పంచచామరము ఎప్పడో చదివాను కానీ మరచిపొయ్యానండి. పోతనగారు భాగవతములో ఒకటే వ్రాసినారనుకుంటాను. ఈమధ్య శ్రీ గణేశ్ గారి కన్నడ సంస్కృత అవధానముల వలన పునశ్చరణ యైనదండి.
అయోమయమ్ము వద్దు లౌకికాఖ్య పోవ దెన్నికన్ భయమ్ము లేదు రాము గొల్వ వద్దు భక్తి తోడ నా అయోధ్యలోని మందిరమ్మునందు, శంభుఁ గొల్వుమా! ప్రయాగ లో,నమాజు చేయ బాగగున్ మసీదులన్. (అయోధ్య రాముడికి దణ్నం పెడితే ఈ నాయకుడు లౌకికవాది అనే ముద్ర చెడుతుందేమో కాబట్టి ప్రయాగ పోయి శివుడికి దణ్నం పెట్టు,మసీదుల్లో నమాజులు చెయ్యి.అని ఒక లౌకిక వాద నాయకుడికి ఒకడు సలహా ఇచ్చినట్టు.నేటి రాజకీయపరిస్థితి ఇది.)
గురువుశంకరుడేగిన కూడి జనము
రిప్లయితొలగించండికలసిపాదపూజలజేసి కలతవీడి
చూపిరద్వైతంబును తమిచూడ్కులలర
ఒప్పుశంకరపూజలయోధ్యలోన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ దైవ మొక్కఁడే ముఖ్యము తత్పరతయె
తొలగించండిభవుఁడు రాముఁడనఁగ నేలఁ బ్రభువొకండె
రూపు వేరు తత్వమొకటె లోతునెఱుఁగ
నొప్పు శంకరపూజ లయోధ్యలోన
పంచచామరము
అయోమయంబునేల దైవమన్న నొక్కఁడేఁ గదా
అయోనిజుండు రాముఁడన్న నాతఁడే నెఱుంగుమా
సయోధ్యనొంది పూజసేయఁ జాలుఁ బ్రోచు నాతఁడే
అయోధ్యలోని మందిరమ్మునందు శంభుఁ గొల్వుమా!
అయోనిజుడు శివుడు నిఘంటువు సహాయమండి
పంచచామరము ఎప్పడో చదివాను కానీ మరచిపొయ్యానండి. పోతనగారు భాగవతములో ఒకటే వ్రాసినారనుకుంటాను. ఈమధ్య శ్రీ గణేశ్ గారి కన్నడ సంస్కృత అవధానముల వలన పునశ్చరణ యైనదండి.
పొరపాటున ప్రాస 3వ పాదములో ప్రాస తప్పినదండి
కాశి క్షేత్రము నందరుకలసి చేయ
రిప్లయితొలగించండిఒప్పు శంకరపూజ ; లయోధ్యలోన
బాల రాముని దర్శించి భక్తితోడ
పూజసలిపిన దప్పక పుణ్యమగును
సల్ప యాత్రలు వెడలె ను శంక రుండు
రిప్లయితొలగించండిచూచి నేపాలు దృశ్యాలు చోద్య మలర
వచ్చి రాముని దర్శించి వాంఛ తోడ
నొప్పు శంకరు పూజ ల యో ధ్య లోన
పంచచామరము:
రిప్లయితొలగించండిప్రయాగలోని సంగమాన భక్తితోడ మున్గి నీ
ప్రయాసదీర విశ్రమించి రాముఁగాంచ జేరుమా
అయోధ్యలోని మందిరమ్ము నందు, శంభుఁ గొల్వుమా
ప్రయాణమందుఁ గాశిలో పరాత్పరున్కనుంగొనన్
రిప్లయితొలగించండిమహ్మదీయుల ప్రార్థనా మందిరమును
గూల్చి కట్టిన శ్రీరాము గోవెలయని
యచటజేరుట కిక సంశయమ్మదేల?
ఒప్పు శంకర , పూజ లయోధ్యలోన.
