1, అక్టోబర్ 2024, మంగళవారం

సమస్య - 4899

2-10-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్”

(లేదా...)

“పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా”

(పితృ అమావాస్య సందర్భంగా...)

34 కామెంట్‌లు:


  1. బ్రతికిన నాడు ముదుసలుల
    సతతమ్మవమాన పరచి చచ్చిన పిదపన్
    క్రతువని మనసంస్కృతి యని
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్.



    బ్రతికిన నాడు వృద్ధులను భారమటంచుదలంచి వారి సు
    స్థత గననట్టి జీవనులు ధర్మపరుండ్రమటంచు చెప్పుచున్
    క్రతువని సంప్రదాయమని కాకికి పిండము పెట్టి భూరిగా
    పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా.

    రిప్లయితొలగించండి
  2. సతతముజన్మకారకుల సద్గుణసంపదతోస్మరించుటల్అతులమునౌనుగాయదియునర్పణఁజేయతిలోదకంబులన్
    పితరులసంస్మరించుట, వివేకవిహీనులకార్యమేగదా
    గత మును కాలదన్నియును కర్మలజేయకనిందఁజేయుచో

    రిప్లయితొలగించండి
  3. కందం
    గతమున చెమటోడ్చి సుతుల
    హితమునఁ దలిదండ్రి తాత లిరువై చన స్వ
    ర్గతికై తర్పణమెంచక
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్!

    చంపకమాల
    గతమున పుత్రులన్ దలఁచి కష్టమునన్ జెమటోడ్చి తల్లులున్
    హితమునఁ దండ్రులున్ వగచి యేర్పరచన్ సిరి వారినెంచి స్వ
    ర్గతికని తర్పణమ్ములిడ రాకను సాలునకొక్కసారియున్
    పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా!

    రిప్లయితొలగించండి
  4. కం॥ సతతము హృదిని నిలుపఁదగు
    నతులిత గౌరమమునుంచి యాదరమొప్పన్
    మితముగ నొక్కదినమునను
    బితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్

    చం॥ అతులిత గౌరవమ్మొదవి యాదర భావము నొప్ప నాతుమన్
    సతతము నిండియుండఁ దగు సంస్మరణీయుల దైవమూర్తులన్
    మితముగ నొక్కపూటనటు మేలిమి పూతల తర్పణమ్ముకై
    పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా!

    ఆతుమ మనస్సు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  5. వితతపు స్వార్థచింతన వివేకము కోల్పడఁజేయ నిర్దయన్
    పితరుల జన్మకారకుల వృద్ధులయాశ్రమమందు మ్రగ్గుచున్
    బ్రతుకగ జేసి జీవనము భారమొనర్చి గతించినంతటన్
    పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా

    రిప్లయితొలగించండి
  6. సతతము మాతాపితలను
    వెతలకు గురిచేసి తనువు వీడిన పిదపన్
    గతముమరచి భేషజముగ
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్

    రిప్లయితొలగించండి
  7. గతమును సతము మరచి తమ
    పతనము నకు కా రణముగ వారే యనుచున్
    శతవిధ ములతి ట్టు కొనుచు
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. బ్రతకగనుండనివ్వరిక పాదపజాతిని మచ్చుకైననీ
      సతతము కానలన్ నఱకు స్వార్థ జనుల్, కపటత్వమందునన్
      వ్రతముగ నాటి మొక్కొకటి పత్రికలందున వారి గొప్ప జూ
      పి తరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా!!

      తొలగించండి
  9. సతతముకోరుచుహితమును
    *“పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్”*
    మతిచెడినవారియట్టుల
    గతముమరచిపితరులకిలకలతను గూర్తుర్


    సుతులునుకొందురుందురిలజూడక వారికి ప్రేమపంచకన్
    హితములునేర్పుచున్సతతమిమ్ముగపెంచిన తల్లిదండ్రులన్
    బ్రతికినయప్పుడాదరముపంచకపోయినపిమ్మటన్సదా
    *“పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా”*

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. పొరబాటును తెల్పినందుకు పోచిరాజు కామేశ్వరరావు గార్కి ధన్యవాదాలు.
      సవరించిన పూరణలు....

