1-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్”
(లేదా...)
“సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
కందంలజ్జ యొకింతయు లేకయెబొజ్జలు పెంచంగఁ దోచి బొక్కసమయొయో!యజ్జగని యెన్నిక గెలువసజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్ఉత్పలమాలలజ్జయొకింతలేక తమ రాజ్యమటంచును స్వార్థచిత్తులైబొజ్జలు పెంచగన్ బ్రభుత బొక్కసమున్ దిగ మ్రింగి నేతలైయజ్జ యటంచు నెన్నికల నందలమెక్కఁగ పంచి కాన్కలన్సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్
పజ్జనుజేరగవిష్ణునికజ్జాలాడిశత్రువులుగ ఖలులైరిగదాలజ్జనులేకనుదౌష్ట్యముసజ్జనుల ప్రజకుహితమొసంగెదరసురుల్
అజ్జరె! మాధవుండె వటుడాకృతి దాల్చి సురారి వద్దకున్ గుజ్జుగ వచ్చి కోరెనడుగుల్ మరి మూడు బలిన్ యశోధనున్లజ్జకు పాత్రుడయ్యె బలి రాక్షస నాయక పాలనంబునన్సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్!!
ఒజ్జయె యోర్మి వహించుచువెజ్జుకు తెలిపె విషయము, విభీషణు డతడాసజ్జన సచి పాలనలో సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్.ఒజ్జ యతండు చెప్పు సమయోచిత గాధల వాడటన్ బుజ్జియవార్తవన్ నిదుర బుచ్చుచు పేర్మి వచించె నిట్టులన్ సజ్జన మైత్రితో నసుర జాతి విభీషణు బాలనమ్ములోసజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్.
సజ్జన సాంగత్యమ్ముననిజ్జగమున దుర్జనుండు హితకారియగున్రజ్జుగ మారును భుజగముసజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్
మజ్జారె ! వాడుక బదలెపిజ్జా హట్టు నికటమున వేడిగ మిర్చీబజ్జీ తినిపించి నపుడుసజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్
జజ్జర కారులు దనుజులుసజ్జను లైరను దలంపు సన్మానితమా?రజ్జన విడి తెల్పుమెపుడుసజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్?జజ్జరకార్లు దానవులు సంబ్రముఁ వీడుదురా స్వభావమున్సజ్జనులైతిరా యనుచు సంశయ మెవ్విధి కల్గియుండెనోరజ్జులు పల్కగా దగునె రక్కొని గ్రమ్మఱి తెల్పు మెచ్చటన్సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్?
సజ్జనకోటి సంగతము సర్వ శుభంబులకాలవాలమైయిజ్జగమందు శాంతి సుఖమేర్పడ గూర్చును నిశ్చయమ్ముగావెజ్జులవంటి సజ్జనుల విజ్ఞతతో వ్యవహారశైలితోసజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్
కందం
రిప్లయితొలగించండిలజ్జ యొకింతయు లేకయె
బొజ్జలు పెంచంగఁ దోచి బొక్కసమయొయో!
యజ్జగని యెన్నిక గెలువ
సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్
ఉత్పలమాల
లజ్జయొకింతలేక తమ రాజ్యమటంచును స్వార్థచిత్తులై
బొజ్జలు పెంచగన్ బ్రభుత బొక్కసమున్ దిగ మ్రింగి నేతలై
యజ్జ యటంచు నెన్నికల నందలమెక్కఁగ పంచి కాన్కలన్
సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్
పజ్జనుజేరగవిష్ణుని
రిప్లయితొలగించండికజ్జాలాడిశత్రువులుగ ఖలులైరిగదా
లజ్జనులేకనుదౌష్ట్యము
సజ్జనుల ప్రజకుహితమొసంగెదరసురుల్
అజ్జరె! మాధవుండె వటుడాకృతి దాల్చి సురారి వద్దకున్
రిప్లయితొలగించండిగుజ్జుగ వచ్చి కోరెనడుగుల్ మరి మూడు బలిన్ యశోధనున్
లజ్జకు పాత్రుడయ్యె బలి రాక్షస నాయక పాలనంబునన్
సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్!!
రిప్లయితొలగించండిఒజ్జయె యోర్మి వహించుచు
వెజ్జుకు తెలిపె విషయము, విభీషణు డతడా
సజ్జన సచి పాలనలో
సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్.
ఒజ్జ యతండు చెప్పు సమయోచిత గాధల వాడటన్
బుజ్జియవార్తవన్ నిదుర బుచ్చుచు పేర్మి వచించె నిట్టులన్
సజ్జన మైత్రితో నసుర జాతి విభీషణు బాలనమ్ములో
సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్.
సజ్జన సాంగత్యమ్మున
రిప్లయితొలగించండినిజ్జగమున దుర్జనుండు హితకారియగున్
రజ్జుగ మారును భుజగము
సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్
మజ్జారె ! వాడుక బదలె
రిప్లయితొలగించండిపిజ్జా హట్టు నికటమున వేడిగ మిర్చీ
బజ్జీ తినిపించి నపుడు
సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్
జజ్జర కారులు దనుజులు
రిప్లయితొలగించండిసజ్జను లైరను దలంపు సన్మానితమా?
రజ్జన విడి తెల్పుమెపుడు
సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్?
జజ్జరకార్లు దానవులు సంబ్రముఁ వీడుదురా స్వభావమున్
సజ్జనులైతిరా యనుచు సంశయ మెవ్విధి కల్గియుండెనో
రజ్జులు పల్కగా దగునె రక్కొని గ్రమ్మఱి తెల్పు మెచ్చటన్
సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్?
సజ్జనకోటి సంగతము సర్వ శుభంబులకాలవాలమై
రిప్లయితొలగించండియిజ్జగమందు శాంతి సుఖమేర్పడ గూర్చును నిశ్చయమ్ముగా
వెజ్జులవంటి సజ్జనుల విజ్ఞతతో వ్యవహారశైలితో
సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్