భయమ్ము దీర్చి భద్రతిచ్చు ఫాలలోచనుండనే
స్వయాన విష్ణుమూర్తి గొల్చె భక్తితోడ సత్యమే
దయామయుండు వాడటంచు తన్మయత్వ మంది య
య్యయోధ్య మందిరమ్మునందు శంభుఁ గొల్వుమా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితీర్చిదిద్దిన రాముని దేవళమున
రిప్లయితొలగించండిసుందరంబగు ప్రత్యేక మందిరములు
శివుని మందిరమునకేగి సిసులు చూడ
నొప్పు శంకరపూజ లయోధ్యలోన
ప్రయోజనమ్ము పొందగోరి భక్తి మార్గమెంచుచున్
బ్రయాణమైరి చూడనెంచి రామ భద్రు రూపునే
యయోధ్యలోని మందిరమ్మునందు; శంభుఁ గొల్వుమా
దయాళువైన వేల్పు దివ్య దర్శనమ్ము దక్కగన్
నయమ్మె భేద భావమెల్ల మాని మానసంబునన్
రిప్లయితొలగించండిజయంబు గూర్చు దైవమొక్క చందమంచు పుణ్యసం
చయమ్ము కాశి లోన రామ చంద్రు పూజఁ జేయరే
అయోధ్యలోని మందిరమ్మునందు శంభుఁ గొల్వుమా!!
పుణ్య సరయూజలంబుల మునకలేసి
రిప్లయితొలగించండిరామమందిరమునకేగి రయముగాను
బాలరాముని దర్శించి భక్తితోడ
నొప్పు శంకర! పూజ లయోధ్యలోన
మెప్పులకు గాక తొలఁగంగ ముప్పు లెల్ల
రిప్లయితొలగించండిగొప్ప వాఁడ వైనను గోరి యిప్పు డెడఁద
ముక్తి రాముని దర్శించి భక్తిఁ జేయ
నొప్పు శంకర! పూజ లయోధ్య లోన
రయమ్మునం బ్రయాణ మిద్ధరం జెలంగ నింపుగా
సయోధ్య చారివై యెడంద సంతసమ్ము మీఱఁగా
దయాళు ఫాలనేత్రుఁ డేడ దర్శనమ్ము నీయ లేఁ
డయోధ్య లోని మందిరమ్ము నందు శంభుఁ గొల్వుమా
[సయోధ్య చారి = సమాన సమూహములో నున్నవానిగఁ జరించు వాఁడ వయి]
తేటగీతి
రిప్లయితొలగించండిశిల్పములపైన కొలువైన శివుఁడెఱింగి
రామనామ మహిమదెల్ప హైమవతికి
రామమూర్తి గుడిని దీర్చ రమ్యముగను
నొప్పు శంకరపూజ సయోధ్య లోన
పంచచామరము
జయన్ వరాననన్ ప్రియాన శంకరుండు గాంచుచున్
స్వయాన దెల్ప రామనామ శక్తియున్ మహత్యమున్
ప్రియాన శిల్పులున్ శ్రమించి వేడ్కఁ దీర్చి నంతనే
యయోధ్యలోని మందిరమ్మునందు శంభుఁ గొల్వుమా!
తే.గీ:వీరశవుని వలె నీవు మారకోయి!
రిప్లయితొలగించండికాశి లోన గొల్చితివి శంకరుని గాని
రాము గుడిలోన దలపక రాము నెట్టు
లొప్పు శంకరపూజ లయోధ్యలోన?
అయోమయమ్ము వద్దు లౌకికాఖ్య పోవ దెన్నికన్
రిప్లయితొలగించండిభయమ్ము లేదు రాము గొల్వ వద్దు భక్తి తోడ నా
అయోధ్యలోని మందిరమ్మునందు, శంభుఁ గొల్వుమా!
ప్రయాగ లో,నమాజు చేయ బాగగున్ మసీదులన్.
(అయోధ్య రాముడికి దణ్నం పెడితే ఈ నాయకుడు లౌకికవాది అనే ముద్ర చెడుతుందేమో కాబట్టి ప్రయాగ పోయి శివుడికి దణ్నం పెట్టు,మసీదుల్లో నమాజులు చెయ్యి.అని ఒక లౌకిక వాద నాయకుడికి ఒకడు సలహా ఇచ్చినట్టు.నేటి రాజకీయపరిస్థితి ఇది.)
చేసె శ్రీరామచంద్రుడు శివుని పూజ
రిప్లయితొలగించండినాడు సాగర తీరాన నయము గాను
నవ్విధముగానె యీనాడునాచరించు
టొప్పు శంకర పూజల యోధ్య లోన
జయమ్ము గోర నెంచినట్బ సాధనమ్ము చేయుమా
భయమ్ము తీర్చి రాముడే శుభమ్ము లిచ్చుచుండురా
అయోమయంబదేలనోయి నాహరుండెరాముడౌ
అయోధ్యలోని మందిరమ్మునందు శంభుఁ గొల్వుమా”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
శివుని దేవళమందున చేరి చేయ
నొప్పు శంకర పూజ; లయోధ్య లోన
రవికుల తిలకుడైన శ్రీరామచంద్రు
నికి సలుప వలయును పూజ నియతి తోడ.