7, అక్టోబర్ 2024, సోమవారం

సమస్య - 4905

8-10-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు”

(లేదా...)

“ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసిరేలనో”

(నేను నేపాల్ వెళ్ళి ఉంటే ఈరోజు ముక్తినాథుని దర్శనం)

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    జగమును నడిపెడు నతీతశక్తి యదియె
    దైవమనచు వెదుక మన తరమె చెపుమ!
    ప్రణవనాదమనుచు నంతరంగమందు
    ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు!

    ఉత్పలమాల
    శక్తి యదేదొ లేకయె విశాలజగమ్ము మనంగ నొప్పునే!
    భక్తి ప్రపత్తి నా యునికిఁ బల్కిరి దైవమటంచు ద్రష్టలే
    సక్తత వీడి కాపురము సాలటనన్ మనమందు కాక యా
    ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసిరేలనో?

    రిప్లయితొలగించండి
  2. పసిడి‌వంటి కాపురమును వదిలిపెట్టి
    తమిగొనినను మౌనిగ నుండు తమనువిడిచి
    మదిని యప్పుడప్పుడు దల్ఛు మానవునకు
    ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు

    రిప్లయితొలగించండి
  3. తే॥ రక్తి యిహసుఖములపై విరక్తిఁ గనుచు
    భక్తి హృదిని నిండ పరమ పదము నొసఁగు
    ముక్తి నిడు దైవమును, రోసె మునిగణంబు
    భవమె మోదమని పరఁగు ప్రజలఁ గనఁగ

    ఉ॥ భక్తినిఁ గాంచి తత్పరత పమ్ముకొనంగను బాహ్య హృష్టినిన్
    రక్తినిఁ గాంచకన్ హృదిని రాగము నింపుచు వేడికొందురే
    ముక్తినొసంగు దేవుని ముముక్షువు లెల్లరు, రోసిరేలనో
    భుక్తిని బాహ్య సౌఖ్యముల భోగముఁ గోరుచు మ్రొక్కనొందకన్

    రోయు అంటే వెదకు అనేఅర్థము నిఘంటువులో చూసానండి మరి రోసిరి అంటే వెదకిరి అనే అర్థము వస్తుందో రాదో తెలియక మానేశానండి. తెలిపిన వారికి అనేక ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. భక్తి మార్గమే కొనితెచ్చు ముక్తిననుచు
    శక్తి మీరంగ తమకోర్కె వ్యక్తమవగ
    యుక్తిపరులై నిరంతర యోగులగుచు
    ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు

    భక్తివిధానమే తమకు బ్రహ్మము నందగజేయు యోచనన్
    శక్తి కొలంది దైవమును సంతతమున్ గొలిచే ప్రబుద్ధులై
    ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసిరేలనో?
    యుక్తిగ చిత్తగించవలె యుక్తుల యత్నము ముక్తి కోసమే!

    [రోసి = వెతికి]

    రిప్లయితొలగించండి
  5. డా బల్లూరి ఉమాదేవి

    కొలుచు చుందురు మౌనులు గుండెలందు
    *“ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు”*
    ఆకులలములనుతినుచు అడవులందు
    తపముచేయుచుండ చెరచు దానవులను


    రిప్లయితొలగించండి

  6. నరుల కిలను ముఖ్యంబది నాస్తికత్వ
    మనుచు బోధించు చుండెడి యల్పుడొకడు
    స్నేహితులముందు సతతమ్ము నిందసేయ
    ముక్తి నిడు దైవమును, రోసె మునిగణంబు.


    శక్తిని నమ్ముకొంచు తగు సాధన జేయుటె ధర్మ మందు నా
    సక్తిని చూపగా వలయు స్కంభుడు హంసుడ టంచు నమ్మెడిన్
    వ్యక్తులు మూర్ఖులంచు నకృతాత్ముడు నిత్యము నిందసేయగా
    ముక్తి నొసంగు దేవుని , ముముక్షువు లెల్లరు రోసిరేలనో.

