తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌ నయో

    రిప్లయితొలగించండి