      పితరులు సంస్మరణమ్మున
      నతులితమై నీదు మనము హాయినిగూర్చున్
      బ్రతికిన నాడాదుకొనక
      పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్

      పితరులు పూజనీయులని విజ్ఞులు చెప్పుగ శాస్త్రమొప్పగా
      సతతము శంకలేల మనసారగ శ్రద్ధగ పూజసల్పుమా
      బ్రతుకుట భారమైనపుడు భద్రత కూర్చక మృత్యురూపులై
      పితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా

      తొలగించండి
  11. సుతు లిల కృతజ్ఞత గలిగి
    పితరుల స్మరి యించె దరు : వివేక వి హీ నుల్
    గతమును మరచిన వారై
    పితరుల. స్మరి యింప బోరు విజ్ఞత కరువై

    రిప్లయితొలగించండి
  12. మతి నుంచి తరులు సుర లని
    వితండ వాదము లొనర్చి వింతగ నకటా
    విత తార్తుల రక్షణ మా
    పి తరుల స్మరియించెదరు వివేక విహీనుల్


    గతి బ్రతుకంగ నిచ్చి మమకారము మీఱ వహించి పెంచఁగా
    సతము కృతఘ్ను లౌట యపచార మొనర్చుట మానవత్వమే
    పితరుల దైవ సన్నిభుల విస్మృతి నొంది వహింప కించు కేఁ
    పితరుల సంస్మరించుట వివేక విహీనుల కార్యమే కదా

    [ఏఁపు + ఇతరుల =ఏఁ పితరుల]

    రిప్లయితొలగించండి
  13. కం:బతికిన యప్పుడు మాతా
    పితరుల పై ద్వేష మూని వేధించియు, నా
    మతధర్మమనుచు కర్మల
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్”

    రిప్లయితొలగించండి
  14. చం:బతికిన యప్పుడున్,తనువు బాసిన యప్పుడు కన్న వారలన్
    మతిని దలంపకే తులసి మంగళమంచును,రావి వేపలన్
    జత యొనరింప బుణ్యమని చౌకగు రీతుల గొప్ప శ్రద్ధ జూ
    పి,తరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా”
    (తల్లి దండ్రులని పట్టించుకునే ధర్మం వదిలి తులసికి నీళ్లు పొయ్యటం,చెట్లకు పెళ్లి చెయ్యటం వగైరా ఆచారాల పై శ్రద్ధ చూపటం.)

    రిప్లయితొలగించండి
  15. అతిశయమనగానిదియే
    బ్రతికిన నాడటు దలపక బాగోగులనున్,
    నుతియించుచురాజసమున
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్”
    కొరుప్రోలు రాధాకృష్ణ

    రిప్లయితొలగించండి
  16. సతతముఁదిట్టుచుఁ బితరుల
    బ్రతుకుట వృధయనిఁబలుకుచుఁ, బగతుర వోలెన్
    నతలాకుతలము ఁజేయుచు
    పితరుల స్మరియించెదరు వివేకవిహీనుల్

    రిప్లయితొలగించండి
  17. బ్రతికిన రోజులందెపుడుఁబట్టెడుబువ్వను బెట్టకుండగా
    సతతముఁగాల్చి గర్భమును,శత్రువువోలెను జూచి యిత్తఱిన్
    బితరుల సంస్మరించుట వివేకవిహీనుల కార్యమే కదా
    పతనముఁదప్పదాతనికి,బంధువులందఱుఁదిట్టుకొందురే

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    బ్రతికిన కాలము నందున
    సతతము హింసలను పెట్టి చచ్చిన పిదపన్
    హితవుగ పిండమ్ములనిడి
    పితరుల స్మరియించెదరు వివేక విహీనుల్.

    రిప్లయితొలగించండి