18, అక్టోబర్ 2024, శుక్రవారం

సమస్య - 4916

19-10-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్”

(లేదా...)

“పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా”

37 కామెంట్‌లు:

  1. కందం
    రంజనచెడి మనుజుడు క్రిమి
    భంజనుఁడై యింటఁ దాగె బలవంతుండై
    కంజదళాక్షా! దయగను
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!

    ఉత్పలమాల
    రంజనమన్నదే చెడెను ప్రాజ్ఞుడు పామరుడైన నింటిలో
    భంజనులై మనన్ వెతల ప్రాణ భయంబున దిక్కు తోచకే!
    కంజదళాక్ష! చిన్ని క్రిమి కర్కశమొల్కను జాలిలేదొకో!
    పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా!

    రిప్లయితొలగించండి
  2. అంజనిపుత్రుడు లంకను
    సంజనితశత్రువగుటనుసంగరమయ్యెన్
    రంజిలెరావణుడంతను
    పంజరమునఁగుంజరమ్ముబంధింపబడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం రెండవ గణం జగణమయింది. సవరించండి.

      తొలగించండి
    2. అంజనిపుత్రుడు లంకను
      సంజనితశత్రువునగుటనుసంగరమయ్యెన్
      రంజిలెరావణుడంతను
      పంజరమునకుంజరమ్ముబంధింపబడెన్

      తొలగించండి
  3. అంజనిపుత్రుడంతటనహంకృతిఁజూపిన శత్రుజేరియున్
    సంజనువెల్గుసూర్యువలెనసంశయవిక్రమమందురాజిలెన్
    రంజనలంకలోచెడగ రామునిబంటువిచారమందెగా బందిజేసిరే
    పంజరమందుకుంజరము బంధితమయ్యెనుసత్యమేగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  4. రంజనలంకలోచెడగరామునిబంటునుబందిజేసిరే

    రిప్లయితొలగించండి
  5. తంజావూరున పిల్లలు
    గుంజుకొన నందెన గల కుంజరబొమ్మల్
    భంజమునొంది దరినగల
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్

    రిప్లయితొలగించండి
  6. కుంజరమా యభిమన్యుఁడు
    కంజవ్యూహమునఁజొచ్చి కౌరవమూకన్
    భంజన మొనరింపఁగనా
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కౌరవ మూక' దుష్టసమాసం. "కౌరవ బలమున్" అనండి.

      తొలగించండి
  7. కం॥ రంజిలు నెత్తము నోడఁగ
    వ్యంజనఁ గౌరవులు సేయఁ బాండవులఁ గనన్
    బుంజముగఁ గ్రమ్మె దుఃఖము
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్

    ఉ॥ రంజిలు జూదమందునట రాజును మోసముఁ జేసి గెల్వఁగన్
    వ్యంజనఁ గౌరవాధములు పాండవులన్ గని సేయఁ గ్రూరులై
    పుంజములౌ యనిర్వృతినిఁ బొందఁగ నచ్చట నిస్సహాయులై
    పంజరమందుఁ గుంజరము బంధితమయ్వెను సత్యమే కదా

    రాజు ధర్మరాజండి
    నెత్తము పాచికలాట
    వ్యంజన ఎగతాళి
    పుంజము రాశి ప్రోగు
    అనిర్వృతి దుఃఖము

    కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చన్ దృష్టిలో ఉంచుకొని నండి.

    రిప్లయితొలగించండి
  8. రంజింప జేసెనని పృథ
    సంజాతుడు రాజరాజు సమ్మోధికడై
    అంజిష్ఠ సుతుడు కౌరవ
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్.


    రంజన మంది భానుజుడు రాజ్యమొ సంగిన రాజరాజుకున్

    రంజన మంద జేయ కుటిలాత్ముల పక్షము జేరెగాదె నీ

    లాంజన తుల్యుడంచు విని ప్రాజ్ఞులు పల్కిరధర్ములున్న యా

    పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా.

