19, అక్టోబర్ 2024, శనివారం

సమస్య - 4917

20-10-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్”

(లేదా...)

“ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా”

31 కామెంట్‌లు:

  1. అనయము జిజ్ఞాస గలిగి
    చెనకన్జాలనిసుమతినిచేకొని తిరుడై
    వనమునకేగి తపోసా
    సాధనము నగడియింపవచ్చుదై కృపాప్తిన్

    రిప్లయితొలగించండి
  2. మన మున శంకరు నిల్పి యు
    నన యము జపి యించి కొలిచి యారా ధిం పన్
    సునిసిత భక్తి యనె డు సా
    ధనమున గడియి o ప వచ్చు దైవ కృ పా ప్తి న్

    రిప్లయితొలగించండి
  3. వినయవివేకసంపదలపెంచియశస్సునుబొందువాడునై
    అనయముభక్తిభావనలహంసగజీవనయాత్రసాగుచున్
    మనము పారమార్థికతమాయగనీక నుమోక్షమందుసా
    ధనము న దైవసత్కృపనుదప్పకపొందగవచ్చుమా నవా

    రిప్లయితొలగించండి
  4. చనువుగనె దెల్పు మంటివి
    యనువుగు విధము దెలుపమని యడిగితివిగదా
    వినుమతని నుతించెడు సొ
    ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కందం
      తనతాతలు ముక్తిఁగొన గ
      గనసీమలనుంచి దింప గంగఁ దపమునన్
      మనవడు సాధించెను సా
      ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్!

      చంపకమాల
      మునుపు భగీరథుండు దన పూర్వపు తాతలు ముక్తిఁ గాంచ గం
      గనిలకు దింపగన్ దపము గాఢపు భక్తిని వేలయేళ్లుగన్
      వనజభవున్ త్రినేత్రుని యపారదయన్గొన జేసి పొందె సా
      ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  6. వినుడో మిత్రమ చెప్పెద
    వినయమ్మున నాదుమాట విశ్వేశ్వరునిన్
    మనము నిలిపి చేసెడి సా
    ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్.


    చనవలె మందిరమ్మదియె సద్గతి నిచ్చునటంచు కాదె నీ
    వనిశము మంతరించు విషయమ్మది మానుమ టంచు చెప్పెదన్
    మనసొక మందిరమ్మవగ మాయుని యందున నిల్పి చేయు సా
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా.

    రిప్లయితొలగించండి
  7. ఉ:కుంజర మెన్నికన్ గెలుచు, గొప్పది చిహ్న మటంచు నెంచు వెన్
    కంజన నున్న వర్ణముల యాశలు బూడిద కాగ ద్రవ్యమన్
    పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను , సత్యమే కదా”
    గుంజగ పేదలన్ ధనము గొప్పది యంచు వచించ నేటికిన్.
    (ఏనుగు గుర్తు తో బహుజనవాదం గెలుస్తుంది అనుకున్నారు కానీ ఆ ఏనుగు ధనం అనే పంజరం లో చిక్కుకు పోయింది.)

    రిప్లయితొలగించండి
  8. ధనమును త్యజించు గుణ సా
    ధనమున నర్వము తనకిక దైవంబను బం
    ధనమున తన నిత్యారా
    ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్

    జననము వల్ల కల్గు పలు సద్గుణ సంపద లెల్లఁ గాయుచున్
    దనదగు మానవత్వమను తత్వము నెన్నడు వీడనాడకే
    మనమున భక్తి తోడ పరమాత్మను ధ్యానమొనర్చు నిత్య సా
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా

    రిప్లయితొలగించండి
  9. అనయము హరినామమ్మును
    పనిగొని మనమందు నిల్పి భక్తియె గదురన్
    వినయమ్మున జేసెడు సా
    ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్

    రిప్లయితొలగించండి
  10. అనయము సాధువర్తనము, నార్తజనావనుఁడైన శ్రీహరిన్
    మనమున నిల్పిభక్తులగు మాన్యులఁగూడి చరించుటల్, సదా
    వినయవిధేయతల్గలిగి వృద్ధుల నాదరణమ్ము సేయు సా
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా

    రిప్లయితొలగించండి
  11. కం॥ మనమున సద్భక్తి విరియ
    వినయము సాయపడు గుణము విజ్ఞత తోడై
    యనునిత్యముఁ జను విద్యా
    ధనమున గడియింపవచ్చు దైవకృపాప్తిన్

    చం॥ వినయ విధేయతల్ పరఁగ వృద్ధులఁ గాంచుచుఁ దోడువోపుచున్
    మనమున భక్తినిష్ఠలును, మన్ననసేయుచుఁ దల్లిదండ్రులన్
    గనుచు సమాదరమ్ముగ జగమ్మున వర్తిలఁ గల్గు విజ్ఞతా
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా

    రిప్లయితొలగించండి
  12. (1)కం:మనమున ద్వేషము వదలుక,
    జనులందున హరిని జూచు సాత్వికతాదీ
    ప్తిని దాల్చి, భక్తి యను నిం
    ధనమున గడియింపవచ్చు దైవకృపాస్తిన్”
    (ఆప్తి లేక ప్రాప్తి అన్నా ,గడించటం అన్నా ఒకటే కనుక దైవకృపాస్తిన్ అంటే బాగుంటుందని కాస్త మార్చాను.అద్వేష్టా సర్వభూతాని మైత్రః కరుణ ఏవచ అని భక్తియోగం లో ఉన్నది.)

    (2)చం:మనమున ధర్మమున్ దలచి,మానిత రీతిని శాస్త్రసమ్మత
    మ్మున తన కామమందు దమమున్ వహియించుచు, దీన సేవకై
    ధనమును కొంత యీయ నది ధర్మమె యౌ త్యజియించినట్టి యా
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా”
    (ధర్మార్థకామమోక్షా లనే చతుర్విధ పురుషార్థాలలో ధనాన్ని, కామాన్ని ధర్మం దిశగా నడిపితే మోక్షం సిద్ధిస్తుందని సనాతనధర్మం చెప్పింది.)

    రిప్లయితొలగించండి
  13. అనవరత ప్రయత్నము సుసాధ్య సుయోగ్య ధనమ్ము మానవా
    ఘనమగువిజ్ఞ ధర్మగుణకార్య ములే సిరియంద్రు మానవా
    అనిశము దైవ చింతన ధనమ్ము మనమ్మున నింపి మాన్య సా
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగవచ్చు మానవా

    రిప్లయితొలగించండి
  14. వనజాక్షున కేల ధనము
    మనమ్ముల వఱలెడు నా రమా సతి పతిపై
    ననుమాన మేల భక్త్యిం
    ధనమున గడియింప వచ్చు దైవకృపాప్తిన్


    అనయము ధర్మ మార్గమున నంచిత రీతిని సంచరించుచున్
    వినయము భక్తి సూపుచును బెద్దల యందుఁ జరించు నట్టి యా
    మనుజుల యందు సంతతము మానని స్వీయ లసన్మహా తపో
    ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగ వచ్చు మానవా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఘనమగు జప తపములతో
    ననయము నర్చించుచు పరమాత్ముని నె
    మ్మనమున వీడకెపుడు సా
    ధనమున గడియింప వచ్చు దైవకృపాప్తిన్.

    రిప్లయితొలగించండి
  16. బల్లూరి ఉమాదేవి
    తనుమన వాక్కుల తోడను
    ననయము మదిలోకొలుచుచు నారాధింపన్
    వినుచును కీర్తనలను సా
    *ధనమున గడియింపవచ్చు దైవ కృపాప్తిన్*


    మనమున శ్రీహరిన్ నిలిపి మంత్రములన్ జపియించుచున్సదా
    జనములు భక్తి తోడనట శ్రద్ధగకొల్చుచు మూడు ప్రొద్దులన్
    వినయము తోడ ధ్యానమునువీడకచేయచునున్నచాలు సా
    *ధనమున దైవ సత్కృపను తప్పక పొందఁగవచ్చు మానవా”*

    రిప్లయితొలగించండి