    రిప్లయితొలగించండి
  7. బాధ్యతలు సంకెలలనెడు భావనమున
    వదలి సంసారముల జేరి వనములందు
    మౌనిగామారి చివరకు మనసు చెదరి
    ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు

    రిప్లయితొలగించండి
  8. ముక్తమునొంద బాధ్యతల, బూని వనంబులకేగి యచ్చటన్
    మౌక్తికమట్లు మారి తమ మానసమం దనురక్తి నెక్కొనన్
    భక్తులయట్టులీశ్వరుని పావననామముగొల్చి పిమ్మటన్
    ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసిరేలనో

    రిప్లయితొలగించండి
  9. గొప్ప తపమును జేసిన కూడ తమకు
    దర్శనం బు ల నీయని దైవ మంచు
    ముక్తి నిడు దైవము ను రో సె ముని గణ o బు
    దిక్కు తెలియని వారైరి తెరువు లేక

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:తపములను వీడి, తమదైన దారి వదలి,
    వరమునన్ గోపబాలుని పరవశమున
    ప్రియుని గా జూచి, మథురమౌ ప్రేమ నొసగి,
    ముక్తి నిడు దైవమును రోసె మునిగణంబు”
    (మునులే గోపికలు గా రాముని వరం తో జన్మించారు.కృష్ణమోహం లో పడి ముక్తి నిచ్చే దైవాన్ని పక్కన పెట్టారు.కృష్ణుడి తో ఉన్నారు కదా!అంటే ఆయన భగవంతుడని తెలిసి కాదు కాబట్టి భగవంతుణ్నీ వదలినట్లే.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:భక్తిగ యాత్ర జేసి తమ భాగ్యముగా గని ముక్తిధామ, మే
    యుక్తిని సాయినిన్ గనగ హోరున నా షిరిడీకి బోయిరో!
    ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసిరేలనో!
    ముక్తిని రోయ రెన్నడును,ముక్తికి సాయియు సాయ మిచ్చు లే.
    (షిరిడీ దగ్గర లో ఒక ముక్తిథామం ఉంది.ముక్తి థామం చూసిన వాళ్లు అది చాలక షిరిడీకి పోయారే! ముక్తి అక్కర లేదా? అని ప్రశ్నించుకొని సాయి కూడా ముక్తికి సాయం చేస్తాడు లే అని సరిపెట్టుకున్నట్టు.)

    రిప్లయితొలగించండి
  12. కష్టముల కోర్చి జపియించు నష్ట ధర్ము
    లకును బుష్టి నిడు వరముల నిడు వాని
    దుష్ట రాక్షసులకు నైనఁ దుష్టి నంది
    ముక్తి నిడు దైవమును రోసె ముని గణంబు

    [రోయు = వెదకు]


    రిక్త వచశ్చయమ్ములను లీలగఁ బల్కుట యందుఁ గాక స
    చ్ఛక్తుల మిన్న యైన సుర సత్తము స్వీయ మనఃప్రభా తప
    శ్శక్తులు ధార వోసి సువిశాల జగత్రయ మందు నెల్లెడన్
    ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసి రేలనో
    [రోయు = వెదకు]

    రిప్లయితొలగించండి
  13. భక్తిని చూపుచున్ సతము పండ్లను పాలను వీడుచున్ వనిన్
    శక్తికొలందిగాహరిని సన్నుతి చేయుచుకొల్తురెప్పుడున్
    ముక్తినొసంగుదేవుని ముముక్షువులెల్లరు:రోసిరేలనో
    భుక్తికిలోటుకల్గెనని పొర్లుచు నేడ్చుచు కొందరేలనో

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    స్మరణ చేయుచునుందురు సతము మునులు
    ముక్తినిడు దైవమును; రోసె మునిగణంబు
    యజ్ఞ యాగాదులను చేయ నడవిలోన
    నాశనము చేయుచుండు దానవుల గాంచి.

    రిప్లయితొలగించండి