    రిప్లయితొలగించండి
  9. కంజదళాయతాక్షుఁడగు కవ్వడి సూనుఁడు తమ్మి మొగ్గరం
    బుంజని కౌరవేయుల సమూహము తల్లడమొంద జేయగన్
    భంజన సేయ గౌరవులు బాలకునిం గదియించిరక్కటా
    పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా

    రిప్లయితొలగించండి
  10. మంజుల మానసుండు గురుమాన్యుఁడు భీష్ముఁడు శాంతనుండు తాన్
    రంజిత ధర్మవర్తనుఁడు, రాగవివర్జిత భక్తిసాంద్రతన్
    వింజ సముండు, పాండవుల విద్విష పక్షమె యుద్ధమందునన్
    పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా!!

    రిప్లయితొలగించండి
  11. మంజుల హృదయుడు గాంగా
    సంజాతుడు పరశురామ ఛాత్రుడు సమితిన్
    సంజకు వాలెనకట! శిఖి
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గంగాసంజాతుడు"

      తొలగించండి
    2. పరశురామచ్ఛాత్రుడు సాధు వండి. పరశురాము ఛాత్రుడు సాధువగును.

      తొలగించండి
    3. గురువు గారికి, కామేశ్వర రావు గారికి ధన్యవాదములు

      మంజుల హృదయుడు గంగా
      సంజాతుడు పరశురాము ఛాత్రుడు సమితిన్
      సంజకు వాలెనకట! శిఖి
      పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!!

      తొలగించండి
  12. రంజిలు యుద్ధము నందు ధ
    నంజయుని శరములఁ జిక్కె నాభీష్ముండే
    కుంజర సన్నిభుడతడే
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్

    వింజమనంగనొప్పు కురు వృద్ధుడు వీరులనడ్డగింపగా
    కుంజర సన్నిభుండు కనఁ గ్రుద్ధుడు భీష్ముడు యుద్ధమందునన్
    భంజనుడై కిరీటి శరపాతము పాల్పడి నేలకూలగా
    పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా

    [వింజము = వింధ్యపర్వతము]

    రిప్లయితొలగించండి
  13. సంజ వెలుంగు న బాలుడు
    మంజుల మగు బొమ్మలు గొని మవు న ము తోడ న్
    రంజి ల గ నాడు చొ క పరి
    పంజరమున గుంజ రమ్ము బంధింప బడె న్

    రిప్లయితొలగించండి
  14. రంజన మణఁగ నరేభం
    బంజలి ధర్మజుఁడు నిల్చి యనుజవరుల తో
    డం జని శకుని భృశము వేఁ
    పం జరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్

    [వేఁపన్ + చరమున = వేపం జరమున; చరము = జూదము]


    కంజదళాక్ష రక్షితము కాదిల మానవ రక్షితమ్ము దా
    నంజలి మోడ్చి మ్రొక్కినను హస్తినిఁ బట్టెడు వేడ్కఁ ద్రవ్వఁగా
    మంజుల ఖాత మొక్కటి సమంచిత రీతినిఁ గాన లోన భూ
    పంజర మందుఁ గుంజరము బంధిత మయ్యెను సత్యమే కదా

    రిప్లయితొలగించండి
  15. కంజదళాయతాక్షనకు కమ్మను వ్రాసెను భైష్మి ప్రేమతో
    రంజన చేయగా వడిగ రంగడు వచ్చు నటంచునెంచుచున్
    మంజుల గాత్రిదానిలిపె మానుగ నాతని రూపమున్ మనో
    *“పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా”*



    రంజనమదిహెచ్చంగను
    కుంజర యూధమునువీడి కూడగ తోడున్
    బంజారులుసదనమ్మను
    *"పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్”*




    రిప్లయితొలగించండి
  16. కం:రంజన సెడి పాండవు లరి
    భంజను లై విరటు గొల్వ బాల్పడి రకటా!
    సంజయ!విధి నేమందును
    పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
    (ఏమాత్రం కష్ట పడని పూరణం)

    రిప్లయితొలగించండి